బ్యాటరీ తప్పు లేదని తేల్చి చెప్పిన కంపెనీ

ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బ్యాటరీ పేలిపోతుందేమో.. కారు తగలబడిపోతుందేమో అన్న భయం. ముఖ్యంగా గతంలో కొన్ని చౌకబారు విదేశీ విడిభాగాలతో తయారైన ఎలక్ట్ిక్ స్కూటర్లు తగలబడటంతో ఈ భయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. అయితే తాజాగా మహీంద్రా కంపెనీకి చెందిన అత్యంత ఆధునిక మహీంద్రా బీఈ 6 (Mahindra BE 6) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉత్తరప్రదేశ్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురికావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈవీల సేఫ్టీ మీద మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మహీంద్ర కంపెనీ అత్యంత పారదర్శకంగా స్పందిస్తూ అసలు మంటలు ఎలా వచ్చాయో సాక్ష్యాధారాలతో సహా వివరించింది.

"అజిత్ పవార్ మృతి ప్రమాదం మాత్రమే.. కుట్ర లేదు"

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బంధువు అజిత్ పవార్ బారామతి విమాన ప్రమాదంలో మరణించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అధికారులు నొక్కిచెబుతున్నారు. శాంతి, భద్రతా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది.

కేంద్ర బడ్జెట్ 2026పై ఆటో రంగం భారీ ఆశలు

ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్‌లో సమర్పించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో ఆశలు మరింత పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో ఆటో రంగం ఒకటైన నేపథ్యంలో, ఈ పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను బడ్జెట్‌లో ప్రకటించాలని ఆటో రంగ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రంగం GDPకి గణనీయంగా దోహదపడుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది, కాబట్టి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ప్రోత్సాహాలను అందించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా, గత కొన్ని సంవత్సరాలుగా విధానాల్లో వచ్చిన మార్పుల తర్వాత, ఇప్పుడు స్థిరమైన, స్పష్టమైన పాలసీ దిశ అవసరమని వారు భావిస్తున్నారు.

ఈ దీవికి వెళ్తే ప్రాణం హుష్.. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ప్లేస్ ఇదే !!

వెనిస్‌కు సమీపంలో ప్లేగు నిర్బంధ ప్రదేశంగా పోవెగ్లియా ద్వీపం యొక్క భయానక చరిత్ర, దాని యుద్ధకాలం మరియు ఆసుపత్రి గతం మరియు వెంటాడే మరియు పరిత్యజించిన పురాణాలను అన్వేషించండి.
Advertisement

రోడ్లపై రాజ్యం బుల్లెట్‌దే.. సేల్స్ నంబర్లు షాక్ ఇచ్చాయి

భారతీయ బైక్ ప్రియుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మోటార్‌సైకిళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) ఒక ఐకానిక్ పేరు. కాలం మారినా, మోడళ్లు కొత్తగా వచ్చినా, బుల్లెట్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎన్ని కొత్త బైక్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చినా, బుల్లెట్ అనే పేరు భారతీయ రోడ్లపై ఎప్పటికీ నిలిచేలా ఉంది. అదే కారణంగా, ఈ బైక్‌కు అమ్మకాల పరంగా ప్రతి నెలా స్థిరమైన, బలమైన డిమాండ్ కనిపిస్తూనే ఉంటుంది. డిసెంబర్ 2025 నెల కూడా ఈ ట్రెండ్‌కు మినహాయింపు కాదు. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, ఆ ఒక్క నెలలోనే 24,849 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌లు అమ్ముడయ్యాయి.

అజిత్ పవార్ కార్ కలెక్షన్ ఇదే

మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బారామతిలో జరిగిన విమాన ప్రమాదం ఒక ధీశాలి అయిన రాజకీయ నాయకుడిని మనకు దూరం చేసింది. అజిత్ పవార్ కేవలం రాజకీయాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ చాలా క్రమశిక్షణతో ఉండేవారు.

బ్రౌన్ రైస్ Vs రెడ్ రైస్‌- ఆరోగ్యానికి ఏది మంచిది..!?

తెలుపు, గోధుమ మరియు ఎరుపు బియ్యం గ్లైసెమిక్ ప్రతిస్పందన మరియు ఫైబర్‌లో ఎలా విభిన్నంగా ఉంటాయో ఒక పోషకాహార నిపుణుడు సమీక్షిస్తారు, ఇది జీర్ణక్రియ మరియు దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి కుటుంబాలకు సహాయపడుతుంది.

50,000 యూనిట్ల ఉత్పత్తిని పూర్తి చేసిన స్కోడా కైలాక్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్కోడా కైలాక్ (Skoda Kylaq) చాలా తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ప్రవేశించిన ఈ మోడల్, భారతీయ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడడంతో వేగంగా ప్రజాదరణ పొందింది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీల్, స్కోడా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కలిసి కైలాక్‌ను కుటుంబాలకూ, యువతకూ ఒక ఆకర్షణీయ ఎంపికగా మార్చాయి. స్కోడా కైలాక్‌ను కంపెనీ డిసెంబర్ 2024లో అధికారికంగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే ఈ SUVపై మంచి స్పందన రావడంతో, డెలివరీలు జనవరి 27, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచే కైలాక్‌కు స్థిరమైన డిమాండ్ కొనసాగుతూ వస్తోంది.

ఈ కారు కొనకపోతే చాలా మిస్ అవుతారు

టయోటా తన పాపులర్ ఎస్యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్(Urban Cruiser Hyryder)లో సరికొత్త టెక్నాలజీని జోడించింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ముఖ్యంగా టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ వంటి కొత్త మోడళ్లకు చెక్ పెట్టేందుకు టయోటా ఒక అదిరిపోయే టెక్ ప్యాకేజీని లాంచ్ చేసింది. బేస్ వేరియంట్ కొన్నవారికి కూడా హై ఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉండడం ఈ ప్యాకేజీ స్పెషాలిటీ.

భారీ డిమాండ్‌తో దూసుకెళ్తున్న యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) భారతీయ స్కూటర్ మార్కెట్‌లో ఒక నమ్మకమైన పేరుగా, ఇంటింటికీ సుపరిచితమైన మోడల్‌గా నిలిచింది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, యాక్సెస్ 125 తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకుని నిరంతరం మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. స్టైల్, పనితీరు, నమ్మకమైన ఇంజిన్ కలయికే ఈ స్కూటర్ విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా యాక్సెస్ 125 మార్కెట్‌లో ఎంత బలంగా నిలబడిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. గత నెల, అంటే డిసెంబర్ 2025లో మాత్రమే సుజుకి యాక్సెస్ 125 మొత్తం 69,622 యూనిట్లు అమ్ముడయ్యాయి.

అజిత్ పవార్ ఆఖరి ప్రయాణం ఆ విమానంలోనే

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. బారామతిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అసలు అజిత్ పవార్ ప్రయాణించిన ఆ విమానం ఏది ? అది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? దాని సామర్థ్యం ఎంత? అనే సాంకేతిక వివరాలపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ విమానం వివరాలు, అందులో ఎవరెవరు ఉన్నారు అనే పూర్తి సమాచారం ఈ వార్తలో తెలుసుకుందాం.

ఫిబ్రవరి 12న MG మెజెస్టర్ ఎంట్రీ.. టీజర్ విడుదల

JSW MG మోటార్ ఇండియా తాజాగా తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUV ఎంజీ మెజెస్టర్ (MG Majestor)కు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు ఫిబ్రవరి 12న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే టీజర్ విడుదలతోనే ఆటోమొబైల్ వర్గాల్లోనే కాదు, కస్టమర్లలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. MG బ్రాండ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ SUV, డిజైన్, పనితీరు విషయంలో పూర్తిగా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుందని కంపెనీ స్పష్టంగా చెబుతోంది. MG మోటార్ తెలిపిన వివరాల ప్రకారం, మెజెస్టర్ తన విభాగంలోనే అత్యంత పొడవైన, వెడల్పు, ఎత్తైన SUVగా నిలవనుంది. ఈ ప్రత్యేకతతో, ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయ D-సెగ్మెంట్ పరిమితులను దాటి, పూర్తిగా కొత్త D+ సెగ్మెంట్ను సృష్టించాలనే లక్ష్యంతో MG ముందుకు సాగుతోంది.
Advertisement

ఈ బైక్ వెళ్తుంటే ప్రతి ఒక్కరూ సైడ్ తప్పుకోవాల్సిందే

ఇండియన్ రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కనిపిస్తే ఆ రాజసమే వేరు. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350(Royal Enfield Classic 350) మోడల్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా విడుదలైన 2025 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే, ఈ బైక్ తన సొంత కంపెనీలోని ఇతర మోడళ్లను కూడా వెనక్కి నెట్టి దూసుకుపోతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, అదిరిపోయే లుక్ ఉండటంతో కుర్రాళ్ల నుంచి ముసలి వాళ్ల దాకా అందరూ దీనికే జై కొడుతున్నారు.

ఇక సామాన్యుడూ బీఎండబ్ల్యూ కార్ కొనొచ్చు

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన సరికొత్త వాణిజ్య ఒప్పందం ఆటోమొబైల్ రంగంలో ఒక మహా విప్లవానికి తెరలేపింది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) ఎట్టకేలకు ఖరారైంది. దీనివల్ల విదేశీ కార్లంటే మోయలేని భారం అనుకునే వారికి భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా బీఎండబ్ల్యూ (BMW), మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రధాని మోదీ "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అని అభివర్ణించారు.

రేపే శక్తిమంతమైన జయ ఏకాదశి: ఈ పనులు చేస్తే అన్నింట్లో `జయ`మే

జయ ఏకాదశి 2026 విష్ణువుకు అంకితం చేయబడిన ఉపవాస దీక్షను సూచిస్తుంది, సమయాలు జనవరి 28 నుండి జనవరి 29 వరకు ఉంటాయి మరియు పాక్షిక ఉపవాసాలు మరియు సమర్పణలు ఆధ్యాత్మిక శుద్ధికి మార్గనిర్దేశం చేస్తాయి.

భారత్- ఈయూ వాణిజ్య ఒప్పందంపై పియూష్ గోయల్ కామెంట్స్

భారతదేశం EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విస్తృతమైన సుంకాల ఉపశమనం అందిస్తుంది, వస్తువులు మరియు సేవలకు మార్కెట్ ప్రవేశాన్ని విస్తరిస్తుంది మరియు వస్త్రాలు మరియు ఆటోమోటివ్ విడిభాగాల వంటి కీలక రంగాలకు దశలవారీ సర్దుబాట్లతో మద్దతు ఇస్తుంది.

స్కూటర్లలో కీలక లోపం.. వెంటనే సర్వీస్ సెంటర్‌‌కు వెళ్లండి!

ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన యమహా(yamaha)కు భారతదేశంలో కూడా భారీ అభిమాన గణం ఉంది. నాణ్యత, పనితీరు, ముఖ్యంగా కస్టమర్ భద్రత విషయంలో యమహా ఎప్పుడూ రాజీ పడదు. ఈ నిబద్ధతలో భాగంగానే, తాజాగా కంపెనీ ఒక కీలకమైన, బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (IYM) అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మే 2, 2024 నుంచి సెప్టెంబర్ 3, 2025 మధ్య తయారు చేసిన 125-సిసి స్కూటర్ మోడళ్లలో మొత్తం 3,06,635 యూనిట్లకు స్వచ్ఛంద రీకాల్ ప్రచారం ప్రారంభించింది. ఈ రీకాల్ తక్షణమే అమలులోకి వస్తుందని యమహా స్పష్టం చేసింది. కంపెనీకి కస్టమర్ల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని మరోసారి ఈ నిర్ణయం ద్వారా నిరూపించింది.

బాక్సాఫీస్ సక్సెస్ గిఫ్ట్.. అనిల్ రావిపూడికి చిరంజీవి లగ్జరీ కారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందుతూ, ఏకంగా రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలన విజయంగా నిలిచింది. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా మారింది. ఈ భారీ సక్సెస్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. సినిమా విజయానికి కీలకంగా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడికి, చిరు తన సంతోషాన్ని చాటుతూ ఖరీదైన అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును గిఫ్ట్‌గా అందించారు.

ఇక షోరూంల ముందు భారీ క్యూలు ఖాయం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఫ్యామిలీ కార్లకు ముఖ్యంగా 7 సీటర్ కార్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఈ విభాగంలో మారుతీ సుజుకీ ఎర్టిగా రారాజుగా వెలుగుతోంది. అయితే మారుతీ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడేందుకు జపాన్ కార్ల దిగ్గజం నిస్సాన్ (Nissan) సిద్ధమైంది. అత్యంత చౌక ధరలో, అదిరిపోయే ఫీచర్లతో నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) పేరుతో సరికొత్త 7 సీటర్ ఎంబీవీ (MPV) కారును మార్కెట్లోకి దించుతోంది. ఈ కారు రాకతో మధ్యతరగతి ప్రజల సొంత కారు కల చాలా తక్కువ ధరలోనే నెరవేరబోతోంది.

Digital Investment Scams : ఆన్‌లైన్ స్కామ్‌లతో పొదుపులకు గండి – ప్రభుత్వ ఉక్కుపాదం

భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ పెట్టుబడి మోసాలు నకిలీ యాప్‌లు మరియు మెసేజింగ్ గ్రూప్‌లను ఉపయోగిస్తున్నాయి. మోసాలు ఎలా పనిచేస్తాయో మరియు పౌరుల కోసం సైబర్‌క్రైమ్ పోర్టల్ మరియు 1930 హెల్ప్‌లైన్‌తో సహా జాతీయ స్పందన గురించి తెలుసుకోండి.
Advertisement

మంచు తుపాను బీభత్సానికి 25 మంది బలి.. చీకట్లోనే 7.5 లక్షల ఇళ్లు!

ఒక ప్రధాన US శీతాకాలపు తుఫాను మరణాలు, విస్తృత విద్యుత్ అంతరాయాలు మరియు అనేక రాష్ట్రాల్లో ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంది, అత్యవసర ప్రతిస్పందన మరియు యుటిలిటీ పునరుద్ధరణ ప్రయత్నాలను ప్రేరేపిస్తుంది.

సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై MHA ఉక్కుపాదం

భారతదేశం అంతటా సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, స్థానిక పోలీసు మరియు బ్యాంకులతో ధృవీకరించుకోవాలని, అలాగే అంతర్-ఏజెన్సీ సమన్వయాన్ని పెంచాలని కోరుతున్నారు.

Adani Embraer : మేక్ ఇన్ ఇండియాకు బలం - విమానాయానంలో అదానీ ఎంబ్రాయర్‌ల కీలక డీల్..!!

భారతదేశంలో ప్రాంతీయ రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మరియు ఎంబ్రేయర్ మధ్య వ్యూహాత్మక సహకారం, ఇందులో తుది అసెంబ్లీ లైన్, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ మరియు నైపుణ్యాల శిక్షణ ఉంటాయి.

ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. 2026 రెనాల్ట్ డస్టర్ స్పెసిఫికేషన్స్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 రెనాల్ట్ డస్టర్ SUV ఎట్టకేలకు నిన్న అధికారికంగా ఆవిష్కరించబడింది. తొలి చూపులోనే ఆకట్టుకునే స్టైలిష్ డిజైన్‌తో పాటు, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఇందులో అనేక కొత్త ఫీచర్లను రెనాల్ట్ జోడించింది. లుక్ పరంగా మరింత మస్క్యులర్‌గా, ప్రీమియం టచ్‌తో కనిపించే ఈ కొత్త డస్టర్, SUV ప్రియుల అంచనాలను నిజం చేసినట్టే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ SUV కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కొత్త డస్టర్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు కేవలం రూ. 21,000 అడ్వాన్స్ చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇది రానున్న రోజుల్లో మార్కెట్లోకి వచ్చే అత్యంత ఆసక్తికర SUVలలో ఒకటిగా మారుతుందనే అభిప్రాయం ఆటో వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కారు గురించిన డిజైన్, ఇంజిన్, ఫీచర్స్, ధర వివరాలు ఈ కింది కథణంలో చూద్దాం.

స్టాక్ లేదన్నా షోరూమ్స్ వద్ద పడిగాపులు

యమహా మోటార్ ఇండియా తన అమ్ములపొదిలోకి కొత్తగా చేరిన XSR 155 మోడల్‌తో భారత టూవీలర్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. 2025 డిసెంబర్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, యమహా చరిత్రలోనే కనివినీ ఎరుగని వృద్ధిని నమోదు చేసింది. కేవలం ఒక్క నెలలోనే యమహా బ్రాండ్‌ను అమ్మకాల శిఖరాగ్రాన నిలబెట్టిన ఘనత XSR 155 బైక్‌కే దక్కుతుంది. నవంబర్ 2025లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ నియో-రెట్రో స్టైల్ బైక్, డిసెంబర్ నెలలోనే రికార్డు స్థాయిలో అమ్ముడై ఆటోమొబైల్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.