పెట్రోల్ తాగేది తక్కువ..మైలేజ్ ఇచ్చేది ఎక్కువ

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) ఇప్పుడు భారత మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒకప్పుడు కేవలం స్పోర్ట్స్ బైక్‌లకు మాత్రమే పెట్టింది పేరైన యమహా, ఇప్పుడు స్కూటర్ల విభాగంలోనూ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha RayZR 125) హైబ్రిడ్ స్కూటర్ అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.

బడ్జెట్ ధరలోనే సఫారి లాంటి లుక్

భారతీయ మార్కెట్‌లో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను క్రియేట్ చేసి అమ్మకాలలో అద్భుతాలు సృష్టించిన టాటా పంచ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తయారవుతోంది. కొత్త సంవత్సరంలో మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్న ఈ పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కెమెరా కంటికి చిక్కింది. డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులతో టాటా మోటార్స్ ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

7 సీటర్ కార్ అయినా తగ్గిన అమ్మకాలు

మారుతి సుజుకి ఎర్టిగా (maruti suzuki ertiga) భారత మార్కెట్లో సంవత్సరాలుగా సామాన్య కుటుంబాల నమ్మకాన్ని సంపాదించుకున్న ఒక విజయవంతమైన MPV. సరసమైన ధర, విశాలమైన కేబిన్, 7 సీట్ల సౌకర్యం, మంచి మైలేజ్ కారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఇది ప్రత్యేక స్థానం సంపాదించింది. ముఖ్యంగా ఒకే కారుతో ఫ్యామిలీతో పాటు రోజువారీ అవసరాలు, లాంగ్ డ్రైవ్స్‌ను కూడా సులభంగా నిర్వహించగలగడం ఎర్టిగాను బడ్జెట్ 7 సీటర్ సెగ్మెంట్‌లో బలమైన ఎంపికగా మార్చింది. అయితే, తాజా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఎర్టిగా సేల్స్‌లో స్వల్ప తగ్గుదల నమోదైనట్టు తెలుస్తోంది. నవంబర్ 2025లో మారుతి సుజుకి ఎర్టిగా మొత్తం 16,197 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గత నెలతో పోలిస్తే గణనీయమైన తగ్గుదలగా చెప్పుకోవచ్చు.

2025లో భారీ నష్టాలను మిగిల్చిన టాప్ 10 ప్రకృతి విపత్తులు ఇవే..?

ప్రపంచ అంచనా ప్రకారం ప్రకృతి వైపరీత్యాల వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవించాయి, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ ప్రభావాలు మరియు బీమా కవరేజ్ పాత్రను బీమా క్లెయిమ్‌లు తెలియజేస్తున్నాయి.
Advertisement

5 రోజుల్లో 5వేల కిలోమీటర్లు..భారత్ నుండి జింబాబ్వేకు..

అముర్ ఫాల్కన్లు భారతదేశం నుండి ఆఫ్రికాకు వేలాది కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తాయి, వాటి మార్గాలు, సంరక్షణ అవసరాలు మరియు అవి ఆకర్షించే ప్రపంచ దృష్టిని అన్వేషించండి.

ఇండియాలో బెస్ట్ 7 సీటర్ ఫ్యామిలీ కార్లు ఇవే!

కొత్త కారు కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఆ కోరికను వాస్తవంగా మార్చే సమయంలో మాత్రం చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ముఖ్యంగా పెద్ద కుటుంబం ఉన్నవారు కార్ ఎంపికలో మరింత ఆలోచించాల్సి వస్తుంది. రోజువారీ ప్రయాణాలు మాత్రమే కాకుండా, ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లే సందర్భాలు, పండుగలు, ఫంక్షన్లు, లాంగ్ డ్రైవ్స్ వంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కారు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఒకేసారి అందరూ సౌకర్యంగా ప్రయాణించగలిగే కార్ కావాలంటే, 7 సీటర్ కార్లు ఉత్తమ పరిష్కారంగా నిలుస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 7 సీటర్ సెగ్మెంట్‌లో కొన్ని కార్లు కస్టమర్లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. వాటిలో రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్ క్లావిస్ కార్లు ముఖ్యమైనవి. వీటి గురించి ఈ కింది కథనంలో చూద్దాం.

రోజూ ఇవి రెండు నోట్లో వేసుకోండి - షుగర్ కంట్రోల్, లివర్ ఇక సూపర్..!!

లవంగాలు మరియు లవంగ నూనె యొక్క నిద్ర, జీర్ణక్రియ మరియు నోటి ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాల యొక్క నిష్పాక్షిక అవలోకనం, భద్రతా సూచనలు, సాక్ష్య పరిమితులు మరియు ఆచరణాత్మక వినియోగ మార్గదర్శకత్వంతో.

మైలేజ్‌లో నెం.1.. అమ్మకాలలో 9వ స్థానం!

బజాజ్ ప్లాటినా (bajaj platina) భారత ద్విచక్ర వాహన మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోటార్‌సైకిల్. సరసమైన ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విస్తృతమైన వినియోగదారుల విశ్వాసాన్ని ఈ బైక్ పొందింది. ముఖ్యంగా రోజువారీ ఆఫీసు ప్రయాణాలు, చిన్న వ్యాపార అవసరాల కోసం ప్లాటినా చాలామందికి మొదటి ఎంపికగా నిలిచింది. అయితే, తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలను చూస్తే ప్లాటినా అమ్మకాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. నవంబర్ 2025 నెలలో బజాజ్ ప్లాటినా మొత్తం 32,040 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనిని గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా మారింది.

శభాష్ "ఢిల్లీ పోలీస్".. ఒక్క రాత్రిలోనే 285 మంది అరెస్ట్!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రతను పరిరక్షించడానికి ఢిల్లీ అధికారులు ఆపరేషన్ అఘాత్ 3.0ని ప్రారంభించారు, వందలాది మందిని అరెస్టు చేశారు, అనుమానితులను నిర్బంధించారు మరియు ఆయుధాలు, డ్రగ్స్ మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ట్రయంఫ్ బైక్ ధరలు పెరుగుతున్నాయి!

ప్రపంచ ప్రఖ్యాత మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారత మార్కెట్‌లో తన బైక్‌ల ధరల విషయంలో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ అన్ని మోడళ్లకు వర్తించే ఎక్స్-షోరూమ్ ధరలు 2025 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. అంటే, ఈ ఏడాది చివరి వరకే ప్రస్తుత ధరలు అమల్లో ఉంటాయన్న మాట. కొత్త ఏడాది ప్రారంభంతో పాటు, అంటే జనవరి 1, 2026 నుంచి, ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ లైనప్‌లోని అన్ని మోడళ్లపై ధరలపై పెరుగుదల అమల్లోకి రానుంది. అయితే, ధరలు ఎంత వరకు పెరగనున్నాయనే అంశంపై కంపెనీ అధికారికంగా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ, ధరల పెరుగుదల తప్పదనే సంకేతాలు మాత్రం ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

రూ.6.25 లక్షలు.. 33 కి.మీ మైలేజ్, 5-స్టార్ సేఫ్టీ

రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, చిన్న వ్యాపార అవసరాలు లేదా కుటుంబంతో చేసే డైలీ జర్నీలు ఇలా అన్ని అవసరాల కోసం భారతీయ వినియోగదారులు కార్ ఎంపికలో కొన్ని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా తక్కువ ధరలో లభించాలి, నమ్మకంగా ఉండాలి, అలాగే ఇంధన సామర్థ్యం మంచి స్థాయిలో ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఒకే కారులో కలిసివస్తే, అది భారత మార్కెట్‌లో విజయం సాధించడం ఖాయమే. అందుకే ఇలాంటి కార్లకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. ఈ కోవలోనే 2025 మోడల్ మారుతి సుజుకి డిజైర్‌ (Maruti Suzuki Dzire)ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సాధారణ వినియోగదారుల అవసరాలను లోతుగా అర్థం చేసుకుని రూపొందించిన ఒక గొప్ప కమ్యూటర్ కారు ఇది.

ఒక లెజెండ్ రీ–ఎంట్రీ! 2026 రెనాల్ట్ డస్టర్ కొత్త లుక్

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ (Renault Duster) SUV రీ-ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఒకప్పుడు భారత మార్కెట్‌లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ని షేక్ చేసిన డస్టర్, ఇప్పుడు మళ్లీ అదే మేజిక్ చేయడానికి రెడీ అవుతోంది. 2012లో తొలిసారి లాంచ్ అయిన ఈ SUV, దాదాపు పదేళ్ల పాటు అంటే 2022 వరకు భారత రోడ్లపై తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, రఫ్ అండ్ టఫ్ ఇమేజ్, డీజిల్ ఇంజిన్ పనితనం వంటి అంశాలు డస్టర్‌ను ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి. అయితే మార్కెట్ మార్పులు, పోటీ పెరగడం, మోడల్ అప్డేట్స్ ఆలస్యం కావడం వంటి కొన్ని కారణాల వల్ల క్రమంగా అమ్మకాలు తగ్గి, చివరికి ఈ కారు మార్కెట్ నుంచి తప్పుకుంది.
Advertisement

రూ.500 చలాన్ కి రూ.6లక్షల ఫైన్

నేటి డిజిటల్ యుగంలో సౌకర్యాలు ఎంత పెరిగాయో, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు సరికొత్త దారుల్లో మన జేబులకు చిల్లు పెడుతున్నారు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఒక షాకింగ్ ఘటనలో.. కేవలం రూ.500 ట్రాఫిక్ చలాన్ చెల్లించబోయి ఒక వ్యక్తి ఏకంగా రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడు. మనం ఏమరుపాటుగా చేసే ఒక చిన్న క్లిక్ మన జీవితకాల కష్టాన్ని ఎలా ఆవిరి చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? దొంగలు మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తారు? అనే పూర్తి వివరాలు చూద్దాం.

షోరూం వాళ్ళ మాటలు నమ్మకండి

కొత్త కారు కొనాలనుకునే వారు షోరూమ్‌కి వెళ్లగానే డీలర్లు చెప్పే మొదటి మాట వెయిటింగ్ పీరియడ్. కారు బుక్ చేసిన తర్వాత చేతికి రావడానికి నెలలు, ఒక్కోసారి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ ఆలస్యం అని మనం అనుకుంటాం. కానీ దీని వెనుక కంపెనీలు, డీలర్లు ఆడే ఒక పెద్ద మైండ్ గేమ్ ఉందని మీకు తెలుసా? కస్టమర్లను ఊరించడం ద్వారా తమ బ్రాండ్ వాల్యూను పెంచుకోవడానికి కంపెనీలు చేసే కొన్ని గమ్మత్తైన విన్యాసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా నెక్సాన్ వేరియంట్ వారీ ధరలు, EMI లెక్కలు లోపల!

ఇండియాలో అత్యంత డిమాండ్ కలిగిన కార్లలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ (tata nexon). ఇది భారత మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే కాంపాక్ట్ పరిమాణం, ప్రతి రోజు ఉపయోగానికి ప్రాక్టికల్ డిజైన్, రాజీ పడని నిర్మాణం ఈ అన్ని అంశాలు కలిసి నెక్సాన్‌ను కుటుంబాలు, కొత్త డ్రైవర్స్, బడ్జెట్‌లో మంచి కారును కోరుకునే వారికి ఒక నమ్మదగిన ఎంపికగా నిలబెట్టాయి. అంతేకాదు, టాటా మోటార్స్‌ బ్రాండ్‌ మీద ఉన్న విశ్వసనీయత కూడా నెక్సాన్‌ను మరింత బలపరుస్తుంది. దీని ధర రూ. 7.32 లక్షల నుండి రూ. 14.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. EMI ఆప్షన్‌లో ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కథణంలో నెలవారీగా EMI డేటా మీ కోసం.

H-1B: హెచ్1బీ కొత్త విధానంలో వీరికి పెరిగిన ఛాన్స్? తాజా మార్పులివే..!

US DHS H-1B వీసాల కోసం జీతం ఆధారిత ఎంపికను ప్రకటిస్తుంది, అధిక జీతాలకు ప్రాధాన్యతనిస్తూ యాదృచ్ఛిక లాటరీని భర్తీ చేస్తుంది, FY 2027 నమోదులకు ముందు ఫిబ్రవరి 27 2026 నుండి అమలులోకి వస్తుంది.

రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలి - ఇదీ లెక్క, లేదంటే..!!

ఆరోగ్యకరమైన పెద్దలు ఎంత తరచుగా మూత్రవిసర్జన చేస్తారు, ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే అంశాలు, వైద్య సమీక్ష అవసరమయ్యే సంకేతాలు మరియు మూత్రాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆచరణాత్మక చర్యల గురించి తెలుసుకోండి.

నంబర్ పెరిగితే బడ్జెట్ బ్రేక్! వెంటనే కారు బుక్ చేయండి!

కొత్త సంవత్సరం మొదలవుతున్న వేళ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) వినియోగదారులకు ఒక షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. జపాన్‌కు చెందిన ఈ ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్, జనవరి 2026 నుంచి తన కార్ల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2025 చివరలో ఒక్కనంబర్ మారి 6 చేరిందటే ఇప్పుడు ఎక్కువ ధరతో కారు కొనాల్సి వస్తుంది. దీంతో కొత్తగా హోండా కారు కొనాలని భావిస్తున్న వారికి ఈ ప్రకటన కీలకంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం మీద ఒక స్పష్టమైన ట్రెండ్ కొనసాగుతోంది. ముడిసరుకు ధరలు, లాజిస్టిక్స్, రవాణా ఖర్చులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాహన తయారీదారులు కాలానుగుణంగా తమ వాహనాల ధరలను సవరించుకోవాల్సి వస్తోంది. హోండా కూడా ఈ పరిస్థితి నుంచి మినహాయింపు కాదు.

కారు లోపల హెల్మెట్ ఏంటి బాసూ?

ఆటోమొబైల్ ప్రపంచంలో భద్రతకు సంబంధించి ఒక పెను మార్పు రాబోతోంది. సాధారణంగా హెల్మెట్ అంటే కేవలం ద్విచక్ర వాహనదారులకే పరిమితం అనుకుంటాం. కానీ భవిష్యత్తులో కార్లలో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ వంటి రక్షణను పొందబోతున్నారు. చైనీస్ టెక్ దిగ్గజం హువావే (Huawei), చెర్రీ (Chery) కార్ల తయారీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలోని లక్సీడ్(Luxeed) బ్రాండ్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీని తన రాబోయే లగ్జరీ మినివాన్ లక్సీడ్ V9లో పరిచయం చేస్తోంది.

దేశంలో దీన్ని మించిన స్కూటర్‌ను చూపించలేరు!

భారతదేశంలో ప్రజలను బెస్ట్ స్కూటర్ ఏది? అని అడిగితే, చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా సాధించిన విశ్వాసం, స్థిరమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా సంవత్సరాలుగా వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నగర ప్రయాణాలకే కాకుండా రోజువారీ అవసరాలకు కూడా అనువుగా ఉండే యాక్టివా, అన్ని వయసులవారి నుంచి ఒకే స్థాయిలో ఆదరణ పొందుతోంది. ఈ ప్రజాదరణ నవంబర్ నెల అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం, నవంబర్‌లో హోండా యాక్టివా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుతూ నంబర్ 1 స్థానంలో కొనసాగింది.
Advertisement

ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా!

ఒకప్పుడు భారతీయ రోడ్లపై తమ స్థానాన్ని పదిలం చేసుకున్న అనేక కార్ బ్రాండ్‌లు(Car Brands) కఠినమైన పోటీ, సరైన ధరల నిర్ణయం లేకపోవడం, సర్వీస్ నెట్‌వర్క్ (Service Network) లోపాల కారణంగా మార్కెట్ నుంచి నిష్క్రమించాయి. అయితే, 2025 నాటికి భారతదేశపు వేగంగా అభివృద్ధి చెందుతున్న వాహన మార్కెట్ (Growing Indian Auto Market) ఇప్పుడు పాత బ్రాండ్‌లను మళ్లీ ఆకర్షిస్తోంది.

2026లో కార్ మార్కెట్‌ను షేక్ చేయనున్న మోడల్ వస్తోంది!

భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో టాటా పంచ్ ఈవీ(Tata Punch Ev) ఒకటిగా నిలిచింది. టాటా మోటార్స్ విక్రయించే ఎలక్ట్రిక్ కార్లలో ఇది అత్యంత సరసమైన ధరకు లభించే మోడల్ కావడంతో, మిడిల్ క్లాస్ కుటుంబాలు, మొదటిసారి EV కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల నుంచి దీనికి భారీ స్పందన లభిస్తోంది. స్టైలిష్ డిజైన్, నగర వినియోగానికి సరిపోయే సైజ్, టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఈ అన్నీ కలిసి పంచ్ EVని మార్కెట్లో హాట్ ఫేవరెట్‌గా మార్చాయి. మార్కెట్లో టాటా పంచ్ EVకు ఉన్న ఈ బలమైన డిమాండ్‌ను గమనించిన టాటా మోటార్స్, ఇప్పుడు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సిద్ధమవుతోంది.

నింజా 650 అప్‌డేట్తో ప్రత్యర్థులకు చుక్కలే

జపనీస్ మోటార్‌సైకిల్ దిగ్గజం కవాసకి (Kawasaki) భారతీయ మార్కెట్లోకి తన ఐకానిక్ మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ 2026 నింజా 650 (Ninja 650)ను అధికారికంగా ప్రవేశపెట్టింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.7.91 లక్షలుగా నిర్ణయించారు. మునుపటి 2025 మోడల్‌తో పోలిస్తే ధర సుమారు రూ.14,000 పెరిగినప్పటికీ, ప్రస్తుత పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా దీనిని E20 ఫ్యూయల్ (20% ఇథనాల్ మిశ్రమం)కు అనుకూలంగా అప్‌డేట్ చేయడం విశేషం.

ఇండియా నుంచి వెళ్లేది ఇప్పుడు SUVలే!

భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రస్తుతం ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో చిన్న హ్యాచ్‌బ్యాక్‌లు, తక్కువ ధర గల ప్యాసింజర్ కార్లు ప్రధానంగా డిమాండ్‌లో ఉండేవి. అయితే, ఇటీవలి కాలంలో వినియోగదారుల అభిరుచులు గణనీయంగా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్లు సాధారణ కార్ల కంటే SUVల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ మార్పు కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, భారతదేశం నుంచి జరుగుతున్న వాహనాల ఎగుమతుల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విడుదలైన గణాంకాలు ఈ ధోరణిని మరింత బలపరుస్తున్నాయి. భారత మార్కెట్లో SUVలు, MPVలు, ప్రీమియం ప్యాసింజర్ కార్లు భారీగా ప్రజాదరణ పొందుతున్నాయి. చిన్న కార్లను పక్కన పెట్టి, కొంచెం పెద్దగా కనిపించే, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన SUVలు లేదా ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే MPVల వైపు మొగ్గు చూపుతున్నారు.

లుక్ చూస్తే లయన్.. మైలేజ్‎లో కింగ్

భారతదేశంలో టూ-వీలర్ అనగానే సామాన్యుడి నుంచి కుర్రాళ్ల దాకా అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు బజాజ్ పల్సర్. కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ బైక్, ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, హైటెక్ ఫీచర్లతో కొత్త అవతారమెత్తింది. బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్ పల్సర్ 150 (Pulsar 150) లో 2026 అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది.