ఈ బైక్‌ను చూస్తే హైవే‌లు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది!

గోవా సముద్రతీరాన జరిగే మోటోవర్స్ 2025 వేడుక ఈసారి ప్రత్యేకంగా బైక్ ప్రేమికులకు పండుగలా మారింది. ఎందుకంటే, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వేళలో రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్(Meteor 350 Sundowner Orange) స్పెషల్ ఎడిషన్‌ను అద్భుతంగా ఆవిష్కరించింది. వేలాది మంది ఉత్సాహభరితమైన రైడర్లు, బైక్ అభిమానులు, కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో ఈ లాంచ్ జరగడంతో ఆ వేదిక ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయింది. మీటియోర్ 350 ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. దాని క్రూయిజర్ డిజైన్, ఆహ్లాదకరమైన రైడింగ్ పోజిషన్, సున్నితమైన రైడ్ క్వాలిటీ దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఎండు ద్రాక్ష వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు

నల్ల ద్రాక్షల నీరు బరువు తగ్గడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

రోడ్లపై గర్జించడానికి బుల్లెట్ 650 వచ్చేసింది.. ఇదే ఫస్ట్ లుక్

రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తాజాగా మోటోవర్స్ 2025లో తన తాజా మోడల్ బుల్లెట్ 650(Bullet 650) ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇటలీలోని మిలాన్‌లో జరిగిన EICMA 2025లో ప్రపంచానికి మొదటి సారి చూపించిన ఈ బైక్, కొన్ని వారాల వ్యవధిలోనే భారత మార్కెట్లో అడుగుపెట్టడం విశేషం. కొత్త బుల్లెట్ 650 డిజైన్‌ను ఒకసారి చూసిన వెంటనే, ఇది ఎందుకు బుల్లెట్ అనిపిస్తుందో అర్థం అవుతుంది. పిన్‌స్ట్రిప్పింగ్‌తో అందంగా తీర్చిదిద్దిన టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్‌ నుంచి ప్రారంభమై, క్లాసిక్ మోడళ్లను గుర్తు చేసే విధంగా కొద్దిగా పైకి లేచిన క్రోమ్ హ్యాండిల్‌బార్లు, స్క్వేర్డ్ రియర్ ఫెండర్ వంటి ప్రతి అంశంలోనూ సంప్రదాయ బుల్లెట్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది.

కిలోమీటర్ ప్రయాణ ఖర్చు కేవలం 60పైసలే

2020లో ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎంజీ ZS EV కంపెనీకి ఒక లక్కీ మోడల్. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఎవరూ పెద్దగా నెగిటివ్ మాట్లాడింది లేదు. దానికి తగ్గట్టుగానే, ప్రతి నెలా దీని సేల్స్ చాలా గౌరవప్రదంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అక్టోబరు నెలలో ఈ కారు సేల్స్‌లో ఏకంగా 143 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబరులో కేవలం 250 యూనిట్లు అమ్ముడవగా 2024 అక్టోబరులో 609 యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది.
Advertisement

సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇలా చేసి చూడండి

2025 నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠి ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని, లార్డ్ మురుగన్‌కు పూజలు మరియు ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలను పొందండి.

హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది

రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూసే వార్షిక వేడుక మోటోవర్స్ ఈసారి గోవా తీరాల్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ ప్రేమికులు, ప్రత్యేకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానం కలిగిన వారు, ప్రతి సంవత్సరం లాంటి ఈ వేడుకలో కొత్త మోడళ్లు, ప్రత్యేక ఎడిషన్‌లు, భవిష్యత్ లాంచ్‌లను చూసే అవకాశం కోసం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈసారి మాత్రం గోవాలో జరిగిన మోటోవర్స్‌కు ప్రత్యేకత మరింత పెరిగింది. ఎందుకంటే కొద్ది వారాల క్రితం ఇటలీలోని మిలన్‌లో నిర్వహించిన 2025 EICMA షోలో ప్రపంచానికి పరిచయం చేసిన అనేక మోడళ్ల ధరలను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇక్కడే ప్రకటిస్తోంది. మొదటి రోజు, అంటే నవంబర్ 21, 2025న, కంపెనీ తన లెజెండరీ హిమాలయన్ శ్రేణిలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది, హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్‌ను అధికారికంగా పరిచయం చేసింది.

రోడ్డుమీద రాజు వచ్చేస్తున్నాడు… కొత్త హోండా పైలట్ 2026 గ్రాండ్ రివీల్!

హోండా పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది సెడాన్‌లు.. సివిక్, సిటీ, అమేజ్. ఎందుకంటే భారత మార్కెట్‌లో హోండాను సెడాన్ బ్రాండ్‌గా చూసే అభిమానం చాలా కాలంగా ఉంది. అయితే, జపాన్‌కు చెందిన ఈ ఆటో దిగ్గజం పెద్ద SUVలను రూపొందించడంలో కూడా ఎంత పెద్ద మాస్టర్ అనేది ప్రపంచ మార్కెట్‌ బాగా తెలుసు. అమెరికా, యూరప్ మార్కెట్లలో హోండా పైలట్, పాస్‌పోర్ట్, CR-V వంటి SUVలు ఇప్పటికే పెద్ద క్రేజ్ సృష్టించాయి. ఇప్పుడు అదే SUV DNAతో వచ్చిన ఒక భారీ మోడల్ భారత రోడ్లపైకి దిగేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హోండా పైలట్ భారత మార్కెట్లో లాంచ్‌కు సిద్ధమవుతోంది.

అదాని విల్మార్‌లో మిగిలి ఉన్న 7శాతం వాటాను విక్రయించిన అదానీ గ్రూప్

అదాని గ్రూప్ అదాని విల్మార్‌లో తన వాటాను 7%కి తగ్గించింది, విల్మార్ ఇంటర్నేషనల్‌ను ఏకైక ప్రమోటర్‌గా మారేందుకు అనుమతిస్తుంది, వారి వృద్ధి సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఎక్కువ టైం కంప్యూటర్, ఫోన్​ చూస్తున్నారా? ఇలా చేయకుంటే షుగరు ఖాయం..!!

భారత యువతలో పెరుగుతున్న టైప్ 2 డయాబెటిస్ కేసులకు పెరిగిన స్క్రీన్ సమయం దోహదపడుతుందని అధ్యయనం వెల్లడించింది, ఆరోగ్యకరమైన అలవాట్ల అవసరాన్ని హైలైట్ చేస్తోంది.

యాక్టివా ఉత్పత్తికి బ్రేక్..6 నెలల్లోనే మూతపడ్డ ప్లాంట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ (EV Market) చాలా వేగంగా మారిపోతోంది. స్టార్టప్ కంపెనీలను వెనక్కి నెట్టి, TVS, బజాజ్ వంటి పాత బ్రాండ్‌లు ఈ విభాగంలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ పోటీలో హెవీ వెయిట్ బ్రాండ్ అయిన హోండాకు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే పెట్రోల్ స్కూటర్ యాక్టివా.. ఈవీ మార్కెట్‌లోకి వచ్చినా హోండాకు ఆశించిన ఫలితం దక్కలేదు. అందుకే కంపెనీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

మొన్న వరకూ హిట్… ఇప్పుడు ఎందుకు సైలెంట్?

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఒకటి. ప్రారంభం నుంచే స్టైలిష్ లుక్, కాంపాక్ట్ సైజ్, ఫీచర్లతో నిండిన ఇంటీరియర్‌, నమ్మకమైన ఇంజిన్ పనితీరు వంటి అంశాలతో ఈ కారు వినియోగదారుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. కేవలం కుటుంబ అవసరాలకే కాకుండా, రోజువారీ ప్రయాణాలకు, నగర ట్రాఫిక్‌లో సులభంగా నడపగల కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. లుక్‌తో పాటు, ప్రాక్టికల్‌గా ఉపయోగపడే ఫీచర్లను అందించడం కూడా ఈ కారుకు పెద్ద ప్లస్ పాయింట్. గ్రాండ్ i10 నియోస్ భారత మార్కెట్లో ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ కుటుంబ హ్యాచ్‌బ్యాక్‌గా తన స్థాయి, ప్రజాదరణ రెండింటినీ స్థిరంగా కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఈ కారుకు గత నెలలో తక్కువ డిమాండ్ వచ్చింది.

మార్కెట్ దుమ్ము దులిపేందుకు దిగుతున్నాడు

అడ్వెంచర్ రైడింగ్ అంటే ఇష్టపడే మన ఇండియన్ బైకర్స్‌కి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక స్పెషల్ బ్రాండ్. గతంలో వచ్చిన హిమాలయన్ 411 గానీ, ఇప్పుడు మార్కెట్‌ను దున్నేస్తున్న హిమాలయన్ 450 గానీ ఎంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ హంగామాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి, ఎన్‌ఫీల్డ్ ఏకంగా 750cc సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటలీలో జరిగిన 2025 EICMA మోటోషోలోనే ఈ పవర్‌ఫుల్ మోడల్‌ను ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ 750cc బీస్ట్‌ కోసం ఇండియాలో బైక్ లవర్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. ఈవీ మార్కెట్‌ను షేక్ చేసే మోడల్ ఇదే!

భారత రెండు చక్రాల మార్కెట్లో ఇటీవల వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల్లో ఒకటి.. ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్ మీద పెరుగుతున్న ఆసక్తి. ఇప్పటివరకు పెట్రోల్ బైకులకే పరిమితమైన చాలా మంది కొనుగోలుదారులు, ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణహితత వంటి అంశాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలు. ఇదే సమయంలో పలు ప్రముఖ కంపెనీలు కూడా ఈ మార్కెట్లోకి అడుగుపెడుతూ, తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో బైకుల ప్రపంచంలో రాజుగానే పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌పై దృష్టి సారించింది.

ఈ కారు ఎక్కితే రాకెట్ లా దూసుకుపోవాల్సిందే

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూకుడు పెంచుతోంది. ఇటీవల విడుదల చేసిన తమ ప్రముఖ ఎలక్ట్రిక్ మోడల్ BE 6 ఎస్‌యూవీ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఊహించని విజయాన్ని సాధించింది. కేవలం కొన్ని సెకన్లలోనే 999 కార్లు అమ్ముడవడంతో ఇప్పుడు మహీంద్రా సంస్థ మరో స్పెషల్ ఎడిషన్ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా దీనికి తోడు పూర్తిగా ఆఫ్-రోడ్ లుక్‌లో ఉన్న కొత్త ఎస్‌యూవీ BE Rall-E టీజర్‌ను కూడా విడుదల చేసింది.

టాటా ఆల్ట్రోజ్ అంటే ప్రజల్లో నమ్మకం పెరిగింది

భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ ఎప్పుడూ పోటీతో నిండి ఉంటుంది. మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20 వంటి అమ్మకాల వీరులు ఉన్నా కూడా, టాటా ఆల్ట్రోజ్ (tata altroz) మాత్రం తన ప్రత్యేకతతో, భద్రతతో, ధర-ఫీచర్ల సమతుల్యతతో వినియోగదారుల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతోంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనాలి అనుకునే వారికి ఆల్ట్రోజ్ ఇప్పుడు ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా నిలిచిపోయింది. అందుకే ఈ కారు అమ్మకాల పరంగాను గత కొంతకాలంగా ఓ స్థిరమైన పర్ఫార్మెన్స్‌ను కనబరుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత అక్టోబర్ 2025 నెలలో టాటా ఆల్ట్రోజ్ మరోసారి తన సత్తా చాటింది. ఈ ఒక్క నెలలోనే 3,770 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. గత సంవత్సరం ఇదే నెలలో, అక్టోబర్ 2024లో కేవలం 2,642 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మైలేజ్ చూసే ఈ కారును కొనేస్తున్న జనాలు

దేశంలో అత్యధికంగా కార్లను విక్రయింటే కంపెనీ మారుతి సుజుకి. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. ఈ క్రమంలో మారుతి సుజుకి నుంచి వచ్చిన XL6 ఎంపీవీ ప్రస్తుతం మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

ఇక ఆ 4 కార్లతో రచ్చ రచ్చే!

జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా అంటేనే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, విశ్వసనీయతకు మారుపేరు. భారత మార్కెట్‌లో తమ పట్టును మరింత పెంచుకోవడానికి సిద్ధమవుతోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ అనేక మోడళ్లను విడుదల చేసి కస్టమర్ల మనసు గెలుచుకున్న హోండా... గత కొద్ది సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, ప్రీమియం ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను గమనించింది. దీనికి తగ్గట్టుగా తమ గ్లోబల్ మోడళ్లను భారతదేశంలో విడుదల చేయడం ద్వారా మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి హోండా సిద్ధమవుతోంది. ఆ 4 ముఖ్యమైన మోడళ్లు ఏమిటో వివరంగా చూద్దాం.

కియా సోరెంటో మార్కెట్లో దిగితే టయోటాకు కష్టకాలమేనా?

టయోటా ఫార్చ్యూనర్‌ అంటే భారత ఆటో మార్కెట్లో ఒక బ్రాండ్‌లా మారిపోయింది. పూర్తి-పరిమాణ SUVల్లో దానికి సరైన పోటీదారు ఇప్పటివరకు కనిపించలేదు. ఆ సైజ్‌, ఆ రోడ్ ప్రెజెన్స్‌, ఆ పవర్.. ఈ మూడు కలిసే ఫార్చ్యూనర్‌ను ఇంకా బలంగా నిలబెడతాయి. అయితే, ఈ ఏకపక్ష రాజ్యానికి త్వరలో ముగింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కియా సిద్ధం చేస్తోన్న భారీ SUV సోరెంటో, ఇప్పుడు నిజంగా భారత్‌లోకి అడుగుపెట్టబోతుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌బేస్ ఉన్న కియా సోరెంటో (kia Sorento) భారత మార్కెట్లో కూడా విడుదలకానుందనే ఊహాగానాలు చాలాకాలంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఊహాగానాలగానే ఉన్నా... తాజాగా ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. మొదటిసారి కియా సోరెంటో భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది

ముందస్తు బుకింగ్‌లతో హాట్ టాపిక్‌గా మారిన మినీ కూపర్ కన్వర్టిబుల్!

మినీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ (mini cooper convertible) భారత్‌లో అధికారికంగా మళ్లీ రాబోతోందన్న వార్త ఆటో ప్రేమికులలో పెద్ద హుషారును తీసుకొచ్చింది. నవంబర్ 19 నుంచి ఈ కాంపాక్ట్ ఓపెన్-టాప్ కారుకు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 2025 నాటికి దాన్ని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మినీ ఇండియా ప్రకటించింది. ఈ సెగ్మెంట్‌లో ఓపెన్-టాప్ కారు ఎంపికలు ఎంతో పరిమితంగా ఉండటంతో, కొత్త మినీ కన్వర్టిబుల్ తిరిగి ఎంట్రీని బ్రాండ్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మినీ కూపర్ S ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి వచ్చిన ఈ కొత్త మోడల్‌ ప్రధాన ప్రత్యేకత దాని పూర్తిగా ఎలక్ట్రిక్ సాఫ్ట్ టాప్.

ప్రతీ 300 మందిలో ఒకరు ఈ కారు కొంటున్నారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇతర పెద్ద కంపెనీలతో పోలిస్తే తక్కువ అమ్మకాలు చేస్తున్న సిట్రోయెన్ కంపెనీ అక్టోబర్ 2025లో మాత్రం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఎంఎస్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం, కంపెనీ కొత్త వ్యూహాలు అమలు చేయడంతో ఫలితం కనిపించడం మొదలైంది.
Advertisement

మెటా $1 బిలియన్ ఆఫర్‌ రిజెక్ట్ చేసిన మీరా.. ఆమె ఎవరు ? ఆ స్టోరీ ఏంటి ??

సౌమిత్ చింతల, ఒక కీలక AI నాయకుడు, మీరా మురాటి స్థాపించిన థింకింగ్ మషీన్స్ ల్యాబ్‌లో చేరారు, మెటా నుండి వచ్చిన $1 బిలియన్ ఆఫర్‌ను తిరస్కరించారు.

విద్యాశాఖతో జతకట్టిన అదానీ గ్రూప్: ఇండాలజీ పరిశోధనకు శ్రీకారం

అదానీ గ్రూప్ భారతీయ నాగరికత సంప్రదాయాలలో పరిశోధనను ప్రోత్సహించడానికి భారతీయ జ్ఞాన వ్యవస్థలతో కలిసి పనిచేస్తోంది, 14 పిహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లకు మద్దతు ఇస్తోంది.

షుగర్​ లెవల్స్​ కంట్రోల్లో ఉండాలా? ఈ టిప్స్ పాటిస్తే చాలు..!!

భారతీయ కుటుంబాలు పెరుగుతున్న మధుమేహం కేసులను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాలను స్వీకరిస్తున్నాయి, మెరుగైన ఆరోగ్యానికి సంపూర్ణ ధాన్యాలు, కూరగాయలు మరియు నాజూకైన ప్రోటీన్లపై దృష్టి పెట్టాయి.

ఈ కారును ఒక్కనెలలో 5 వేల మంది కొన్నారు

స్కోడా(Skoda) ఆటోకు 2025 సంవత్సరం నిజంగానే గోల్డెన్ ఇయర్‌గా నిలుస్తోంది. చేక్ ఆటోమేకర్ భారత మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త దిశను సృష్టించుకోవడంలో విజయవంతమైంది. ఈ సంవత్సరం తొలి పది నెలల్లోనే స్కోడా అద్భుతమైన అమ్మకాల ప్రగతిని నమోదు చేసింది. జనవరి నుండి అక్టోబర్ 2025 మధ్య మొత్తం 61,607 యూనిట్లు అమ్ముడవడం బ్రాండ్ చరిత్రలోనే అత్యధిక రికార్డు. ఇంకా క్యాలెండర్ సంవత్సరానికి రెండు నెలల సమయం మిగిలి ఉండగానే, ఇది 2022లో నెలకొల్పిన 53,721 యూనిట్ల పూర్తి సంవత్సర రికార్డును సులభంగా అధిగమించడం గమనార్హం. స్కోడా బ్రాండ్‌కు భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరింత బలమైన స్థానం ఏర్పడుతోందనే సంకేతాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

మార్కెట్‎ను షేక్ చేయబోతున్న 4 కార్లు

భారతదేశంలో ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్న సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది మిడ్-సైజ్ SUV సెగ్మెంటే.. ఈ సెగ్మెంట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, మహీంద్రా, టాటా, రెనాల్ట్, నిస్సాన్ వంటి పెద్ద కంపెనీలు తమ కొత్త మోడళ్లను ఈ సెగ్మెంట్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. రాబోయే 3-4 నెలల్లో మార్కెట్‌లోకి రాబోతున్న ఈ 4 కార్లు ప్రజల్లో భారీ అంచనాలను పెంచాయి. ఈ కార్లలో ఏముంది? ఈ పోటీ ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం.