దీని మీద వెళ్తుంటే అమ్మాయిలు వెంటపడతారు
ఆటోమొబైల్స్
- 10 month, 14 days ago
యమహా (Yamaha) కంపెనీ నుంచి బైక్ లవర్స్ ఎంతోమంది ఎప్పటి నుంచో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న కొత్త బైక్ XSR 155 డెలివరీలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. బైక్‌ను డెలివరీ తీసుకుంటున్న కస్టమర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బైక్‌ను యమహా రూ.1.5 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350), టీవీఎస్ రోనిన్ (TVS Ronin) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిన ఈ మోడల్, R15 మోడల్‌ను ఆధారంగా చేసుకుని తయారైంది.