ఆ విషయంలో టాప్ 2కు చేరిన టాటా
ఆటోమొబైల్స్
- 11 month, 26 days ago
భారతదేశంలో కార్ల అమ్మకాలు సెప్టెంబర్ 2025లో చాలా ఆసక్తికరంగా మారాయి. జీఎస్‌టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి నెల ఇదే. పండుగ సీజన్ ఆఫర్లు, తగ్గిన జీఎస్‌టీ రేట్ల కారణంగా వినియోగదారులు కార్ షోరూమ్‌లకు పరుగులు తీశారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) నివేదిక ప్రకారం.. సెప్టెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల రిటైల్ అమ్మకాలు 5.8% పెరిగి 2,99,369 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, ఆగస్టుతో పోలిస్తే కొంచెం తగ్గుదల (7.39%) ఉన్నప్పటికీ, మొత్తం సంవత్సరం అమ్మకాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి.