ఒకే ఛార్జ్‌తో 158 కి.మీ రేంజ్.. టీవీఎస్ ఆర్బిటర్ స్కూటర్ అద్భుత ఫీచర్లు!
ఆటోమొబైల్స్
- 1 year, 1 month, 6 days ago
టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS), ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా టూవీలర్, త్రీవీలర్ వాహనాల్లో అగ్రగామిగా నిలుస్తు ఒకవైపు పెట్రోల్ ఆధారిత వాహనాలతో దూసుకుపోతూ, అదే సమయంలో ఎలక్ట్రిక్ విభాగంలో కూడా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈవీ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ సంస్థ, తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter)ను లాంచ్ చేసింది. TVS ఇప్పటికే iQube అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఇప్పుడు, ఈ కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరకు విడుదల అయింది. దీని ధర వచ్చేసి రూ.99,000 ఎక్స్‌షోరూమ్. రోజువారీ ప్రయాణాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లేలా డిజైన్ చేయబడిన ఈ ఆర్బిటర్, తన సెగ్మెంట్‌లో మొదటిసారి అందిస్తున్న అనేక ఫీచర్లను కలిగి ఉంది.