వింటేజ్ బైక్‌తో ఎంట్రీ ఇచ్చిన డీకే శివకుమార్.. బెంగళూరులో హల్‌చల్ చేసిన రైడ్
ఆటోమొబైల్స్
- 1 year, 1 month, 16 days ago
బెంగళూరు నగరాన్ని దేశంలోని ఐటీ హబ్‌గా, స్టార్టప్‌ల రాజధానిగా ప్రపంచం గుర్తించింది. ఈ గుర్తింపు పొందినప్పటి నుండి నగర జనాభా ఊహించని రీతిలో పెరుగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉద్యోగార్థులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఈ నగరంలోకి అడుగుపెడుతున్నారు. ఫలితంగా మౌళిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. రవాణా వ్యవస్థపై ఈ ఒత్తిడి అత్యధికంగా కనిపిస్తోంది. ఉదయం ఉద్యోగాలకు వెళ్ళే సమయం, సాయంత్రం తిరిగి వచ్చే సమయం .. ఈ రెండు పీక్ అవర్స్‌లో నగరమంతా వాహనాల రద్దీతో నిండిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగిపోవడం, ఒక్కో కిలోమీటర్ కదలడానికి అరగంట వేచిచూడడం, అత్యవసర పనులకీ సమయానికి చేరుకోలేక ఇబ్బంది పడడం, ఇవన్నీ బెంగళూరు జీవనశైలిలో భాగమైపోయాయి.