జనాల మనసులో చెరగని కైనెటిక్ ఇప్పుడు కొత్తగా, నిశ్శబ్దంగా తిరిగి రాబోతుంది!

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలదే రాజ్యంగా కనిపిస్తుంది. మార్కెట్లో విడుదల అవుతున్న చాలా ఫోర్ వీలర్, టూవీలర్స్‌లో ఈవీలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా టూవీలర్ తయారీదారులు మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త ఎలక్ట్రిక్ బైకులను, స్కూటర్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ 1980లలో మనకు సుపరిచితమైన కైనెటిక్ హోండా DXను ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో, ఎలక్ట్రిక్ అవతారంలో మన ముందుకు తీసుకురాబోతోంది. kinetic Dx Electric Scooterను కైనెటిక్ గ్రీన్ జూలై 28న తమ కొత్త DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. రాబోయే ఈ కొత్త మోడల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 అమ్మకాలు తగ్గుదల.. కారణాలు ఏమిటి?

భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే టూ వీలర్లలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ఒకటి. ఇది ఒక మోపెడ్ రకం వాహనం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో దీనికి చాలా ఆదరణ ఉంది. తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్ దీనికి ప్రధాన ఆకర్షణలు. అందుకే సాధారణ ప్రజలకు ఇది చాలా ఇష్టమైన వాహనంగా మారింది. ప్రస్తుతం, పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే మోపెడ్‌లు భారతదేశంలో పెద్దగా లేవనే చెప్పాలి.

క్లావిస్ EV స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, నడిపిన అనుభవం పూర్తిగా ఇదే

Kia Clavis EV: తెలుగులో రివ్యూ. ఫీచర్లు, పనితీరు, ధర మరియు ఇతర వివరాలు. ఎలక్ట్రిక్ MPV గురించి తెలుసుకోండి.

మధ్య దారిలో బైక్ ఆగిపోతే ఏం చేయాలి? ఈ సింపుల్ పద్ధతులు ట్రై చేయండి!

బైక్ నడిపే చాలా మందికి మధ్యలో పెట్రోల్ అయిపోయి, బైక్‌ను తోసుకుంటూ వెళ్లిన అనుభవం ఉండే ఉంటుంది. అప్పుడు అయ్యో, కాస్త ముందుగానే పెట్రోల్ కొట్టించుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే, ఎప్పుడూ మీ బైక్ ఫ్యూయల్ లెవల్‌ను గమనిస్తూ ఉండాలి. కానీ, ఒకవేళ అనుకోకుండా మీరు మధ్య దారిలో ఉన్నప్పుడు పెట్రోల్ అయిపోతే, కంగారు పడాల్సిన అవసరం లేదు.
Advertisement

లవంగం నీటి ఆరోగ్య ప్రయోజనాలు వివరించబడ్డాయి

లవంగం నీటి ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి, రోగనిరోధక శక్తిని పెంచడం నుండి జీర్ణక్రియకు సహాయపడటం వరకు. ఉత్తమ ఫలితాల కోసం దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

సీట్‌బెల్ట్ లోపం.. వర్టస్, టైగన్, కుషాక్, స్లావియా, కైలాక్‌లకు రీకాల్ షాక్!

ప్రముఖ దిగ్గజ కార్ల తయారీదారులు ఫోక్స్‌వ్యాగన్, స్కోడా వేర్వేరు బ్రాండ్‌లుగా కనిపించినా, ఇవి ఒకే గ్రూపుకు చెందినవి. అయినప్పటికి విడివిడిగా తమ వాహనాలను విడుదల చేస్తుంటాయి. అందుకే స్కోడా కుషాక్- ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా స్లావియా - ఫోక్స్‌వ్యాగన్ వెర్టస్ వంటి కార్లు ఒకే ప్లాట్‌ఫామ్, ఒకే ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌ను పంచుకుంటూ ఉంటాయి. ఈ కార్లు Volkswagen India 2.0 ప్రాజెక్ట్ కింద రూపొందించబడ్డవే. మోడ్యూలర్ MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ నాలుగు కార్లు భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లోకలైజ్ చేయబడ్డాయి. అయితే, తాజాగా ఈ కార్లకు సంబంధించిన ఓ తయారీ లోపం కంపెనీ దృష్టికి వచ్చినట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కుషాక్, టైగన్, స్లావియా, వెర్టస్ కార్లను వెంటనే రీకాల్ చేసింది.

ఆగస్ట్ లో వీరే మహర్జాతకులు అని ప్రకటించిన సూర్య కేతువులు

ఆగస్టు 2025 లో సూర్యుడు మరియు కేతు సంయోగం యొక్క జ్యోతిష్య ప్రభావాన్ని అన్వేషించండి. ఇది వివిధ రాశిచక్రాలపై ఎలా సానుకూలంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450కి పోటీగా సరికొత్త బైక్

అడ్వెంచర్ బైక్ మార్కెట్‌లో ఒక కొత్త సంచలనం మొదలైంది. ఇటలీకి చెందిన పేరున్న బైక్ కంపెనీ మోటో మోరిని తమ సరికొత్త ఆల్ట్రైక్ 450(Alltrhike 450) బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ బైక్ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, CFMoto 450 MT వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వబోతోంది.

వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, వీటితో కూడా బెనిఫిట్స్!

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషక సూచనలను కనుగొనండి, వీటిలో విటమిన్ C-సమృద్ధిగా ఉండే ఆహారాలు, హైడ్రేషన్ మరియు మరిన్ని ఉన్నాయి.

హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ ఎవరు ముందున్నారో తెలుసా? జూన్ 2025 టాప్ 10 బైక్స్ లిస్ట్ ఇదే

ప్రపంచ వ్యాప్తంగా టూవీలర్ అమ్మకాల్లో భారత్ కీలక స్థానాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ రోజువారీ రవాణా అవసరాల కోసం బైక్‌లు, స్కూటర్లను ఎన్నుకుంటున్నారు. ఈ దృక్పథం జూన్ 2025 నెల టూవీలర్ అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెలలో కొన్ని లక్షల సంఖ్యలో భారత్‌లో టూవీలర్స్‌ను ప్రజలు కొనుగోలు చేశారు. అయితే ఈ టైంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్స్‌ను ఒకసారి చూద్దాం. జూన్ 2025లో అత్యధికంగా విక్రయమైన 2-వీలర్‌గా మళ్లీ హీరో స్ప్లెండర్ (Hero Splendor) బైక్ నిలిచింది. ఒకే నెలలో 3,31,057 యూనిట్లు అమ్ముడవడం, ఈ మోడల్‌కు మార్కెట్లో ఇప్పటికీ ఎంతటి స్థిరమైన ఆదరణ ఉన్నదో చెప్పకనే చెబుతుంది. ఇది కేవలం నంబర్ల విషయమే కాదు, దీని వెనుక ఉన్న విశ్వాసం, ఆర్ధికత, మైలేజ్ ఈ విజయానికి కారణాలుగా నిలిచాయి.

ISRO News: జూలై 30న NISAR ప్రయోగం: ఈ ఉపగ్రహం ప్రత్యేకతలు ఇవే..!!

జూలై 30న నాసా మరియు ఇస్రో యొక్క నిసార్ ఉపగ్రహం, ద్వంద్వ-బ్యాండ్ రాడార్ సాంకేతికత ద్వారా ఆధునిక భూ పరిశీలన సామర్థ్యాలను అందిస్తుంది.

ఫ్యామిలీలకు బెస్ట్ EV వచ్చేసింది! కియా కారెన్స్ క్లావిస్ బుకింగ్ చేయండి ఇప్పుడే

కియా (Kia) నుండి ఇటీవలే విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ కారు కారెన్స్ క్లావిస్ EV (carens clavis), భారతీయ మార్కెట్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు కేంద్రబిందువైంది. ఆవిష్కరణ తర్వాతే కస్టమర్లలో భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు ఆ కారును పొందేందుకు సరైన సమయం వచ్చేసింది. ఈ కారు అమ్మకానికి రావడం కేవలం కొన్ని రోజుల క్రితం జరిగినా, ఇప్పటి నుంచే భారీ స్పందన కనిపిస్తోంది. కస్టమర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ ఎలక్ట్రిక్ MPVకి సంబంధించి అధికారిక బుకింగ్‌లు జూలై 22, 2025 నుంచి ప్రారంభం అయ్యాయి. బుకింగ్ ప్రక్రియను కంపెనీ సులభతరం చేసింది. కేవలం రూ.25,000 మాత్రమే చెల్లించి, కస్టమర్లు తమ కారును ముందుగా బుక్ చేసుకునే అవకాశం పొందుతున్నారు.
Advertisement

ఉద్యోగులలో పెరుగుతున్న ఒత్తిడితో హార్ట్ స్ట్రోక్స్ .. జాగ్రత్త!

పట్టణ వృత్తిపరులలో పెరిగిన ఒత్తిడి గుండెపోటు పెరుగుదలకు సంబంధించినది. గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి జీవనశైలి అంశాలు మరియు నివారణ చర్యల గురించి తెలుసుకోండి.

Perplexity AI: సోషల్ మీడియా బదులు ఈ స్కిల్స్ నేర్చుకోండి..! పర్ ప్లెక్సిటీ సీఈవో సలహా..!

అరవింద్ శ్రీనివాస్ నేటి మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి సోషల్ మీడియా వినియోగం కంటే AI నైపుణ్యాలను నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తున్నారు.

పేదల డిఫెండర్ వస్తోంది.. త్వరలో కొత్త బొలెరో లాంచ్

భారతదేశంలో నంబర్ వన్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ తయారీదారు అయిన మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్‌లోకి ఒకటి కంటే ఎక్కువ కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ ప్రొడక్టులతో చాలా వరకు వివిధ సందర్భాలలో భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో కెమెరా కంటికి చిక్కాయి. మహీంద్రా ప్రతేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంటే ఆగస్టు 15న కొత్త ఉత్పత్తులు, కాన్సెప్ట్ మోడల్‌లను పరిచయం చేస్తుంది.

తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. జెల్యో ఇ గ్రేసీ+ వచ్చేసింది

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ జెల్యో ఇ మొబిలిటీ తమ పాపులర్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రేసీ ప్లస్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త గ్రేసీ+, సిటీ ప్రయాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఇది మెరుగైన పర్ఫామెన్స్, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందజేస్తుంది.

10 ఏళ్లలో 12 లక్షల విక్రయాలు.. క్రెటా అంత బాగుందా?

భారతదేశపు SUV మార్కెట్‌లో ఒక తిరుగులేని ప్రయాణాన్ని ప్రారంభించి, హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ఇప్పుడు విజయవంతంగా 10 ఏళ్లు పూర్తిచేసుకుంది. 2015 జూలై 21న మొదటిసారి పరిచయం చేసిన ఈ కారు, అప్పటినుంచిSUV ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది కేవలం ఒక వాహనం కాదు, మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో నమ్మకానికి, స్టైలిష్ డిజైన్‌కి ప్రతీకగా మారింది. ప్రమాదాలను తట్టుకునే బలమైన బాడీ, డ్రైవింగ్‌లో సౌకర్యం, స్టైలిష్ లుక్, టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఇవన్నీ కలగలిపిన ఓ పర్ఫెక్ట్ ప్యాకేజీగా క్రెటా నిలిచింది. ఇది మార్కెట్‌లోకి వచ్చాక SUVలు కుటుంబ వాహనాలుగా ఎంతగానో ప్రాచుర్యం పొందిన దానికి ఇదే ప్రధాన కారణం. గ్రామీణం నుంచి నగరాలు వరకూ, తొలిసారి కారు కొనేవారు నుంచి కారును అప్‌గ్రేడ్ చేసేవారివరకు, క్రెటా అందరికీ ఇష్టమైన మోడల్‌గా మారింది.

ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా బదిలీ చేయాలంటే ?

ఫాస్ట్‌ట్యాగ్ మన టోల్ ట్యాక్స్ పేమెంట్స్ చాలా ఈజీ చేస్తుంది. నాలుగు చక్రాల వాహనాలకు ఇది చాలా అవసరం. గతంలో టోల్ గేట్ల దగ్గర క్యూలో నిలబడి గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే కొన్ని సెకన్లలోనే టోల్ కట్టేయొచ్చు. ఒకవేళ మీరు మీ పాత బ్యాంక్ నుంచి వేరే కొత్త బ్యాంక్‌కు మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌ను మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, దానిని ఎలా చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.

భారత రోడ్లపై ప్రెసిడెంట్ లెవల్ లగ్జరీ! రూ.69.90 లక్షలకు MG M9 విడుదల!

దిగ్గజ కార్ల తయారీదారు అయినటువంటి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల విభాగానికి మరింత తోడు అందించడానికి లగ్జరీ EV మార్కెట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న MG M9 ప్రెసిడెన్షియల్ లిమోసిన్ ఎలక్ట్రిక్ MPV (Presidential Limousine)ను విడుదల చేసింది. లగ్జరీ, కంఫర్ట్‌ను కొత్త దృక్పథంతో తిరిగి నిర్వచించేందుకు రూపొందించబడిన ఈ కార్, వినియోగదారులకు అత్యుత్తమమైన టెక్నాలజీని అందిస్తుంది. ఈ లగ్జరీ లిమోసిన్‌ను కంపెనీ ఇండియా మార్కెట్‌లో రూ.69.90 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు వెబ్‌సైట్ లేదా దగ్గర్లోని MG SELECT అనుభవ కేంద్రాలకు వెళ్లి రూ.1,00,000 బుకింగ్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

2025లో టాటా నుండి కొనుగోలు చేయదగిన టాప్ 5 కార్లు!

టాటా మోటార్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సేఫ్టీ. అందుకే కస్టమర్లు టాటా కార్లను కొనేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. మీరు ఈ 2025లో కొత్త టాటా కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆల్ట్రోజ్, టియాగో ఈవీ, కర్వ్, పంచ్, నెక్సాన్ మోడళ్లు మీకు మంచి ఎంపికలు కావచ్చు. ఈ కార్ల ధరలు, వాటిలోని ముఖ్యమైన ఫీచర్ల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
Advertisement

క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్ కలిపి హ్యుందాయ్ అమ్మకాలలో 65% షేర్!

దక్షిణ కొరియా బ్రాండ్ అయినటువంటి హ్యుందాయ్ (Hyundai)కు జూన్ 2025 అంతగా కలిసిరాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడం, యుద్ద భయాల కారణంగా ఆటోపరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. దీని ఫలితంగా గత నెల దేశీయంగా ఉండే ఆటో పరిశ్రమకు పెద్దగా మేలు చేయలేదు. అనేక కంపెనీలు అమ్మకాల పరంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. హ్యుందాయ్ కూడా ఈ నెమ్మదీ తరంగాన్ని తప్పించలేకపోయింది. గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన కార్లతో పోలిస్తే, ఈ ఏడాది అమ్మకాలు 12 శాతం పడిపోయాయి. 2024 జూన్‌లో 50,103 యూనిట్లు డెలివరీ చేసిన హ్యుందాయ్, 2025 జూన్‌లో కేవలం 44,024 కార్లనే అమ్మగలిగింది. ఏడాది కాలంలో సేల్స్ తగ్గడంపై కంపెనీ చర్యలకు ఉపక్రమించింది.

ఒక క‌ప్పు సోయాబీన్‌ను ఉడ‌క‌బెట్టి తింటే ఎన్నో సమస్యలకు పరిష్కారం..!!

భారతదేశంలో సోయాబీన్స్ హృదయ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో కనుగొనండి. ప్రోటీన్ మరియు ఒమేగా-3తో నిండి, అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

బసాల్ట్ అమ్మకాలు ఊపందుకున్నాయా? గణాంకాలు ఏం చెబుతున్నాయి?

సిట్రోయెన్ బసాల్ట్ ఒక పాపులర్ కూపే ఎస్‌యూవీ. ఇది చాలా లేటెస్ట్ డిజైన్, మంచి ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాదు బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది. అయినప్పటికీ, ఈ కారు అమ్మకాల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వచ్చింది. అయితే, ఒక అద్భుతం జరిగినట్లుగా బసాల్ట్ అమ్మకాలు ఈ జూన్ నెలలో మెరుగుపడ్డాయి. మొత్తం 214 యూనిట్లను విక్రయించారు.

లీటర్ పెట్రోల్‌తో 90 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే బైక్! రూ.70 వేలకే వస్తుంది

భారతదేశంలో రోజూ స్కూటర్, బైక్ మీదే జీవితం సాగించే మిడిల్ క్లాస్ ప్రజలకు తక్కువ ధరలో లభిస్తూ, పెట్రోల్‌పై పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తూ మంచి మైలేజ్ అందించడంలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina)కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది మాములు టూవీలర్ కాదు, అది నిత్య జీవన భాగస్వామి. ఏప్రిల్ 2006లో ప్లాటినా బైక్ తొలిసారిగా రోడ్డుపైకి వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు దశాబ్దాలకు చేరుకుంటున్నా, దీని డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. రోజూ ప్రయాణించాల్సిన ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్లు, చిన్న వ్యాపారస్తులు.. ఇలా అనేక రకాల వర్గాలకు ఇది అందుబాటులో ఉండే ఆప్షన్‌గానే నిలుస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా బైక్ కొనాలనుకునే వ్యక్తికి ఇది ఒక పెద్ద ఊరట.

స్కార్పియో క్రేజ్.. యూత్‌లో సూపర్ హిట్, అమ్మకాల్లోనూ అదే జోరు!

భారతదేశంలో మహీంద్రా స్కార్పియో కారుకు పరిచయం అవసరం లేదు. ఇది ఒక స్టార్ హీరో రేంజ్‌లో జనంలోకి దూసుకెళ్లింది. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమా అంటే స్కార్పియోలు గాల్లోకి ఎగరాల్సిందే. అవి ఎంత ఎగిరితే ఆ సినిమా అంత హిట్ అన్నంత పాపులారిటీ సంపాదించుకున్నాయి.