ఈ ఏడాది సేఫ్టీ టెస్ట్‌లో బెస్ట్ కార్లు.. ఇక వీటి సేఫ్టీ విషయంలో నో టెన్షన్!
ఆటోమొబైల్స్
- 1 year, 9 month, 9 days ago
కార్లను కొనేముందు ఎవరైనా సరే అనేక విషయాలను పరిశీలిస్తారు. డిజైన్, ధర, ఫీచర్లను మొదలుకొని ప్రతీది చూస్తారు. ముఖ్యంగా కారులో ప్రయాణం సేఫ్టీనా కాదా అనేది అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ విషయంలో కార్ల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన కొత్త విధానం భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP/ BNCAP - Bharat New Car Assessment Programme). ఈ ఏడాది 10 కార్లను భారత్ ఎన్‌క్యాప్ ద్వారా టెస్టింగ్ చేయగా.. ఒక్క ఎస్‌యూవీ మినహా అన్ని కార్లు, ఎస్‌యూవీలు 5 స్టార్ రేటింగ్ పొందాయి. ఆ వివరాలు మీకోసం...