కొత్త మారుతి బ్రెజ్జా బుకింగ్స్ స్టార్ట్.. మరో 10 రోజుల్లో గ్రాండ్ లాంచ్!

సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఇప్పుడు సరికొత్త అప్‌డేట్‌తో కొత్త అవతారంలో రాబోతోంది. చాలా కాలంగా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. అప్‌డేట్ చేసిన కొత్త బ్రెజ్జాను ఈ జూలైలో అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మారుతి సుజుకి, లాంచ్‌కు ముందే ఈ SUV కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. దీంతో కొత్త బ్రెజ్జాను ముందుగానే సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పటి నుంచే తమ పేరును నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మారుతి సుజుకి ఎరీనా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బ్రెజ్జా కోసం బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
Advertisement