బొమ్మ కారుని చూసి చిన్నపిల్లాడిలా మురిసిపోయిన సీఎం విజయ్
ఆటోమొబైల్స్
- 43 min ago
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈసారి ఆయన రాజకీయ ప్రసంగం లేదా సినిమా కారణంగా కాదు, ఒక చిన్న టాయ్ కార్ వల్ల నెట్టింట వైరల్ అవుతున్నారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (Vinfast) ఆసియా కార్యకలాపాల సీఈఓ ఫామ్ సాన్ చౌ ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కంపెనీకి చెందిన ఒక చిన్న కారు మోడల్ (బొమ్మ కారు)ను జ్ఞాపికగా బహుమతిగా అందజేశారు. సాధారణంగా ఇలాంటి బహుమతులను స్వీకరించి పక్కన పెట్టే నాయకులను మనం చూస్తుంటాం. కానీ విజయ్ మాత్రం ఆ టాయ్ కార్‌ను చేతిలోకి తీసుకుని ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.