ఒకేసారి రెండు సర్‌ప్రైజులు.. డిస్కౌంట్ + కొత్త వైబ్ ఎడిషన్!
ఆటోమొబైల్స్
- 5 month, 6 days ago
భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి గుర్తింపు పొందిన మోడళ్లలో హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios) ఒకటి. సరసమైన ధర, స్టైలిష్ డిజైన్‌తో ఈ కారు చాలా మంది కొనుగోలుదారుల మొదటి ఎంపికగా మారింది. ముఖ్యంగా, హ్యుందాయ్ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం మరియు తక్కువ నిర్వహణ ఖర్చులు కూడా ఈ కారుకు మంచి డిమాండ్ తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అమ్మకాలను మరింత పెంచేందుకు కంపెనీ ఈ ఏప్రిల్ నెలలో ఈ మోడల్‌పై ప్రత్యేక ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మరింత సరసమైన డీల్‌గా మారింది. ఇప్పటికే బడ్జెట్ సెగ్మెంట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించిన ఈ కారు, ఇప్పుడు ఈ ఆఫర్ల వల్ల మరింత మంది దృష్టిని ఆకర్షిస్తోంది.