లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ ఈ కారు
ఆటోమొబైల్స్
- 7 month, 11 days ago
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీల హవా కొనసాగుతోంది.ప్రస్తుతం కొత్త కారు కొనే వాళ్ల ఫస్ట్ ఛాయిస్ ఎస్యూవీనే. ముఖ్యంగా సెవెన్ సీటర్ లగ్జరీ ఎస్యూవీ విభాగంలో ఇప్పటి వరకూ టయోటా ఫార్చ్యూనర్ తిరుగులేని కింగ్ లా వెలుగొందుతుంది. అయితే ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి సవాల్ విసిరేందుకు జర్మన్ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్(Volkswagen) తన అస్త్రాన్ని రెడీ చేసింది. సరికొత్త టైరాన్ ఆర్ లైన్ (Tayron R-Line) ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం పెట్టేసింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం కావడంతో కార్ లవర్లలో ఉత్సాహం నెలకొంది.