సూపర్ హీరోల సృష్టికర్త 'స్టాన్ లీ' అస్తమయం

హాలీవుడ్ మేటి ర‌చ‌యిత‌, ఎడిట‌ర్‌, ప‌బ్లిష‌ర్‌ స్టాన్ లీ (95) క‌న్నుమూసారు. లాస్ ఏంజిల్స్‌లోని సిడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో స్టాన్ లీ తుదిశ్వాస విడిచారు. హాలీవుడ్‌లో ఫాద‌ర్ ఆఫ్ పాప్ క‌ల్చ‌ర్‌గా గుర్తింపు ఉన్న స్టాన్ లీ మార్వెల్ కామిక్స్ కోసం 1961లో తొలిసారి 'ద ఫెంటాస్టిక్ ఫోర్' క్యారెక్ట‌ర్ల‌ను క్రియేట్ చేసారు. ఆ త‌ర్వాత స్పైడ‌ర్ మ్యాన్‌, ద ఇంక్రెడిబుల్ హ‌ల్క్, ఎక్స్‌-మెన్‌, థోర్‌, ఐర‌న్ మ్యాన్‌, బ్లాక్ ప్యాంథ‌ర్ లాంటి సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌నూ సృష్టించాడు. గ‌త ఏడాది స్టాన్ లీ భార్య అనారోగ్యంతో క‌న్నుమూసారు.

దటీజ్ ప్రియాంక చోప్రా.. పెళ్లి కూడా వ్యాపారంగానే..

బాలీవుడ్ అందాల సుందరి ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు నిక్ జోనస్ పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పెళ్లికి ముందు జరిపించే కార్యక్రమాలు జోష్‌గా సాగుతున్నాయి. నవంబర్‌లో వీరి పెళ్లి రాజస్థాన్‌లో జరుగనున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సినీ తారల పెళ్లికి సంబంధించిన ఫొటోలను షూట్ చేయడానికి పెద్ద సంస్థలు పోటీ పడటం సహజం. ప్రియాంక విషయంలో కూడా ఇదే జరిగిందట. తనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ ఫొటోల కాంట్రాక్టుకు ఇచ్చి ప్రియాంక భారీగానే వెనుకేసుకొందట.

టీ20ల్లో అత్యధిక పరుగుల భారత క్రికెటర్‌గా మిథాలి

భారత మహిళా జట్టు వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ భారత్‌ తరపున టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది. పురుషుల జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మల కన్నా ఆమె అత్యధిక పరుగులు సాధించింది. 84 టీ20 మ్యాచ్‌ల్లో ఈ 37.20 సగటుతో 2,232 పరుగులు చేసి టీ20ల్లో భారత్‌ తరపున రోహిత్‌ (2,203) కోహ్లి (2,102) పరుగులను అధిగమించింది. ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ 5వ స్థానంలో నిలిచింది.

టీ20 ప్రపంచకప్‌ ..అలీసా అర్ధశతకంతో ఆస్ట్రేలియా విజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అలిసా హీలీ అదరగొట్టింది. 21 బంతుల్లోనే అర్ధశతకం బాది ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించటంలో కీలకపాత్ర పోషించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 6 వికెట్లకు 93 పరుగులే చేయగలిగింది. అనంతరం అలిసా (56 నాటౌట్‌) చెలరేగడంతో ఆసీస్‌ 9.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని  ఛేదించింది.

నేడు కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్


ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారం జరగనుంది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడానికి ఆయన న్యాయవాదులు అన్ని సిద్దం చేశారు. ఈడీలో నమోదు అయిన ఆంబిడెంట్ నిర్వహకులు కేసులు మాఫీ చేయించడానికి రూ. 20 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ ఫైవ్ స్టార్ హోటల్ ఈ డీల్ జరిగిందని సీసీబీ పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు.

స్టార్లు ఉన్నా 'కంటెంట్‌' మిస్ ..అందుకే 'థగ్స్' తుస్

ఇండియన్‌ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆమిర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం 'బాహుబలి' రికార్డులను బద్దలు కొడుతుందని ఆశపడిన బాలీవుడ్‌ వర్గాలకు ఎదురుదెబ్బ తగిలింది.ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల మార్కును మాత్రమే దాటింది. ఈ చిత్రం విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్‌ టాక్‌ మొదలయింది. స్టార్లు ఉన్నా సినిమాలో అసలు విషయం లేకపోయే సరికి వసూళ్ళపై ప్రభావం గట్టిగా చూపింది.

నేటి నుంచే హాంకాంగ్‌ ఓపెన్‌ ..బరిలో భారత షట్లర్లు

భారత షట్లర్లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచే హాంకాంగ్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌ ఆరంభం కానుంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు, రెండో సీడ్‌ యమగూచి (జపాన్‌)తో సైనా తలపడతారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్‌, హాంకాంగ్‌కు చెందిన వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ను ఢీకొంటాడు. ప్రణయ్‌, సమీర్‌, సాయిప్రణీత్‌ కూడా బరిలో ఉన్నారు. సాత్విక్‌ సాయిరాజ్‌ పురుషుల, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పోటీ పడనున్నాడు. మహిళల డబుల్స్‌లో సిక్కి, పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ బరిలో ఉన్నారు.

ఎట్టకేలకు కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల...9 మందితో టిడిపి

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేసింది. సోమవారం ఆర్థరాత్రి న్యూ ఢిల్లీలో నాటకీయ పరిణామాల మధ్య ఈ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ విడుదల చేసిన తెలంగాణా ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత జాబితాలో 65 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ లిస్ట్ లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 14 మందికి చోటు లభించగా, పిసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కక పోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

నకిలీ వార్తలను కట్టడి చేసే దిశగా సామాజిక మాధ్యమాలు

సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా కసరత్తు తీవ్రమైంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామంటూ సామాజిక మాధ్యమ దిగ్గజాలు ముందుకొచ్చాయి. నకిలీ వార్తల్ని కట్టడి చేస్తామని ట్విటర్‌ స్పష్టం చేసింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రతినిధులు స్పష్టం చేసారు. విద్వేష సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ కేంద్రం ట్విటర్‌కు స్పష్టం చేసింది. 

'కాజల్'కు స్టేజిపై ముద్దిచ్చిన ఛోటా.కె.నాయుడు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కవచం'. మేహరీన్, కాజల్‌ అగర్వాల్‌ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమంలో కాజల్‌ మాట్లాడుతూ చిత్ర ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు గురించీ మాట్లాడుతూ 'స్మాల్‌' ..ఛోటా ..నాకిష్టమైన వ్యక్తి. మరోసారి ఆయనతో పని చేయడం అద్భుతమైన అనుభూతి అనగానే కాజల్‌ దగ్గరకు వెళ్ళిన ఛోటా ఆమె బుగ్గపై ముద్దిచ్చారు. దానికి కాజల్ నవ్వేస్తూ  'ఛాన్స్‌ పే డ్యాన్స్‌'.. ఆయన నా కుటుంబంలోని వ్యక్తి కింద లెక్క' అంది. అయితే ఇప్పుడు దీనిపై సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

పవర్ ఫుల్‌గా RRR‌.. దద్దరిల్లే టైటిల్‌తో రాజమౌళి

బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సెట్స్‌పైకి వచ్చాడు రాజమౌళి. సంచలన విజయం తర్వాత మరోసారి మల్టీస్టారర్‌కే ఓటు వేశాడు జక్కన. బాహుబలి కోసం ప్రభాస్, రానా దగ్గుబాటిని కలిపిన అగ్రదర్శకుడు తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాకరీ వేదికగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు రోజుకొకటి మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక్కరోజులో రూ.2లక్షల కోట్లు ఆర్జించిన 'ఆలీబాబా'

ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ అలీబాబా 'సింగిల్స్‌ డే' అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే దాదాపు 31 బిలియన్ల డాలర్లను ఆర్జించింది. మన కరెన్సీలో రూ.2లక్షల కోట్ల పైమాటే. నవంబరు 11న చైనా సింగిల్స్‌ డే పేరిట అలీబాబా ఆన్‌లైన్‌ అమ్మకాలు  నిర్వహిస్తుంది. ఈ ఏడాది అమ్మకాల్లో చైనీయులు విపరీతంగా కొనుగోళ్ళు చేసారు. ఈ సింగిల్స్‌ డేనే 11/11 పేరుతో పిలుస్తారు. సింగిల్స్‌ డే ప్రారంభమైన రెండు నిమిషాల ఐదు సెకండ్లలోనే 1.44బిలియన్‌ డాలర్ల (రూ.10వేల కోట్ల) వ్యాపారం జరిగినట్లు వెల్లడించింది.  

65 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ 65 మంది అభ్యర్థులతో  తొలి జాబితాలో ప్రకటించింది. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, పోరిక బలరాం నాయక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, మల్లు రవిలకు అవకాశం లభించింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. జాబితా ఖరారుకు సంబంధించి సోమవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు, కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.  రాహుల్‌ అనుమతి పొందిన తర్వాత రాత్రి 11.15 గం.లకు జాబితాను విడుదల చేసారు.

తెలంగాణ ఎన్నికలు ..9 మందితో తెదేపా తొలి జాబితా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 9 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. మహాకూటమిలో భాగంగా తెదేపా కేటాయించిన 14కు స్థానాల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం- నామా నాగేశ్వర రావు, సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట- మచ్చ నాగేశ్వర రావు, వరంగల్‌ పశ్చిమ- రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, మక్తల్‌- కొత్తకోట దయాకర్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌- ఎర్ర శేఖర్‌, ఉప్పల్‌- వీరేందర్‌ గౌడ్‌, శేరిలింగంపల్లి- భవ్య ఆనంద్‌ ప్రసాద్‌, మలక్‌ పేట- ముజఫర్‌.  

నేను డేరా బాబాను ఒక్కసారి కూడా కలవలేదు

ఒకానొక సందర్భంలో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరా బాబాను  బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కలిసారని వార్తలు వెలువడుతున్నాయి. ఒక కేసు విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం అక్షయ్‌కు సమన్లు జారీ చేసిందట. దీనిపై ట్విటర్‌లో అక్షయ్ స్పందిస్తూ 'నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నేను గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్ ను కలిసానని వార్తలు వెలువడుతున్నాయి. నా జీవితంలో ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా గుర్మీత్‌ సింగ్‌ను కలవలేదు. పంజాబీ సోదర సోదరీమణులకు హాని కలిగించే పనులు నేను ఎప్పటికీ చేయను' అని వెల్లడించారు.  

రిటైరైనా ఫిట్‌నెస్‌ విషయంలో తగ్గేది లేదు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జట్టులోకి వచ్చిన తర్వాత క్రికెటర్లకు ఫిట్‌నెస్‌ పట్ల ఉండే దృక్పథాన్ని మార్చేసాడు. శక్తిమంతంగా తయారవడం కోసం పూర్తిగా శాకాహారిగా మారాడు. విరాట్‌ దీనిపై మాట్లాడుతూ 'క్రికెట్‌ నుంచి రిటైరైన తర్వాత కూడా ఫిట్‌నెస్‌ విషయంలో తగ్గేది లేదు. నేనెప్పుడూ సాధ్యం కాని వాటి గురించి మాట్లాడను. ఫిట్‌నెస్‌ వల్ల మానసికంగా బలంగా తయారు కావడంతో పాటు మన శక్తిసామర్థ్యాలు పెరుగుతాయని ఎవ్వరైనా తెలుసుకుంటారు' అని తెలిపాడు.
Advertisement

మద్యం సేవించిన ఎయిరిండియా ఆపరేషన్స్‌‌ డైరెక్టర్‌ లైసెన్సు రద్దు

ఎయిరిండియా (ఏఐ) బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన అరవింద్‌ కథ్‌పాలియా లైసెన్సును మూడేళ్ళ పాటు డీజీసీఏ రద్దు చేసింది. ఎయిరిండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అయిన కథ్‌పాలియా ఆదివారం మధ్యాహ్నం విమానం నడపడానికి కొద్ది సేపటి ముందు నిర్వహించిన శ్వాస పరీక్షలో మద్యం సేవించి పట్టుబడ్డారు. దీంతో మరో పైలట్‌తో విమానం నడిపించారు. కథ్‌పాలియాపై డీజీసీఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ నవంబరు 11 నుంచి మూడేళ్ళ పాటు సస్పెండ్‌ చేసినట్లు సోమవారం వెల్లడించింది. 

విలన్‌గా 'వరలక్ష్మి' చాలా బిజీ

నటి వరలక్ష్మి తమిళ సినిమాల్లో కథానాయికగా కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం వరుసగా ప్రతినాయకి పాత్రలను చేస్తోంది. 'విక్రం వేద'లో గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ అమ్మడు ప్రతినాయిక పాత్రలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల 'సండకోళి 2', 'సర్కార్‌'లో లో ప్రతినాయికగా నటించి మెప్పించింది. 'మారి 2', 'రాజపార్వై', 'నీయా 2' చిత్రాల్లోనూ విలన్‌ పాత్రలే పోషించింది. ప్రస్తుతం వరలక్షి కోసమే సినిమాల్లో ప్రతినాయిక పాత్రలు సృష్టిస్తున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

నటీమణులు ప్రశ్నిస్తే అవకాశాలు ఇవ్వట్లేదు

నటి రమ్యానంబీశన్‌ నటించిన చిత్రం 'నట్పున్నా ఎన్నాన్ను తెరియుమా' విడుదలకు సిద్ధం అవుతోంది. దీనితో పాటు విజయ్‌సేతుపతికి జంటగా 'సీతకాది' చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ మలయాళ భామకు మాతృభాషలో అవకాశాలు రావడం లేదట. దీని గురించి మాట్లాడుతూ 'మలయాళ సినిమాకు చెందిన మహిళల భద్రత కోసం డబ్ల్యూసీసీ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసారు. ఈ సంఘం ద్వారా నటీమణులు తమ సమస్యల గురించి న్యాయమైన రీతిలో ప్రశ్నించగా అలాంటి వారిని మాలీవుడ్‌ అవకాశాలు కల్పించకుండా పక్కన పెట్టేస్తోంది' అని చెప్పింది.

మన పని ద్వారానే వేధింపులను ఎదుర్కోవచ్చు

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారంపై నటి నిత్యా మేనన్‌ స్పందించింది. 'వేధింపులకు గురైన వారి బాధను నేను అర్థం చేసుకోగలను. ఆ తరహా వేధింపులను నేను వ్యతిరేకిస్తాను. కానీ వాటిని ఎదుర్కొనే విషయంలో మాత్రం నా పంథా వేరు. నా వరకూ ఓ బృందంగా ఏర్పడడం కన్నా మన పని ద్వారానే వేధింపులకు గురిచేసేవారిని ఎదుర్కోవచ్చని అనుకుంటాను. మనం పని చేసే విధానం, మన ప్రవర్తన, పని ప్రదేశంలో తోటివారితో వ్యవహరించే తీరు ఇవన్నీ మన సహచరులకు, ప్రేక్షకులకు గట్టి సందేశాన్నిస్తాయి' అని చెప్పింది.

ఛోటాను రెచ్చగొట్టిన తమన్... పబ్లిగ్గా కాజల్‌కు ముద్దు, వార్నింగ్!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతున్న‌ చిత్రం క‌వ‌చం. ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, కాజల్ మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటన హాట్ టాపిక్ అయింది.ఇతరులను విష్ చేసే సమయంలో మర్యాద పూర్వకంగా హగ్ చేసుకోవడం సర్వసాధారణమే. అయితే ఛోటా ఏకంగా కాజల్‌ను ముద్దు పెట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న ‘సర్కార్’... ఫస్ట్ వీకెండ్ షాకింగ్ కలెక్షన్స్!

విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఆదివారంతో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో ఏకంగా 8 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. 2018లో వచ్చిన అతిపెద్ద తమిళ చిత్రాల్లో 'సర్కార్' ఒకటి. విజయ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా బడ్జెట్ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాపై భారీ హైప్ రావడంతో థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.

నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి

తెలుగులో వెలుగు వెలిగిన ఇలియానా బాలీవుడ్‌కు వెళ్ళి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొంది. ఆ తర్వాత ఆరేళ్ళకు రవితేజతో 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నెల 16న విడుదలవుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఇలియానామీడియాతో పలు విషయాలను చర్చించింది. 'బాలీవుడ్‌లో ఒప్పుకొన్న సినిమాల వల్ల ఇక్కడ నటించడం కుదరలేదు. తొలినాళ్ళలో నాకు ఇన్ని విషయాలు తెలిసేవి కాదు. నేను చేసిన తప్పుల్నుంచే కొత్త విషయాలు నేర్చుకొన్నా. నేను గర్భవతిని అని కూడా ప్రచారం చేసారు' అని చెప్పింది.

బికినీలో రాధిక ఆప్టే కేక.. బాత్‌టబ్‌లో అర్ధనగ్నంగా.. పిచ్చెక్కిస్తున్న ఫొటోలు

విలక్షణ నటి రాధిక ఆప్టే బాలీవుడ్‌లోనే కాకుండా వెబ్‌ మాధ్యమంలోనూ దూసుకెళ్తున్నది. ఖాళీ సమయం లభిస్తే విహారయాత్రల్లో మునిగి తేలుతుంది. విదేశీ యాత్రల్లో బికినీలతో హెరెత్తిస్తుంటుంది. ఇలాంటి అందాల తార మాటల్లోనే కాదు.. చేతలతో కూడా మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. గతంలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో తన స్నేహితురాలితో బికినీలో తీయించుకొన్న ఫొటోను రాధిక ఆప్టే తన ఫేస్‌బుక్ కవర్ పిక్చర్‌గా అప్‌లోడ్ చేసింది.

బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్

తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితర నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం వార్నింగ్ ఇచ్చారు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన కూడా మండిపడ్డారు. మన జనసేనకు అండగా ఉండే యువతను ఎమ్మెల్యే బాలకృష్ణ సంకర నా కొడుకులు అని, దెందులూరు రౌడీ ఎమ్మెల్యే దళితులను కొడతాడని,, మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యకారులను భూతులు తిడతారని, ఇదేనా మీ సంస్కారం.. ఇదేమైనా మీ సొత్తా అని ప్రశ్నించారు