ఓ వైపు స్కూటర్ రైడింగ్.. మరోవైపు ఆఫీస్ వర్క్ (వీడియో)

ఐటీ సిటీగా పేరుగాంచిన బెంగళూరు టెక్నాలజీలో, అభివృద్ధిలో ఇతర నాగరాలకంటే వేగంగా ముందుకు సాగుతోంది. ఇటీవల ఓ వ్యక్తి స్కూటీ మీద వెల్తూనే ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.బెంగళూరులో.. కర్ణాటక వాసులు మాత్రమే కాకుండా ఉత్తర, దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉంది. రోజూ ట్రాఫిక్ కష్టాల మధ్య సతమతమవుతూ.. ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్లాలన్నా.. రావాలన్నా చాలా కష్టంగా మారిపోతోంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి స్కూటీ మీద వెళుతూనే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఇది బెంగళూరులో ఇది ప్రారంభం కాదు అనే క్యాప్షన్‌తో వీడియో వైరల్ అవుతోంది.

భారతీయులు ఎక్కువగా ఏ కలర్‌ కార్లను ఇష్టపడుతున్నారో తెలుసా.??

కారు కొనడమనేది చాలా మందికి కల. జీవితంలో ఒక్కసారైనా తమ బడ్జెట్‌(Cars Colours) ధరలో తమకు నచ్చిన కారున కొనుగోలు చేస్తారు. అయితే ఎవరైనా సరే కారు కొనేముందు చాలా విషయాలను పరిశీలిస్తారు. ధర, మైలేజ్‌, పనితీరు ఇలా చాలా చూస్తారు. కానీ వీటి తర్వాత మరో ముఖ్యమైనది కలర్‌. అవును కారు కలర్‌ కూడా కస్టమర్ల ఫేవరెట్లలో ఒక భాగమే.

అమ్మకాల్లో హోండా ఎలివేట్ అరుదైన రికార్డ్: ఇష్టపడి మరీ కొనేస్తున్న జనం!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ హోండా (Honda) ఎప్పటికప్పుడు కొత్త కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటోంది. ఇందులో భాగంగానే గత ఏడాది కంపెనీ 'ఎలివేట్' SUVని మార్కెట్లో విడుదల చేసింది.హోండా కంపెనీ 2023లో కొత్త ఎలివేట్ (Elevate) SUVని లాంచ్ చేసినప్పటి నుంచి అద్భుతమైన అమ్మకాలను పొందుతూనే ఉంది. సంస్థ ఈ కారును లాంచ్ చేసిన కేవలం ఆరు నెలల కాలంలో ఏకంగా 30000 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ హోండా కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనేది ఇట్టే అర్థమైపోతుంది. ఇది అమ్మకాల్లో సాధించిన అరుదైన మైలురాయి అని తెలుస్తోంది.

రూ. 10 లక్షల లోపు ధరలో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌తో ది బెస్ట్‌ కార్లు ఇవే..

వేసవి ప్రారంభం కావడంతో కారులో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. డ్రైవింగ్‌లో పదే పదే ఏసీ టెంపరేచర్‌ను అడ్జస్ట్‌ను చేసే అవసరం లేకుండా ఈ ఫీచర్‌ను తీసుకువచ్చారు. ఈ క్రమంలో రూ. 10 లక్షల లోపు ధరలో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఉన్న కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటే.. ఇక్కడ ఏడు కార్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
Advertisement

మరింత తక్కువ ధరలో బజాజ్‌ చేతక్‌ ఇ స్కూటర్‌

భారత మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బజాజ్‌ చేతక్‌(Bajaj Chetak E Scooter)కు మంచి ఆదరణ లభిస్తోంది. బజాజ్‌ ఆటో ఇండియా విక్రయిస్తున్న ఈ స్కూటర్‌.. మెరుగైన పనితీరుతో కస్టమర్లకు ఫేవరెట్‌గా ఉంది. ఈ క్రమంలో బజాజ్‌.. చేతక్‌ స్కూటర్‌ను ఇప్పుడున్న ధర కంటే మరింత సరసమైన ధరలో విడుదల చేయాలని చూస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

జనరల్‌ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ఆన్‌లైన్‌ పేమెంట్స్‌

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్‌ తీసుకువచ్చింది. జనరల్‌ బోగీ(Unreserved Train Tickets)ల్లో ప్రయాణించేవారు ఇకపై టికెట్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. రిజర్వ్‌డ్‌ కోచ్‌ల మాదిరిగానే ఎంచక్కా ఆన్‌లైన్‌లోనే టికెట్ల కొనుగోలుకు నగదు బదిలీ చేయవచ్చు. యూపీఐ విధానం ద్వారా రైల్వే శాఖ ఈ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

బెంజ్ కారు లాంటిది.. కానీ బెంజ్ కారు కాదు!.. ఇంకేదో చెప్పుకోండి

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో చాలా మంది వాహనాలను తనకు నచ్చినట్లు మోడిఫైడ్ చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి కథనాలు చాలా తెలుసుకున్నప్పటికీ.. మళ్ళీ ఇలాంటి సంఘటన మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.గతంలో మహీంద్రా థార్ SUVలను మోడిఫైడ్ చేసుకున్న సంఘనలు చూసాము. ఇప్పుడు మారుతి జిమ్నీ ఓ మెర్సిడెస్ బెంజ్ కారుగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ కారును చూడగానే ఒక్కసారిగా ఇది మెర్సిడెస్ బెంజ్ కారేమో అని బ్రమ కలుగుతుంది. కానీ ఇది బెంజ్ కారుగా కనిపించే మారుతి జిమ్నీ కావడం విశేషం. ఎరుపు రంగులో కనిపించే ఈ కారు 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది.

మీ బైక్‌ లేదా కారుపై హోలీ మరకలు పోవాలంటే ఈ టిప్స్‌ తప్పనిసరి..

నేడు భారత్ మొత్తం హోలీ సంబరా(Holi Celebrations)ల్లో మునిగిపోయింది. స్నేహితులు, బంధుమిత్రులు.. ఒకరిపై ఒకరు హోలీ రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపేస్తుంటారు. ఈ క్రమంలో ఒంటిపై ఉన్న దుస్తులు రంగులతో నిండిపోయి ఉంటాయి. అయితే ఈ సందర్భాల్లో మీ వాహనాలపై కూడా కలర్స్‌ పడుతుంటాయి. కానీ వాటిని తొలగించడం కొంచెం కష్టం. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.

ఇలాంటి 'హైలక్స్ పికప్ ట్రక్' ఎప్పుడూ చూసుండరు!.. వీడియో

ఆధునిక కాలంలో భారతదేశంలో వెహికల్ మోడిఫికేషన్ / కస్టమైజ్ సర్వ సాధారణం అయిపోయింది. గతంలో కూడా మనం చాలా కస్టమైజ్ వాహనాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కస్టమైజ్ 'టయోటా హైలక్స్' (Toyota Hilux) గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో టయోటా హైలక్స్.. ఫార్చ్యూనర్ మాదిరిగా గొప్ప ప్రజాదరణ పొందలేదు. అయితే కొంతమంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. అలంటి వారిలో ఒకరు హైలక్స్ పికప్ ట్రక్కును మరింత అందంగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భారీగా మోడిఫైడ్ చేయబడిన టయోటా హైలక్స్ పికప్ ట్రక్ దర్శనమిస్తుంది. బహుశా ఇలాంటి కారును ఇప్పటి వరకు మీరు చూసి ఉండరని భావిస్తున్నాము.

డీజిల్‌తో నడిచే బైక్‌లు ఎందుకు ఉండవో తెలుసా

కార్లలో పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ ఇలా ఇంజిన్లలో వేరియంట్లు ఉంటాయి. కానీ బైక్‌లలో మాత్రం పెట్రోల్‌ వేరియంట్‌ మాత్రమే ఉంటుంది. ఇందులో డీజిల్‌(Diesel Bikes) కానీ సీఎన్‌జీ కానీ ఉండదు. ముఖ్యంగా డీజిల్‌ బైక్‌లను మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇలా ఎందుకని మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

చీరకట్టులో బైక్ రైడ్.. ఫిదా చేస్తున్న యువతులు - వీడియో

గతంలో పోలిస్తే.. ఆధునిక కాలంలో ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. నేడు బైకులు, కార్లు నడపడంలో కూడా మహిళల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల ఇద్దరు మహిళలు డర్ట్ బైకులు రైడ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు మహిళలు చీరలు కట్టుకుని, చెప్పులు ధరించి బైక్ రైడ్ చేయడం చూడవచ్చు. ఈ వీడియోను సురక్ష కెసి మరియు జర్నా ఛంత్యాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీరు హోండా సీఆర్ఎఫ్ సిరీస్ డర్ట్ బైక్‌లను రైడ్ చేస్తుండటం చూడవచ్చు.

ట్రాక్‌పై రైలు ఆగిపోవడంతో నెట్టిన రైల్వే సిబ్బంది

ఆగిపోయిన ఇంజిన్ రైలు కోచ్‌ను రైల్వే కార్మికులు తమ చేతులతో నెడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం నెటిజన్ల(Railway Men Push The Train Coach)ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
Advertisement

ఉప్పల్‌ స్టేడియం నుంచి ఈ రూట్లలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు

దేశవ్యాప్తంగా ఐపీఎల్‌ సీజన్‌(IPL Season 2024) అట్టహాసంగా ప్రారంభమైంది. లక్షలాది మంది క్రికెట్‌ అభిమానులతో క్రికెట్‌ స్టేడియంలు కోలాహలంగా మారాయి. ఈ క్రమంలో రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ కూడా ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన వినియోగదారులకు టాటా పవర్‌ గుడ్‌న్యూస్‌ తీసుకువచ్చింది. అదేంటంటే..

సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రికి ఆనంద్‌ మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ గిఫ్ట్‌..

క్రికెటర్‌ సర్ఫరాజ్‌ఖాన్‌(Cricketer Sarfaraz Khan) తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆనంద్‌ మహీంద్రా.. నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా క్రీడారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందిస్తూ వారికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ప్రకటిస్తుంటారు. ఈక్రమంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రికి కూడా ఖరీదైన బహుమతిని అందించారు.

రూ.4.9 కోట్ల కారులో కనిపించిన డాలీ చాయ్‌వాలా - వీడియో వైరల్

చాలామందికి లంబోర్ఘిని కారును కొనుగోలు చేయడం ఒక కల. ఇది కొందరి జీవితంలో నిజమవుతుంది, మరి కొందరి జీవితంలో కలగానే మిగిలిపోతుంది. ఇటీవల 'డాలీ చాయ్‌వాలా' లంబోర్ఘిని (Lamborghini) కారులో కనిపించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.సోషల్ మీడియా అతి తక్కువ కాలంలోనే కొంతమంది జీవితాలను మార్చింది. ఈ కోవకు చెందిన వారిలో నాగ్‌పూర్‌కు చెందిన టీ అమ్మే వ్యక్తి డాలీ చాయ్‌వాలాగా పాపులర్ అయిన 'సునీల్ పాటిల్' ఒకరు. ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రమే కాకుండా టీ తయారు చేసి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. ఇతడు బిల్‌గేట్స్'కు కూడా టీ ఇచ్చి గతంలో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు.

జూన్‌లో బజాజ్‌ సీఎన్‌జీ బైక్‌ లాంచ్‌.!!

సీఎన్‌జీ- ఆధారిత బైక్‌ ప్రకటనతో బజాజ్‌ ఆటో ఇండియా.. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బైక్‌ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ Bajaj CNG Bike లాంచ్‌కు సంబంధించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. పూర్తి సమాచారం ఈ కథనంలో.. .

ఈ కారు కొనుగోలుపై రూ.2 లక్షలు తగ్గింపు - పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' తన కొడియాక్ కారు మీద భారీ తగ్గింపు ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఎంత డిస్కౌంట్, ఏ వేరియంట్ మీద ప్రకటించిందనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.స్కోడా యొక్క 7 సీటర్ కొడియాక్ SUVని స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు ఎల్&కే అనే మూడు ట్రిమ్‌లలో అందించేది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ కారును కేవలం టాప్ స్పెక్ వేరియంట్లో మాత్రమే అందిస్తోంది. ఈ వేరియంట్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దీంతో స్కోడా కొడియాక్ ఎల్&కే వేరియంట్‌‌ను ఇప్పుడు ఏకంగా రూ. 2 లక్షల తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.

హీరో విడా వీ1 ఇ స్కూటర్‌ యజమానులకు రూ. 27,000 విలువైన ప్యాకేజ్‌ ఫ్రీ

హీరో మోటోకార్ప్ తన విడా(Hero Vida Electric Scooter) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌ ద్వారా కస్టమర్లు రూ. 27,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరి కస్టమర్లు ఈ ఆఫర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

అడ్డదిడ్డంగా కారు డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న మహిళ - వీడియో

ర్యాష్ డ్రైవింగ్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది మగవాళ్లే.. కానీ ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో యువతి రోడ్డుపై వ్యతిరేకంగా కారు డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.యూట్యూబ్‌లో వైరల్ అయిన ఒక వీడియోలో ఓ మహిళ టాటా హెక్సా కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. ఆమె గంటకు 80 కిమీ వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కావాలనే కారును రాంగ్ సైడ్ వేగంగా డ్రైవ్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది ఖచ్చితంగా వెల్లడి కాలేదు. వీడియోలో ఆమె ఎదురుగా కూడా కార్లు రావడం గమనించవచ్చు.

రూ. కోటి విలువైన ఈవీ పరికరాల దొంగతనం

ఈజీ మనీ ధ్యేయంగా రూ. కోటి విలువైన ఎలక్ట్రిక్‌ వాహనాల పరికరాల చోరీకి పాల్పడ్డారు కొందరు దుండగులు. వీరి వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు(Robbery In Electric Vehicle Charging Stations). వీరి వయసు కేవలం 8 నుంచి 11 ఏళ్ల లోపు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ కూడా ఉంది. అదేంటంటే..
Advertisement

ఏప్రిల్ 1 నుంచి కియా కంపెనీ కార్ల ధరల పెంపు

భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. ఏప్రిల్ 1 నుంచి తన ప్రముఖ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కియా సెల్టోస్, సొనెట్ మరియు కారెన్స్‌తో సహా దాని అన్ని మోడళ్లపై 3 శాతం పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. కమోడిటీ ధరలు, మార్కెటింగ్ సంబంధిత పెంపుదల కారణంగానే ధరలను పెంచాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది.

హృతిక్ రోషన్ కొత్త కారు ఇదే.. ధర ఎంతో తెలుసా?

ఆధునిక కాలంలో కొత్త కార్లను కొనుగోలు చేసే సెలబ్రిటీల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటికే అనేక ఖరీదైన కార్లను కలిగి ఉన్న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తాజాగా మరో కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.నటుడు హృతిక్ రోషన్ కొనుగోలు చేసిన కొత్త కారు రేంజ్ రోవర్ అని తెలుస్తోంది. ఇటీవల ఈ SUVలో డైరెక్టర్ 'ఫరా ఖాన్' పార్టీకి రావడం కనిపించిది. హృతిక్ రోషన్ ఈ రేంజ్ రోవర్ కారులో పార్టీకి వచ్చిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ముంబైలో జరిగిన పార్టీకి హృతిక్ రోషన్.. తన కొడుకు మరియు స్నేహితురాలు 'సబా ఆజాద్'లతో కలిసి వచ్చారు.

రోడ్డు భద్రత కోసం డ్రైవ్‌స్పార్క్‌ బైకింగ్‌ కమ్యూనిటీ

ప్రజల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బైకింగ్ కమ్యూనిటీని ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతోంది. అంతేకాకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. కాగా రైడింగ్‌ ఔత్సాహికుల కోసం మా డ్రైవ్‌స్పార్క్‌.. ఓ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అదేంటంటే..

షాకిచ్చిన Citroen eC3.. గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీరో రేటింగ్

మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'సిట్రోయెన్ ఈసీ3' (Citroen eC3) ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ ఇటీవల గ్లోబల్ ఎన్‌సీఏపీ (Global NCAP) క్రాష్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీరో రేటింగ్ సాధించి అందరికి షాకిచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 'సిట్రోయెన్ ఈసీ3' అందరిని నిరుత్సాహపరిచింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 0 రేటింగ్ సాధించగా.. పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 1 స్టార్ రేటింగ్ పొందింది. క్రాష్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరీక్షించబడిన కారు భారతీయ నిర్మిత మోడల్ అని తెలుస్తోంది. గ్లోబల్ ఎన్‌సీఏపీ సేఫర్ కార్స్ ఫర్ ఇండియా ప్రచారంలో పరీక్షించబడిన చివరి కొన్ని కార్లలో ఇది ఒకటి.

ఏథర్‌ ఎనర్జీ కొత్త అప్‌డేట్‌ ప్రోగ్రాంతో కొత్త స్కూటర్‌ కొనుగోలు

భారత్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీసంస్థ ఏథర్ ఎనర్జీ(Ather Energy Exchange Program) గుడ్‌న్యూస్‌ తీసుకువచ్చింది. కస్టమర్లను పెంచుకునే దిశగా ఒక ఎక్స్‌ఛేంజ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ను కొన్ని షరతులతో ప్రవేశపెట్టింది. ఆ ఎక్స్‌ఛేంజ్‌ ప్లాన్‌ ఎలా పనిచేస్తుంది.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..