వెస్పా 140 వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..

ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పాకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. భారత్‌లో కూడా ఈ కంపెనీ దశాబ్ధాల కాలం నుంచి కస్టమర్లకు సేవలందిస్తోంది. కొంత కాలం పాటు దేశీయ OEMల భాగస్వామ్యంతో పనిచేసిన వెస్పా.. గత దశాబ్ద కాలంగా స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. ఈ క్రమంలో వెస్పా.. ఓ గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది.

గూగుల్‌ మ్యాప్స్‌లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లపై అప్‌డేట్‌

ఈ రోజుల్లో గూగుల్‌ మ్యాప్స్‌(Google Maps) లేకుండా కొత్త రూట్లలో ప్రయాణించడం చాలా కష్టం. ఎవరినీ అడగకుండా గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్‌తో ఏ చిక్కూ లేకుండా సులభంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అందుకే మెట్రో సిటీల్లో ఎక్కువగా దీనిపై ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో గూగుల్‌ మ్యాప్స్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ ఇక్కడుంది.

త్వరలో ఇండియాలో లాంచ్‌ కానున్న ఫోర్డ్‌ టెరిటరీ కారు..

ఫోర్డ్‌ కారు ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ఆ కంపెనీ ఇండియాలో సరికొత్త ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి తాజాగా ఆ సంస్థ కొత్త SUVని భారత్‌లో ట్రేడ్‌మార్క్‌ చేసింది. కంపెనీ నుంచి అందిన నివేదికల ప్రకారం ఫోర్డ్ ఇండియా భారతదేశంలో 'టెరిటరీ' పేరును ట్రేడ్‌మార్క్ చేసింది.

పెరిగిన మారుతి స్విఫ్ట్ ధరలు.. పూర్తి వివరాలు

మారుతి సుజుకి అంటే అందరికి మొదట గుర్తొచ్చేది 'స్విఫ్ట్'. అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్విఫ్ట్ ధరలను రూ.15000 నుంచి రూ.39000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

25 దేశాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ రెంటల్స్‌ అండ్‌ టూర్స్‌ సర్వీస్‌

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌(Royal Enfield) బైక్‌పై రైడ్‌ చేయాలనుకునేవారికి సంస్థ అదిరిపోయే న్యూస్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బైక్‌లను సంస్థ రెంటల్‌, టూర్ల విధానంలో పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 25 కంటే ఎక్కువ దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌ల రెంటల్‌ విధానంపై పూర్తి సమాచారం ఈ కథనంలో..

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్‌

కేవలం రూ. 8999 ధరలో డ్యాష్‌క్యామ్‌ అందుబాటులోకి రానుంది. పూణే ఆధారిత సేఫ్‌క్యామ్స్ డిజిటల్ ఐ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఈ కెమెరాను తీసుకువచ్చింది. R2 పేరుతో సరికొత్త డాష్ కెమెరాను ఆ సంస్థ మార్కెట్‌లోకి తీసకువచ్చింది. భారతదేశంలో మెటల్ బాడీ కలిగిన మొదటి ఎంట్రీ లెవల్ డాష్ కెమెరాగా R2 అందుబాటులో ఉండనుంది.

గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్‌

ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన లారెన్స్‌.. టాలీవుడ్‌ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. వివిధ భాషల్లో నటించడమే కాకుండా.. హారర్‌ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సామాజిక సేవలోనూ లారెన్స్‌ ముందుంటాడు.

5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు..

బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కండక్టర్‌, ప్రయాణికుల మధ్య చిల్లర విషయంలో వాదనలు, తగాదాలు చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు కొందరు ప్రయాణికులు వారికి రావాల్సిన చిల్లర తీసుకోకుండానే వెళ్లిపోతారు. మరికొందరైతే తమకు రావాల్సింది ఇచ్చే వరకూ వదలరు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దేశంలో ఎక్కువగా అమ్ముడవతున్న టాప్‌ 3 కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు ఇవే..

దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపైనే వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇందులో హ్యుందాయ్‌, మారుతి, కియాలకు చెందిన కార్లు మాత్రమే అమ్మకాల్లో రాణిస్తున్నాయి. గత ఏడాది కాలంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీలను గమనిస్తే ఈ కంపెనీ కార్లు మాత్రమే సత్తా చాటాయి.

ట్రయంఫ్ టైగర్ 900 బైకులు మరింత కొత్తగా వచ్చేశాయ్!

ట్రయంఫ్ మోటార్‌సైకిల్ ఇండియా (Triumph Motorcycle India) దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ 'టైగర్ 900' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ బైక్ ధర, డిజైన్, ఫీచర్స్ మరియు బుకింగ్స్, డెలివరీలను గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి

సాధారణ ప్రజలమాదిరిగా కాకుండా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్త బైకులు, కార్లు కొనుగోలు చేస్తుంటారని అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే బాలీవుడ్ నటుడు 'జాన్ అబ్రహం' ఓ కొత్త బైకుని తన గ్యారేజిలో చేర్చారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Advertisement

టోల్‌గేట్‌ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు

టోల్‌బూత్‌(Toll Booth)లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. టోల్‌ బూత్‌ల వద్ద మనం చూసే పెద్ద పెద్ద సూచిక బోర్డుల్లో ఓ నోటీసు బోర్డును తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇంతకీ ఆ బోర్డు ఏంటి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

జైలు నుంచి వచ్చి కోట్లు విలువ చేసే కారు కొన్న యూట్యూబర్

ప్రముఖ సెలబ్రిటీల మాదిరిగానే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదా యూట్యూబర్స్ కూడా ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇందులో భాగంగానే ఇటీవల 'ఎల్విష్ యాదవ్' ఓ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) కంపెనీకి చెందిన జీ-వ్యాగన్ కొనుగోలు చేశారు.

రూ. 150 కే విమాన టికెట్‌.. ట్రైన్‌ జర్నీ కంటే చాలా చీప్‌

మన దేశంలో కేవలం 150 రూపాయలకే విమాన టిక్కెట్లు అమ్ముతున్నారంటే నమ్ముతారా? ఇది కొద్ది రోజులు ఆఫర్ అనుకుంటే పొరపాటే.. నిజంగానే ఈ విమాన టిక్కెట్ ధర 150 రూపాయలు. దేశంలోని దాదాపు 22 రూట్లలో రూ. 1000 లోపు టికెట్ ధరతో విమాన సర్వీసు నడుస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

హవ్వ!.. ఇలా కూడా ఎవరైనా చేస్తారా?: నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎన్నెన్నో సంఘటనలు కనిపించాయి. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన మాత్రం వామ్మో! అనిపించేలా ఉంది. ఇంతకీ ఏంటా ఘటన? ఎక్కడ జరిగింది? ట్రాఫిక్ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.

త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా బుల్లెట్‌ ట్రైన్స్‌

గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక సౌకర్యాలతో రైళ్లు రూపు దిద్దుకుంటున్నాయి. ఇందుకు వందే భారత్‌ రైళ్లు ఉదాహరణ. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెమీ హె స్పీడ్ రైళ్లు రూపుదిద్దుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు సేవలందిస్తుండగా.. త్వరలో బుల్లెట్‌ రైళ్లు కూడా భారత్‌లో మెరుపు వేగంతో పరగులు పెట్టనున్నాయి.

బెంజ్‌ కారు కొన్న సోషల్‌ మీడియా సెన్సేషన్‌ 'కుషా కపిల'

సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్స్ కూడా ఖరీదైన కార్లను కొనేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ప్రముఖ యూట్యూబర్ 'కుషా కపిల' (Kusha Kapila) మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొనుగోలు చేసింది.

MG గ్లోస్టర్‌పై బంపర్‌ ఆఫర్లు.. జీరో మెయింటెనెన్స్‌ అండ్‌ రిపేర్‌ కాస్ట్‌

ఎంజీ గ్లోస్టర్‌ కారు ఓనర్లకు MG మోటార్ ఇండియా గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది. కస్టమర్ల కోసం ప్రత్యేకమైన యాజమాన్య అనుభవ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్‌ ద్వారా కస్టమర్లు మొదటి మూడు సంవత్సరాల్లో జీరో మెయింటెనెన్స్‌ మరియు రిపేర్‌ ఖర్చులను అందిస్తుంది. ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ఎంజీ ఇండియా ప్రయత్నిస్తోంది.

మరో కొత్త కారు లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లో 'బొలెరో నియో ప్లస్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Advertisement

సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట..

భారత మార్కెట్లో ఎస్‌యూవీ(Used SUVs)లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా నాన్‌- మెట్రో భారతీయ నగరాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఎస్‌యూవీలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారని వెల్లడైంది. దాదాపు 40 శాతం యూజ్డ్‌ కార్ల కొనుగోలుదారులు.. ఎస్‌యూవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

మార్కెట్లో సుజుకి హయబుసా యానివర్సరీ ఎడిషన్ బైక్ లాంచ్.. ధర రూ.17.70 లక్షలు

భారతీయ మార్కెట్లోని ఖరీదైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న 'సుజుకి హయబుసా' ఇప్పుడు ఓ ప్రత్యేకమైన ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర, డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విపణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హయబుసా యొక్క స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ వెర్షన్ అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టిన తొమ్మిది నెలల తరువాత భారతదేశంలో అడుగుపెట్టినట్లు సమాచారం. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 80,000 ఎక్కువ.

నాలుగు గ్లోబల్‌ రేంజ్‌ బైక్‌లను భారత్‌లో లాంచ్‌ చేసిన అప్రిలియా..

ప్రముఖ ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీదారు అప్రిలియా(Aprilia) భారత్‌లో తన మొత్తం మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను లాంచ్‌ చేసింది. ఇందులో ఫ్లాగ్‌షిప్ RSV4 ఫ్యాక్టరీ, RS660, Tuono 660 మరియు Tuareg 660 వంటి అడ్వెంచరస్‌ బైక్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ మోటార్‌సైకిళ్లను CBUలుగా అప్రిలియా యొక్క మోటోప్లెక్స్ డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

భారత్‌ నుంచి తగ్గిన వాహనాల ఎగుమతులు

భారత్ నుంచి ఈ సారి వాహనాల ఎగుమతులు(Automobile Exports) స్వల్పంగా క్షీణించాయని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం నివేదించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రధాన విదేశీ మార్కెట్లలో ఈ ఎగుమతులు తగ్గడానికి కారణంగా ఆటో నిపుణులు చెబుతున్నారు. మరి ఎంతమేర ఈ సారి ఎగుమతులు తగ్గిపోయాయి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఇకపై ఓలా, ఉబర్‌, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్‌ ఉండదు.!!

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కంపెనీల యాప్‌ల ద్వారా రైడ్‌లను బుక్ చేసుకుంటే.. ఆ యాప్ ద్వారా పేమెంట్‌ చెల్లించే ఆప్షన్‌ను తొలగించాలని రైడ్‌ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. మార్కెట్‌లో విపరీతమైన పోటీ మరియు డ్రైవర్లు తమ యాప్‌ను వదిలిపెట్టకపోవడం వల్ల పన్ను విధించకుండా ఉండటానికి కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..