హోండా కొత్త ZR-V వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోమొబైల్స్
- 4 month, 3 days ago
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా (Honda) భారత మార్కెట్లో మళ్లీ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ అమ్మకాల పరంగా కొంత వెనుకబడినప్పటికీ, ఇప్పుడు మాత్రం కొత్త వ్యూహాలతో మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలని చూస్తోంది. ఇప్పటికే అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మోడళ్లతో భారతీయ వినియోగదారుల్లో మంచి గుర్తింపు సంపాదించిన హోండా, ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోను మరింత ప్రీమియంగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ ఒక కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.