2026 కియా సైరోస్ ఎంట్రీ.. డిజైన్, ఫీచర్లలో పెద్ద మార్పులు
ఆటోమొబైల్స్
- 5 month, 6 days ago
భారతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకునేందుకు కియా ఇండియా (Kia India) మరో కీలక అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. కంపెనీ తన ప్రాచుర్యం పొందుతున్న మోడల్ కియా సైరోస్ (Kia Syros)కు MY26 వెర్షన్‌ను పరిచయం చేస్తూ, డిజైన్, వేరియంట్ ఎంపికలు, ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఈ మోడల్‌ను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ అప్‌డేట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ధరల పరంగా చూస్తే, ఈ అప్‌డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ. 8.39 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. అయితే అసలు ఆకర్షణ మాత్రం ఇందులో తీసుకొచ్చిన కొత్త ట్రిమ్ నిర్మాణంలోనే ఉంది.