సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫిదా అయిన కారు!
ఆటోమొబైల్స్
- 7 month, 19 days ago
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) భారత మార్కెట్లో విశ్వసనీయతకు, దీర్ఘకాలిక పనితీరుకు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన అనేక మోడళ్లు ఇప్పటికే భారత వినియోగదారుల మనసుల్లో స్థానం సంపాదించగా, వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన SUV టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్. ఈ కారు 2022లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిరంతరం మంచి స్పందనను పొందుతూ, టయోటా లైనప్‌లో ఒక కీలక మోడల్‌గా మారింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం దాని హైబ్రిడ్ టెక్నాలజీ. ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే హైబ్రిడ్ ఇంజిన్ వినియోగదారులకు పెద్ద ఆకర్షణగా మారింది.