మహీంద్రా XUV 7XO చూస్తే వావ్ అనాల్సిందే
ఆటోమొబైల్స్
- 8 month, 24 days ago
మహీంద్రా అండ్ మహీంద్రా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలుగుతున్న XUV700ని సరికొత్త హంగులతో, సరికొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే మహీంద్రా XUV 7XO. ఇటీవల విడుదలైన XUV 3XO బాటలోనే, ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, టెక్నాలజీ పరంగా నెక్స్ట్ లెవల్‌లో కనిపిస్తోంది. రూ.13.66 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్‌షోరూమ్) వచ్చిన ఈ కారు, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.