పాత కార్లను EVగా మార్చుకునే ఛాన్స్.. రూ.50 వేల ప్రోత్సాహకం!

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా శీతాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుండటంతో, ప్రజారోగ్యంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్ రంగాన్ని కేంద్రంగా చేసుకుని ఒక కొత్త, వినూత్నమైన చర్యపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం, రోడ్లపై ఇప్పటికీ నడుస్తున్న పాత పెట్రోల్, డీజిల్ వాహనాలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ వాహనాలను పూర్తిగా రద్దు చేయడం వల్ల యజమానులకు ఆర్థిక భారం పడుతుందనే ఆలోచనతో, వాటికి ఒక ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే పాత వాహనాల ఇంజిన్లను తొలగించి, వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే (రెట్రోఫిట్) విధానం.

సిగరెట్ అలవాటు ఉందా, రోజూ ఇవి రెండు తినండి - ఊహించని మార్పు..!!

నానబెట్టిన బాదం ఎలా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ మరియు గుండె ఆరోగ్యాన్ని భారతీయ ఆహారంలో ఎలా ప్రోత్సహిస్తుందో తెలుసుకోండి, ఆచరణాత్మక రోజువారీ మోతాదులు మరియు జీర్ణక్రియ పరిశీలనలతో.

వీధి కుక్కలు కరిస్తే బాధ్యత ఎవరిది? సుప్రీం కోర్టు షాకింగ్ కామెంట్స్..

భారతదేశ సుప్రీంకోర్టు వీధి కుక్కల ప్రవర్తనను మరియు ప్రజల భద్రతను కాపాడటంలో స్టెరిలైజేషన్ పాత్రను పరిశీలిస్తుంది, పాఠశాలలు మరియు వీధుల సమీపంలో తిరిగే కుక్కల నుండి వచ్చే ప్రమాదాలను హైలైట్ చేస్తుంది.

షోరూమ్‌కు రావడానికి కూడా టైం లేదు

చెన్నై సిటీ అనగానే సినిమానో, బీచులకో ఫేమస్ అని గుర్తొస్తుంది.. కానీ ఇప్పుడు కార్ల తయారీలోనూ ప్రపంచాన్ని శాసిస్తోంది. వచ్చిన వారిని ఆదరించే ఊరు అని చెన్నైకి పేరుంది. ఇప్పుడు నిసాన్ (Nissan) కంపెనీని కూడా అలాగే అక్కున చేర్చుకుంది. నిసాన్ కంపెనీ ఫ్యాక్టరీ నుంచి తయారవుతున్న కార్లు మన దేశంలోని షోరూమ్‌లకు వెళ్లడం కంటే ఎక్కువగా నేరుగా విదేశాలకే ఎగుమతి అవుతున్నాయి. తాజాగా నిసాన్ మోటార్ ఇండియా సృష్టించిన రికార్డులే ఇందుకు నిదర్శనం.
Advertisement

పోలీసులకంటే స్పీడ్‌గా పని చేసే AI హెల్మెట్

బెంగళూరులో రోజురోజుకీ క్షీణిస్తున్న ట్రాఫిక్ క్రమశిక్షణపై విసిగిపోయిన ఒక భారతీయ టెక్నీషియన్ చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఐటీ రంగంలో దేశానికే కాదు ప్రపంచానికీ పేరు తెచ్చుకున్న బెంగళూరు నగరంలో, వాహనాల సంఖ్య రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ అధిక వాహనాలతో చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు, చిన్నా-పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవే నగర వాసులకు ప్రధాన తలనొప్పిగా మారాయి. ఈ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పంకజ్, తన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ ప్రయోజనానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు.

షోరూం ఖాళీ చేయడానికి హోండా భారీ ప్లాన్

2026లో కొత్త కార్ల దండయాత్రకు ముందే షోరూమ్‌లను ఖాళీ చేయాలని హోండా భారీ నిర్ణయం తీసుకుంది.న్యూఇయర్ సందర్భంగా ఎలివేట్, సిటీ, అమేజ్ మోడళ్లపై రూ.1.71 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు జనవరి నెలలో మాత్రమే అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారుల్లో హడావుడి మొదలైంది.

ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకు బెస్ట్ స్కూటర్! ఫుల్ ట్యాంక్‌పై 250 కి.మీ మైలేజ్

TVS Jupiter 125 భారతీయ మార్కెట్‌లో ఒక విశ్వసనీయమైన, కుటుంబానికి అనుకూలమైన స్కూటర్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారు, చిన్నపాటి ప్రయాణాలు చేసే వారు, అలాగే సౌకర్యం, మైలేజీకి ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు ఇది అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. డిజైన్ పరంగా ఇది చాలా సింపుల్‌గా, కానీ ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. పురుషులు-మహిళలు ఇద్దరికీ సులభంగా నడపగలిగేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ స్కూటర్‌లోని ముఖ్యమైన ఆకర్షణ దీని రైడింగ్ కంఫర్ట్. వెడల్పైన సీటు, సరైన హ్యాండిల్ పొజిషన్, స్మూత్ సస్పెన్షన్ వల్ల రోజువారీ ప్రయాణాల్లో అలసట తక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర రోడ్లపై కూడా జూపిటర్ 125 చాలా సాఫీగా ముందుకు సాగుతుంది.

ఈవీ మార్కెట్లో బజాజ్ సునామీ

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన ఓలా ఎలక్ట్రిక్ జోరు తగ్గడం, సంప్రదాయ దిగ్గజాలైన టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj) దూకుడు పెంచడంతో రంగం రసవత్తరంగా మారింది.

7 సీటర్ కార్లలో దేశంలోనే బెస్ట్ కారు

మారుతి సుజుకి ఎర్టిగా (maruti suzuki ertiga) భారత మార్కెట్‌లో ఒక నమ్మకమైన కుటుంబ MPVగా ఇంటి పేరుగా నిలిచింది. సంవత్సరాలు గడిచినా ఈ కారుపై వినియోగదారుల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూనే ఉండగా, అమ్మకాల పరంగా కూడా ఎర్టిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గత నెల డిసెంబర్ 2025లో మాత్రమే ఈ MPVను 16,300 యూనిట్ల వరకు కొనుగోలుదారులకు విజయవంతంగా డెలివరీ చేయడం జరిగింది. ఇది ఎర్టిగాపై ఉన్న క్రేజ్‌కు స్పష్టమైన నిదర్శనం. ఇంతకుముందు నెలల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే కూడా ఎర్టిగా ఎంత స్థిరంగా మార్కెట్‌లో ముందుకు సాగుతోందో అర్థమవుతుంది. నవంబర్ 2025లో 16,197 యూనిట్లు, అక్టోబర్‌లో 20,087 యూనిట్లు, సెప్టెంబర్‌లో 12,115 యూనిట్లు, అలాగే ఆగస్టులో 18,445 యూనిట్లు అమ్ముడయ్యాయి.

షావోమీ దెబ్బకు పెట్రోల్ కార్లు షెడ్డుకే

స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో రారాజులా వెలుగొందుతున్న షావోమీ (Xiaomi), ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. టెస్లా, బి‌వైడి వంటి దిగ్గజ కంపెనీలకు షావోమీ సేల్స్ చూస్తుంటే వణుకు పుడుతోంది. ఒకప్పుడు కేవలం తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లను అందించి ఇండియాలో తిరుగులేని బ్రాండ్‌గా ఎదిగిన షావోమీ, ఇప్పుడు అదే ఫార్ములాను ఎలక్ట్రిక్ కార్లలోనూ అమలు చేస్తోంది.

ఈ స్కూటర్‎కు నెలకోసారి ఛార్జింగ్ పెడితే చాలు

ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలనుకునే వారికి, ముఖ్యంగా రేంజ్ విషయంలో టెన్షన్ పడేవారికి ఒక అదిరిపోయే గుడ్‎న్యూస్. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ(Simple Energy), మార్కెట్లోకి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ సింపుల్ అల్ట్రా(Simple Ultra)ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ రేంజ్ వింటే పెట్రోల్ బండ్ల యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. మీరు ఊహించని దూరం ప్రయాణించవచ్చు.

ఈ సంక్రాంతికి గుమ్మానికి తమలపాకులతో తోరణం కట్టి చూడండి: ఎన్నో వాస్తు ప్రయోజనాలు

లక్ష్మిని ఆహ్వానించడానికి, ప్రతికూలతను తొలగించడానికి మరియు ఇంట్లో ఆరోగ్యం, శాంతి మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి తమలపాకు తోరణం వాస్తు సూత్రాలతో ఎలా సమలేఖనం అవుతుందో అన్వేషించండి.
Advertisement

పెట్రోల్ ధరలు చూసి భయపడే మిడిల్ క్లాస్ కోసం కొత్త EV లాంచ్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ప్రస్తుతం భారత కారు మార్కెట్‌లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఒకదాని వెంట ఒకటి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, ప్రత్యర్థి కంపెనీలకు స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. వరుస లాంచ్‌లతో మార్కెట్‌ను తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహాన్ని మహీంద్రా బలంగా అమలు చేస్తోంది. ఇటీవలే XUV 7XOను అధికారికంగా లాంచ్ చేసిన మహీంద్రా, దానికి కేవలం ఒక రోజు గ్యాప్‌లోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XUV 3XO EVను కూడా ప్రవేశపెట్టడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వరుస విడుదలలు భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న SUV మార్కెట్‌లో మహీంద్రా దూకుడు ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.

హైదరాబాదీ మిర్చి కా సాలన్.. ఇలా చేస్తే అదిరిపోద్ధంతే!

హైదరాబాదీ మిర్చి కా సాలన్‌ను అన్వేషించండి, ఇది చింతపండుతో చేసిన నట్టి మిర్చి కూర, ఇది బిర్యానీతో చాలా బాగుంటుంది. కుటుంబ భోజనం కోసం తయారీ, వైవిధ్యాలు మరియు వడ్డించే చిట్కాలను తెలుసుకోండి.

మధ్య తరగతి ప్రజల కోసం నిస్సాన్ భారీ గిఫ్ట్

ఒకప్పుడు భారతీయ రోడ్లపై రారాజులా వెలిగిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) గుర్తుంది కదా? ఆ కారు మళ్ళీ కొత్త అవతారంలో తిరిగి వస్తోంది. అయితే ఈసారి డస్టర్‌తో పాటు దాని తమ్ముడు లాంటి మరో పవర్‌ఫుల్ కారు కూడా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అదే జపాన్ దిగ్గజం నిస్సాన్ తయారు చేసిన నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton).

కొత్త మహీంద్రా SUV గురించిన టాప్ విషయాలు

మహీంద్రా ఆటోమొబైల్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించింది. నిన్న అధికారికంగా లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 7XO, ఇప్పటికే మార్కెట్‌లో మంచి పేరు సంపాదించిన XUV700కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా పరిచయమైంది. లాంచ్ అయిన వెంటనే ఈ SUVపై భారీ చర్చ మొదలైంది అంటే, ఇందులో ఎంత కొత్తదనం, ఎంత అప్‌గ్రేడ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆధునాతన డిజైన్, తాజా టెక్నాలజీ, డజన్ల కొద్దీ కొత్త ఫీచర్లతో XUV 7XO ఇప్పుడు మరింత ప్రీమియం ఫీల్‌ను ఇస్తోంది. డిజైన్ పరంగా చూస్తే, XUV 7XO పూర్తిగా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. XUV700 బోల్డ్ ఐడెంటిటీని నిలుపుకుంటూనే, ఈసారి మరింత షార్ప్ లైన్స్, అప్‌డేటెడ్ ఫ్రంట్ లుక్, ఆధునిక లైటింగ్ ఎలిమెంట్స్‌తో SUVకి కొత్త వ్యక్తిత్వం ఇచ్చారు. ఇది రోడ్డుపై కనిపించిన వెంటనే చూపు ఆకర్షించేలా డిజైన్ చేశారు.

బీర్ vs వైన్‌- ఏ వయసు వారికి ఏది మంచిది..!!

కొత్త మార్గదర్శకం మొత్తం ఆల్కహాల్ తీసుకోవడం మరియు ఆరోగ్య స్థితి గుండె ప్రమాదాన్ని ఎర్ర వైన్ లేదా బీర్ కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చూపిస్తుంది; పెద్దలకు పరిమితులు మరియు సురక్షిత పద్ధతులు.

చమురు నిల్వల్లో రారాజులు.. ప్రపంచం లోనే టాప్ 10 దేశాల జాబితా ఇదే !!

నిరూపితమైన చమురు నిల్వలు, ప్రాంతీయ అసమానతలు మరియు ప్రపంచ సరఫరా మరియు ధరలపై షేల్ ఉత్పత్తి ప్రభావం యొక్క విశ్లేషణ, వెనిజులా ముందుంది.

ఫ్యామిలీ SUV ఇప్పుడు మరింత సేఫ్.. పంచ్ ఫేస్‌లిఫ్ట్

టాటా మోటార్స్ (tata motors) భారతీయ మార్కెట్‌కు అందించిన అత్యంత విజయవంతమైన వాహనాల్లో టాటా పంచ్ (tata punch) ఒకటిగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2021లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ మైక్రో-SUV, ప్రారంభం నుంచే తనదైన శైలితో, భద్రతతో, ప్రాక్టికాలిటీతో వినియోగదారుల మనసును గెలుచుకుంది. దాని ఫలితంగానే, ఇప్పటివరకు 6 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలు సాధించి, నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా పంచ్ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతోంది. చిన్న కుటుంబాల నుంచి యువత వరకు, నగరాల నుంచి గ్రామాల వరకు పంచ్ ప్రతి వర్గంలోనూ తన పట్టును ఉంచుకుంది. ఇప్పుడు, ఈ విజయవంతమైన ప్రయాణానికి మరో కొత్త అధ్యాయం జోడించేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది.

ఈ కారుంటే చుట్టాలు ఎక్కువైనా చింత లేదు.

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది బడ్జెట్ ఎంపీవీ(MPV). ఇప్పుడు ఆ విభాగంలో ప్రకంపనలు సృష్టించేందుకు జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్(Nissan) తన సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. తన పాపులర్ ఎస్‌యూవీ మాగ్నైట్ సృష్టించిన సంచలనాన్ని ఎంపీవీ మార్కెట్‌లోనూ పునరావృతం చేసేందుకు నిస్సాన్ గ్రావైట్(Nissan Gravite) పేరుతో 7-సీటర్ కారును తీసుకువస్తోంది.
Advertisement

ఒక్క నెలలో 14 వేల మంది.. సేల్స్ కౌంటర్ వద్ద క్యూలు!

మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti suzuki victoris) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన చాలా తక్కువ కాలంలోనే ఒక ప్రముఖ SUVగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కొత్త మోడల్ అయినప్పటికీ, లాంచ్ అయిన నాటి నుంచే వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఈ కారుపై ఎంత స్థాయిలో ఆసక్తి ఏర్పడిందో స్పష్టంగా అర్థమవుతుంది. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ విక్టోరిస్‌ను మారుతి సుజుకి లైనప్‌లో ఒక కీలక మోడల్‌గా మార్చింది. ఈ SUV విజయాన్ని తాజా అమ్మకాల గణాంకాలు మరింత బలంగా నిరూపిస్తున్నాయి. డిసెంబర్ 2025 నెలలో మాత్రమే 14,000 యూనిట్లకు పైగా విక్టోరిస్ కార్లు వినియోగదారులకు డెలివరీ కావడం అంటే, మార్కెట్లో దీనికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం.

కారు లోపల పడుకోవచ్చు..ఆకాశాన్ని చూడొచ్చు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో 2025 సంవత్సరం ఒక చారిత్రక మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఏళ్ల తరబడి ఏకఛత్రాధిపత్యం వహించిన టాటా మోటార్స్‌కు ఎంజీ మోటార్ ఇండియా కోలుకోలేని దెబ్బ కొట్టింది. కేవలం ఒకే ఒక్క కారు.. అది ఎంజీ విండ్‌సర్ (MG Windsor).

నెల మారినా డిమాండ్ తగ్గలేదు.. బ్రెజ్జా 17,700 యూనిట్లు

మారుతి సుజుకి బ్రెజ్జా (maruti suzuki brezza) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కాంపాక్ట్ SUV మాత్రమే కాదు... ప్రతి కుటుంబానికి పరిచయమైన ఇంటి పేరులా మారిపోయింది. స్టైలిష్ డిజైన్, విశ్వసనీయత, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఇవన్నీ కలసి బ్రెజ్జాను సంవత్సరాలుగా కొనుగోలుదారుల తొలి ఎంపికగా నిలిపాయి. అందుకే ఈ కారుకు డిమాండ్ రోజురోజుకూ మరింత బలపడుతూ వస్తోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు తాజా సాక్ష్యం డిసెంబర్ 2025 అమ్మకాల గణాంకాలు. గత నెలలో మాత్రమే మారుతి సుజుకి బ్రెజ్జా మొత్తం 17,700 యూనిట్లు వినియోగదారులకు విజయవంతంగా డెలివరీ చేయబడ్డాయి.

పక్కా పేదల కోసమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) భారత మార్కెట్లో సంచలనం సృష్టించింది. తన సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తూ, దేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే ఛార్జ్‌తో ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించే సింపుల్ అల్ట్రా వేరియంట్‌ను పరిచయం చేసింది. రేంజ్ విషయంలో భయపడే ఎలక్ట్రిక్ వాహనదారులకు ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు.

మహీంద్రా XUV 7XO చూస్తే వావ్ అనాల్సిందే

మహీంద్రా అండ్ మహీంద్రా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలుగుతున్న XUV700ని సరికొత్త హంగులతో, సరికొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే మహీంద్రా XUV 7XO. ఇటీవల విడుదలైన XUV 3XO బాటలోనే, ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, టెక్నాలజీ పరంగా నెక్స్ట్ లెవల్‌లో కనిపిస్తోంది. రూ.13.66 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్‌షోరూమ్) వచ్చిన ఈ కారు, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.