డిసెంబర్ 15నుంచి మహీంద్రా కొత్త కార్ బుకింగ్స్
ఆటోమొబైల్స్
- 9 month, 17 days ago
భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ మధ్యకాలంలో టాటా మోటార్స్ తన ఐకానిక్ సియెర్రా (Tata Sierra) ఎస్‌యూవీకి పునర్జన్మ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటాకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న మహీంద్రా, తమ అత్యంత ప్రజాదరణ పొందిన XUV700 ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కొత్త పేరుతో విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. XUV300 ని XUV 3XO గా మార్చినట్లుగానే, XUV700 ఫేస్‌లిఫ్ట్‌ను ఇకపై XUV 7XO అనే పేరుతో పిలవనున్నారు.