రోజుకు 66 మంది ఇదే కారును ఇంటికి తీసుకెళ్తున్నారు

భారతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ విభాగంలో స్టైలిష్ డిజైన్, కాంపాక్ట్ సైజు, నగర ప్రయాణాలకు అనువైన అంశాలతో మంచి గుర్తింపు పొందిన కార్లలో మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis) ఒకటి. యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ కారు తన ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లతో ఒకప్పుడు మంచి డిమాండ్‌ను సంపాదించింది. అయితే ఇటీవల ఈ మోడల్ అమ్మకాల గణాంకాలు చూస్తే కొంత మందగమనాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇగ్నిస్‌కు డిమాండ్ కొద్దికొద్దిగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి నెలలో విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ నెలలో ఈ కారు మొత్తం 1,848 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.

స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ ధరకే స్కూటర్

భారతదేశపు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor), సామాన్యుల కలలను సాకారం చేస్తూ మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే తన ఐక్యూబ్ (iQube) మోడల్‌తో ఓలా, ఏథర్ వంటి దిగ్గజాలకు చమటలు పట్టించిన టీవీఎస్, ఇప్పుడు బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లను కోరుకునే వారి కోసం ఆర్బిటర్ (Orbiter) శ్రేణిలో సరికొత్త బేస్ మోడల్ టీవీఎస్ ఆర్బిటర్ V1 (TVS Orbiter V1)ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ.49,999 ప్రారంభ ధరకే లభించే ఈ స్కూటర్, ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది.

ఇరాన్‌తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !!

ఈ కథనం కొనసాగుతున్న US దాడులు, పెరుగుతున్న రక్షణ ఖర్చులు, వ్యయంపై సెనేట్ బ్రీఫింగ్‌లు మరియు శత్రుత్వాల మధ్య వైట్ హౌస్ నిధుల అభ్యర్థన గురించి వివరంగా తెలియజేస్తుంది.

ఓర్నీ.. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్న జనం.. వైరల్ వీడియో!

గ్యాస్ సిలిండర్ల కొరత గురించి పుకార్లు వ్యాప్తి చెందడంతో LPG కొరత భయాలు వ్యాపించాయి; అధికారులు స్థిరమైన సరఫరా గురించి హామీ ఇస్తుండగా, వినియోగదారులు దేశవ్యాప్తంగా నిల్వ చేసుకోవడానికి పరుగులు తీస్తున్నారు.
Advertisement

భారత్ పవర్ అంటే ఇదే!: ముంబై పోర్టులో ల్యాండైన భారీ ట్యాంకర్

Hormuz జలసంధిలో ఉద్రిక్తతల మధ్య షెన్లాంగ్ ట్యాంకర్ ముంబైకి ముడి చమురును చేరవేసింది, ఇది భారతదేశ దిగుమతుల కోసం కొనసాగుతున్న చమురు రవాణా మరియు భద్రతా పరిశీలనలను హైలైట్ చేస్తుంది.

ఈ కారు పరిస్థితి చూస్తే జాలేస్తుంది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota Kirloskar Motor) కార్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విశ్వసనీయత, మంచి పనితీరు, దీర్ఘకాలిక నాణ్యత కారణంగా టయోటా బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే కార్ల నుంచి ప్రీమియం, లగ్జరీ వాహనాల వరకు విస్తృత శ్రేణిలో మోడళ్లను అందించడం టయోటా ప్రత్యేకత. అందుకే భారతీయ వినియోగదారులు ఈ బ్రాండ్‌పై విశ్వాసం చూపుతూ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో టయోటా దేశీయ మార్కెట్లో మొత్తం 30,737 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 26,414 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్

సెక్షన్ 301 క్రింద US భారతదేశం మరియు 16 దేశాలపై ప్రభావం చూపే ప్రపంచ పారిశ్రామిక అధిక సామర్థ్యంపై ఒక కొత్త విచారణను ప్రారంభించింది, ఇందులో సంభావ్య సుంకాల చర్యలు మరియు తాత్కాలిక వాణిజ్య చర్చలు ఉంటాయి.

స్కూటర్ ఇప్పుడే కొంటేనే వేలల్లో లాభం

మీరు ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు ఇది డెడ్ లైన్ సమయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న భారీ సబ్సిడీ గడువు ముగియడానికి కేవలం మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. మార్చి 31, 2026 తర్వాత ఈ సబ్సిడీలో భారీ మార్పులు రానున్నాయి. దీనివల్ల ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఈ లోపే కారు లేదా బైక్ ఇంటికి తెచ్చుకుంటే మీకు వేల రూపాయల లాభం కలుగుతుంది. ప్రస్తుత ఆఫర్లు, సబ్సిడీ వివరాలు, మార్కెట్ ట్రెండ్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం PM E-DRIVE(PM Electric Drive Revolution in Innovative Vehicle Enhancement) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం 2028 వరకు ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ టూ-వీలర్లు (e-2W), త్రీ-వీలర్లపై (e-3W) ఇచ్చే ఇన్సెంటివ్‌లు మాత్రం 31 మార్చి 2026 వరకే అమల్లో ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి kWh బ్యాటరీ సామర్థ్యంపై రూ.5,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. అయితే, ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది రూ.2,500కి పడిపోతుంది. అంటే, మీరు ఏప్రిల్‌లో స్కూటర్ కొంటే నేరుగా మీ జేబు నుంచి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ మార్చి నెలాఖరు లోపు కొనుగోలు పూర్తి చేయడం తెలివైన పని.

బైక్ లాగా 30 కి.మీ మైలేజ్ కారు.. కొనేవాళ్లు మాత్రం కనిపించడం లేదు

భారతీయ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ విభాగంలో మంచి పేరు తెచ్చుకున్న కార్లలో టయోటా గ్లాంజా (Toyota Glanza) ఒకటి. స్టైలిష్ డిజైన్, మంచి ఫీచర్లు, విశ్వసనీయతతో ఈ కారు వినియోగదారుల మధ్య మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన కారుగా దీనిని చాలా మంది ఎంపిక చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ కారుకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు కొంత మార్పును చూపుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో Toyota Kirloskar Motor విక్రయిస్తున్న గ్లాంజా అమ్మకాలు పాములు-నిచ్చెనల ఆటలాగే పైకి దిగుతూ కొనసాగుతున్నాయి. కొన్నినెలల్లో మంచి వృద్ధి కనిపిస్తుండగా, మరికొన్నినెలల్లో అమ్మకాలు తగ్గుతున్నాయి. ఇదే పరిస్థితి తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 నెల గణాంకాల్లో కూడా కనిపించింది.

దేశం మొత్తం ఈ కారే కావాలంటోంది

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా టాటా మోటార్స్ పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు కేవలం కమర్షియల్ వాహనాలకే పరిమితమైన ఈ దిగ్గజ సంస్థ, ఇప్పుడు ప్యాసింజర్ కార్ల విభాగంలో కూడా రారాజుగా వెలుగుతోంది. ఫిబ్రవరి 2026 నాటికి అందిన తాజా గణాంకాల ప్రకారం.. టాటా మోటార్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. గత నెలలో ఈ సంస్థ ఏకంగా 62,329 కార్లను విక్రయించి, తన చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 34 శాతం వృద్ధిని సూచిస్తోంది. ముఖ్యంగా సేఫ్టీ రేటింగ్స్, అడ్వాన్సుడ్ ఫీచర్ల వల్ల సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ టాటా కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?

గల్ఫ్ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటడంతో భారతదేశం ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా బ్యాలెన్స్ మరియు ఇంధన భద్రతకు ముప్పును ఎదుర్కొంటోంది.

ఇక రోడ్ల మీద విమానంలా దూసుకుపోవచ్చు! గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అదానీ సత్తా!

ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ సమయాన్ని తగ్గించడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం మరియు 12 జిల్లాల్లో పారిశ్రామిక, పర్యాటక మరియు పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement

ఏథర్ స్కూటర్లపై రూ.20,000 వరకు తగ్గింపు

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగంలో ముందంజలో నిలుస్తున్న ప్రముఖ కంపెనీలలో ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఒకటి. ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, మంచి పనితీరు కలిగిన స్కూటర్లతో ఈ సంస్థ ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీలు కొత్త ఫీచర్లు, మెరుగైన రేంజ్, ఆకర్షణీయమైన డిజైన్‌లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువస్తూ పోటీని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అమ్మకాలను మరింతగా పెంచుకోవాలని భావించిన ఏథర్ ఎనర్జీ కస్టమర్ల కోసం ప్రత్యేక పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది.

మళ్లీ గుర్తొస్తున్న "లాక్ డౌన్" కష్టాలు.. గ్యాస్ కొరతతో సామాన్యుడు విలవిల !!

భారతదేశంలో LPG సిలిండర్ల కొరత రెస్టారెంట్లు, ధాబాలు మరియు గిగ్ కార్మికులను ప్రభావితం చేస్తుంది, ధరలు పెరగడం మరియు సరఫరా పరిమితుల మధ్య డెలివరీ ఆలస్యం అవుతున్నాయి.

ఇది కారు కాదు ఇనుప కోట

మహారాష్ట్రలోని థానే నగరంలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన టాటా సియెర్రా (Tata Sierra) SUV టెస్ట్ డ్రైవ్ సమయంలో జరిగిన ఈ ప్రమాదం, వాహనాల భద్రత (Car Safety) ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పింది. సుమారు 20 అడుగుల లోతైన గోతిలో కారు పడిపోయినప్పటికీ, అందులోని ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టాటా కార్ల బిల్డ్ క్వాలిటీకి ఈ ఘటనే ఒక నిదర్శనమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

బైక్ సెకండ్ హ్యాండ్‎కు అమ్మినా వారంటీ పోదు

భారతదేశంలోని స్పోర్ట్స్ బైక్ ప్రేమికులకు కేటీఎం (KTM) అంటే ఒక క్రేజ్. వేగం, స్టైల్, పవర్‌ఫుల్ ఇంజిన్‌లకు మారుపేరుగా నిలిచిన ఈ ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ, ఇప్పుడు తన కస్టమర్ల కోసం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమ బైక్‌లపై నమ్మకాన్ని మరింత పెంచేందుకు, అమ్మకాలను భారీగా పెంచుకునే లక్ష్యంతో, కేటీఎం తన వారంటీ ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న వారంటీ కాలాన్ని ఏకంగా రెట్టింపు చేస్తూ కంపెనీ పెద్ద ప్రకటన చేసింది. దీనివల్ల కొత్తగా బైక్ కొనేవారికే కాకుండా, పాత బైక్‌ను రీసేల్ చేసేటప్పుడు కూడా కస్టమర్లకు భారీ ప్రయోజనం కలగనుంది.

శక్తిమంతమైన పాప విమోచన ఏకాదశి- ఇలా చేయండి

2026 ఏకాదశి తేదీలు, ఉపవాస నియమాలు, పూజ విధానాలు మరియు మంత్రాల గురించి తెలుసుకోండి. వైష్ణవ సంప్రదాయంలో పాపమోచని మరియు కామద ఏకాదశి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలను అర్థం చేసుకోండి.

Forbes: ఇంత కరవులోనూ.. ప్రపంచ కుబేరులు వీళ్లే..

ఫోర్బ్స్ 2026 మొత్తం USD 20.1 ట్రిలియన్ సంపదతో 3,428 మంది బిలియనీర్లను ర్యాంక్ చేసింది. ఎలోన్ మస్క్ ముందుండగా, లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ తరువాత ఉన్నారు, ఇది వివిధ రంగాలలో విస్తృత సంపద వృద్ధిని ప్రతిబింబిస్తుంది.

Trump: "అంతా బూడిద చేశాం.. ఇక యుద్ధం ముగిస్తాం"

ఇరాన్‌లో US-ఇజ్రాయెల్ చర్యల విశ్లేషణ, యుద్ధం త్వరగా ముగుస్తుందని ట్రంప్ ప్రకటనలు మరియు చమురు మార్కెట్లు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంభావ్య ప్రభావాలు.

రియర్ వెంటిలేటెడ్ సీట్లున్న టాప్-5 SUVలు ఇవే

వేసవిలో భారతదేశంలో ప్రయాణం అంటే అదొక నరకం. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడిపోతుంటారు. అందుకే ఇప్పుడు కారు కొనేవారు ఇంజిన్ పవర్ కంటే ముందు ఏపీ ఎంత బాగా వస్తుంది. సీట్లు ఎంత కంఫర్ట్‌గా ఉన్నాయనేది చూస్తున్నారు. ముఖ్యంగా వెంటిలేటెడ్ సీట్లు ఇప్పుడు ఒక లగ్జరీ నుంచి అవసరంగా మారిపోయాయి. సాధారణంగా చాలా కార్లలో డ్రైవర్, కో-డ్రైవర్ కోసం మాత్రమే ఈ సీట్లు ఉంటాయి. కానీ వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుల కోసం కూడా చల్లని గాలిని అందించే రియర్ వెంటిలేటెడ్ సీట్లు కలిగిన టాప్ 5 కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Advertisement

క్రీడలకూ మతానికీ లింక్? వరల్డ్ కప్ వివాదంపై టాలీవుడ్ హీరోయిన్ ఫైర్!

భారతదేశం 2026 T20 ప్రపంచ కప్ గెలుచుకుంది మరియు ఒక దేవాలయానికి ట్రోఫీ సందర్శన వివాదానికి దారితీసింది; జాతీయ గర్వం మరియు సమ్మిళితత్వంపై నాయకులు మరియు ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలిపారు.

ఈ ఫోటోలో ఉన్న 5 పుస్తకాలను కనిపెట్టగలరా..?

ఒక చిత్రంలో దాగి ఉన్న ఐదు పుస్తకాలను కనుగొనే ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌ను అన్వేషించండి. తొమ్మిది సెకన్ల వ్యవధిలో సూక్ష్మ వివరాలను గుర్తించడానికి మరియు దృశ్య అవగాహనను మెరుగుపరచడానికి কৌশলాలను తెలుసుకోండి.

అజ్ఞాతంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్?.. అసలేమైంది?

US-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మెజ்தబా ఖమెనీ ఆరోగ్యం గురించి పుకార్లు, అధికారిక స్పందనలు, ఇరాన్ నాయకత్వం మరియు ప్రజల కమ్యూనికేషన్‌పై వాటి ప్రభావం గురించి విశ్లేషణ.

లీటరుకు 70 కి.మీ ఇచ్చే సామాన్యుడి ‘ఫ్యాషన్’ ఈ బైక్

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో టూ వీలర్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బైక్ అనేది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది వారి ఫ్యామిలీలో ఓ మెంబర్‎తో సమానం. పల్లెటూళ్లలో నివసించే సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే వాహనం ప్రాణాధారం.

రోజుకు కేవలం 16 కార్లు మాత్రమే.. ఎస్-ప్రెస్సోకు మార్కెట్లో షాక్!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు మంచి గుర్తింపు పొందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో (Maruti Suzuki S‑Presso) ఒకటి. తక్కువ ధర, చిన్న కుటుంబాలకు సరిపడే డిజైన్, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ కారు చాలా కుటుంబాల్లో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వినియోగదారులు ఈ మోడల్‌ను ఎక్కువగా ఎంచుకునేవారు. అందుకే ఇది మార్కెట్లో ఇంటింటికి సుపరిచితమైన కారుగా మారింది. అయితే ఇటీవల కాలంలో ఈ కారుకు ఉన్న డిమాండ్ తగ్గుతూ వస్తోంది. కొత్త మోడళ్లు మార్కెట్లోకి రావడం, వినియోగదారుల అభిరుచులు మారడం వంటి కారణాల వల్ల ఎస్‌ ప్రెస్సో అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి.