టీ తాగుతూ దమ్ము కొడుతున్నారా.. అయితే, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

ప్రతిరోజూ టీ తాగుతూ ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీ విరామాలు మరియు సిగరెట్లను కలిపి తీసుకోవడం గురించి పునరాలోచించాలని, సురక్షితమైన రోజువారీ ఎంపికల కోసం సూచిస్తున్నారు.

మధ్యతరగతి కలల బైక్‌లు ఇవే… తక్కువ ధరలో టాప్ మైలేజ్!

రోజువారీ ప్రయాణాలకు సరిపడే కొత్త మోటార్‌సైకిల్ కోసం చూస్తున్నారా? అయితే భారత మార్కెట్లో 100cc సెగ్మెంట్ ఇప్పటికీ అత్యంత పాపులర్‌గా కొనసాగుతోంది. కారణం చాలా సింపుల్.. సరసమైన ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అలాగే అద్భుతమైన మైలేజీ. ప్రతిరోజూ ఆఫీస్‌కు, స్కూల్ రన్స్‌కు, లేదా చిన్న చిన్న పనులకు వెళ్లేవారికి ఈ బైక్‌లు నిజంగా బెస్ట్ చాయిస్‌గా మారాయి. ఈ కేటగిరీలో ప్రస్తుతం ఎక్కువగా కొనుగోలు అవుతున్న మోడళ్లలో బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ 100, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో HF డీలక్స్ అనే నాలుగు బైక్‌లు ముందంజలో ఉన్నాయి. ప్రతీ మోడల్‌కి తనదైన ప్రత్యేకత ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. తక్కువ ధరకే మంచి మైలేజ్, డైలీ యూజ్‌కు సరిపోయే పనితీరు ఇవన్నీ కలిసి వీటికి మాస్ మార్కెట్లో గట్టి క్రేజ్‌ని తీసుకొచ్చాయి. వీటి గురించిన వివరాలు ఈ కింది కథనంలో..

జిప్సీలా మాయం కాకుండా మారుతి మెగా ప్లాన్

2025 సెప్టెంబర్‌లో కొత్త జీఎస్‌టీ 2.0 సంస్కరణలు అమలు చేసిన తర్వాత, మారుతి సుజుకి కార్లు మరింత తక్కువ ధరలలో లభిస్తున్నాయి. దీనికి తోడు పండుగ సీజన్, ఇయర్ ఎండ్ ఆఫర్లలో భాగంగా కంపెనీ తమ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటిస్తోంది. ఈ డిసెంబర్ 2025 నెలలో మారుతి సుజుకి తమ ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ ద్వారా విక్రయించే ప్రముఖ మోడళ్లలో ముఖ్యంగా మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ పై ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలలో ఒకటైన జిమ్నీపై ఈ డిసెంబర్‌లో ఏకంగా రూ.లక్ష వరకు గరిష్ట ప్రయోజనాలు లభిస్తున్నాయి.

గాలిలో ఎగిరే కైట్‌లా నడుస్తుందట ఈ కొత్త కారు

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ దిగ్గజం నిస్సాన్ (Nissan), దశాబ్దాలుగా గ్లోబల్ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. నాణ్యత, పనితీరు, భద్రత అనే మూడు మూల సూత్రాలపై నమ్మకంగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ దేశాల్లో అనేక మోడళ్లను విజయవంతంగా విక్రయిస్తోంది. భారతదేశంలో కూడా నిస్సాన్ బ్రాండ్‌కు గణనీయమైన అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కంపెనీ చేసిన ఓ భారీ ప్రకటన ఆటోమొబైల్ ప్రపంచంలో భారీ చర్చను రేపుతోంది. బ్రెజిల్‌లోని సావో పాలోలో నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక గ్లోబల్ ఈవెంట్‌లో, నిస్సాన్ తన సరికొత్త SUV కైట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ విభిన్న డిజైన్‌తో, ఆధునిక సాంకేతికతలతో, భవిష్యత్‌ తరానికి అనువైన సౌకర్యాలతో రూపొందించిన SUV, కంపెనీ నెక్స్ట్-జెనరేషన్ వాహనాల దిశగా తీసుకున్న కీలక అడుగుల్లో ఒకటిగా నిలిచింది.
Advertisement

ప్రతీరోజూ ఉదయాన్నే రెండు ఆకులు తినండి.. డయాబెటిస్, బరువు కంట్రోల్!

పనస ఆకుల ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి, జీర్ణక్రియకు మద్దతు, రోగనిరోధక శక్తిని పెంచడం మరియు చర్మ ఆరోగ్యం వంటి వాటితో సహా, సురక్షిత వినియోగం మరియు సంభావ్య నష్టాలపై మార్గదర్శకత్వంతో.

పేదల కొత్త కారు నెరవేర్చేలా మారుతి మెగా ప్లాన్

ఒకప్పుడు భారతీయ మార్కెట్‌లో అత్యంత చౌకగా లభించే, అధిక మైలేజీని అందించే కార్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో వినియోగదారులు ఆ అత్యంత చౌకైన ఎంట్రీ-లెవల్ కార్లపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం భారతీయులు మైలేజీ కంటే కూడా ప్రీమియం ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లుగా నిలిచిన కొన్ని మోడళ్ల అమ్మకాలు ఇప్పుడు మందగిస్తున్నాయి. వాటిలో మారుతి సుజుకి ఆల్టో K10 ఒకటి. 25 ఏళ్లుగా భారత మార్కెట్‌లో ఉన్న ఆల్టో, ఇప్పటికీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు చేస్తూ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చూడండి! న్యూ వెన్యూకి బంపర్ రెస్పాన్స్

హ్యూందాయ్ (Hyundai) భారత మార్కెట్‌ను మరింతగా ఆకర్షించేందుకు గత నెలలోనే తన కొత్త తరం వెన్యూ ఎస్‌యూవీ(Venue Suv)ని అధికారికంగా విడుదల చేసింది. విడుదలైన నిమిషం నుంచే ఈ మోడల్‌పై వచ్చిన స్పందన కంపెనీ అంచనాలను మించి వెళ్లింది. ఎందుకంటే హ్యూందాయ్ వెన్యూ దేశీయ మార్కెట్లో ఇప్పటికే బెస్ట్‌సెల్లర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న SUV. ఇప్పుడు దీని కొత్త తరం మోడల్ రావడంతో కస్టమర్లలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త వెన్యూ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొన్ని వారాల్లోనే 32,000కు పైగా బుకింగ్‌లు అందుకుంది. ఈ సంఖ్య ఒక్కటే వినియోగదారుల్లో ఈ కారుపై ఉన్న నమ్మకం, ఆసక్తి ఎంత ఎక్కువదో చెప్పడానికి సరిపోతుంది. ముఖ్యంగా, యంగ్ కస్టమర్లు, కుటుంబ కార్ కొనుగోలుదారులు ఈ SUV వైపు పెద్దఎత్తున మొగ్గు చూపుతున్నారు.

డిసెంబర్లో కేక పుట్టించే కిర్రాక్ బైక్స్ రాబోతున్నాయ్

2025 డిసెంబర్ నెల భారతీయ టూ వీలర్ లవర్స్‎కు సంవత్సరాంతపు గొప్ప బహుమతితో రాబోతోంది. కొంతకాలంగా టెస్టింగ్ దశలో కనిపించిన స్పై షాట్‌లు, నిరంతరంగా బయటపడిన అప్‌డేట్‌లు టూ వీలర్ లవర్లలో భారీ ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు ఆ స్కూటర్లు, బైకుల్లో కొన్ని అధికారికంగా మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త మోడళ్లు BMW, సుజుకి, బజాజ్, FB మొండియాల్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి రాబోతున్నాయి. ఈ మోడళ్లన్నీ అన్ని రకాల రైడర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడ్డాయి.

మార్కెట్లో వీటి ఆధిపత్యం పెరిగింది భయ్యా

భారతదేశంలో హైబ్రిడ్ కార్ల సెగ్మెంట్ అనూహ్యంగా వేగం పుంజుకుంటోంది. ఇంధన ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ ఉపయోగం, సుదూర ప్రయాణాల కోసం వాహనాలు నడపడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ కారణంగానే గత కొన్నేళ్లుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీని అందించే స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు సాధారణ వినియోగదారులకు కూడా ప్రియంగా మారాయి.

కొత్త RX 350h ఎక్స్‌క్విజిట్ ఇండియాలో లాంచ్

లగ్జరీ వాహనాలకు పేరుగాంచిన లెక్సస్ (lexus), భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. RX సిరీస్‌లో భాగంగా RX 350h Exquisite అనే కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. తన విలాసవంతమైన డిజైన్, నాణ్యత గల మెటీరియల్స్, అత్యాధునిక టెక్నాలజీతో ఈ కారు ప్రీమియం SUV సెగ్మెంట్‌లో వినియోగదారులకు కొత్త ఎంపికను అందిస్తుంది. లెక్సస్ ఎప్పుడూ తన కార్లలో ఫీచర్ రిచ్ క్వాలిటీ, క్లాసీ ఇంటీరియర్, నిశ్శబ్ద రిఫైన్డ్ డ్రైవ్‌కు ప్రసిద్ధి. అదే ధోరణిని కొనసాగిస్తూ ఈసారి మరింత అందుబాటు ధరలో ఒక లగ్జరీ వెర్షన్‌ను తీసుకువచ్చింది. కొత్త RX 350h Exquisite వేరియంట్‌ను కంపెనీ రూ. 89.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందిస్తోంది.

ఆఫ్రికా కోసం తయారైన హ్యుందాయ్ i10కు సున్నా స్టార్ రేటింగ్!

ఆఫ్రికన్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసి అక్కడి ఎగుమతి చేస్తున్న భారతదేశంలో తయారైన హ్యుందాయ్ గ్రాండ్ i10 (Hyundai grand i10) తాజాగా నిర్వహించిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో నిరాశాజనకమైన ఫలితాన్ని నమోదు చేసుకుంది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను ఆధారంగా చేసుకుని నిర్వహించిన ఈ తాజా పరీక్షల్లో గ్రాండ్ i10కి జీరో-స్టార్ రేటింగ్ లభించింది. సాధారణంగా, హ్యుందాయ్ కార్లు భద్రత పరంగా మంచి పేరును సంపాదించినా, ఈ మోడల్ మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోవడం విశేషంగా మారింది. దేశంలో అమ్మే గ్రాండ్ i10, ఎగుమతి వెర్షన్‌లంటే భద్రత పరంగా పెద్ద తేడా ఉండదనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆఫ్రికన్ మార్కెట్‌కు బయలుదేరిన మోడల్ టెస్ట్‌లో ఇలా తక్కువ స్కోరు రావడం వినియోగదారుల్లో ఆందోళన కలిగించే అంశం. ఆఫ్రికాలోని చాలా పేద ప్రజలకు ఇది ప్రమాదకరమని GNCAP పరీక్ష తేల్చింది.
Advertisement

ఓలా, ఉబర్‌కు చెక్: డ్రైవర్లకు 100% కమిషన్ క్యాబ్ సర్వీస్

భారతదేశ రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ భారత్ టాక్సీ అనే సహకార (Co-operative) ఆధారిత మొబిలిటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రారంభమైంది. ఓలా (Ola), ఉబర్ (Uber), ర్యాపిడో (Rapido) వంటి ప్రైవేట్ యాప్‌లకు ఇది సరికొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. షుగర్​ పరీక్ష చేయించాల్సిందే..!!

భారతదేశంలో సాధారణంగా కనిపించే మధుమేహం యొక్క ఏడు ప్రారంభ సంకేతాలను గుర్తించండి, సకాలంలో తనిఖీలు ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి మరియు ప్రారంభ గుర్తింపు మరియు జీవనశైలి మార్పుల కోసం ఆచరణాత్మక చర్యలను తెలుసుకోండి.

చిన్న ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ కారు!

ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య పెరుగుతున్నా, సాధారణ కుటుంబాలకు అందుబాటులో ఉండే చిన్న EVల కొరత ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన వృద్ధికి అడ్డంకిగా నిలుస్తోంది. పెద్ద SUVలు, క్రాసోవర్‌లు, ప్రీమియం సెగ్మెంట్ EVలు ఎక్కువగా లభిస్తుండటంతో, బడ్జెట్‌ ఫ్రెండ్లీ చిన్న కార్లను కోరుకునే కొనుగోలుదారులకు ఎంపికలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలోనే దక్షిణ కొరియా దిగ్గజం కియా చిన్న, కానీ శక్తివంతమైన కొత్త ఎలక్ట్రిక్ కారును సిద్ధం చేస్తోంది.. అదే కియా ఈవీ2 (Kia EV2). ఈ ఏడాది జరిగిన ప్రత్యేకమైన కియా EV డే కార్యక్రమంలో కంపెనీ ఈ మోడల్‌ను అధికారికంగా ప్రదర్శించింది. బయటకు చిన్నగా కనిపించినా, డిజైన్ స్టాన్స్ మాత్రం పూర్తిగా futuristic-EV2ను చిన్నతనంతో పాటు ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌కు కావాల్సిన ఆధునిక టెక్నాలజీ సూటిగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.

రూ.7.5లక్షలకే 215కిమీ రేంజ్ ఈవీ

వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) త్వరలోనే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కంపెనీ, ముఖ్యంగా విఎఫ్‌6 (VF6), విఎఫ్‌7 (VF7) వంటి రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (EV SUVs) దేశీయ మార్కెట్లలో విజయవంతంగా విక్రయిస్తోంది. ఇప్పుడు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, 2026 ఫిబ్రవరిలో కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రవేశం భారత ఈవీ మార్కెట్‌లో కొత్త పోటీని సృష్టించనుంది.

రష్యా చమురు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం: భారత్ రెండూ సాధించగలదా?

భారతదేశం మరియు రష్యా ఇంధన ధరలు, రక్షణ సహకారం మరియు ఆంక్షల నుండి ఉపశమనంపై చర్చలు జరపాలని యోచిస్తున్నాయి, ప్రపంచ ఒత్తిడి మధ్య సమతుల్య వాణిజ్యం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్నాయి.

జనాలందరూ ఆ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లే కావాలంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల చుట్టూ ఏర్పడిన ఉత్సాహం రోజురోజుకూ కొత్త ఎత్తులకు చేరుతోంది. ఇంధన ధరలు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సహక చర్యలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన.. ఈ మూడు కలిసి భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను మెల్లగా కానీ బలంగా ఎలక్ట్రిక్ మోడ్‌కి తిప్పేస్తున్నాయి. దీనివల్ల గత కొన్నేళ్లలో EVల డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి లగ్జరీ SUVల వరకు పలు రకాల ఎలక్ట్రిక్ కార్లు కన్పించడం సాధారణమైపోయింది. కస్టమర్లలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ దృష్టిని వేగంగా ఎలక్ట్రిక్ విభాగంపై కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, గత నవంబర్‌లో ఏ కంపెనీలు ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయో వివరాలను చూద్దాం.

చలికాలంలో ఈ పొరపాట్లు చేస్తే బ్యాటరీ లైఫ్ ఖతం

చలికాలం అనేది ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక పెద్ద సవాలును తీసుకొస్తుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినప్పుడు, ఈవీ బ్యాటరీల పనితీరుపై ప్రభావం చూపడం సహజం. ఈ సమయంలో సరైన అవగాహన లేని డ్రైవర్లు చేసే కొన్ని సాధారణ పొరపాట్ల వల్ల బ్యాటరీ సామర్థ్యం, లైఫ్ స్పాన్ రెండూ తగ్గుతాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ కారు నడుపుతున్నట్లయితే, చలికాలంలో ఛార్జింగ్ సమయంలో కొన్ని ముఖ్య విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తప్పుడు ఛార్జింగ్ అలవాట్లు దీర్ఘకాలంలో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు.

అందరి ఫేవరెట్ స్విఫ్ట్ ఇప్పుడు మరింత చీప్!

మారుతి సుజుకి స్విఫ్ట్‌ (Maruti Suzuki Swift)... పేరు వినగానే భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో ఓ ఐకాన్ గుర్తుకువస్తుంది. దాదాపు కొన్ని లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై, ఏళ్ల తరబడి హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతూ వస్తున్న ఈ కారు, ఇప్పుడు GST తగ్గింపు లాభాలతో మరింత రణరంగం సృష్టిస్తోంది. ధరలు తగ్గడంతో మారుతి షోరూమ్‌ల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగిపోయింది. కొత్తగా కస్టమర్లు మాత్రమే కాదు, ఇప్పటికే కారు కొనాలని చూసిన వారు కూడా ధరల తగ్గింపును సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వేళ, సంవత్సరాంతం కావడంతో ఉన్న స్టాక్‌ను త్వరగా క్లియర్ చేసుకోవడానికి మారుతి సుజుకి భారీ ఆఫర్ల దిశగా అడుగుపెట్టింది. డిసెంబర్ 2025ను లక్ష్యంగా చేసుకుని, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్‌పై కంపెనీ అగ్రెసివ్‌గా డీల్స్ ప్రకటించింది.
Advertisement

మనోళ్లంతా డబ్బులు ఉన్నోళ్లు అయిపోయారు

భారతదేశంలో ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ వృద్ధి వేగం ఏమాత్రం తగ్గడం లేదు. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా వంటి ప్రధాన బ్రాండ్‌లు నిరంతరం కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, మార్కెట్లో తమ ఆధిపత్యం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

కస్టమర్ల నమ్మకమే లక్ష దాటించింది

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) సంస్థ 2025 నవంబర్ నెలలో అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ నవంబర్ నెలలో మొత్తం 1,22,300 టూ వీలర్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం 2024 నవంబర్‌లో అమ్ముడైన 94,370 యూనిట్లతో పోలిస్తే, ఏకంగా 29.60 శాతం (27,930 యూనిట్లు) అధికం కావడం విశేషం. దీని ద్వారా సుజుకి ఇండియన్ మార్కెట్‌లో లక్షకు పైగా టూ వీలర్లను విక్రయించే ప్రముఖ కంపెనీల సరసన నిలిచింది. సుజుకి ద్విచక్ర వాహనాల కోసం భారతీయ మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది. దేశీయ మార్కెట్‌లో 96,360 యూనిట్ల విక్రయాలు జరగగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 23.01 శాతం వృద్ధిని సూచిస్తుంది. అదేవిధంగా, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. 2024 నవంబర్‌లో 16,037 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు, 2025 నవంబర్‌లో 61.75 శాతం పెరిగి 25,940 యూనిట్లకు చేరుకున్నాయి.

భారతీయుల కోసం జర్మనీ బంపర్ ఆఫర్..!

జర్మనీ AI, రోబోటిక్స్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాలలో కొరతను ఎదుర్కొంటోంది; సులభతరం చేయబడిన వీసాలు మరియు EU బ్లూ కార్డ్ భారతీయ గ్రాడ్యుయేట్‌లకు తలుపులు తెరుస్తున్నాయి, TU9 విశ్వవిద్యాలయాలు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే STEM అధ్యయనానికి దారితీస్తున్నాయి.

కేవలం ఒక నెలలో 2,064 ట్రైబర్లు! మధ్యతరగతి అడిగేదీ ఇదే!

ఫ్రెంచ్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) ఇండియా నవంబర్ 2025 నెలను చాలా సానుకూలమైన అమ్మకాలతో ముగించింది. ప్రత్యేకించి భారత కుటుంబాల మధ్య మంచి క్రేజ్ ఉన్న రెనాల్ట్ ట్రైబర్ (Triber) ఈసారి ఆశించిన దానికంటే మెరుగైన స్పందనను సొంతం చేసుకుంది. తాజాగా వెలువడిన నెలవారీ సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ట్రైబర్ నవంబర్‌లో 2,064 యూనిట్లు అమ్ముడవుతూ మంచి దూకుడు చూపించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ MPV 1,486 యూనిట్ల వద్ద నిలిచింది. అంటే, సంవత్సరం వ్యవధిలో ట్రైబర్ డిమాండ్ గణనీయంగా పెరిగి, 578 అదనపు యూనిట్ల వృద్ధిని నమోదు చేసింది. ట్రైబర్‌ సేల్స్‌లో కనిపించిన ఈ పెరుగుదల, ఈ మోడల్‌పై కస్టమర్ నమ్మకం ఎంత పెరిగిందో మరోసారి నిరూపించింది.

30 రోజుల్లో 6 లక్షల సేల్స్! మార్కెట్లో ఊచకోత

భారతదేశ టూవీలర్ మార్కెట్‌కు నవంబర్ 2025 నిజంగా పండుగ నెలగా మారింది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద టూవీలర్ తయారీదారైన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఈ నెలను అద్భుతమైన పనితీరుతో ముగించింది. తాజాగా విడుదలైన అధికారిక అమ్మకాల గణాంకాలు పరిశ్రమలో తిరిగి విశ్వాసాన్ని నింపాయి. ప్రజలు తిరిగి బైక్‌ల కొనుగోలులో ఆసక్తి చూపుతున్నారని స్పష్టమైంది. నవంబర్ 2025లో హీరో మోటోకార్ప్ మొత్తం 6,04,490 యూనిట్లను మార్కెట్లోకి పంపింది. ఇందులో దేశీయ విక్రయాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎగుమతులు కూడా ఉన్నాయి. ఏకంగా యూనిట్ల సంఖ్యను చూస్తేనే కంపెనీపై తిరిగి ప్రజల నమ్మకం ఎంత బలమైనదో తెలుస్తుంది.