ఎలక్ట్రిక్ రంగంలో కొత్త యుద్దం
ఆటోమొబైల్స్
- 11 month, 1 day ago
ఇండియన్ మార్కెట్‌లో హోండా (Honda) తన పాత వైభవాన్ని కోల్పోయి నిరాశలో ఉంది. అయినా తగ్గేదేలే అంటూ పోరాడానికి కాలు దువ్వుతోంది. అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మోడళ్లు అమ్మకాల్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా, భవిష్యత్తు కోసం కొత్త వ్యూహాలను రచిస్తోంది. ముఖ్యంగా టాటా మోటార్స్ (Tata Motors), ఎంజీ (MG), మహీంద్రా (Mahindra) వంటి దిగ్గజాలు రాజ్యమేలుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) రంగంలోకి హోండా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా జపాన్ మొబిలిటీ షోలో హోండా కొత్త ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ(Alpha Electric SUV) ప్రోటోటైప్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.