ఆస్ట్రేలియా NCAP అగ్నిపరీక్షలో స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. భారతదేశంలో ఈ కారుకు ఉన్న ఆదరణ ప్రత్యేకమే. మొదటిసారి కారు కొనుగోలు చేయాలని అనుకునే వారు, మైలేజ్‌తో పాటు పనితీరు, డిజైన్, అందుబాటు ధరను ప్రాధాన్యతనిచ్చే వారు స్విఫ్ట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ కారు ఒక విధంగా మధ్య తరగతి కుటుంబాలకు సరిపోయే మోడల్‌గా నిలుస్తోంది. తాజాగా స్విఫ్ట్‌పై ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. 2025 మోడల్ స్విఫ్ట్ కారు ఆస్ట్రేలియాలో నిర్వహించిన క్రాష్ టెస్టులో 3 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది సాధారణ అప్‌డేట్ కాదని చెప్పాలి, ఎందుకంటే గతంలో 2024 డిసెంబర్‌లో పరీక్షించినప్పుడు అదే ఆస్ట్రేలియా-స్పెక్ మోడల్ కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది.

విటమిన్​ బి12 లోపం లక్షణాలు- జాగ్రత్తలు, నిర్లక్ష్యం చేస్తే డేంజర్..!!

భారతదేశంలో విటమిన్ B లోపం పెరుగుతోంది, ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఆహార వనరులు మరియు అవగాహన మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వ్యూహాలను తెలుసుకోండి.

కాంపిటీషన్ ఎంత ఉన్నా.. ఫ్రాంక్స్ SUVకు ఉన్న క్రేజ్ తగ్గట్లేదు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు చెప్పగానే విశ్వసనీయత, సౌకర్యం, అందుబాటులో ధర అనేవి మనసుకు తట్టే మూడు ప్రధాన అంశాలు. ఇప్పటికే విభిన్న సెగ్మెంట్లలో ఆధిపత్యం చాటుకుంటున్న ఈ కంపెనీ, SUV విభాగంలో కూడా తన ప్రత్యేక గుర్తింపును ఫ్రాంక్స్ (Fronx) ద్వారా సంపాదించింది. ప్రీమియం లుక్, శక్తివంతమైన పనితీరు, కుటుంబం మొత్తానికి సరిపడే స్పేస్ అన్నీ ప్యాకేజీగా ఈ కారు వినియోగదారుల మన్ననలు పొందుతోంది. తాజాగా విడుదలైన ఆగస్టు 2025 అమ్మకాల నివేదికలోనూ ఈ కారు తన స్థిరమైన డిమాండ్‌ను మరోసారి నిరూపించుకుంది. నివేదిక ప్రకారం, ఆగస్టు 2025లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మొత్తం 12,422 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 12,387 యూనిట్లతో పోలిస్తే కాస్త ఎక్కువ.

ఒక్క లీటరుతోనే 70 కి.మీ మైలేజ్ ఇచ్చే హీరో కొత్త మోడల్ వచ్చేసింది

భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు వినియోగదారులు ఎక్కువగా ఆశించే అంశం మంచి మైలేజ్, తక్కువ ధర, విశ్వసనీయత. ఈ మూడు లక్షణాలను సమన్వయం చేస్తూ మార్కెట్‌లో స్థిరమైన గుర్తింపును సంపాదించుకున్న మోడల్‌లో ఒకటి హీరో HF డీలక్స్. ఎంతో కాలంగా మిడిల్ క్లాస్ కుటుంబాలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఈ బైక్‌ను నమ్మకంగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ఈ మోడల్, ప్రతి రూపాయికి విలువ అనే మాటను నిజం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ డిమాండ్‌ను బలోపేతం చేస్తూ, హీరో మోటోకార్ప్ 2025 HF డీలక్స్ ప్రో (Hf Deluxe Pro)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోటీదారులకు టఫ్ ఫైట్ ఇవ్వడానికి, దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.73,550గా నిర్ణయించారు. అంటే, ధరలో అందుబాటులో ఉండి కూడా ఫీచర్లలో ఏ మాత్రం తగ్గని మోడల్‌గా దీన్ని డిజైన్ చేశారు.
Advertisement

ఈ చిన్న చిట్కాలతో టేస్టీ, స్మూత్ చపాతీలు: చల్లారినా గట్టిపడవ్

మీ చపాతీలు ఎక్కువ కాలం మృదువుగా ఉండేలా చేయడానికి సమర్థవంతమైన పద్ధతులను కనుగొనండి. సరైన పిండిని తయారు చేయడం మరియు నిల్వ చేసే సాంకేతికతల గురించి తెలుసుకోండి.

కేవలం రూ. 10 లక్షల్లో 5-స్టార్ రేటింగ్‌తో టాప్ సేఫ్టీ కార్లు ఇవే !

భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలు కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి చాలా ముఖ్యమైన అంశంగా మారాయి. అంటే, ఈ మధ్య కాలంలో ప్రజలు కారు కొనేటప్పుడు మైలేజ్, ధరతో పాటు, ఆ కారుకు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఎన్ని స్టార్ రేటింగ్ వచ్చిందో కూడా జాగ్రత్తగా చూస్తున్నారు.

ఘోర విషాదం.. పడవలు బోల్తా పడి 193 మంది మృతి !

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదాలలో 193 మంది మరణించారు. అదృశ్యమైన వారి కోసం కొనసాగుతున్న శోధన చర్యలను కీలక వివరాలు వెల్లడిస్తున్నాయి.

మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా యెజ్డి రోడ్‌స్టర్

Yezdi Roadster 2025 launched in India with updated styling, improved engine, and enhanced comfort. Prices start from ₹2,10,000. | యెజ్డి రోడ్‌స్టర్ 2025 భారతదేశంలో నవీకరించబడిన శైలి, మెరుగైన ఇంజిన్ మరియు మెరుగైన సౌకర్యంతో ప్రారంభించబడింది. ధరలు ₹ 2,10,000 నుండి ప్రారంభమవుతాయి.

కియా కార్లు కొనే వాళ్లకు పండుగ ముందే వచ్చింది

కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గించడంతో మార్కెట్‌లో ధరల తగ్గింపు సందడి నెలకొంది. చాలా కంపెనీలు ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నాయి. పండుగల సీజన్‌కు ముందు వచ్చిన జీఎస్టీ తగ్గింపు నిర్ణయం మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

కారు కొనేముందు ఈ విషయాలు మర్చిపోవద్దు

కారు కొనుగోలు అనేది చాలా మందికి ఒక కల. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో చాలా మంది కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోరు. ముఖ్యంగా మీరు మొదటిసారి కారు కొంటున్నట్లయితే, మొత్తం ఖర్చును అర్థం చేసుకోవడం చాలా అవసరం. టీవీల్లో, వార్తల్లో తరచుగా కారు ఎక్స్-షోరూమ్ ధరల గురించి మాత్రమే చెబుతారు. కానీ కారు కొనడం అనేది కేవలం ఎక్స్-షోరూమ్ ధరతో ముడిపడి ఉండదు.

పచ్చళ్ళు తెగ తింటున్నారా? అయితే ఈ రోగాలు పక్కా.. రాసుకోండి!

పోషకాహార నిపుణులు పచ్చళ్ళలో అధిక సోడియం మరియు పరిరక్షకాలు వల్ల ఆరోగ్య ప్రమాదాలను హైలైట్ చేస్తున్నారు. సురక్షితమైన వినియోగానికి మితిమీరిన వినియోగం మరియు లేబుల్ తనిఖీలు అవసరం.

హెల్త్ కు మంచిదని చెప్పి రోజూ కోడిగుడ్డు తీసుకుంటున్నారా?

బరువు తగ్గడానికి మొత్తం గుడ్లు మరియు గుడ్డు తెల్లసొన యొక్క ప్రయోజనాలను అన్వేషించండి. మీ ఆరోగ్య లక్ష్యాలు మరియు పోషక అవసరాలను మద్దతు ఇస్తున్న ఎంపికను కనుగొనండి.
Advertisement

బీఎండబ్ల్యూ బైకులపై ఏకంగా రూ. 92,000 ఆదా

బీఎమ్‌డబ్ల్యూ మోటరాడ్ ఇండియాలో తన G310RR సూపర్‌స్పోర్ట్ బైక్, C400 GT మ్యాక్సీ-స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో ఈ ధరల తగ్గింపును ప్రకటించారు. 350సీసీ కంటే తక్కువ కెపాసిటీ గల టూవీలర్స్‌పై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించడంతో ఈ రెండు మోడల్స్ భారత మార్కెట్లో మరింత అందుబాటులోకి వచ్చాయి. ఈ తగ్గింపుల వివరాలు, మోడల్స్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.

కొత్త టీవీఎస్ జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది

భారతీయ మార్కెట్లో గేర్‌లెస్ స్కూటర్‌లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. హోండా యాక్టివా (Honda Activa), టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter) వంటి మోడల్స్ ప్రతి నెలా లక్షల్లో అమ్ముడవుతూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీవీఎస్ జుపిటర్ 110 మోడల్‌కు సంబంధించి సరికొత్త స్పెషల్ ఎడిషన్ విడుదలైంది. నల్లని అందం, అప్‌డేటెడ్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ స్కూటర్ ధర, మైలేజ్, ఇతర ప్రత్యేకతలు వివరంగా చూద్దాం.

డాక్టర్లు, ఇంజనీర్ల ఫేవరెట్ కారు.. రూ.5.79 లక్షలు, 34 కి.మీల మైలేజ్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) ఎప్పటినుంచో భారతీయ మార్కెట్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు గడించింది. సాదాసీదా డిజైన్, విశాలమైన ఇంటీరియర్, మైలేజ్‌ ఫ్రెండ్లీ ఇంజిన్‌, విశ్వసనీయమైన మారుతి సర్వీస్ నెట్‌వర్క్‌ కారణంగా ఈ కారు మిలియన్లాది కుటుంబాల ఫ్యామిలీ కార్గా నిలిచింది. దీని పెర్ఫామెన్స్‌కు దేశంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రధానంగా డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ కారును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే కాలానికి అనుగుణంగా మారుతూ మరింత ఆధునిక రూపకల్పనతో, వినియోగదారుల కోసం డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తున్నా, ఈసారి అమ్మకాల గ్రాఫ్‌లో మాత్రం కొంత వెనుకంజ వేసింది.

పొట్ట కొవ్వు తగ్గించి స్లిమ్ చేసే సూపర్ సూప్స్ ఇవే!

బొజ్జ కొవ్వును తగ్గించడానికి మరియు మీ బరువు తగ్గింపు ప్రయాణాన్ని మద్దతు ఇవ్వడానికి తక్కువ క్యాలరీలు ఉన్న కానీ పోషకాలు అధికంగా ఉన్న ఐదు భారతీయ సూప్స్‌ను కనుగొనండి.

మహీంద్రా కారు కొనుగోలు దారులకు పండగే

భారత మార్కెట్లో మహీంద్రా XUV700కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఎస్‌యూవీ ఇప్పుడు కొనుగోలుదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. పెద్ద ఎస్‌యూవీలపై జీఎస్టీ, కాంపెన్సేషన్ సెస్ తగ్గింపుల తర్వాత, మహీంద్రా XUV700 ధరలు రూ.1.43 లక్షల వరకు తగ్గాయి.

కోటిన్నర కారులో వెళ్తూ తమన్నా చేసిన పనికి నెటిజన్లు ఫిదా

ఇండియా సినిమా ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటన, అందంతో టాప్ హీరోయిన్‎గా వెలుగొందుతున్న తమన్నా భాటియాకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మిల్కీ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తమన్నా ఒక అత్యంత ఖరీదైన లగ్జరీ కారులో ప్రయాణిస్తూ ఆమె తనలో ఉన్న దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ జోరు ఆగట్లేదు

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) భారతీయ మార్కెట్లో SUV లవర్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తోంది. ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు లగ్జరీ లుక్ కలగలిపిన ఈ కారు వినియోగదారులను ఆకర్షిస్తోంది. తాజాగా విడుదలైన సేల్స్ రిపోర్ట్ ప్రకారం, హైరైడర్ డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టమవుతోంది. 2025 ఆగస్టు నెలలోనే టయోటా ఈ SUVని 9,854 యూనిట్ల డెలివరీలు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో అంటే 2024 ఆగస్టులో కేవలం 4,385 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. అంటే, కేవలం ఒక సంవత్సరంలోనే అమ్మకాల వృద్ధి 124.52 శాతం వరకు పెరిగిందని అర్థం.

కోట్లు విలువ చేసే కారులో పిడకలా ?

భారతీయులకు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లంటే ఎంతో కోపం ఉండేది. ఇప్పుడు ఆ కోపం వారి కార్లపై చూపిస్తున్నారా? ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తోంది. సాధారణంగా కోట్లాది రూపాయల ఖరీదు చేసే ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు వంటి సంపన్నులు తమ ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు. కానీ, భారతదేశంలో డిఫెండర్ కారును ఆవు పేడ పిడకలు తీసుకెళ్లడానికి కూడా వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Advertisement

ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్.. అయినా సేల్స్‌లో దెబ్బతిన్న SUV!

భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త బ్రాండ్లు అడుగుపెడుతున్నా, పాత బ్రాండ్లు పోటీని తట్టుకుని నిలబడుతున్నా, ప్రతి కంపెనీకి మార్కెట్‌లో నిలదొక్కుకోవడం సవాల్‌గానే ఉంటుంది. ఆ క్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీదారు సిట్రోయెన్ (Citroën) కూడా కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్‌లో తన వాహనాలను అందిస్తోంది. స్టైలిష్ డిజైన్, యూరోపియన్ ఫీల్, ప్రీమియం లుక్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ కంపెనీకి అభిమానులు ఏర్పడ్డారు. అయితే, ఆగస్టు నెల ముగిసిన వెంటనే వెలుగులోకి వచ్చిన తాజా సేల్స్ రిపోర్ట్ మాత్రం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా చేసింది. సిట్రోయెన్ తన అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రీమియం SUV C5 ఎయిర్‌క్రాస్‌ (C5 aircross)కు సంబంధించిన సేల్స్ వివరాలను ప్రకటించింది.

స్కోడా నయా మోడల్.. స్పీడ్ పిచ్చోళ్లకు కిక్కిచ్చే కారు

భారతీయ రోడ్లపై స్పీడు, స్టైల్‌ను మిక్స్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం స్కోడా ఒక అద్భుతమైన కారును సిద్ధం చేసింది. స్కోడా నవంబర్ 2025 నాటికి ఇండియాలో కొత్త అక్టేవియా ఆర్‌ఎస్ (Octavia RS) సెడాన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, అద్భుతమైన పర్ఫామెన్స్‎తో స్పీడ్ లవర్స్‎ను ఆకట్టుకుంటుంది. ఈ కారు ఇంజిన్, ఫీచర్లు, ధర, విడుదల తేదీ గురించి వివరంగా తెలుసుకుందాం.

లగ్జరీ కార్లతో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్న లారీ ఎల్లిసన్!

ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించడం గ్లోబల్ బిజినెస్ వర్గాలను కదిలించింది. ఎల్లిసన్ సంపద సెన్సేషన్ సృష్టించేలా 101 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8.8 లక్షల కోట్లు) పెరగడంతో ఆయన ఆస్తుల విలువ 393 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ గణాంకం టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ఆస్తులను దాటేసింది. ప్రస్తుతం మస్క్ వద్ద 385 బిలియన్ల ఆస్తులు ఉండగా, లారీ ఎల్లిసన్ అతనిని 8 బిలియన్ల తేడాతో అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. 81 ఏళ్ల వయసులోనూ ఒరాకిల్ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ ఎల్లిసన్ చూపిస్తున్న వ్యాపార దూరదృష్టి నిజంగా విశేషమే. ఆయన సంపదలో ఎక్కువ భాగం డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ ద్వారానే వస్తోంది.

జీఎస్టీ పుణ్యమా అని భారీగా తగ్గిన ఇన్నోవా ధర

సాధారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న కార్ల ధరలు తగ్గడం చాలా కష్టం. ఆ కోవలోనిదే టయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ కారుకు మార్కెట్లో ఉన్న డిమాండ్ వల్ల, కస్టమర్లు బతిమాలినా ఒక్క రూపాయి కూడా తగ్గించరు. కానీ ఇప్పుడు, జీఎస్‌టీ తగ్గింపు కారణంగా ఇన్నోవా క్రిస్టా ధర ఏకంగా రూ.1.80 లక్షలు వరకు తగ్గనుంది. ఈ బంపర్ ఆఫర్ గురించి, వివిధ వేరియంట్ల కొత్త ధరల గురించి, ఈ కారు స్పెషల్ ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ బైక్ కొనగానే ఐఫోన్ గెలుచుకునే ఛాన్స్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా టూవీలర్ విభాగంలో కొత్త మోడళ్లతో పాటు వినూత్నమైన ఆఫర్‌లను తీసుకొస్తూ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) తన కొత్త పథకాన్ని ప్రకటించింది. మెగా ఫెస్టివ్ ఉత్సవ్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆఫర్ స్కీమ్, పట్టణ ప్రయాణికులకు హై-ఎండ్ ఎలక్ట్రిక్ బైక్‌లను మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద వినియోగదారులు గరిష్టంగా రూ.35,000 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం కలదు. ముఖ్యంగా, ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఒబెన్ ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ షోరూమ్‌లలో అందుబాటులో ఉండటం మరింత ప్రత్యేకం.