ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు డేంజర్ లో ఉన్నట్లే - నిర్లక్ష్యం చేయద్దు..!!

నగర భారతదేశంలో అలసట ఎలా మూత్రపిండ సమస్యలను సూచించవచ్చో అన్వేషించండి. ప్రమాదాలు, నివారణ మరియు క్రమమైన ఆరోగ్య తనిఖీల ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

మారుతి విక్టోరిస్ కారుకు ఆల్టర్నేటివ్స్ ఇవే

మారుతి సుజుకి (Maruti Suzuki) నుండి కొత్త విక్టోరిస్(Victoris) కారు భారత మార్కెట్లో విడుదలైంది. మారుతి సుజుకి కొత్త, తక్కువ ధరల ఎస్‌యూవీ (SUV) అయిన విక్టోరిస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.50 లక్షలు. విక్టోరిస్ కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్లు రూ.10 లక్షల బడ్జెట్‌ను కొద్దిగా దాటినా, రూ. 10 లక్షల లోపు ధరలో పోటీగా అనేక ప్రముఖ కార్లు మార్కెట్లో ఉన్నాయి.

ధరలు తగ్గిన మారుతి మోడళ్లు.. మార్కెట్లో డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశం

దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు ఊపిరి పీల్చేలా మారిన కీలక పరిణామం ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాహనాలపై విధిస్తున్న పన్ను రేట్లను గణనీయంగా తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆటోమొబైల్ రంగంపై 28 శాతం జీఎస్టీ విధించబడుతున్నా, తాజా నిర్ణయం ప్రకారం అది కేవలం 18 శాతానికి తగ్గించబడింది. ఈ తగ్గింపు వల్ల వినియోగదారులు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి మరింత ఉత్సాహం చూపిస్తారని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. దీని ఫలితంగా ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఇప్పటికే తమ ధరలను సవరించడం ప్రారంభించాయి.

మహీంద్రా అదిరిపోయే ఆఫర్..ఈ కారు కొంటే భారీగా ఆదా

విక్రయాల పరంగా హ్యుందాయ్, టాటా మోటార్స్‌ను అధిగమించి చాలా నెలలుగా భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా మహీంద్రా అండ్ మహీంద్రా నిలిచింది. దీనికి ప్రధాన కారణం సరైన సమయంలో ప్రజలకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం, మంచి మోడళ్లను విడుదల చేయడం.
Advertisement

యువత కలల బైక్ వచ్చేసింది.. రూ.1.95 లక్షల ప్రారంభ ధరతో కొత్త మీటియర్ 350

బైకుల రారాజు అంటే అందరికి గుర్తుకు వచ్చేది రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మాత్రమే. ఈ పేరు వింటేనే ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక క్లాస్ ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి కంపెనీ నుంచి కొత్త మోడల్ వస్తే, బైక్ ప్రియులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి అంచనాల నడుమ, భారతీయ మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా అప్‌డేట్ చేసి విడుదల చేసిన మరో అద్భుతం 2025 మీటియర్ 350 (2025 Meteor 350). ఈ బైక్ రూపకల్పనలో చేసిన మార్పులు, కొత్త తరహా ఫీచర్లు చూసినప్పుడు, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన క్లాసిక్ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే ఆధునికతను ఎలా కలగలిపిందో స్పష్టంగా తెలుస్తుంది. యువతను ఆకట్టుకునేలా,అలాగే, అన్ని వయస్సుల వారికి సరిపోయేలా దీన్ని తీర్చిదిద్దారు. దీని ప్రతి అంగుళం లోయల్టీ, స్టైల్, పవర్ కలయికగా కనిపిస్తుంది.

ఇంజిన్ సీసీపై జీఎస్టీ ఆధారపడి ఉంటుందా?

మనం బైక్, స్కూటర్ లేదా కారు గురించి మాట్లాడినప్పుడు ముందుగా ఇంజిన్ కెపాసిటీ అంటే సీసీ గురించి మాట్లాడుకుంటాం. ప్రకటనల నుంచి షోరూమ్‌ల వరకు.. 100సీసీ, 350సీసీ లేదా 2000సీసీ వంటి పదాలు మనకు తరచుగా వినిపిస్తుంటాయి. అయితే, ఇంజిన్ కెపాసిటీ సీసీలో ఎందుకు కొలుస్తారు? అసలు సీసీ అంటే ఏమిటి? దానిపై పన్ను అంటే జీఎస్టీ రేటు ఎందుకు ఆధారపడి ఉంటుంది? ఈ విషయాల గురించి వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

రేంజ్ రోవర్ లాగే మలైకా కూడా ఎవర్ గ్రీన్

బాలీవుడ్ అందాల తార మలైకా అరోరా తన స్టైలిష్ లుక్, లగ్జరీ లైఫ్ స్టైల్‎తో ప్రసిద్ధి చెందారు. 1998లో వచ్చిన దిల్ సే సినిమాలోని ఛైయ్యా ఛైయ్యా పాటలో డ్యాన్స్ చేసిన తర్వాత ఆమె అదృష్టమే మారిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపించారు. ఇటీవల 51 ఏళ్ల మలైకా అరోరా కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (Range Rover Autobiography) ఎస్‌యూవీని కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అదానీ గ్రూప్‌కు కేదారనాథ్ రోప్‌వే నిర్మాణ బాధ్యతలు

అదాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సోనప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ వరకు రోప్‌వే ప్రాజెక్ట్ కోసం ఒప్పందాన్ని పొందింది, ఇది యాత్రికుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

ఒక కుటుంబంలోనే 11 ఏథర్ స్కూటర్లు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

ఇటీవలి కాలంలో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా టూవీలర్స్ విభాగంలో ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొని, దాని పనితీరుతో సంతృప్తి చెందితే, ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం కూడా అదే బ్రాండ్ స్కూటర్లను కొనడం ఒక సాధారణమైన ట్రెండ్‌గా మారింది. ఇలాంటి ఆసక్తికరమైన ఉదాహరణగానే దివాకర్ అనే వ్యక్తి కథ ప్రస్తావనలోకి వచ్చింది. ఏథర్ ఎనర్జీ ఇటీవల తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్న సమాచారం ప్రకారం, దివాకర్ ఇప్పటి వరకు మొత్తం 11 ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేశారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకే బ్రాండ్‌కి ఇంతగా ఆకర్షితుడై, వరుసగా 11 స్కూటర్లు కొనడం విశేషం.

కేవలం రూ. 10.50 లక్షలకే మారుతి అద్బుతమైన కారు

మారుతి సుజుకి ఎప్పుడూ భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన కొత్త మోడళ్లను రూపొందిస్తూ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కంపెనీ విక్టోరిస్ అనే అత్యాధునిక SUVను ఆవిష్కరించింది. ఈ కారు కేవలం డిజైన్ పరంగానే కాకుండా, భద్రతా ప్రమాణాల్లోనూ ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. తాజాగా విక్టోరిస్ SUV ప్రారంభ ధరను కంపెనీ ఎక్స్ షోరూమ్ రూ.10.50 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరతో ఇది తన సెగ్మెంట్‌లో వినియోగదారులకు పోటీగా, విలువైన ఆప్షన్‌గా నిలవనుంది. అధికారికంగా విక్రయాలు సెప్టెంబర్ 22, 2025 నుండి మొదలుకానున్నప్పటికీ, ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించడంతో ఈ కొత్త SUVపై ఆటోమొబైల్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఆగస్టు 2025లో అమ్మకాలలో మరోసారి సత్తా చాటిన బాలెనో

మారుతి సుజుకి బాలెనో (maruti suzuki baleno) ఎప్పటినుంచో దేశీయ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సొగసైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్, మంచి మైలేజ్ వంటి అంశాల వల్ల ఇది వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో పోల్చితే ప్రీమియం టచ్ కలిగిన ఈ మోడల్, మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండటం కూడా దీన్ని ప్రత్యేకంగా నిలిపింది. ఒకవైపు యూత్‌కు ఆకర్షణీయమైన లుక్, మరోవైపు కుటుంబానికి సరిపడే ప్రాక్టికాలిటీని కలగలిపినందువల్ల బాలెనో ఎప్పుడూ హాట్‌ సేలర్‌గా నిలుస్తూ వస్తోంది. తాజాగా విడుదలైన ఆగస్టు 2025 సేల్స్ గణాంకాలు కూడా ఈ విషయాన్నే రుజువు చేశాయి.

టీమిండియా కెప్టెన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ తన దూకుడు బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు.
Advertisement

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ బీపీ, డయాబెటిస్ బాధితులకు దివ్యౌషధం - ఈ జాగ్రత్తలతో..!!

భారతదేశంలో రక్తపోటు మరియు మధుమేహాన్ని నిర్వహించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా సహాయపడుతుందో అన్వేషించండి. మార్గదర్శకత్వం కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించండి.

బ్రెజ్జా, వెన్యూ, సోనెట్‌లను అధిగమించిన నెక్సాన్

దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (tata motors) ఎప్పటినుంచో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తోంది. వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా వాహనాలను అందిస్తూ, మార్కెట్లో పోటీదారులకు గట్టి సవాలు విసురుతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఈ కంపెనీకి ఉన్న పట్టుదల ప్రత్యేకం. ప్రస్తుతం దేశీయంగా SUVల క్రేజ్ పెరిగిపోతుండటంతో, టాటా మోడళ్లకు డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఇందులో నెక్సాన్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మోడల్. తాజాగా ఆగస్టు 2025లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ అమ్మకాల గణాంకాలు వెలువడగా, టాటా నెక్సాన్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. గత నెలలోనే 14,004 యూనిట్లు అమ్ముడవడంతో ఈ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

హోండా నుండి డబుల్ ఆఫర్స్

ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటంటే జీఎస్‌టీ (GST) తగ్గింపు. చిన్న కార్ల నుండి పెద్ద లగ్జరీ ఎస్‌యూవీల వరకు, భారతదేశంలో ఇప్పుడు మరింత చౌకగా లభించనున్నాయి. కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఇది ఒక రకంగా లాటరీ తగిలినట్లే. అయితే ధరలు తగ్గినా, బ్రాండ్‌లు ప్రతి నెల ఇచ్చే డిస్కౌంట్‌లను నిలిపివేస్తాయేమో అని చాలామంది ఆందోళన చెందారు. కానీ, హోండా ఈ నెల అసాధారణమైన తగ్గింపులతో తమ కార్లను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

టారిఫ్ ఎఫెక్ట్ వీరికి పెద్ద దెబ్బే..!

భారతదేశ ఐటీ రంగం గ్లోబల్ ఔట్‌సోర్సింగ్ డిమాండ్ బలహీనపడటం మరియు అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా నియామకంలో తగ్గుదలను ఎదుర్కొంటోంది.

టాటా పంచ్‌కు షాక్‌.. ఆగస్టు అమ్మకాలు 32% కిందకు పడిపోయాయి!

టాటా మోటార్స్ తయారు చేసిన పంచ్ మైక్రో SUV భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే వినియోగదారులలో మంచి పేరు తెచ్చుకుంది. చిన్న సైజులో స్టైలిష్ డిజైన్, అద్భుతమైన భద్రతా ప్రమాణాలు, అలాగే రోడ్డుపై నమ్మకమైన పనితీరుతో ఈ కారుకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడింది. అయితే, తాజాగా వెలువడిన అమ్మకాల గణాంకాలు ఈసారి పంచ్‌కు పెద్దగా అనుకూలంగా లేకపోవడం గమనార్హం. 2025 ఆగస్టు నెలలో టాటా మోటార్స్ కేవలం 10,704 పంచ్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సంఖ్యను గత ఏడాది అదే నెలలోని అమ్మకాలతో పోలిస్తే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఎందుకంటే 2024 ఆగస్టులో టాటా పంచ్ 15,643 యూనిట్లు అమ్ముడైంది. అంటే ఒక్క సంవత్సరంలోనే అమ్మకాలలో దాదాపు 32 శాతం క్షీణత చోటుచేసుకుంది.

రూ.1.64 లక్షల వరకు తగ్గింపు.. ఈ టాప్ 5 కార్లను మిస్ అవ్వకండి!

జీఎస్‌టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా వంటి అనేక వాహన తయారీదారులు భారతీయ మార్కెట్‌లో తమ కార్ల ధరలను భారీగా తగ్గించారు. ఇందులో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, కాంపాక్ట్ ఎస్‌యూవీ, మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో సహా ఇతర ప్రముఖ మోడల్స్ ఉన్నాయి.

జీఎస్టీ రేట్లు తగ్గడంతో టైర్ల ధరల కోత.. CEAT అధికారిక ప్రకటన

భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఆటోమొబైల్ రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో వినియోగదారులకు నేరుగా లాభం చేకూర్చే ప్రయత్నంలో ప్రముఖ టైర్ తయారీదారు CEAT లిమిటెడ్ ముందడుగు వేసింది. తమ మొత్తం టైర్ శ్రేణిపై ధరల తగ్గుదలను అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ తగ్గింపు వల్ల కార్లు, బైకులు, కమర్షియల్ వాహనాలు, అలాగే వ్యవసాయ యంత్రాలు నడిపే వినియోగదారుల వరకు అందరికీ ప్రయోజనం కలుగనుంది. సీఈఏటీ తెలిపిన ప్రకారం, కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుండి అధికారికంగా అమలులోకి రానున్నాయి. అంటే, ఆ తేదీ తరువాత డీలర్లు, ఎండ్ యూజర్లకు తక్కువ ధరలోనే టైర్లు లభ్యం అవుతాయి. దీనివల్ల కేవలం వినియోగదారులే కాదు, కంపెనీ సేల్స్ నెట్‌వర్క్‌కి కూడా ఒక సానుకూల వాతావరణం ఏర్పడనుంది.

ఎస్యూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. జీఎస్‌టీ తగ్గింపుతో అద్భుతమైన ఆఫర్స్

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుండి జీఎస్‌టీ పన్ను తగ్గింపును అమలు చేయనుంది. దీనివల్ల వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా కంప్లీట్ సైజు ఎస్‌యూవీ కార్ల ధరలు లక్షల్లో తగ్గుతాయి. ఈ తగ్గిన ధరతో ఒక చిన్న కొత్త కారునే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఏయే కార్ల ధరలు ఎంత తగ్గుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Advertisement

రూ.10 లక్షల లోపు టాప్ సెల్లింగ్ కార్లు ఇవే

ఆగస్టు 2025 అమ్మకాల డేటా ప్రకారం.. భారతీయ కార్ల మార్కెట్‌లో రూ.10 లక్షల లోపు ధర ఉన్న వాహనాలదే పైచేయిగా ఉంది. ముఖ్యంగా, భారతదేశంలోనే నంబర్ వన్ కార్ల కంపెనీ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) మార్కెట్‌లో తన లీడర్‌షిప్‌ను నిలబెట్టుకుంటోంది. అదే సమయంలో టాటా (Tata), హ్యుందాయ్ (Hyundai) కంపెనీల కార్లు కూడా ఈ ధరల విభాగంలో మంచి అమ్మకాలను నమోదు చేశాయి. గత ఆగస్టు నెలలో రూ.10 లక్షల లోపు ఎక్కువగా అమ్ముడైన టాప్ 6 కార్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

పండుగల ముందు స్విఫ్ట్ అమ్మకాలు డౌన్

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) అనే పేరు వినగానే మనసులో ఒక ప్రత్యేకమైన అనుబంధం కలుగుతుంది. ఈ కారును భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తిస్తారు. ఆకర్షణీయమైన డిజైన్, ప్రాక్టికల్ ఫీచర్లు, మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు ఇవన్నీ కలిసి స్విఫ్ట్‌కి ప్రత్యేకమైన స్థానం తీసుకువచ్చాయి. ఈ కారు ఎప్పటిలాగే మార్కెట్లో బలమైన అమ్మకాలను కొనసాగిస్తున్నప్పటికీ, 2025 ఆగస్టు నెలలో వచ్చిన గణాంకాలు కొంచెం వేరే కథ చెబుతున్నాయి. ఈ నెలలో మొత్తం 12,385 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో, అంటే 2024 ఆగస్టులో, 12,844 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, కేవలం ఒకే నెలలోనే గత సంవత్సరం కంటే తక్కువ సంఖ్యలో విక్రయాలు నమోదయ్యాయి.

ప్రధాని మోడీ పర్యటన వేళ బిగ్ షాక్.. అస్సాంలో భారీ భూకంపం !

సెప్టెంబర్ 14, 2025న ఈశాన్య భారతదేశంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది, ప్రాణనష్టం లేదా నష్టం గురించి తక్షణ నివేదికలు లేవు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు.

కార్లు, బైకులపై GST తగ్గింపు.. మధ్యతరగతి ప్రజలకు డబుల్ గిఫ్ట్!

భారతదేశంలో మధ్యతరగతి వర్గం ఎప్పటినుంచో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాగా నిలుస్తూ వస్తోంది. దేశ జనాభాలో పెద్ద భాగం ఈ వర్గానిదే. రోజువారీ అవసరాలు, లైఫ్‌స్టైల్, ఖర్చులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. అందుకే వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ధరల విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. కార్లు, బైకులు, స్కూటర్లు వంటి వాహనాలు మధ్యతరగతి కుటుంబానికి కేవలం సౌకర్యమే కాకుండా, ఒక కలల సాధనంగా మారతాయి. కానీ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల తమ కలలను వాయిదా వేసుకునే పరిస్థితి చాలా మందికి ఎదురయ్యేది. ఇలాంటి సమయంలో వస్తువులు, సేవల పన్ను (GST) తగ్గింపు రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఊరటను కలిగించింది.

విక్టోరిస్ SUV ధరను వెల్లడించబోతున్న మారుతి

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తూ, తన స్థాయిని మరింత బలపరుస్తూ వస్తోంది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా డిజైన్‌, టెక్నాలజీ, ఫీచర్స్ అన్నింటినీ సమన్వయం చేస్తూ కొత్త వాహనాలను పరిచయం చేయడంలో కంపెనీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో తాజాగా విక్టోరిస్ SUVను ఆవిష్కరించడం ద్వారా మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ మోడల్‌లో అందించిన డిజైన్‌ ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉండగా, ఎక్స్‌టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు ప్రతిదీ లేటెస్ట్ లుక్‌ను ప్రతిబింబిస్తుంది. ఒక SUVలో కావలసిన ప్రతి ఫీచర్‌ను దాదాపుగా సమకూర్చి, మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అందుబాటు ధరలో అందించాలన్న ఆలోచనతో మారుతి ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది.