మళ్లీ తన భద్రతను నిరూపించుకున్న ఆల్ట్రోజ్.. BNCAPలో ఫుల్ 5 స్టార్ రేటింగ్!
ఆటోమొబైల్స్
- 1 year, 16 days ago
టాటా మోటార్స్(Tata Motors) నుండి కొత్త కార్లను కొనుగోలు చేసే విషయంలో వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే అంశం భద్రత. అందుకే టాటా మోడళ్లు వినియోగదారులలో ఒక ప్రత్యేకమైన నమ్మకాన్ని కలిగించాయి. వీటిలో టాటా ఆల్ట్రోజ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భారత మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచే ఇది అత్యంత ప్రజాదరణ పొందిన హాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. స్టైలిష్ డిజైన్, ఫీచర్లు మాత్రమే కాకుండా, భద్రత పరంగా కూడా ఆల్ట్రోజ్ ఎప్పుడూ ఒక బెంచ్‌మార్క్‌గా గుర్తించబడింది. ఇటీవలే దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్‌డేటెడ్ లుక్, కొత్త ఫీచర్లు, మరింత బలమైన క్వాలిటీతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది.