మారుతి ఆల్టో K10 ధర కేవలం రూ.3.70 లక్షలు!
ఆటోమొబైల్స్
- 1 year, 14 days ago
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన GST కౌన్సిల్ సమావేశం ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక పెద్ద ఊపిరి పోసినట్లయింది. చాలా కాలంగా ఆటో కంపెనీలు, డీలర్లు, వినియోగదారులు ఎదురుచూస్తున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఆ సమావేశంలో వెలువడింది. ఇప్పటి వరకు వాహనాలపై 28 శాతం పన్ను విధించబడుతుండగా, తాజాగా దానిని 18 శాతం వరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వాహన మార్కెట్‌లో మంచి ఉత్సాహాన్ని రేకెత్తించింది. దీని ప్రభావం వెంటనే దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకిపై కనిపించింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్న ఈ సంస్థ, కొత్త GST రేట్ల ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది.