పండుగ బహుమతిగా మారుతి సుజుకి కొత్త SUV విక్టోరిస్

మారుతి సుజుకి భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తూ వినియోగదారుల అభిరుచులను బట్టి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ వస్తుంది. తాజాగా, దేశంలోనే అతిపెద్ద ఆటోమేకర్‌గా పేరుగాంచిన ఈ కంపెనీ, విక్టోరిస్ (Victoris) అనే సరికొత్త కాంపాక్ట్ SUVను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ మోడల్ పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించబడింది. కొత్త కారు కొనాలనుకునే కస్టమర్లను ఆకట్టుకోవడమే కాకుండా, పోటీదారులకు గట్టి సవాలు విసరాలనే లక్ష్యంతో మారుతి ఈ వాహనాన్ని ప్రవేశపెట్టింది. విక్టోరిస్ SUVలో డిజైన్ నుండి సేఫ్టీ వరకు ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టబడింది. ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్, ఆకట్టుకునే లుక్స్, కస్టమర్లను కట్టిపడేసే రీతిలో తీర్చిదిద్దబడ్డాయి.

మరో కొత్త బైక్‌తో మార్కెట్‌లోకి హీరో.

భారతీయ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కొత్త బైక్‌లను విడుదల చేస్తోంది. ప్రీమియం సెగ్మెంట్‌లో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే హీరో కంపెనీ కొద్ది రోజుల క్రితం సరికొత్త అడ్వెంచర్-స్టైల్ స్కూటర్ హీరో జూమ్ 160ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

టాటా మోటార్స్ బలమైన ఆయుధం ఇదే.. సేల్స్‌లో అదరగొట్టిన ఈవీలు

టాటా మోటార్స్ (tata motors) భారతదేశంలో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆటోమొబైల్ దిగ్గజం. అయితే, తాజాగా విడుదలైన ఆగస్టు 2025 అమ్మకాల గణాంకాలు కొంత ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టాయి. ప్యాసింజర్ కార్ల విభాగంలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. అయితే, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మాత్రం తన వేగాన్ని నిలబెట్టుకుంది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతులను కలుపుకుని చూస్తే, టాటా మోటార్స్ ఆగస్టు నెలలో మొత్తం 43,315 ప్యాసింజర్ కార్లను రవాణా చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 44,486 యూనిట్లతో పోలిస్తే సుమారు 1,171 వాహనాలు తక్కువ.

ఇకపై ఈవీలను కొనాలంటే ఎక్స్‎ట్రా రూ.7లక్షలు పెట్టాల్సిందే

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే, ఇప్పుడు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడం మరింత ఖరీదైనదిగా మారవచ్చు. ఒక నివేదిక ప్రకారం.. ఒక ట్యాక్స్ ప్యానెల్ రూ. 40 లక్షలు (సుమారు 46,000 డాలర్లు) కంటే ఎక్కువ ధర ఉన్న ఈవీలపై జీఎస్టీని పెంచాలని సూచించింది. ఇది టెస్లా, మెర్సిడెస్-బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ వంటి విదేశీ కంపెనీల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.
Advertisement

ఒకే ఏడాదిలో 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు.. తమిళనాడు టాప్‌లో!

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలను కబళిస్తున్నాయి. సంఖ్యల రూపంలో చూస్తే ఇవి కేవలం గణాంకాలు అనిపించవచ్చు, కానీ వాటి వెనుక వేల కుటుంబాల కలలు, ఆశలు, జీవితాలు చెదిరిపోతున్నాయి. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం, హెల్మెట్ - సీట్‌బెల్ట్ వంటి ప్రాథమిక భద్రతా నియమాలను విస్మరించడం ఈ విషాదానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం పేపర్ తెరిస్తే రోడ్డు ప్రమాద వార్త తప్పక కనిపించడం సహజమైపోయింది. ఒక కుటుంబానికి ప్రధాన బలమైన వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే, అది ఆ కుటుంబానికి కోలుకోలేని విషాదాన్ని మిగుల్చుతుంది. చిన్న పిల్లల విద్య, వృద్ధుల సంరక్షణ, కుటుంబ భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి.

ఇక మార్కెట్‌లో ప్రత్యర్థులకు చుక్కలే.. టాటా పంచ్ రెడీ

టాటా మోటార్స్ ఎంట్రీ-లెవల్ మోడల్, చిన్న కారు అయిన టాటా పంచ్, దాని పేరుకు తగ్గట్టుగానే ప్రత్యర్థులకు ఒక అదిరిపోయే పంచ్ ఇచ్చింది. సిఎన్‌డి పవర్‌ట్రెయిన్‌తో వచ్చిన ఈ కారు నిజంగానే మిగతా కార్ల తయారీదారులకు ఒక సవాలు విసిరింది.

ఆగస్టులో మరోసారి దూసుకెళ్లిన మారుతి సుజుకి

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దశాబ్దాలుగా ఈ బ్రాండ్ సాధించిన విజయాలు, కస్టమర్ల విశ్వాసం, విస్తృతమైన మోడల్ లైనప్ అన్నీ కలిపి దీన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపాయి. దేశంలోనే అతిపెద్ద ఆటోమేకర్‌గా మారుతి సుజుకి ఎప్పటికీ ఒక ప్రమాణంగా నిలుస్తోంది. ఆగస్టు 2025కి సంబంధించిన తాజా అమ్మకాల గణాంకాలు విడుదల కావడంతో మళ్లీ ఒకసారి కంపెనీ తన శక్తి ఎంత గొప్పదో చూపించింది. గత 31 రోజుల్లో ఈ బ్రాండ్ మొత్తం 1,80,683 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 1,81,782 యూనిట్లతో పోలిస్తే స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, ఇది పెద్దగా ఆందోళన కలిగించే విషయం కాదు.

ఈ కారుతో రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్నే చూస్తారు

కొత్త కారు అనగానే మనలో చాలా మందికి దాని లుక్, ఇంజిన్, మైలేజ్ మీద మాత్రమే దృష్టి ఉంటుంది. అయితే, కొన్ని కార్లు మన అంచనాలకు మించి ఆశ్చర్యపరుస్తాయి. మార్కెట్లో విడుదలయ్యే చాలా కార్లు ఒకేలా అనిపించినా, ఎంజి మోటార్స్ నుండి వచ్చిన ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ మాత్రం తన అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీన్ని ఎందుకు బ్లాక్‌బస్టర్ ఎస్‌యూవీ అని పిలుస్తున్నారో.. దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

మనతో ఎన్ని గొడవలున్నా చైనా కంపెనీ కార్లను తెగ కొనేస్తున్నారు

చైనాకు చెందిన BYD (Build Your Dreams) ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ. ఈ కంపెనీ దేశీయ మార్కెట్‌లో అనేక రకాల కార్లను విజయవంతంగా అమ్ముతోంది. ఈ కార్లు మంచి డిజైన్‌తో పాటు ఎన్నో ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. అందుకే కస్టమర్లు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా BYD కంపెనీ భారతదేశంలో ఒక కొత్త రికార్డును నెలకొల్పింది.

10 నెలలుగా టాప్ EVగా MG విండ్సర్.. ఆగస్టు 2025 సేల్స్ రిపోర్ట్

భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ కార్ల తయారీదారు JSW MG మోటార్ ఇండియా (Jsw Mg Motor India) మరోసారి తన అమ్మకాలతో హైలైట్ అవుతోంది. తాజాగా ఆగస్టు నెల ముగియగానే కంపెనీ అధికారికంగా తన విక్రయాల గణాంకాలను ప్రకటించింది. ఈ వివరాలు పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని కలిగించేలా ఉన్నాయి. నివేదికల ప్రకారం, MG మోటార్ ఆగస్టు 2025లో మొత్తం 6,578 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ సంఖ్య కేవలం గణాంకం మాత్రమే కాదు, గత సంవత్సరం ఇదే కాలంలో అమ్ముడైన 4,323 యూనిట్లతో పోలిస్తే దాదాపు 52.16 శాతం వృద్ధిని సూచిస్తుంది. అంటే, కేవలం ఒక సంవత్సర కాలంలోనే MG బ్రాండ్ దేశీయ మార్కెట్లో తన ప్రాచుర్యం, డిమాండ్ ఎంతగానో పెరిగిందని ఇది నిరూపిస్తోంది.

హ్యుందాయ్ 10వ వార్షికోత్సవ వేడుక.. ప్రజల కోసం ప్రత్యేక క్రెటా కింగ్ కార్స్

హ్యుందాయ్ (Hyundai) ఎప్పటి నుంచో భారతీయుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కార్ల బ్రాండ్. ముఖ్యంగా SUV విభాగంలో తన క్రెటా మోడల్‌తో ఒక చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో, క్రెటా 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూందాయ్ కొత్త ప్రత్యేక ఎడిషన్ మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక సిరీస్‌లో క్రెటా కింగ్ (CRETA king), కింగ్ లిమిటెడ్ ఎడిషన్ (CRETA King Limited Edition), కింగ్ నైట్ ఎడిషన్ (CRETA King Knight) మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఇప్పటికే ఉన్న వేరియంట్‌లకు మరింత విలువ చేకూరేలా కొత్త ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేసింది.

దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడిన మహీంద్రా కారు

రోడ్డు ప్రయాణాలు ఇప్పుడు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అయితే రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే కారు కొనేటప్పుడు దాని లుక్, మైలేజ్ మాత్రమే కాకుండా, సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
Advertisement

టెస్లా ఇండియాలో షాక్.. మోడల్ Yకి కేవలం 600 బుకింగ్స్ మాత్రమే!

భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం అతిపెద్ద గమ్యస్థానంగా మారిపోతోంది. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, పర్యావరణ కాలుష్యం అదుపులో ఉంచే అవసరం పెరిగిన నేపథ్యంలో, ఈవీలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. దేశీయ కంపెనీలు అయిన టాటా, మహీంద్రా మొదలైనవి ఇప్పటికే తమ ఫోకస్‌ను ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్లించాయి. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈవీ కంపెనీలు కూడా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రత్యేకంగా టెస్లా కంపెనీపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రాచుర్యం పొందేలా చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించారు.

5 లక్షల కుటుంబాల కల నెరవేర్చిన టీవీఎస్

తమిళనాడుకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motor), ఇటీవల జరిగిన ఆగస్టు నెల అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే నెలలో ఏకంగా 5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలను అమ్మి, తమ చరిత్రలోనే అత్యుత్తమ రికార్డును నమోదు చేసింది. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా టీవీఎస్ మోటార్స్ చూపించిన ఈ అద్భుతమైన వృద్ధి, అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు వస్తున్న వాహనాలపై అలర్ట్!

దేశంలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారతదేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. వాయు కాలుష్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రభావితమైన నగరాల్లో ఢిల్లీ ఎప్పుడూ అగ్రస్థానంలోనే నిలుస్తోంది. దీంతో అక్కడ గాలి నాణ్యత మరింత దిగజారిపోతోంది. పలు ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అయితే అవి అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ప్రభుత్వం మరింత కఠినమైన నిర్ణయాలను తీసుకుంది. వాటిలో ముఖ్యంగా 15 ఏళ్లు దాటిన కార్లు, ట్యాక్సీలను పూర్తిగా రోడ్లపై నడవనీయకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా డీజిల్‌ కార్లను ఢిల్లీలో పూర్తిగా బ్యాన్ చేశారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహిస్తున్నారు.

ఒక్క నెలలోనే రికార్డు సేల్స్.. టెన్షన్ పడుతున్న టీవీఎస్, బజాజ్!

బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ (Ather Energy), ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (Two Wheeler) తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. దేశీయంగా అనేక ఈ-స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి చాలా చక్కటి డిజైన్, అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. కస్టమర్లు కూడా పోటీ పడి కొనుగోలు చేశారు. దానికి సాక్ష్యంగా ఈ 2025 ఆగస్టులో కంపెనీ స్కూటర్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆ వివరాలు ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

అందరి కోసం సిద్ధమవుతున్న మారుతి న్యూ ఎస్కుడో

భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను అందిస్తూ, ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki). దేశంలో మధ్యతరగతి కుటుంబాల నుండి ప్రీమియం వర్గం వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే కార్లను అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు, మైలేజ్, డిజైన్ అప్‌డేట్‌లతో తన కార్లను రీఫ్రెష్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా, మారుతి సుజుకి మరో కొత్త అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న SUVల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, కొత్త మిడ్-సైజ్ కాంపాక్ట్ SUV ఎస్కుడో (Escudo)ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమాచారం ప్రకారం, ఈ కారు సెప్టెంబర్ 3, 2025న అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.

31 రోజుల్లో 60,000 మంది ఈ కంపెనీ కారును కొనుగోలు చేశారు

హ్యుందాయ్ కంపెనీ గత ఆగస్టు నెలలో మొత్తం 60,501 వాహనాలను విక్రయించి భారీ వృద్ధిని సాధించింది. ఇందులో 44,001 వాహనాలు దేశంలో అమ్ముడయ్యాయి. 16,500 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ఈ లక్షణాలు ఉంటే- దానిమ్మ జోలికి అస్సలు వెళ్లొద్దు

దానిమ్మ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను మరియు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులతో ఉన్న వ్యక్తుల కోసం సురక్షిత వినియోగానికి అవసరమైన జాగ్రత్తలను తెలుసుకోండి.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కంపెనీ కార్లే కావాలంటున్నారు

పండుగ సీజన్‌కు గేట్‌వే‎గా ఆగస్టు నెల నిలిచింది. పండుగ సీజన్ స్టార్ట్ కావడంతో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేసి లేదా బుక్ చేసి ఉంటారు. ఈ నేపథ్యంలో గత నెల అమ్మకాల గణాంకాలను తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది. టయోటా కిర్లోస్కార్ మోటార్ (TKM) 2025 ఆగస్టు నెల అమ్మకాల నివేదికను ఇప్పుడు విడుదల చేసింది.
Advertisement

ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ పెంపు? కంపెనీలలో ఆందోళన

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు చాలా వేగంగా పెరుగుతోంది. అయితే, ఒక కొత్త ప్రతిపాదన మొత్తం ఆటో పరిశ్రమను ఆందోళనలోకి నెట్టింది. జీఎస్టీ రేట్లపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని సూచించింది. జీఎస్టీ కౌన్సిల్ ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఈ చర్చ ఇప్పటికే కంపెనీలు, వినియోగదారుల ఆలోచనపై ప్రభావం చూపడం మొదలుపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పు.. ప్రభుత్వ E20 ఇంధన విధానానికి గ్రీన్ సిగ్నల్!

ఇండియాలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం తీసుకున్న E20 ఇంధన విధానంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. ఈ విధానాన్ని సవాలు చేస్తూ అక్షయ్ మల్హోత్రా అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే E20 ఇంధన విధానంపై సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తేలికగా కొట్టివేసింది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం వంటి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న చర్యలు సముచితమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం, ఈ విధానంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని తెలిపింది.

రేస్‌ట్రాక్‌కి పర్ఫెక్ట్‌గా, రోడ్‌పై స్టైల్‌గా.. కవాసకి నింజా ZX-6R స్పోర్ట్స్ మోడల్ లాంచ్!

కవాసకి (kawasaki) అనే పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ లవర్స్ మనసులో ప్రత్యేకమైన ఉత్సాహం కలుగుతుంది. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకుపోయే స్పీడ్ బీష్ట్‌గా, రోడ్డుపై అందరినీ ఆకట్టుకునే లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్‌గా కవాసకి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భారతదేశంలో కూడా ఈ కంపెనీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా యువత, స్పోర్ట్స్ బైక్‌లకు ఆసక్తి ఉన్నవారు కవాసకిని కలల బైక్‌గా భావిస్తారు. ఈ క్రమంలో తాజాగా కంపెనీ తన మరో సరికొత్త అద్భుతాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే కొత్త కవాసకి నింజా జెడ్‌ఎక్స్-6ఆర్ (KAWASAKI NINJA Zx 6r). దీనిని చూసిన వెంటనే దాని డిజైన్, స్టైల్ మనసును దోచేస్తాయి. రేసింగ్ హార్ట్‌బీట్ ఉన్న వారందరికీ నచ్చేలా ఈ బైకును డిజైన్ చేశారు.

రూ.10లక్షల లోపు కీ-లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ కార్లు ఇవే

కొన్నేళ్లుగా ఆధునిక కార్లలో తప్పనిసరిగా ఉన్న అనేక అంశాలు కనుమరుగై, వాటి స్థానంలో కొత్త ఫీచర్లు వచ్చాయి. గత కొన్నేళ్లుగా కార్లలో అందుబాటులో ఉన్న ఫీచర్లలో కీ-లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ ముఖ్యమైనవి. కీ-లెస్ ఎంట్రీ వల్ల తాళం చెవితో డోర్ తెరవడానికి బదులుగా డిజిటల్ కీతో సులభంగా కారులోకి ఎంటర్ అవ్వొచ్చు. అదే సమయంలో పుష్-బటన్ స్టార్ట్ ఫీచర్ వల్ల ఇంజిన్‌ను ఒక బటన్ నొక్కడం ద్వారా స్టార్ట్ చేయవచ్చు. రూ. 10 లక్షల లోపు ధరలో ఈ రెండు ఫీచర్లను అందించే కార్లు ఏవో చూద్దాం.

అశ్వ‌గంధ టీ తో రెట్టింపు శక్తి, ఈ సమస్యలు దూరం..!!

అశ్వగంధ టీ ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతత లక్షణాలతో మరియు మెరుగైన మానసిక స్పష్టతతో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకోండి.