అశ్వ‌గంధ టీ తో రెట్టింపు శక్తి, ఈ సమస్యలు దూరం..!!

అశ్వగంధ టీ ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతత లక్షణాలతో మరియు మెరుగైన మానసిక స్పష్టతతో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకోండి.

హైబ్రిడ్ కార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? అయితే ఇది చదవండి

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. పర్యావరణ సమస్యలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ రెండు కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇకపై సాధారణ ఇంజిన్ కార్లకంటే హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యల్లో కూడా హైబ్రిడ్ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఇప్పటికే టయోటా, హోండా వంటి కంపెనీలు భారత మార్కెట్‌లో హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టాయి. వీటి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. వినియోగదారులు ఫ్యూయల్ పొదుపు + భవిష్యత్ టెక్నాలజీ కలయికగా హైబ్రిడ్ కార్లను ఎంచుకుంటున్నారు. భారతదేశం లాంటి పెరుగుతున్న మార్కెట్‌లో, రాబోయే సంవత్సరాల్లో హైబ్రిడ్ కార్లే కీలకమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ కార్లు ఎలా పనిచేస్తాయో ఒకసారి తెలుసుకుందాం.

రూ.1,299కే ఫ్లైట్ టికెట్.. ఎయిర్ ఇండియా ‘పేడే సేల్’ ఆఫర్ !

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దేశీయ టికెట్లు ₹1,299 నుండి మరియు అంతర్జాతీయ టికెట్లు ₹4,876 నుండి ప్రారంభమయ్యే పరిమిత కాలపు టికెట్ అమ్మకాన్ని ప్రకటించింది. ఇప్పుడే బుక్ చేయండి!

ఒక్క నిమిషంలో ఫాస్టాగ్ పాస్ యాక్టివేట్ చేస్కోండి

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఆగస్ట్ 15న ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass)ను ప్రారంభించింది. ఈ పాస్ ద్వారా ప్రైవేట్ వాహనాల యజమానులు కేవలం రూ.3,000తో 200 ట్రిప్పులు (టోల్ క్రాసింగ్) చేయవచ్చు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ దేశంలోని అన్ని నేషనల్ హైవేలు, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై పని చేస్తుంది.
Advertisement

తెల్లటి కారు తీసుకుంటే లాభమే గాని నష్టమేం ఉండదు

కొత్త కారు కొనే సమయంలో కలర్ ఎంచుకోవడం అనేది నిజంగా ఒక తలనొప్పిగా మారిపోతుంది. ఈ రోజుల్లో ఆటోమొబైల్ కంపెనీలు విభిన్నమైన కలర్ ఆప్షన్లు అందిస్తుండటంతో, ఏది ఎంచుకోవాలో అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కారు కలర్ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో పలు సమస్యలతోనూ సంబంధం ఉంటుంది. సరైన కలర్ ఎంచుకోకపోతే పునఃవిక్రయం సమయంలో దాని విలువ తగ్గిపోవచ్చు. అలాగే కొన్ని కలర్ కార్లు నిర్వహణ ఖర్చులు ఎక్కువగా తీసుకోవచ్చు. చిన్న చిన్న గీతలు, మురికి ఎక్కువగా కనబడే రంగులు మీకు అదనపు ఇబ్బందులు కలిగించవచ్చు. అయితే మీకు ఇక్కడ ఆక్చర్యకర విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రజలు ఎంచుకునే రంగు తెలుపు.

ప్రపంచంలోని టాప్ 10 ఆటో బ్రాండ్ల జాబితా నుండి నిస్సాన్ అవుట్

ప్రపంచంలోని అత్యుత్తమ కార్ల తయారీ సంస్థల్లో నిస్సాన్ ఒకటి. జపాన్‌కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో రెండు కార్లను మాత్రమే విక్రయిస్తున్నప్పటికీ గల్ఫ్‌ దేశాలలో నివసించే వారిని ఈ కంపెనీ గురించి అడిగితే వారికి నిస్సాన్ అంటే చాలా ఇష్టం.

ఒక్కసారి చార్జ్ చేస్తే 355 కి.మీ. వరకు ప్రయాణం

కియా సైరోస్ (Kia Syros) భారత ఆటోమొబైల్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి వినియోగదారుల మన్ననలు పొందుతూ, అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. గత ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ప్రస్తుతం ఐసీఈ ఇంజిన్‌ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. కానీ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, కియా తన అత్యంత విజయవంతమైన మోడల్‌ సైరోస్‌కి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కియా సైరోస్ EV గురించి ఇప్పటికే వినియోగదారుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే, ఈ వాహనం భారతీయ మార్కెట్లో ప్రవేశిస్తుందన్న వార్తలు ఆటోమొబైల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ కారు భారతీయ రోడ్లపై టెస్ట్‌ రన్‌ను ప్రారంభించినట్లు సమాచారం వెలువడింది.

కొత్త టయోటా ఫార్చ్యనర్ వచ్చేస్తోంది

టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఒక ఫుల్-సైజ్ ఎస్‌యూవీ. ఇది జనాల్లో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇది చాలా చక్కని డిజైన్, అనేక ఫీచర్లను కలిగి ఉంది. టయోటా కంపెనీ 2026 సెకండ్ ఆఫ్‎లో న్యూ జనరేషన్ ఫార్చ్యూనర్‎ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అసలు ఫార్చ్యునర్ అంటేనే పొలిటికల్ లీడర్స్ బండి అన్న పేరుంది. అలాంది దానిని ఇప్పుడు హిల్క్స్ పికప్ ట్రక్‌ను ఆధారం చేసుకుని రూపొందించబడుతుందని చెబుతున్నారు. కొత్త కారు అంచనా ధర, స్పెషాలిటీ ఏంటో చూద్దాం.

సెప్టెంబర్లో లాంచ్ కానున్న బైకులు, స్కూటర్లు ఇవే

ప్రతి నెలా కొత్త కార్లు (New Cars) మార్కెట్‌లోకి వచ్చినట్లే, ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి కూడా కొత్త మోడళ్లు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో అయితే టూ-వీలర్లు (Two Wheelers) పెద్ద సంఖ్యలో వస్తున్న కాలం ఇది. ఆగస్ట్ నెల ముగిసిపోయింది. 2025 సెప్టెంబర్‌లో కూడా భారతీయ ద్విచక్ర వాహనాల విభాగంలో అనేక లాంచ్‌లు జరగనున్నాయి. భారతదేశంలో అత్యధిక అమ్మకాలు జరిగే పండుగ సీజన్ మొదలవుతుండటంతో, రాబోయే ముప్పై రోజులలో విడుదల చేయడానికి అనేక వాహనాలు సిద్ధంగా ఉన్నాయి.

సీక్రెట్ వెపన్ దించబోతున్న మారుతి

భారత మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని ప్రముఖ బ్రాండ్లు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. అయితే, దేశంలో నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి సొంతంగా ఒక ఈవీని అభివృద్ధి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. దీని లాంచ్ కూడా వాయిదా పడుతోంది. భారతీయ కస్టమర్లను, దేశ ప్రభుత్వ విధానాలను బాగా అర్థం చేసుకున్నందున లేటయినా లేటెస్టుగా రావాలనే ఆలోచనలో మారుతి సుజుకి ఉన్నట్లు అనిపిస్తుంది.

పాలు ఆరోగ్యానికి మంచివే - ఈ సమస్యలున్న వారు తాగారో, ఇక అంతే..!!

లాక్టోస్ అసహనత భారతదేశంలో పెరుగుతోంది, జనాభాలో 60% వరకు ప్రభావితమవుతున్నారు. దీని కారణాలు మరియు మెరుగైన నిర్వహణ కోసం ఆహార ప్రత్యామ్నాయాలను కనుగొనండి.

మీ దగ్గర జిక్సర్ 250 ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోవాలి

సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) కంపెనీ భారతదేశంలో కొన్ని నిర్దిష్ట మోటార్‌సైకిళ్లను ఒక లోపం కారణంగా రీకాల్ చేసింది. అంటే, ఒక నిర్దిష్ట సమయంలో ఉత్పత్తి చేయబడిన బైకులలో లోపాలు కనుగొన్న తర్వాత, వాటిని సరిచేయడానికి సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ వాటిని తిరిగి షోరూమ్‌లకు పిలిపిస్తోంది.
Advertisement

తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు సెప్టెంబర్లో రాబోతున్నాయ్

ఆగస్ట్ నెల ఈరోజుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఆటోమొబైల్ రంగానికి చాలా ముఖ్యమైన నెల కానుంది. సాధారణంగా చాలామంది దీపావళికి కార్లు కొనాలని ప్లాన్ చేస్తారు. వారిని ఆకర్షించడానికి, సెప్టెంబర్ నెలలో కొత్త కార్లు చాలా రిలీజ్ కానున్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో 6 కొత్త కార్లు విడుదల కానున్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.

త్వరలో మార్కెట్లోకి హైబ్రిడ్ కార్ల సునామీ

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్ ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన హోండా, హ్యుందాయ్, కియా, రెనాల్ట్ 2026-2027 నాటికి కొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలను విడుదల చేయబోతున్నాయి. ఈ కొత్త వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తూనే, మంచి మైలేజీని అందిస్తాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

రూ. 10 లక్షల లోపు లభించే 360-డిగ్రీ కెమెరా కార్లు!

కార్లలో చాలా మంది కోరుకునే ఒక ముఖ్యమైన ఫీచర్‌గా 360-డిగ్రీ కెమెరా (360-Degree Camera) మారింది. కారు చుట్టూ ఏమి జరుగుతుందో కారులో కూర్చున్న చోటు నుంచే చూడవచ్చు. ఇందుకోసం కారు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కారు చుట్టూ అమర్చిన కెమెరాలు కలిసి పనిచేస్తాయి. ఇటువంటి 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌తో రూ.10 లక్షల లోపు లభించే కార్ల గురించి ఈ కథనంలో చూద్దాం. ఈ ఫీచర్ అన్ని వేరియంట్లలో లభించదు. కేవలం కొన్ని వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి ఏవో కూడా ఇక్కడ తెలుసుకుందాం.

ఏథర్ నుంచి తక్కువ ధరకే కొత్త స్కూటర్లు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్రగామి స్థానం సంపాదించుకున్న ఏథర్ ఎనర్జీ(Ather Energy), 2025లో జరిగిన మూడవ Ather Community Day సందర్భంగా భవిష్యత్తు వైపు తీసుకెళ్లే పలు సరికొత్త ఆవిష్కరణలను పరిచయం చేసింది. ఈ ఈవెంట్‌లో కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే వాహనాలను రూపొందించడానికి ఒక వేదికను తీసుకొచ్చింది. తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆల్-న్యూ EL ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరించింది. ఇది 450 సిరీస్ తర్వాత కంపెనీ రూపొందించిన తొలి వాహన ఆర్కిటెక్చర్. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రత్యేకంగా మల్టిపుత్ వినియోగం (Versatility), స్కేలబిలిటీ (Scalability), ఖర్చు ఆప్టిమైజేషన్ (Cost Optimisation) దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ప్రకటించిన టెక్నాలజీలు, వాహన ప్లాట్‌ఫారమ్‌లు కేవలం ఏథర్‌కే కాదు, మొత్తం భారతీయ EV మార్కెట్‌కే ఒక మైలురాయి కానున్నాయి.

మళ్లీ సేల్స్‌లో దూసుకెళ్లిన హోండా యాక్టివా

గత రెండు దశాబ్దాలుగా భారతీయుల హృదయాలను గెలుచుకుంటూ వస్తున్న స్కూటర్ ఒకటుంటే అది హోండా యాక్టివానే (Honda Activa). ఒక కుటుంబానికి సరిపోయే సౌకర్యం, యువతకు కావాల్సిన స్టైల్, వృద్ధులకు ఉపయోగపడే సులభత, ఇవన్నీ కలిపి యాక్టివాను హౌస్‌హోల్డ్ నేమ్గా మార్చేశాయి. ప్రస్తుతం ఇది ఆరవ తరంలో ఉన్నప్పటికీ, దాని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. దానికి నిదర్శనమే జూలై 2025లో నమోదైన అద్భుతమైన సేల్స్ ఫిగర్లు. ఆ నెలలో మాత్రమే యాక్టివా మొత్తం 2,37,413 యూనిట్లు విక్రయించబడింది. ఈ సంఖ్య గత సంవత్సరం అదే నెలలో అమ్ముడైన 1,95,604 యూనిట్లతో పోలిస్తే దాదాపు 21.37 శాతం పెరుగుదల సాధించింది. అంతేకాదు, గత నెలలో యాక్టివా భారతదేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా నిలిచింది.

మీ కంటిలో ఈ లక్షణాలు ఉన్నాయా- అసలు నిర్లక్ష్యం చేయద్దు..!!

గ్రామీణ భారతదేశంలో సాధారణ కంటి పరీక్షల ద్వారా గ్లాకోమాను త్వరగా గుర్తించడం అత్యంత ముఖ్యమైనది. అవగాహన ప్రచారాలు మరియు అందుబాటులో ఉన్న సేవలు దృష్టి నష్టాన్ని నివారించవచ్చు.

తెలుగు నేలపైకి బుల్లెట్ రైళ్లు.. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు

దేశంలో రైల్వే రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. ఇప్పటి వరకు మనం సాధారణ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మెట్రో రైళ్లు చూసి అలవాటు పడ్డాం. కానీ ఇప్పుడు ఆ దశను దాటుకుని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన బుల్లెట్‌ రైళ్లు మనకు మరింత దగ్గర కావడం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైలు కారిడార్లను నిర్మిస్తూ, ప్రధాన మెట్రో నగరాల మధ్య ఈ సౌకర్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు కూడా చారిత్రక ప్రాధాన్యత దక్కబోతోంది. ఇటీవల హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్ల నిర్మాణానికి ప్రాథమిక ఆమోదం లభించింది.

ఫ్యామిలీ ట్రావెల్‌కి సూపర్ హిట్! టాటా వింగర్ ప్లస్ 9 సీటర్ వ్యాన్

టాటా మోటార్స్ (Tata Motors) గురించి మాట్లాడితే, మనకు మొదట గుర్తొచ్చేది భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో అగ్రగామి అనే విషయం. కార్లతో పాటు వ్యాన్లు, బస్సులు, ట్రక్కులు వంటి అన్ని రకాల వాణిజ్య వాహనాలను తయారు చేసి, వాటిని ప్రపంచవ్యాప్తంగా విక్రయించే సంస్థగా టాటా మోటార్స్ పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈ క్రమంలోనే, వాణిజ్య వాహనాల విభాగంలో తన స్థానం మరింత బలంగా నిలబెట్టుకునే ఉద్దేశంతో కంపెనీ తాజాగా ఒక కొత్త వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే టాటా వింగర్ ప్లస్ (tata winger plus). ఈ కొత్త మోడల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది 9 సీట్ల వాహనం. అంటే ఇది వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే కాకుండా, పర్యాటక ప్రయాణాలు, స్కూల్ లేదా ఆఫీస్ ట్రాన్స్‌పోర్ట్ అవసరాలకు కూడా సరైన ఎంపిక అవుతుంది.
Advertisement

వాము- మెంతుల్లో ఏది బెటర్?- ఓ లుక్కేయండి

బరువు తగ్గడానికి అజ్వైన్ మరియు మెంతి నీటి ప్రయోజనాలను అన్వేషించండి. పొట్ట కొవ్వును తగ్గించడం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడం కోసం ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉందో కనుగొనండి.

80+ kmpl మైలేజీ ఇచ్చే అతి తక్కువ ధర బైక్‌లు ఇవే!

రోజువారీ పనుల కోసం కొత్త బైక్ కొనాలని అనుకునే పేద, మధ్యతరగతి ప్రజలకు మొదట గుర్తొచ్చేది, ఏ బైక్ మైలేజీ ఎక్కువ ఇస్తుంది? అది నిజంగా ఎంతకాలం నమ్మకంగా ఉంటుంది అన్న సందేహమే. ఎందుకంటే ఈ వర్గం ప్రజలకు బైక్ అనేది కేవలం ప్రయాణానికి ఉపయోగించే వాహనం మాత్రమే కాదు, కుటుంబ బడ్జెట్‌లో పెద్ద భాగం కూడా. ఒకసారి డబ్బు వెచ్చించి కొనుగోలు చేసిన తర్వాత, అది ఎక్కువ కాలం బాగా నడవాలి, అలాగే పెట్రోల్ తక్కువ తాగుతూ ప్రతిరోజూ ఖర్చు తగ్గించాలి. ఇలాంటి సందర్భంలో బజాజ్ ప్లాటినా 100, TVS రేడియన్, హీరో HF 100 వంటి బైక్‌లు ఎక్కువగా ప్రస్తావనలోకి వస్తాయి. వీటన్నీ సాదాసీదా లుక్ ఉన్నప్పటికీ, అందులోని అసలు బలం మైలేజీ, నమ్మకమైన ఇంజిన్. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

డయాబెటిక్ న్యూరోపతి గురించి తప్పక తెలుసుకోండి.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

భారతదేశంలో మధుమేహ న్యూరోపతి పెరుగుతున్న ప్రబలతను, దాని కారణాలు, లక్షణాలు మరియు మెరుగైన ఆరోగ్యానికి సమర్థవంతమైన నిర్వహణ వ్యూహాలను అన్వేషించండి.

ఫోన్ కాల్ లీక్ ఎఫెక్ట్.. పదవి నుంచి థాయిలాండ్ ప్రధాని ఔట్ !

రిలయన్స్ జియో 2026లో IPO ప్రణాళికలను ప్రకటించింది మరియు భారతదేశం యొక్క డిజిటల్ దృశ్యంపై దాని ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ గ్లోబల్ విస్తరణను లక్ష్యంగా పెట్టుకుంది.

సుజుకి నుండి మొదటి ఈవీ స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఓలా, ఏథర్ వంటి స్టార్టప్ కంపెనీలు సృష్టించిన ఈ మార్కెట్‌లో ఇప్పుడు బజాజ్, టీవీఎస్ వంటి పెద్ద బ్రాండ్లు కూడా దూసుకుపోతున్నాయి. ఈ పోటీలో తమకంటూ ఒక స్థానాన్ని పదిలం చేసుకోవడానికి జపాన్ దిగ్గజం సుజుకి కూడా సిద్ధమైంది. ఆటో ఎక్స్‌పో 2025లో సుజుకి ప్రదర్శించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-యాక్సెస్ త్వరలోనే భారత మార్కెట్లోకి రాబోతోంది. ఈ స్కూటర్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.