డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా నడిపే ఎలక్ట్రిక్ స్కూటర్లు

పెట్రోల్ ధరలు పెరుగుతున్న కొద్ది, పేద-మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇంధనంపై ఆధారపడకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే మార్గాల కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక పెద్ద మార్గం చూపుతున్నాయి. వీటి ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, పెట్రోల్ అవసరం లేకుండా కేవలం విద్యుత్‌తో నడవడం. ఇంట్లో లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ అందించడంతో పాటు, రన్నింగ్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాలుష్యం లేని ప్రయాణం అందించడం వీటి మరో ప్రధాన బలం. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి, వాటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

బ్రెజా, నెక్సాన్‌లకు షాక్.. సరికొత్త హ్యుందాయ్ వెన్యూ వచ్చేస్తోంది

సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌లో ఒకప్పుడు మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఆ తర్వాత టాటా నెక్సన్, కియా సోనెట్ వంటి మోడల్స్ రావడంతో పోటీ మరింత పెరిగింది. అయితే ఇప్పుడు, హ్యుందాయ్ వెన్యూ తన పాత డిజైన్‌ను పక్కన పెట్టి సరికొత్త రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది.

ఫ్యాషన్ డిజైనింగ్ లో ఏఐ.. క్రియేటివిటీలో కొత్త ట్రెండ్

భారతదేశంలో ఫ్యాషన్ పరిశ్రమను ఎలా కృత్రిమ మేధస్సు మార్చేస్తుందో, ట్రెండ్‌లను అంచనా వేయడం మరియు రిటైల్ వ్యూహాలను ఆప్టిమైజ్ చేయడం ద్వారా అన్వేషించండి.

పోటీదారులకు గట్టి షాక్.. టయోటా హైరైడర్ SUV జూలైలోనే 8,814 యూనిట్ల సేల్స్

ప్రముఖ కార్ల తయారీదారు అయినటువంటి టయోటా (Toyota) కంపెనీ అంతర్జాతీయంగా, దేశీయంగా తన సత్తా చాటుతుంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొత్త కార్లను విడుదల చేస్తుంది. తాజాగా కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (urban cruiser hyryder)కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. 2025 జూలై నెలలోనే టయోటా హైరైడర్ 8,814 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడింది. గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 7,419 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాల పరిమాణం 19 శాతం వృద్ధి సాధించింది. ఇది కేవలం ఒక SUV మాత్రమే కాకుండా, మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతీకగా నిలుస్తోంది.
Advertisement

టాటా, మహీంద్రా కార్లకు షాక్.. మళ్ళీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న క్రెటా

భారతదేశంలో కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. జూలై 2025 నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితా బయటికి వచ్చింది. ఈ జాబితాలో మరోసారి హ్యుందాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, ఈ జాబితాలో బ్రెజా, నెక్సాన్, పంచ్ వంటి పాపులర్ ఎస్‌యూవీలు ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. టాప్-10లో కేవలం నాలుగు మోడళ్లకు మాత్రమే అమ్మకాల్లో వృద్ధి కనిపించింది.

టీవీఎస్, బజాజ్ దూసుకుపోతే.. ఓలా మూడో స్థానానికి!

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వృద్ధికి ప్రధాన కారణాలు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులు, చిన్న దూర ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో, సైలెంట్‌గా, తక్కువ నిర్వహణతో ఉపయోగపడే ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఓలా, ఏథర్, టీవీఎస్, హీరో ఎలక్ట్రిక్ వంటి బ్రాండ్‌లు కొత్త మోడళ్లు, అధిక రేంజ్, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. గ్రామీణ మార్కెట్‌లో కూడా ఇప్పుడు నెమ్మదిగా వీటికి డిమాండ్ పెరుగుతోంది, ముఖ్యంగా రోజువారీ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం అవుతున్నాయి. 2025 సంవత్సరానికి అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. ఆ వివరాలను ఈ కింది కథనంలో చూద్దాం.

ప్రపంచ రికార్డు సృష్టించిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఇంతకీ ఏంటంటే ?

కారు మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ ఉన్నప్పటికీ కొన్ని కార్లు మాత్రమే ప్రజల మనసులను గెలుచుకుంటాయి. అలాంటి వాటిలో ఒకటి మారుతి సుజుకి వాగన్ఆర్. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా కోటి యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. సుజుకి సంస్థకు ఇది ఒక చరిత్రాత్మక విజయం. 1993లో జపాన్‌లో ప్రారంభమైన ఈ కారు ఆ తర్వాత ఐరోపా, భారత్ వంటి మార్కెట్లలో తనదైన ముద్ర వేసింది.

రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్.. హీరో సూపర్ స్ప్లెండర్ XTEC ధర, ఫీచర్స్

భారతదేశంలో టూవీలర్ మార్కెట్‌కి ఎప్పటికీ ఒక స్థిరమైన డిమాండ్ ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సులభంగా ఉపయోగించుకునే, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను జనాలు బాగా ఇష్టపడుతుంటారు. ఈ తరహా బైకులు కేవలం రవాణా అవసరాలకే కాదు, కుటుంబం, ఉద్యోగం, వ్యవసాయ పనులు వంటి అనేక రోజువారి పనుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో, తక్కువ ఫ్యూయల్ వినియోగంతో ఎక్కువ ప్రయాణం చేయగలిగే బైక్‌లు అందరికి బాగా నచ్చుతాయి. ఈ నేపథ్యంలోనే హీరో మోటోకార్ప్ అందించిన సూపర్ స్ప్లెండర్ XTEC మోడల్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది సాధారణ మోటార్‌సైకిల్ మాత్రమే కాదు, ఆధునిక సాంకేతికతను గ్రామీణ రోడ్లపై కూడా నమ్మకంగా నడిచేలా రూపొందించిన మోడల్.

జూలైలో టాప్-5లో స్థానం దక్కించుకున్న మారుతి స్విఫ్ట్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) అంటే వినియోగదారుల్లో ఓ నమ్మకం కనిపిస్తుంది. సంవత్సరాలుగా ప్రజల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్న ఈ బ్రాండ్, ప్రత్యేకించి మారుతి స్విఫ్ట్ (Swift) వంటి మోడళ్లతో మరింతగా ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ప్రతి నెలా కార్ల సేల్స్ జాబితాల్లో మారుతి స్విఫ్ట్ పేరు మెరుగైన గణంకాలతో కనిపించటం సాధారణమే. శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, అత్యుత్తమ మైలేజీ, చక్కని డిజైన్, సురక్షితమైన ఫీచర్లు ఇవన్నీ కలగలిపి అద్భుతమైన కారుగా ఇది అందరి చేత ఆదరణను పొందుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని మరింతగా గెలుచుకుంటూ, మారుతి సుజుకి సంస్థ మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. తాజాగా విడుదలైన గణంకాలను చూసినట్లయితే ఈ కారు డిమాండ్ ఏ మేరకు ఉందో తెలుస్తుంది.

రెస్టారెంట్ లలో ఏఐ.. ఇంతలా వాడేస్తున్నారా?

AI భారతదేశంలో రెస్టారెంట్ నిర్వహణను పునర్నిర్మిస్తోంది, ఆటోమేషన్ ద్వారా ఖర్చులను తగ్గించడంతో పాటు సామర్థ్యం మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తోంది.

ఏఐ టూల్స్ వాడకం వస్తే చాలదు..! మరో బాంబు పేల్చిన బిల్ గేట్స్..!

AI సాధనాలను ఉపయోగించడం మాత్రమే ఉద్యోగ భద్రతను హామీ ఇవ్వదని బిల్ గేట్స్ జనరేషన్ Z ని హెచ్చరిస్తున్నారు. నిరంతర అభ్యాసం మరియు అనుకూలత అవసరమని ఆయన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.

రేర్ ఎర్త్ మాగ్నెట్ దెబ్బకు చిత్తైన బజాజ్.. ఈవీ అమ్మకాలలో భారీ పతనం

ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చని చాలామంది నమ్ముతారు. అందుకే, ఓలా, ఏథర్ వంటి కంపెనీలు మంచి రేంజ్, ఫీచర్లతో స్కూటర్లు విడుదల చేసి మార్కెట్‌ను పాలిస్తున్నాయి. ఈ పోటీలోకి ఎలక్ట్రిక్ స్కూటర్లతో వచ్చిన బజాజ్ కూడా వాటికి గట్టి పోటీనిచ్చింది.
Advertisement

స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే 100కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌లలో జెలియో ఎలక్ట్రిక్ (Zelio Electric) ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అత్యంత సరసమైన ధరలో కొత్త నైట్+(Knight+) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

టీవీఎస్ నుంచి కొత్త మ్యాక్సీ స్టైల్ స్కూటర్ వచ్చేస్తుంది

TVS మోటార్స్ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో ఆసక్తికరమైన అడుగువేసింది. ఇది సాంప్రదాయిక స్కూటర్లతో కాకుండా, మ్యాక్సీ-స్టైల్ లో రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో పరిచయం చేస్తోంది. M1-S అనే పేరుతో పిలవబడే ఈ కొత్త మోడల్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి వస్తుందని తెలుస్తుంది. ఈ స్కూటర్‌ను భారత మార్కెట్లో ప్రస్తుతానికి తీసుకురావడం లేదని సమాచారం. కానీ భవిష్యత్తులో ఇది ఇండియాలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా కొనసాగుతున్న iQube సిరీస్‌కు ఇది ఒక శక్తివంతమైన భాగస్వామిగా నిలవవచ్చు. మ్యాక్సీ-స్కూటర్ డిజైన్ అనేది పెద్దగా స్పేస్, లాంగ్ రైడింగ్ కమ్ఫర్ట్‌ను కోరుకునే వినియోగదారులకు తగిన ఎంపిక అవుతుంది.

40 ఏళ్ల చరిత్ర.. జీ-క్లాస్ సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?

లగ్జరీ కార్లు అనగానే మనకు గుర్తొచ్చే పేరు మెర్సిడెస్ బెంజ్. ఈ కంపెనీకి చెందిన జీ-క్లాస్ మోడల్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ కారు ధర చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ధనవంతుల మనసులను గెలుచుకుంది. ఇప్పటివరకు ఈ కారు ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి? దీని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రాంక్స్ ఫైర్‌.. ఒక్క నెలలో 12,900 యూనిట్ల విక్రయాలు!

భారతీయ ప్రముఖ కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki)కి చెందిన ఫ్రాంక్స్ (Fronx) SUV విభాగంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మంచి పనితీరు ఈ కారుకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్టైలిష్‌గా ఉండే బాడీ లైన్లు, స్మార్ట్ LED లైటింగ్, ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్ అన్ని కలిసి దీనికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇది నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండటంతోపాటు దూర ప్రయాణాల్లోనూ సౌకర్యంగా ఉండేలా రూపొందించబడింది. అందుకే ఈ కారుకు డిమాండ్ సానుకూలంగా ఉంటుంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, మార్కెట్‌లో దీనిపై ఉన్న డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ SUV ని కొనుగోలు చేయాలనే ఆసక్తి గల వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదీ స్పష్టంగా అర్థం అవుతుంది.

టెస్లా ఇండియాలో మూడు షోరూమ్‌లు.. ఎక్కడెక్కడో తెలుసా?

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న టెస్లా ఇప్పుడు భారత్‌లో వేగంగా తన అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముంబైలో మొదటి షోరూమ్ ప్రారంభించిన టెస్లా, ఢిల్లీలో రెండో షోరూమ్ తెరవడానికి సిద్ధంగా ఉంది.. ఇక ఇప్పుడు మూడో షోరూమ్‌కు కూడా స్థలాన్ని ఎంపిక చేసుకుంది. ఈ కొత్త షోరూమ్ ఎక్కడ వస్తుంది, దానికి అద్దె ఎంత అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ అలవాట్లతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్.. అలెర్ట్

పట్టణ భారతదేశంలో పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరిగిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు సంబంధించినది, నగర వాసులలో ఆరోగ్య ఆందోళనలను పెంచుతోంది.

లీటరుకు 30 కిమీ మైలేజ్! బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే..!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్ కార్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు మారుతుండటం, జీవన వ్యయాలు పెరగడం వంటివి వినియోగదారులను ఖర్చు పై శ్రద్ధ పెట్టేలా చేస్తాయి. అంతేకాదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువ పొందాలనే ఆలోచన మరింత పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో తక్కువ ధర, మంచి మైలేజ్, అందమైన డ్రైవింగ్ అనుభూతి కలిగించే కార్లకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కుటుంబ ప్రయాణాలకు సరిపోయేంత స్థలం, ఆర్థికంగా భారం కాకుండా ఉండేలా ధర, సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలే చాలామంది ఎంపికను ప్రభావితం చేస్తాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి సెలెరియో, ఆల్టో K10, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వంటి కార్లు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న మోడల్స్. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

మార్కెట్లోకి ట్రయంఫ్ త్రక్స్‌టన్ 400.. కొత్త కేఫ్ రేసర్ బైక్ లాంచ్!

కొత్తగా బైక్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ట్రయంఫ్ నుంచి సరికొత్త త్రక్స్టన్ 400 కఫే రేసర్ మార్కెట్లోకి వచ్చేసింది. కేవలం రూ. 2.74 లక్షలకే (ఎక్స్-షోరూమ్) లభించే ఈ బైక్, రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Advertisement

ఒక్క జూలైలో 12 వేల కార్లు.. బాలెనో అంటేనే నమ్మకం అంటున్నారు

మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలు అందించడంలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడూ ముందుంటుంది. అటువంటి బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ - బాలెనో (Baleno), ఇప్పుడు భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కారులలో ఒకటిగా నిలిచింది. దాదాపు ప్రతి నెలా, ఈ కారుకు గల డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్టైలిష్ లుక్, విస్తృతమైన ఇంటీరియర్, అధునాతన ఫీచర్లతో బాలెనో అనేది ఒక మంచి ఆప్షన్‌గా మారింది. ప్రత్యేకించి నగరాల్లో ఉండే యువత నుంచి, చిన్న కుటుంబాల వరకు ఇది ఒక పర్ఫెక్ట్ కారుగా పేరు తెచ్చుకుంది. ఫ్యూయల్ సామర్థ్యం పరంగా బాలెనో నిరూపించుకున్న మోడల్. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ, మంచి మైలేజీ అందించడంతో ఇది వినియోగదారుల మనసు దోచుకుంది.

జస్ట్ 10 లక్షలు.. ఈ SUVల స్టైల్ చూస్తే ఫ్యామిలీ మొత్తం ఫిదా అవుతుంది!

ఇప్పుడు కారుల ఎంపికల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రజలు తక్కువ సైజు సెడాన్ల వైపు మొగ్గు చూపేవారు. అందుబాటులో ఉండే ధర, మైలేజ్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకునేవారు. అయితే, ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. స్టైల్, రోడ్ ప్రెజెన్స్, ఇంటీరియర్ స్థలం వంటి అంశాలను ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో ఇది SUVల విపరీతమైన డిమాండ్‌కు దారితీసింది. పొడవైన, ఎత్తైన SUVలు ఇప్పుడు ప్రతి కుటుంబం కలల కారు లాంటి స్థాయికి చేరుకున్నాయి. ఇంటీరియర్ స్పేస్, హైడ్ డ్రైవింగ్ పొజిషన్, బూట్ స్పేస్,సురక్షితంగా ఉండే ఫీల్ వంటి అంశాలు SUVల వైపు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దీంతో కంపెనీలు కొత్త SUVలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం, రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో ఆకర్షణీయమైన SUVలను ఈ కథనంలో ఇవ్వడం జరిగింది.

హ్యుందాయ్ లగ్జరీ బ్రాండ్ జెనసిస్ ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?

లగ్జరీ కార్లంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి బ్రాండ్స్. ఇప్పుడు ఆ జాబితాలోకి హ్యుందాయ్ మోటార్స్ నుండి ఒక కొత్త పేరు చేరబోతోంది. అదే జెనసిస్ బ్రాండ్. హ్యుందాయ్ లగ్జరీ డివిజన్ అయిన జెనసిస్ త్వరలోనే భారత మార్కెట్లోకి రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా వంటి కార్లతో మార్కెట్‌లో దూసుకుపోతున్న ఈ సంస్థ, జెనసిస్‌తో లగ్జరీ కార్ల మార్కెట్‌లో కూడా అడుగు పెట్టనుంది. మరి జెనసిస్ ఎప్పుడు వస్తుంది, దాని ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

ట్రంప్ కామెంట్స్ పై ఆర్బీఐ గవర్నర్ షాకింగ్ రియాక్షన్..!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 5.5% వద్ద స్థిరంగా ఉంచింది, FY 2026 కోసం GDP వృద్ధిని 6.5% గా అంచనా వేస్తోంది, ఆర్థిక అనిశ్చితుల మధ్యలో.

నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్.. అద్భుతమైన గ్లామర్, 5-స్టార్ సేఫ్టీ!

నిస్సాన్ కంపెనీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మాగ్నైట్ కారు. ఈ ఒక్క కారుతోనే నిస్సాన్ భారత మార్కెట్లో చాలా గట్టిగా నిలబడింది. మాగ్నైట్ లాంచ్ అయి దాదాపు ఐదేళ్లు అవుతున్నా, దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్‌ను కొత్త లుక్‌లో కురో ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లాక్ కలర్, అదిరిపోయే ఫీచర్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తున్న ఈ కారు ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.