పెరిగిన పెట్రోల్ రేట్లకి బెస్ట్ సొల్యూషన్.. హోండా యాక్టివా!

భారత స్కూటర్ మార్కెట్‌లో హోండా యాక్టివా (Honda Activa) పేరు చెబితే, ప్రతి ఇంటిలో గుర్తొచ్చే బ్రాండ్. 2001లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ స్కూటర్, అప్పటి నుంచి ఇప్పటివరకు వినియోగదారుల మన్ననలు సంపాదిస్తూ, నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. మొదటి వాహనం ఎంచుకుంటున్న వారికి, రోజూ ఆఫీసుకు వెళ్తున్న వారికైనా, కుటుంబ ప్రయోజనాల కోసం చూసే వారికైనా హోండా యాక్టివా ప్రతి తరానికి, ప్రతి అవసరానికీ సరిపోయే విధంగా ఉంది. ఈ స్కూటర్‌కు అనువైన డిజైన్, నమ్మకమైన ఇంజిన్, ఆర్థికంగా సరిపడే నిర్వహణ ఖర్చులు ఉన్నందువల్లే ఇది అనేక మందికి మొదటి ఆప్షన్‌గా మారింది. దేశంలోని పల్లె నుంచి పట్టణం వరకు ఇది రోడ్లపై కనిపిస్తుంది.

మార్వెల్ స్టైల్‌లో టీవీఎస్ NTORQ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ వచ్చేసింది

దేశీయ టూవీలర్ వాహన రంగంలో పేరొందిన సంస్థ టీవీఎస్ మోటార్ (Tvs Motor) కంపెనీ, తమ ప్రముఖ స్కూటర్ మోడల్ అయిన ఎన్‌టార్క్ 125కి మరో ప్రత్యేకతను జోడిస్తూ, మార్వెల్ అవెంజర్స్ సూపర్ స్క్వాడ్ సిరీస్‌లోకి కొత్త ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ (Tvs Ntorq 125 Super Soldier Edition) మార్వెల్ యూనివర్స్‌లోని అభిమానుల హృదయాలను గెలిచిన సూపర్ హీరోల నుంచి ప్రేరణ పొందింది. ఈ సరికొత్త ఎడిషన్, టీవీఎస్ ఎన్‌టార్క్ సూపర్ స్క్వాడ్ సిరీస్ లైనప్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఇందులో అత్యంత ప్రాచుర్యం పొందిన మార్వెల్ పాత్రలైన క్యాప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ వంటి వీరుల ప్రతిరూపాలను డిజైన్ రూపంలో మనకు దర్శనమిస్తాయి.

నేను ఇంకా అందంగానే ఉన్నానా ?.. ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న "గాజా చిన్నారి"

గాజాలో ఒక పిల్లవాడు ప్రాంతంలో కొనసాగుతున్న మానవతా సంక్షోభం మధ్య తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలిపోవడం సమస్యను ఎదుర్కొంటున్నాడు.

ఆవు పాల బెనిఫిట్స్ తెలిస్తే తాగకుండా ఉండరు!

వర్షాకాలంలో ఆవు పాలు ఎలా రోగ నిరోధక శక్తిని పెంచుతాయో తెలుసుకోండి, వాటి సమృద్ధిగా ఉన్న పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, మరియు ప్రోబయోటిక్స్ తో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Advertisement

పండుగ సీజన్‌లో బజాజ్‌కు బ్యాడ్‌న్యూస్..EV ఉత్పత్తికి బ్రేక్

ప్రపంచమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తోంది. ముఖ్యంగా స్కూటర్లు, టూవీలర్ల డిమాండ్ బాగా పెరిగింది. కానీ, ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ముఖ్యమైన ఒక ముడిసరుకు ఉంది. దాని పేరు రేర్ ఎర్త్ ఎలిమెంట్. దీన్ని ఎక్కువగా చైనా తయారు చేస్తుంది. ఇప్పుడు చైనా ఈ ముడిసరుకును వేరే దేశాలకు అమ్మకుండా ఆపేసింది.

ఎంజీ కామెట్ ఈవీ ధరల పెంపు.. ఎంత పెరిగిందో తెలుసా?

చిన్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో బాగా అమ్ముడవుతున్న ఎంజీ కామెట్ ఈవీ ధరలు పెరిగాయి. జూలై 2025 నుండి ఈ ధరల పెంపు వెంటనే అమల్లోకి వస్తుంది. మోడల్‌ను బట్టి రూ.15,000 వరకు ధరలు పెరుగుతాయని ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. కొత్త ధరలతో ఈ కారు ఇప్పుడు రూ.7.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై, టాప్ మోడల్ రూ.10 లక్షలకు (ఎక్స్-షోరూమ్) దగ్గరగా ఉంటుంది. 2025 ప్రారంభం నుంచి చాలాసార్లు ధరలు పెరిగిన తర్వాత ఇది మరో పెంపు.

కార్ ప్రేమికులకు గుడ్‌న్యూస్.. బ్రిటన్ లగ్జరీ కార్లు త్వరలో చవకగా!

భారతదేశం, బ్రిటన్ మధ్య (India-UK FTA) తాజాగా సంతకమైన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయబోతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ ఈ ఒప్పందం మరింత లాభపడనుంది. ఎంతో కాలంగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలుకుతూ,తాజగా లండన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని వాణిజ్య మంత్రుల చేతుల మీదుగా పూర్తయ్యింది. దీన్ని అమలు చేయడానికి భారత మంత్రివర్గం, బ్రిటన్ పార్లమెంట్ నుండి తుది ఆమోదం రావాల్సి ఉంది. అయితే ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటివరకు బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ భారీ దిగుమతి సుంకాలు విధిస్తూ వస్తోంది.

ఎలక్ట్రిక్ కారు అంటే ఇదే మరి! 3.2 సెకన్లలో 100 కి.మీ వేగం

JSW-MG మోటార్ ఇండియా ఎట్టకేలకు భారత మార్కెట్‌కి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న కారు ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster) ను అధికారికంగా విడుదల చేసింది. ఇది కేవలం ఓ కొత్త ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు... భారతదేశం లో ఎలక్ట్రిక్ వాహనాల పరిణామానికి కొత్త దిశ చూపించే పవర్‌ప్యాక్ స్పోర్ట్స్ కారు. ఈ సైబర్‌స్టర్ ప్రత్యేకతేంటంటే, ఇది ఆసియాలో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. MG కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఈ కారును చేర్చి, లగ్జరీ,పెర్ఫార్మెన్స్ లెవెల్స్‌ను మరో మెట్టు ఎక్కించింది. భారత మార్కెట్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.72.49 లక్షలుగా నిర్ణయించబడింది. అయితే, ఈ ధర కేవలం ముందుగానే బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

మారుతి ప్లాట్‌ఫామ్‌పై టయోటా కొత్త ఎలక్ట్రిక్ కారు

జపాన్ వాహన తయారీ సంస్థలైన సుజుకి, టయోటా మధ్య జరుగుతున్న కార్ ఎక్స్చేంజ్ గురించి వాహన ప్రియులకు తెలుసు. భారత మార్కెట్‌లో సుజుకి, టయోటా ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైన వాహనాలను వేర్వేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. ఉదాహరణకు, మారుతి మోడల్స్ అయిన ఎర్టిగా, ఫ్రాంక్స్, బాలెనో లను టయోటా వరుసగా రూమియాన్, టైజర్, గ్లాంజా అనే పేర్లతో రీబ్యాడ్జ్ చేసి అమ్ముతోంది.

పల్లీలను రెగ్యులర్ గా తీసుకుంటున్నారా - ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

పల్లీలు కండరాల వృద్ధికి ఎలా సహాయపడతాయో మరియు ఫిట్‌నెస్ ఆసక్తుల కోసం అవసరమైన పోషకాలను ఎలా అందిస్తాయో కనుగొనండి. బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రోటీన్ ఎంపిక.

కొత్త గ్లామర్ 125లో అప్ డేటెడ్ ఫీచర్స్.. ఈ స్పెషల్ బటన్ ఏం చేస్తుందంటే

ఆటో రంగంలో దిగ్గజ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తన నెక్ట్స్ జనరేషన్ హీరో గ్లామర్ 125ను రహస్యంగా పరీక్షిస్తోంది. సాధారణంగా తక్కువ ధర కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు తక్కువగా ఉంటాయి. కానీ, హీరో ఇప్పుడు కొత్త దారిలో వెళ్తోంది. ఆశ్చర్యకరంగా, కంపెనీ తన ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందించబోతోంది.

టెక్నాలజీ, స్టైల్, మైలేజ్ అన్నీ ఒకే స్కూటర్‌లో.. టెన్నిస్ 1500 అదిరింది!

VLF కంపెనీ నుండి సరికొత్త శక్తివంతమైన అప్‌డేట్‌తో టెన్నిస్ 1500 ఎలక్ట్రిక్ స్కూటర్ (Tennis 1500) విడుదల అయింది. ఇప్పటికే మంచి సేల్స్ హైప్ అందుకున్న ఈ మోడల్‌ను కంపెనీ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మార్చింది. 2025 సంవత్సరానికి ప్రత్యేకంగా, స్టైలిష్ డిజైన్, కొత్త కలర్ ఆప్షన్లు, స్మార్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. విభిన్న కలర్స్‌లలో విడుదలైన ఈ మోడల్, యూత్‌కు ప్రత్యేకంగా నచ్చేలా రూపొందించబడింది. స్కూటర్ ముందు భాగాన్ని శార్ప్‌గా డిజైన్ చేయగా, బాడీపై కొత్త గ్రాఫిక్స్, ప్రీమియం పేఇంట్ స్కీమ్‌ను ఉపయోగించడం వలన ఇది రోడ్డుపై స్పెషల్ లుక్ ఇస్తుంది.
Advertisement

రూ. 15 లక్షల లోపు టాప్-5 బెస్ట్ 7-సీటర్ కార్లు ఇవే

పెద్ద ఫ్యామిలీకి రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఒక స్టైలిష్, సౌకర్యవంతమైన, దూర ప్రయాణాలకు అనుగుణంగా ఉండే 7-సీటర్ కారు కొనాలని చూస్తున్నారా? భారతదేశంలో ఈ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్, సౌలభ్యం, మంచి పర్ఫామెన్స్ లభిస్తాయి. ఈ జాబితాలో, ఎంపీవీ, ఎస్యూవీ రెండు రకాల కార్లు ఉన్నాయి. మరి, భారతదేశంలో లభించే అత్యంత సరసమైన టాప్-5 బెస్ట్ 7-సీటర్ కార్లు ఏంటో ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

మూడు వేరియంట్లు, ఆరు కలర్‌లు.. విన్‌ఫాస్ట్ VF7 వచ్చేస్తుంది

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారత ఎలక్ట్రిక్ వాహన రంగంపై తన దృష్టిని మరింతగా కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లలో తన స్థానం సాధించిన ఈ బ్రాండ్, ఇప్పుడు భారతదేశంలో తన తొలి అడుగులు వేయబోతోంది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసిన కంపెనీ, భారత మార్కెట్‌ను ఒక కీలక అవకాశంగా చూస్తూ దీన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో, ఈ ఆగస్టులో భారత్‌లో రిలీజ్ కావాల్సిన రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి VinFast VF7. ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా VF6, VF7 మోడళ్లకు రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి.

నిస్సాన్ మాగ్నైట్ 2 స్టార్ నుంచి 5 స్టార్‌కు ఎలా మారింది?

ఒకప్పుడు కేవలం 2-స్టార్ రేటింగ్ పొంది డబ్బా కారు అని విమర్శలు ఎదుర్కొన్న నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలలో నిస్సాన్ మాగ్నైట్‌లో భారీగా సేఫ్టీ అప్‌డేట్‌లను చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కొన్నేళ్ల క్రితం నిస్సాన్ మాగ్నైట్‌ను గ్లోబల్ NCAP పరీక్షించినప్పుడు, అది కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. ఆ సమయంలో, కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తక్కువ ఉండటం, ఇతర సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే, నిస్సాన్ కంపెనీ తన కారు సేఫ్టీని మెరుగుపరచాలని నిర్ణయించుకుంది.

షాకింగ్.. ట్యాక్స్ పేయర్లపై ఏఐ నిఘా.. ITR ఫైలింగ్ లో జాగ్రత్త!

భారతదేశంలో పన్ను మోసం గుర్తింపులో AI ఎలా మార్పులు తీసుకువస్తుందో, అనుగుణత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, డేటా భద్రతలో సవాళ్లను ఎలా పరిష్కరిస్తుందో తెలుసుకోండి.

కొత్త కార్ కోసం షోరూమ్‌కు వెళ్లే ముందు ఇది చదవండి.. తరువాత బడ్జెట్ రెడీ చేసుకోండి!

సామాన్య కుటుంబాల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇష్టపడే కారు జాబితాలో టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) పేరు ఎప్పుడు ఉంటుంది. ఇది ఒక బ్రాండ్ పేరు మాత్రమే కాదు, అది ఎన్నో భారతీయ కుటుంబాల విశ్వాసానికి నిదర్శనం. అందరూ ఈ కారును ఒక నమ్మకమైన MPVగా భావిస్తారు. విశాలమైన ఇంటీరియర్ ఏర్పాట్లు, మల్టీ పర్పస్ ఉపయోగాలు, నాణ్యతకు తగ్గ స్టైల్, మన్నిక, మైలేజ్, మెరుగైన సేఫ్టీ అంశాల కారణంగా ఇది ఫేవరెట్ మోడల్‌గా మారిపోయింది. ఇన్నోవా క్రిస్టా డిజైన్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. కేవలం ఎక్స్‌టీరియర్ ఆకృతితోనే కాకుండా, ఫీచర్ల పరంగా కూడా ఇది స్మార్ట్‌ SUVలను ఢీ కొట్టగలదు.

మైలేజ్ కింగ్ ప్లాటినా జూన్‌లో ఫామ్‌లో లేదు..! కారణం తెలుసా?

భారతీయుల మనస్సుల్లో ఎప్పుడూ ఓ స్థిరమైన స్థానం కలిగి ఉండే సెగ్మెంట్‌ అంటే ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్‌లు. తక్కువ బడ్జెట్, అధిక మైలేజ్, నిర్వహణలో తక్కువ ఖర్చుతో అనేక రకాల అవసరాలకు సరిపోయే బైక్ కావాలంటే, ఈ విభాగంలోనే ఎన్నుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ మంచి ఆదరణ పొందుతున్న బైక్‌లలో బజాజ్ ప్లాటినా ముందు వరుసలో ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలు తమ మొదటి బైక్ ఎంపికగా చాలా సందర్భాల్లో ప్లాటినాను ఎంచుకుంటాయి. రోజూ ఆఫీసుకు వెళ్లేవాళ్లు, కాలేజీ స్టూడెంట్లు, డెలివరీ ఏజెంట్లు వంటి నిరంతరం ప్రయాణించాల్సిన వారు ఎక్కువగా దీనిపైనే ఆధారపడతారు. బజాజ్ ప్లాటినా శక్తిని తక్కువ వ్యయంతో అందించగల బైక్‌గా పేరు తెచ్చుకుంది.

భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. విదేశీ కార్లు చౌకగా మారేనా ?

భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం బ్రిటన్ వెళ్లి, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ తో సమావేశమై ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని రెండు దేశాల మధ్య ఒక చారిత్రక మైలురాయిగా భావిస్తున్నారు. దీనివల్ల రెండు దేశాలకూ అనేక వస్తువుల దిగుమతులు చౌకగా మారతాయి.

టెస్లా మోడల్ వై బుకింగ్‌లు ప్రారంభం.. ఎంత చెల్లించాలంటే ?

కేవలం రూ. 22,220తో టెస్లా మోడల్ వై కారును భారతదేశంలో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి. బుకింగ్ నియమాలు, ధర, వేరియంట్లు, పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టెస్లా రాకతో భారత ఈవీ మార్కెట్‌లో కొత్త శకం ప్రారంభం అయింది.
Advertisement

ఒక్క ఛార్జ్‌తో బెంగళూరు నుంచి తమిళనాడుకు

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (GEML) భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగానికి పునాది వేసిన కంపెనీల్లో ఒకటి. ఎలక్ట్రిక్ సికిళ్లు, స్కూటర్లు, 3-వీలర్ ఆటో రిక్షాల వరకు పలు వాహనాలను ఇది మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రత్యేకించి ఆంపియర్ వంటి బ్రాండ్‌లతో ఈ సంస్థ దేశ వ్యాప్తంగా వినియోగదారులకు నమ్మకమైన, అనుకూలమైన ఎలక్ట్రిక్ రవాణాకు వాహనాలను అందిస్తోంది. ఇప్పుడీ కంపెనీ మరోసారి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది. ఎల్ట్రా సిటీ ఎక్స్‌ట్రా (Eltra City Xtra) అనే తమ ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వాహనంతో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులోని తమ ప్రధాన కేంద్రం నుంచి తమిళనాడులోని రాణిపేట వరకూ, ఒక్కసారి ఛార్జ్ చేసిన తరువాత 324 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డును నెలకొల్పింది.

AI లో రేసులో నంబర్ వన్‌‌గా ఉండాలి - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ !

అధ్యక్షుడు ట్రంప్ మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులను AI ఫ్రేమ్‌వర్క్‌లను పునర్నిర్మించడానికి సంతకం చేశారు, 'వోక్' AI మోడళ్లపై మరియు AI ఎగుమతుల్లో US నాయకత్వంపై దృష్టి సారించారు.

బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, వీరికి మాత్రం మహా డేంజర్..!!

భారతదేశంలో కొంతమంది వ్యక్తుల్లో బొప్పాయి వినియోగం జీర్ణ అసౌకర్యాన్ని ఎలా కలిగించగలదో మరియు ఇందులో ఎంజైమ్ పాపైన్ యొక్క పాత్రను అన్వేషించండి.

25 నెలల్లోనే ప్రపంచాన్ని దుమ్ములేపిన మారుతి SUV.. పేరు ఫ్రాంక్స్!

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది మారుతి సుజుకి (Maruti Suzuki). కంపెనీ తన కాంపాక్ట్ SUV మోడల్ ఫ్రాంక్స్ (Fronx) అరుదైన ఘనతను సాధించింది. జూన్ 2023లో ఫ్రాంక్స్ గ్లోబల్ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి, కేవలం 25 నెలల్లోనే ఇది ఒక లక్ష యూనిట్ల (1,00,000) ఎగుమతులు పూర్తి చేసింది. దేశీయంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా భారత తయారీ నాణ్యతను చాటింది. అతి తక్కువ కాలంలోనే మారుతి లక్ష కార్లను ఎగుమతి చేయడం అంటే సాధారణ విషయం కాదు. ముఖ్యంగా జపాన్‌ దేశంలో కూడా Fronx కి గణనీయమైన ఆదరణ లభించడం గమనార్హం. ఇది సాధారణంగా అత్యధిక నాణ్యతను కోరుకునే మార్కెట్. ఈ దేశంలో కూడా భారతీయ తయారీ కారు నమ్మకాన్ని సంపాదించడం అనేది గర్వకారణం.

ఎలక్ట్రిక్ బైక్‌లకు పెరుగుతున్న మార్కెట్.. మేటర్ ఈవీ కొత్త అడుగు!

భారతదేశంలో కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీలలో మేటర్ ఈవీ ఒకటి. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయించే కొన్ని కంపెనీలలో మేటర్ ఈవీ కూడా ఉంది. ఈ కంపెనీ అమెరికాకు చెందిన హెలేనా సంస్థ సహాయంతో పనిచేస్తుంది. క్యాపిటల్ 2బీ, జపాన్ ఎయిర్‌లైన్స్, కెనడాకు చెందిన ట్రాన్స్‌లింక్ ఇన్నోవేషన్ ఫండ్, ఎస్‌బీ ఇన్వెస్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలు మేటర్ ఈవీలో పెట్టుబడులు పెట్టాయి.