నాడు మీ తాతయ్య వాడిన DX.. ఇప్పుడు మీ కోసం EVగా వచ్చేసింది!
ఆటోమొబైల్స్
- 1 year, 2 month, 7 days ago
ఎన్నో గుర్తుల్ని, జ్ఞాపకాల్ని మళ్లీ తెచ్చేలా... కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (KEL)తన ప్రతిష్టాత్మక స్కూటర్ డీఎక్స్(DX) ను ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనంగా మార్చి విడుదల చేసింది. కాలంతో పాటు మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా, కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ (inetic Watts and Volts Ltd. (KWV)) అనే ప్రత్యేక ఎలక్ట్రిక్ విభాగం ద్వారా భారత్‌లో ఈ సరికొత్త DX ఎలక్ట్రిక్ స్కూటర్ (DX Electric Scooter)ను విడుదల చేసింది. 1980లలో మనకు సుపరిచితమైన కైనెటిక్ హోండా DXను పూర్తిగా కొత్త రూపంలో, ఎలక్ట్రిక్ అవతారంలో మన ముందుకు తీసుకురావడంలో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో చెప్పకనే చెబుతుంది. ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తన పాత జ్ఞాపకాల్ని ఇప్పటి తరానికి పరిచయం చేయడానికి కైనటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంతో అట్టహాసంగా ఈ రోజు విడుదల చేసింది.