తగ్గిన డిమాండ్.. రెనాల్ట్ క్విడ్ జూన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి!

దిగ్గజ వాహన తయారీ కంపెనీ రెనాల్ట్ (Renault) చాలా కాలంగా భారత్‌లో సత్తా చాటడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దేశంలోని మధ్య తరగతి, సంపన్న వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని పలు మోడళ్లను విక్రయిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ప్రసిద్ధ మోడల్ క్విడ్ (kwid)కు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 2025 నెలలో కేవలం 449 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఇది గడిచిన ఏడాది ఇదే నెలలో నమోదైన 603 యూనిట్లతో పోలిస్తే దాదాపుగా 26 శాతం తగ్గుదల అని చెప్పవచ్చు. అంటే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 154 యూనిట్ల తగ్గుదల ఉంది. కేవలం నగర ప్రయాణాలకు సరిపడే కారుగా మాత్రమే కాకుండా, స్టైలిష్‌గా ఉండాలని కోరుకునే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉన్న ఈ కారును గత నెలలో తక్కువ మంది ఎంచుకున్నారు.

5-స్టార్ సేఫ్టీతో వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ధరల పెంపు!

భారత మార్కెట్లో విశ్వసనీయతకు మారుపేరైన టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రా ఎమ్‌పీవీ ఇప్పుడు మరింత ఖరీదైంది. ఈ పెద్ద సైజు కారు స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. తాజాగా, ఈ హైక్రాస్ ఎమ్‌పీవీ ధరలు పెరిగాయని ఒక ప్రైవేట్ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. ఏ వేరియంట్‌కు ఎంత ధర పెరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మార్కెట్లోకి ఇమొటోరాడ్ సరికొత్త అడ్వెంచర్ రేంజర్ ఈ-సైకిల్‌

భారతదేశంలో ఎలక్ట్రిక్ సైకిల్స్‌కు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ఇమొటోరాడ్ ఒక సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే అడ్వెంచర్ రేంజర్ ఈ-సైకిల్. ఇది ఇమొటోరాడ్ నుండి వస్తున్న మొదటి మోటో-స్టైల్ ఎలక్ట్రిక్ సైకిల్. దీని ధర కేవలం రూ.55,999 మాత్రమే.

జూన్‌లో ఇన్విక్టో అదరగొట్టింది! ఏడాది వ్యవధిలో 18.19% అమ్మకాల వృద్ధి!

మారుతి సుజుకి ఇన్విక్టో... పేరే సరిపోతుంది దాని ప్రీమియమ్‌ MPV స్థాయిని చెప్పేందుకు. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్, మరింత ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో, మారుతి బ్రాండ్‌కు తగ్గటువంటి ప్రత్యేకమైన స్టైల్‌ను కలిగి ఉంది. ఇటీవలి జూన్ నెలలో ఈ కారుకు మార్కెట్‌లో మంచి స్పందన లభించింది. మీడియా నివేదికల ప్రకారం, ఒక్క నెల అంటే జూన్ 2025లో ఈ కారు 264 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. గత ఏడాది ఇదే కాలంలో 223 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి 18.19 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. అంటే, మార్కెట్‌లో ఉన్న పోటీకి తగినట్టుగానే ఈ MPV తన స్థిరమైన కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది.
Advertisement

ఫీచర్లు చూస్తే మెచ్చుకోవాల్సిందే.. రెనాల్ట్ క్విడ్ EV త్వరలో రాబోతోంది!

ప్రపంచ మార్కెట్‌లో తనదైన శైలిలో ఉండే రెనాల్ట్ (Renault), ఇప్పుడు భారత మార్కెట్‌లో కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో అడుగులు వేస్తోంది. అత్యంత లో-కాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని బలపరచేందుకు, రెనాల్ట్ క్విడ్ EVను భారతదేశానికి పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఐసీఈ ఇంజిన్ విభాగంలో కైగర్, క్విడ్, ట్రైబర్ కార్లను విక్రయిస్తున్న కంపెనీ ఇప్పుడు ఈవీపై ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ క్విడ్ కారును తీసుకురాబోతుంది. ఇది ఏ సాధారణ ఎలక్ట్రిక్ కారు కాదు, ఇది డాసియా స్ప్రింగ్ EV ఆధారంగా రూపొందించబడిన మోడల్. డాసియా బ్రాండ్‌ను యూరప్‌లో చాలా మంది విశ్వసనీయ బ్రాండ్‌గా పరిగణిస్తారు. అదే పునాదులపై ఇప్పుడు క్విడ్ EV రూపంలో రెనాల్ట్ భారత్‌కి తీసుకువస్తోంది.

బాలెనో అమ్మకాలపై గట్టి ప్రభావం! మారుతికి ఊహించని నష్టం!

భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగాన్ని మాటలకే కాదు, అమ్మకాల పరంగా కూడా శాసించింది మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno). అందమైన డిజైన్, మన్నికైన ఇంజిన్, మంచి మైలేజ్, ఖర్చు తక్కువైన మెయింటెనెన్స్... ఇవన్నీ కలిపి, ఈ కారును చాలా మంది కుటుంబాలు తమ మొదటి ప్రీమియం కారుగా ఎంచుకున్నాయి. రీసేల్ విలువ కూడా పటిష్టంగా ఉండటంతో, బాలెనో ఒక సురక్షితమైన పెట్టుబడి లా మారింది. అయితే తాజాగా ఈ కారుకు ఆదరణ తగ్గినట్లు తెలుస్తుంది. *జూన్ 2025లో బాలెనో కేవలం 8,966 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఇది గత సంవత్సరం ఇదే జూన్ నెలలో విక్రయించిన 14,895 యూనిట్లతో పోలిస్తే దాదాపు 40 శాతం తగ్గుదల. బాలెనో తరహా పెద్ద బ్రాండ్‌కు ఇది చాలా పెద్ద నష్టమే.

టెస్లా మోడల్ Y vs టాటా హ్యారియర్.ఈవీ.. ఏది బెస్ట్?

భారత మార్కెట్‌లోకి ఎట్టకేలకు టెస్లా అడుగుపెట్టింది. టెస్లా తన మోడల్ Y సెడాన్‌ను రూ.60 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ ఖరీదైన టెస్లాలో లేని కొన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లు కేవలం రూ. 21 లక్షల ధర ఉన్న టాటా హ్యారియర్.ఈవీలో ఉన్నాయట. ఈ రెండు కార్ల మధ్య ఉన్న కీలక తేడాలు, ఏయే ఫీచర్లు టాటా హ్యారియర్‌ను స్పెషల్‎గా నిలబెడుతున్నాయో చూద్దాం. టెస్లా మోడల్ Y ఒక ప్రీమియం సెడాన్ కాగా, టాటా హ్యారియర్.ఈవీ ఒక భారీ ఎస్‌యూవీ. ఈ రెండింటి మధ్య ధరలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా టాటా హ్యారియర్ కొన్ని చోట్ల టెస్లాను మించిపోయింది.

కేవలం రెండేళ్లలోనే బజాజ్ ఈ బైక్‌కి గుడ్‌బై చెప్పింది!

బజాజ్ పల్సర్ పేరు చెబితే, బైకు ప్రేమికుల గుండెద‌డిగా మోగుతూనే ఉంది. 125సీసీ నుంచి 400సీసీ వరకు స్టాండర్డ్, P, N, NS, RS వంటి అనేక వేరియంట్‌లతో పల్సర్ పేరే ఒక సింబల్ అయింది. శక్తివంతమైన ఇంజిన్, స్పోర్టీ డిజైన్, అందుబాటు ధర.. ఇవన్నీ కలిపి పల్సర్‌ను యువత హార్ట్‌థ్రోబ్‌గా నిలిపాయి. అయితే కంపెనీ తాజాగా పల్సర్‌కు చెందిన ఒక వేరియంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పల్సర్ N150 ని నిలిపివేసింది. యువతను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో వచ్చిన ఈ మోడల్ అంతగా ఆదరణ పొందలేదు. ఇతర పల్సర్ మోడళ్లతో పోల్చితే, ఈ బైక్‌కి మార్కెట్‌లో సరైన స్పందన రాలేదు. అమ్మకాలు నిరాశపరిచాయి. దీంతో, ప్రారంభించిన రెండు సంవత్సరాలకే, బజాజ్ N150ను తాత్కాలికంగా నిలిపివేసింది.కంపెనీ యథాతథంగా కొనసాగించడం వల్ల మార్కెట్‌లో కలిగే నష్టాన్ని గమనించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ ఛార్జింగ్.. ఇంట్లో ఇతర వస్తువులకు ప్రమాదమా?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇంట్లోని ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు నష్టం జరగవచ్చు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి పరిష్కారం ఏంటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

కారును తుప్పు పట్టకుండా ఉంచే కోటింగ్స్: ఏది బెస్ట్?

వర్షాకాలం వచ్చిందంటే చాలు, కారు యజమానులకు ఓ పెద్ద సమస్య మొదలవుతుంది. అదే తుప్పు. ముఖ్యంగా, పాత కార్లు ఉన్నవారికి ఇది మరింత పెద్దగా మారుతుంది. కొత్త కార్లతో పోలిస్తే, పాత కార్లకు తుప్పు పట్టే ప్రమాదం చాలా ఎక్కువ. చిన్నపాటి గీతలు, పెయింట్ ఊడిపోయిన చోట్ల వర్షపు నీరు చేరితే, మెల్లగా తుప్పు పట్టి కారు రూపాన్నే మార్చేస్తుంది.

అలసిపోయినట్లు అనిపించినప్పుడు ఎనర్జీ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్

రోజువారీ ఖర్జూరాల వినియోగం ద్వారా మెరుగైన జీర్ణక్రియ నుండి మెరుగైన గుండె ఆరోగ్యం వరకు ఉన్న టాప్ 10 ఆరోగ్య ప్రయోజనాలను కనుగొనండి.

సురక్షితంగా, శక్తివంతంగా.. సుజుకి జిమ్నీ హైబ్రిడ్ వర్షన్ త్వరలో!

మారుతి సుజుకి (maruti suzuki) తన క్లాసిక్ లుక్‌కి గల, ఆఫ్‌రోడ్ మోడల్ అయిన జిమ్నీ (Jimny) కారును మరోసారి భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. గతంలో మహీంద్రా థార్‌కి ప్రత్యామ్నాయంగా లాంచ్ చేసిన ఈ కారు, మొదట తగిన ఆదరణను పొందలేకపోయింది. దీంతో కంపెనీ ఈ సారి మరింత కొత్త అప్‌డేట్‌లతో ఈ కారును రీఎంట్రీ చేయడానికి సిద్ధం చేస్తోంది. ఈసారి ఇది కేవలం ఓ గ్లామరస్ SUVగా మాత్రమే కాకుండా మరింత స్టైలిష్, ఫీచర్-రిచ్ వేరియంట్‌తో తీసుకురానుంది. సరికొత్త హైబ్రిడ్ ఇంజిన్‌తో జిమ్నీ వస్తుందని తెలుస్తుంది. అయితే దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆగష్టు నాటికి ఇది లాంచ్ కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పాటు సేఫ్టీ పరంగా, అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇతర టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు కూడా దీనిలో ఉండనున్నాయి.
Advertisement

రోజూ చపాతీలు తింటున్నారా, మంచిదేనా - నిపుణుల సూచనలు..!!

ఫైబర్, ప్రోటీన్ మరియు ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండే చపాతీ యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి, ఇది సమతుల్య ఆహారానికి అనుకూలంగా ఉంటుంది.

కేవలం 3 ఏళ్లలో 3 లక్షల యూనిట్లు.. మహీంద్రా XUV700 సక్సెస్ స్టోరీ!

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా XUV700 ఒక సంచలనం సృష్టించింది. లగ్జరీ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ కేవలం మూడు సంవత్సరాలలో 3 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి దీనికి ఉన్న డిమాండ్ ఎంతగా ఉందంటే, కొన్నిసార్లు దీని వెయిటింగ్ పీరియడ్ ఏకంగా ఒక సంవత్సరం దాటిపోయింది.

మీ కార్‌కు వర్షం వల్ల ప్రమాదం కాకుండా చూడాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

వర్షం మొదలవుతుందంటే చాలామందికి ఒక ప్రశాంతత, ఒక శాంతమైన వాతావరణం. కానీ కారును కలిగి ఉన్న వారికి మాత్రం ఇది సవాలుగా మారుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో కారు మెయింటనెన్స్ అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. సరైన నిర్వహణ లేకపోయినట్లతే ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కారును వర్షంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా నడివగలిగేలా చేయవచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కారును వర్షపు నీటి నుంచి అన్ని విధాలుగా రక్షించుకోవడానికి పాటించాల్సిన కొన్ని సూచనలను ఈ కింది కథనంలో అందించడం జరిగింది. మరి ఆ వివరాలు ఎంటో ఒకసారి తెలుసుకుందాం.

సబ్సిడీ షాక్.. ప్రభుత్వ నిర్ణయంతో కష్టాల్లో పడ్డ కంపెనీలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, కొన్ని కంపెనీలు ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ సబ్సిడీల దుర్వినియోగం కారణంగా కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల చిన్న కంపెనీలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.

కియా 7సీటర్ ఈవీ వేరియంట్ల వారీగా స్పెషాలిటీలివే

ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇస్తుండడంతో అందరి దృష్టి దాని మీదే ఉంది. అదే సమయంలో కియా కంపెనీ కూడా ఇండియాలో కొత్తగా కేరెన్స్ క్లావిస్ ఈవీ అనే ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. రూ.17.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైన ఈ కొత్త కేరెన్స్ క్లావిస్ ఈవీ HTK+, HTX, HTX+ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లలో ఎలాంటి టెక్నికల్ ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒకే కంపెనీకి చెందిన రెండు MPVలు.. ఎర్టిగా టాప్, XL6 డౌన్.. ఎందుకో?

మారుతి సుజుకి MPV సెగ్మెంట్ ప్రస్తుతం మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇందులో ముఖ్యంగా ఒక కీలక మోడల్ అయిన మారుతి సుజుకి XL6, సేల్స్ పరంగా నిరాశాజనకంగా కనిపిస్తోంది. ఇది ఒకప్పుడు ప్రీమియం ఎంపీవీగా మంచి అంచనాలతో మార్కెట్లోకి ప్రవేశించినా, ప్రస్తుతం ఆదరన కొల్పోతున్నట్లు కనిపిస్తుంది. ఇది 6 సీట్ల కాంబినేషన్‌తో స్టైలిష్ డిజైన్,ఆకట్టుకునే అంశాలను కలిగి ఉన్నప్పటికి కొనుగోలుదారులను ఆకర్షించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటోంది. జూన్ 2025లో మారుతి సుజుకి XL6 అమ్మకాలు గణనీయంగా పడిపోవడం ఈ MPVకు ఎదురవుతున్న వాస్తవ సమస్యలను స్పష్టంగా చూపిస్తోంది. గతంలో ఒక ప్రీమియం ఎంపీవీగా మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న XL6, ఇప్పుడు కొనుగోలుదారుల నుంచి మెరుగైన స్పందనను పొందడంలో విఫలమవుతోంది.

టెస్లాకు స్వాగతం.. ఛార్జింగ్ స్టేషన్లలో కలుద్దాం అంటున్న మహీంద్రా!

అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా (Tesla) ఇప్పుడు అధికారికంగా భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఇది భారత ఆటోమొబైల్ రంగానికి ఓ కీలక మలుపు అని చెప్పవచ్చు. సాధారణంగా టెస్లా కంపెనీ ప్రపంచంలోనే అదిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగా ఉంది. దీనికి ప్రధాన ప్రత్యర్థిగా చైనాకు చెందిన బీవైడీ (Byd) కంపెనీ అంతర్జాతీయంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో కూడా అడుగుపెట్టి క్రమంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటుంది. ఈ క్రమంలో టెస్లా ఇంత కాలం భారత్‌లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేసినప్పటికి పలు కారణాల వల్ల ఇది జరగలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు టెస్లా తన మొదటి అడుగు వేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా రాకపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తనదైన శైలిలో స్పందించారు.

బ్యాటరీ నుంచి బూట్ వరకు.. టెస్లా మోడల్ Y పూర్తి విశేషాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి మారుపేరు అయిన టెస్లా (Tesla), ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ యాజమాన్యంలో నడుస్తున్న ఈ కంపెనీ, భారతదేశానికి తన తొలి అడుగును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వేసింది. ముంబై నగరంలో ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మాక్స్‌సిటీ మాల్‌లో, టెస్లా తమ దేశంలోనే మొదటి కార్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది. ఈ సందర్భంగా, టెస్లా భారత్ మార్కెట్లో అమ్మకానికి తీసుకొచ్చిన మొదటి కారు మోడల్ Y (Model Y) ఎలక్ట్రిక్ SUV. ఈ మోడల్ Y ఎలక్ట్రిక్ SUV ధర, ఫీచర్లు,ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను కంపెనీ వెల్లడించింది. ఆయా వివరాలను ఈ కథణంలో చూద్దాం.
Advertisement

దూసుకెళ్తున్న AWL అగ్రి బిజినెస్ .. ఈ ఏడాది ఏకంగా 21 శాతం వృద్ధి

AWL అగ్రి బిజినెస్ FY26 Q1లో రూ. 17,059 కోట్ల రికార్డు ఆదాయాన్ని సాధించింది, ఇది తినదగిన నూనె విభాగంలో 26% వృద్ధితో నడిపించబడింది.

చేప కళ్ళను తక్కువగా అంచనా వెయ్యొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే తప్పక తింటారు!

చేప కళ్ల ఆరోగ్య ప్రయోజనాలను కనుగొనండి, ఇవి ఒమేగా-3 మరియు విటమిన్ A లో సమృద్ధిగా ఉంటాయి, ఇవి హృదయ ఆరోగ్యం మరియు பாரవాణి కోసం సంప్రదాయ భారతీయ వంటకాలలో అవసరం.

కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ కారు లాంచ్! ధర, రేంజ్, ఫీచర్లు ఒక్కసారిగా చూసేయండి!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఇతర తయారీదారులకు పోటీగా దూసుకుపోతుంది. దేశంలో ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు కూడా ఇప్పుడు కియా కార్లు కనిపిస్తున్నాయంటే , కంపెనీ ఇండియాలో ఏ రేంజ్‌లో ఆదరణ సంపాదించిందో తెలిసిపోతుంది. ఇప్పటికే ఇంధన ఆధారిత పలు మోడళ్లను విక్రయిస్తున్న కియా ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈవీలపై కూడా ఫోకస్ చేసింది. అందుకే తన ఐసీఈ వెర్షన్లను ఎలక్ట్రిక్ మోడళ్లుగా మార్చి తిరిగి మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో కియా ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఎలక్ట్రిక్ MPV కారెన్స్ క్లావిస్ ఈవీ (Carens Clavis Ev) ని, చివరికి భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది.

అమెరికాలో రూ.38 లక్షల టెస్లా.. ఇండియాలో రూ.60 లక్షలు ఎందుకు?

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ అయిన టెస్లా మోడల్ వైని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కారు రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే, భారత్‌లో దీని ధరలు అమెరికా, చైనా, జర్మనీతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి.

అతిగా నిద్రిస్తున్నారా? అయితే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే

భారతదేశంలో అధిక నిద్రకు మధుమేహం మరియు రక్తపోటుతో సంబంధం ఉంది. సమతుల్య నిద్ర పట్టిక కోసం ప్రమాదాలు మరియు నిపుణుల సిఫారసులను కనుగొనండి.