మరాజ్జోకు కష్టకాలం.. జనవరి-మే 2025లో అమ్మకాలు కేవలం 37 యూనిట్లు!
ఆటోమొబైల్స్
- 1 year, 2 month, 29 days ago
ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలోని మహీంద్రా (Mahindra) దేశీయంగా, అంతర్జాతీయంగా కార్ల అమ్మకాలతో దూసుకుపోతుంది. స్కార్పియో, XUV 3XO, XUV700, థార్ వంటి వంటి ప్రతీ మహీంద్రా మోడల్ కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. దీని పొడవైన SUVల సిరీస్‌ను భారతీయులు ఎంతో అభిమానంతో స్వీకరించారు. అందుకే, ఈ మధ్యకాలంలో అమ్మకాల పరంగా మహీంద్రా దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఎదగడం పెద్ద వార్తైంది. దాని ప్రస్తుత మోడళ్లన్నీ మార్కెట్లో హిట్లుగా నిలుస్తూ, ఒక విశిష్టమైన ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నాయి. అయితే ఇలాంటి మెరుగైన సేల్స్ మధ్య ఒకటి మాత్రం ఆదరణ సంపాదించలేకపోతుంది. అదే మహీంద్రా మరాజ్జో ఎంపీవీ (Mahindra Marazzo Mpv). ఇది కంపెనీ ప్రారంభించిన ఏకైక MPV మోడల్. ఇది మాత్రం వినియోగదారుల నుండి సరైన స్పందన పొందలేకపోయింది.