ఓలా, ఒబెన్, రివోల్ట్, ప్యూర్ ఈవీ.. లక్ష లోపు టాప్ 4 ఎలక్ట్రిక్ బైకులు!

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయి. మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఎక్కువగా బైకులు లేదా స్కూటర్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి వాళ్లు రోజూవారీ పనులకు పెట్రోల్ వాహనాలు వాడకుండా, డబ్బు ఆదా చేసే ఎలక్ట్రిక్ బైకులను వాడొచ్చు.

టెస్లా మొదటి షోరూమ్ కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది.. ఎక్కడ, ఎప్పుడంటే?

టెస్లా(tesla) భారతదేశంలో అడుగుపెట్టబోతోంది. ఇది కేవలం ఒక కంపెనీ రాక మాత్రమే కాదు, ఒక సాంకేతిక విప్లవం అడుగుపెట్టడం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన టెస్లా, బిలియనీర్ విజనరీ ఎలోన్ మస్క్ నేతృత్వంలో, ఎన్నో దేశాలలో తన ఆధిపత్యాన్ని చాటిన తర్వాత ఇప్పుడు భారత మార్కెట్‌ను కూడా తన దృష్టిలో పెట్టుకుంది. ఇప్పటికే దేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు టెస్లా పలు కీలక అడుగులు వేసింది. ముఖ్యంగా, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో మొదటి షోరూమ్‌లను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో మొదటి షోరూమ్ ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి, ఇప్పుడు ఒక కొత్త అప్‌డేట్ వచ్చింది.

చిల్లీ ఆయిల్..ట్రై చేయండి!!

మీ ఆహారంలో మిరప నూనెను చేర్చడం ద్వారా మెరుగైన మెటబాలిజం మరియు గుండె ఆరోగ్యం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి.

ఉపవాసం ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు - ఈ పొరపాట్లు చేయద్దు..!!

మీ మానసిక స్పష్టత మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి వారాంతపు ఉపవాసం ఎలా సహాయపడుతుందో అన్వేషించండి.
Advertisement

ఢిల్లీలో కొత్త రూల్.. పాత కార్లకు పెట్రోల్ బంద్!

దేశ రాజధాని ఢిల్లీలోని వాహనదారులకు బ్యాడ్ న్యూస్. కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఒక కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, జులై 1వ తేదీ నుంచి ఢిల్లీలోని పెట్రోల్ పంపుల దగ్గర ఉండే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు గుర్తించిన ఎండ్-ఆఫ్-లై వాహనాలకు (అంటే, పాతబడిపోయిన వాహనాలకు) పెట్రోల్ లేదా డీజిల్ పోయరు.

ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి.. నామినేట్ చేసిన పాకిస్థాన్.. కారణం ఇదే..!

పాకిస్తాన్, భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో అతని దౌత్య ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, 2026 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిపాదించింది.

ఇవి లేవంటే స్కూటర్ మార్కెట్ నిలవదు! టాప్-5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు చూశారా?

ప్రస్తుతం భారత మార్కెట్లో స్కూటర్లకు డిమాండ్ భారీగా ఉంది. గతంలో బైకులకు ఎక్కువ ప్రధాన్యత ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ధోరణి మొత్తం మారిపోయింది. డిమాండ్ మేరకు మార్కెట్లోకి కొత్త కొత్త స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. సౌకర్యం, సరళత, మైలేజ్ ఇవన్నీ కలిపి స్కూటర్లను ఓ నమ్మకమైన వాహనంగా మార్చాయి. ఇందుకే మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద టూవీలర్ వాహన మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా, మే 2025 నెలలో జరిగిన స్కూటర్ అమ్మకాలు చూస్తే ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలో, ఒక్కో స్కూటర్ మోడల్ దాదాపు లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. వాటిలో ఒకటి ఏకంగా 1.9 లక్షల యూనిట్లు అమ్ముకొని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

మంత్ర సూపర్ కార్గో.. సరుకు రవాణాలో కొత్త రారాజు!

మంత్ర ఎలక్ట్రిక్ (Montra Electric) అనే కంపెనీ, కొత్త ఎలక్ట్రిక్ కార్గో ఆటోను (Electric Cargo Auto) తీసుకొచ్చింది. ఇది మామూలు పెట్రోల్/డీజిల్ ఇంజిన్ వాహనాలకు ఏ మాత్రం తీసిపోకుండా, వాటికి పోటీగా ఉండేలా తయారు చేశారు. ఈ కొత్త ఆటో గురించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

2026 నుండి బైక్‌లకు ABS, రెండు హెల్మెట్లు తప్పనిసరి!

భారతదేశ రోడ్లపై భద్రతను మరింత మెరుగుపరచే దిశగా మరో కీలకమైన అడుగు పడింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, 2026 జనవరి 1వ తేదీ నుంచి దేశంలో విక్రయించే అన్ని కొత్త టూవీలర్స్.. అవి స్కూటర్లు కావొచ్చు లేదా బైకులు కావొచ్చు, ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) కలిగి ఉండటం తప్పనిసరి కానుంది. ఇది కేవలం ఒక నిబంధన మాత్రమే కాక, భారత రోడ్లపై రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు తీసుకున్న చొరవగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు 125cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన టూవీలర్ వాహనాలకు మాత్రమే ABS తప్పనిసరి అయిందని చూస్తే, కొత్త నియమంతో అన్ని వాహనాల్లో ఇది వర్తించనుంది.

ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ఇదే.. భారీగా తగ్గిన ధర

భారత మార్కెట్‌లో చాలా పాపులర్ అయిన బైకుల్లో ఒకటి బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ. ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ అనే పేరు దీనికి ఉంది. ఈ బైక్‌లో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు.

భారతుల హృదయాల్లో నిలిచిపోయిన కార్.. స్విఫ్ట్‌కు 20 ఏళ్లు పూర్తి

భారతీయ ఆటోమొబైల్ రంగంలో వినియోగదారుల హృదయాలను గెలుచుకున్న హ్యాచ్‌బ్యాక్ కారుల్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఒక గుర్తిండిపోయే పేరు. చిన్న కార్ల సెగ్మెంట్‌లో యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్, నమ్మకమైన పెర్ఫార్మెన్స్, మెరుగైన మైలేజీ వంటి అంశాలతో స్విఫ్ట్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. 2005లో మే నెల చివరిలో భారత రోడ్లపైకి అడుగుపెట్టిన ఈ కారు, అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మార్పులు, చూస్తూ ముందుకు సాగింది. ప్రారంభించిన కొద్ది కాలంలోనే హ్యాచ్‌బ్యాక్ విభాగంలో స్విఫ్ట్ అగ్రస్థానాన్ని సాధించగలిగింది. 2011లో విడుదలైన రెండవ తరం మోడల్‌లో ఇంకా మెరుగైన ఫీచర్లు, మైలేజీతో పాటు, అప్‌డేటెడ్ స్టైలింగ్‌ను తీసుకువచ్చారు. ఆ తర్వాత 2018లో వచ్చిన మూడో తరం మోడల్ మరింత ఆధునికతను చాటుతూ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది.

యువతలో హైబీపీ... కంటి చూపు పోయే ప్రమాదం.. జాగ్రత్త

భారతదేశంలో యువతులపై అధిక రక్తపోటు పెరుగుతోంది, ఇది వారి దృష్టి మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. అవగాహన మరియు నివారణ కీలకం.
Advertisement

డ్రీమ్ ఫోల్క్స్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న బ్యాంకింగ్ సంస్థలు..!

డ్రీమ్‌ఫోక్స్ మరియు ఆర్థిక సంస్థల మధ్య వివాదం కారణంగా భారతదేశంలో విమానాశ్రయ లౌంజ్ సేవలలో అంతరాయం ఏర్పడింది. పరిష్కార ప్రయత్నాలు జరుగుతున్నాయి.

స్టార్ హోటల్స్ లో ఏఐ .. హౌస్ కీపింగ్ లో మానవ సామర్ధాన్ని మించి..

భారతీయ హోటళ్లలో AI ఆధారిత హౌస్‌కీపింగ్ రోబోట్స్ అతిథుల అనుభవాలను మరియు ఆపరేషనల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి, ఇది ఆతిథ్య పరిశ్రమలో మార్పును సూచిస్తుంది.

టాటా మోటార్స్ కొత్త ప్లాన్..అప్డేట్ అవుతున్న టాటా సఫారి

భారతదేశ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ వివిధ హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. ఇవి పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల దేశీయంగా కంపెనీ సరికొత్త హారియర్ ఈవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు అప్‌డేట్ చేసిన సఫారి ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురావడానికి లోపల లోపల ఏర్పాట్లు చేసుకుంటోంది.

కొత్త స్పోర్ట్ అవతారంలో హోండా సిటీ.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

హోండా (Honda) సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీకి తాజాగా ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. కంపెనీ వినియోగదారులను ఆకట్టుకోవడానికి "సిటీ స్పోర్ట్ ఎడిషన్ (city Sport Edition)"ను తీసుకొచ్చింది. ఇది కేవలం మరో ఎడిషన్ మాత్రమే కాదు, హోండా క్లాసిక్ డిజైన్‌కి స్పోర్టీ యాటిట్యూడ్‌ జోడించిన వినూత్న ప్రయత్నం. ఈ కొత్త స్పోర్ట్ ఎడిషన్ కార్ ఎక్స్‌టీరియర్ నలుపు రంగు యాసలతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. గ్రిల్, బంపర్, సైడ్ మిరర్లు వంటి అంశాలపై గ్లోస్సీ బ్లాక్ టచ్ స్పోర్టీగా కనిపిస్తాయి. నైపుణ్యాన్ని చాటుతాయి. అంతే కాక, లోపలికి వెళితే, ఎరుపు రంగు హైలైట్‌లతో కూడిన ఇంటీరియర్ డిజైన్ ఈ కారుని ప్రీమియంగా, స్పోర్టీగా మార్చేస్తుంది. ఇది నేటి యువతకు నచ్చేలా కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.

వోల్వో S90 కి ఇక ఇండియాలో గుడ్ బై.. ఇకపై అంతా ఎస్‌యూవీలేనట..

వోల్వో కంపెనీకి చెందిన S90 అనే మిడ్‌సైజ్ లగ్జరీ సెడాన్ కారును ఇండియాలో అమ్మకాలు ఆపేసినట్లు సమాచారం. ఆ కారును వాళ్ళ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇండియా శక్తి ఇక్కడి ప్రజలే- వృధి అభివృద్ధి పథంలో దూసుకెళుతోన్న భారత్: ప్రణవ్ అదానీ

గౌతమ్ అదానీ 2047 కోసం భారతదేశ వృద్ధి లక్ష్యాలపై అవగాహనను పంచుకుంటూ, శక్తి, మౌలిక సదుపాయాలు మరియు సమగ్ర అభివృద్ధిని ప్రాముఖ్యతనిస్తారు.

తక్కువ బడ్జెట్‌కి టాప్ రేంజ్ EV.. జెలియో లెజెండర్ ఫీచర్లు అదుర్స్!

భారతదేశంలోని వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో కొత్త టూవీలర్ ఇటీవల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఈవీ తయారీదారు అయినటువంటి జెలియో (ZELIO) కంపెనీ తమదైన ఫీచర్లతో కూడిన తక్కువ ధరలో, తక్కువ వేగంలో సురక్షితంగా ప్రయాణించాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని గతంలో లెజెండర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు దీనికి అప్‌డేట్‌గా అదే స్కూటర్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌‌ను విడుదల చేసింది. ఇప్పటికే జెలియో బ్రాండ్ చిన్న పట్టణాలు, నగరాల్లో తనకంటూ ఒక ప్రాధాన్యం ఏర్పరచుకుంటుండగా, ఈ కొత్త మోడల్ మరింత మందిని ఆకట్టుకునేలా ఉంది. ఈ స్కూటర్ మూడు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంది, దీని ద్వారా వినియోగదారులు తమ ప్రయోజనాలకు అవసరం ఉన్న దాన్ని ఎంచుకోవచ్చు.

టీవీఎస్ జోరు, హోండా దూకుడు.. కానీ హీరోనే కింగ్!

ప్రపంచంలోనే టూ వీలర్లు (బైకులు, స్కూటర్లు) ఎక్కువగా అమ్ముడయ్యే దేశాల్లో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో ప్రతి నెలా లక్షల్లో టూ-వీలర్లు అమ్ముడవుతున్నాయి. గత మే నెలలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. గత మే నెలలో ఎక్కువ మంది కొన్న మొదటి 10 టూ-వీలర్లు అన్నీ కలిపి దాదాపు 12లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. కచ్చితంగా చెప్పాలంటే టాప్-10లో ఉన్న టూ-వీలర్ల మొత్తం అమ్మకాల సంఖ్య 11,84,386.
Advertisement

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా - లివర్ డేంజర్ లో ఉన్నట్లే, వెంటనే..!!

ఆరోగ్య నిపుణులు కాలేయ నష్టానికి సంబంధించిన లక్షణాలను, పసుపు మరియు అలసట వంటి వాటిని గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను, సమర్థవంతమైన ప్రారంభ జోక్యానికి గుర్తిస్తున్నారు.

రిలీజ్ కాకముందే రికార్డు.. టెస్సెరాక్ట్ EV స్కూటర్‌కు జనం బ్రహ్మరథం!

ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో అల్ట్రావయోలెట్ (ultraviolette) ఆటోమోటివ్ ఇప్పటికే తనదైన గుర్తింపు పొందింది. దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖులు భాగస్వాములుగా ఉండటంతో పాటు, కంపెనీ పరిచయం చేసిన స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్‌కి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఈ సంస్థ నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ త్వరలో రాబోతుంది. ఈ మోడల్ పేరు టెస్సెరాక్ట్ (tesseract). కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకునేందుకు వినియోగదారులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇప్పటికే 70,000 బుకింగ్‌లు నమోదయ్యాయి. ఈ డిమాండ్‌ను చూస్తే, ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎంత భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నదో స్పష్టమవుతుంది. దీన్ని డెలివరీలు 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్: చూడటానికి అదిరిపోతుంది, కానీ ధర కూడా ఎక్కువే!

అమ్మకాలు లేక అల్లాడుతున్న హోండా కంపెనీకి ఇప్పుడు కొత్త ఉత్సాహం రాబోతుంది. అందుకు కారణం భారత మార్కెట్లోకి సరికొత్త కారు రాబోతుండడమే. ప్రస్తుతం అమేజ్, సిటీ, ఎలివేట్ అనే మూడు మోడళ్లతోనే మార్కెట్లో గట్టిగా నిలబడటానికి ప్రయత్నిస్తున్న ఈ జపనీస్ బ్రాండ్ ఈ కొత్త కారుతో దేశంలో మళ్ళీ జోరు పెంచడానికి రెడీ అవుతుంది.

గ్లాంజా పేరు చెప్పగానే అమ్మకాలు పరిగెడుతున్నాయ్!

దేశీయంగా, అంతర్జాతీయంగా కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీ టయోటా (Toyota) తన మోడల్ గ్లాంజా (Glanza)కు సంబంధించి సేల్స్ వివరాలను వెల్లడించింది. అమ్మకాల నివేదిక ప్రకారం, గ్లాంజా భారతీయ మార్కెట్లో తన స్థిరమైన ప్రదర్శనతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో గ్లాంజా ఇప్పటికే బలమైన స్థానం ఏర్పరచుకుంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ విజయానికి మరో నిర్ధారణగా నిలిచాయి. 2025 మేలో టయోటా గ్లాంజా 4,753 యూనిట్లను విక్రయించగలిగింది, ఇది గత సంవత్సరం అదే నెలలో నమోదైన 4,517 యూనిట్లతో పోల్చితే దాదాపుగా 5 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఈ వృద్ధి కంపెనీకి ఖచ్చితంగా ఊతమిచ్చే అంశం. ఇది కేవలం వార్షికంగా మాత్రమే కాదు, నెలవారీ సేల్స్‌లో కూడా కనిపించింది.

క్రాష్ టెస్ట్‌లో పాస్ అవ్వడమే కాదు.. టాప్ స్కోర్ కొట్టింది!

బ్రెజిల్‌లో తయారుచేసిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టెర్రా సేఫ్టీ విషయంలో అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించింది. ఈ కారును ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్ల కోసం ప్రత్యేకంగా తయారుచేశారు. బ్రెజిల్‌లో దీని డెలివరీలు రీసెంటుగా మొదలయ్యాయి.