తక్కువ ధర, ఎక్కువ సీట్లు.. మే 2025లో మారుతీ ఈకో దూసుకెళ్లింది
ఆటోమొబైల్స్
- 1 year, 4 month, 3 days ago
భారతదేశంలో ఇటీవల కార్ల మార్కెట్‌లో 7 సీట్ల కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. పెద్ద కుటుంబాలు కలిగినవారికి వీటిలో ప్రయాణించడం సౌకర్యంగా ఉండటంతో, ఈ తరహా కార్లు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా, తక్కువ ధరలో, ఎక్కువ సీట్లు కలిగిన కార్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఈ విభాగాన్ని ఎంచకుంటున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీకి చెందిన కార్లు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. మారుతీ సుజుకీ విక్రయించిన మొత్తం వాహనాల సంఖ్య మే 2025లో 1,80,077 యూనిట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే 3 శాతం పెరుగుదలగా చెప్పొచ్చు. మే 2024లో మారుతీ 1,74,551 వాహనాలను విక్రయించిన సంగతి గమనార్హం.