యమహా నుంచి యువత కోసం అదిరిపోయే స్కూటర్.. స్మార్ట్ ఫీచర్లతో ఏరోక్స్ 155 విడుదల!

యమహా (Yamaha) తన ప్రీమియం బ్రాండ్ క్యాంపెయినింగ్ 'ది కాల్ ఆఫ్ ది బ్లూ'లో భాగంగా తాజాగా 2025 ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్ మోడల్‌కు ఆకర్షణీయమైన కొత్త రంగులను ఇంట్రడ్యూస్ చేసింది. నేటి సిటీ యువత లైఫ్‎స్టైల్‎కు సరిపోయేలా రూపొందించిన ఈ ఏరోక్స్ 155 వాస్తవంగా యమహా పర్ఫామెన్స్, డిజైన్, ఇన్నోవేషన్ పట్ల ఉన్న అభిరుచిని ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త స్కూటర్ గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త ఈవీ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కి.మీలు..

పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రయాణ ఖర్చులు భారం అనుకునే వారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో ఈవీ తయారీదారులు వరుసగా కొత్త కొత్త కార్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎంజీ మోటార్స్ (Mg motors) నుంచి సరికొత్త ఈవీ కారు మార్కెట్లోకి విడుదలైంది. ఆ మోడల్ పేరు విండ్సర్ ఈవీ ప్రో (windsor ev pro). దేశీయ ఎలక్ట్రిక్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోటీ పెరిగిన కారణంగా కంపెనీ ఈ అదిరిపోయే మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ కారు మార్కెట్లోకి విడుదల అయింది. ఇది ప్రస్తుత వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరను రూ.17.49 లక్షలుగా నిర్ణయించారు.

కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్‌లకు పోటీగా MG M9 ప్రీమియం MPV!

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా మోటార్స్ సృష్టించిన సంచలనానికి మించి ఏదైనా ఉందంటే అది ఎంజీ సొంతం. జెడ్ఎస్, కామెట్, విండ్‌సర్‌ వంటి మోడళ్లతో నిశ్శబ్ద విప్లవం సృష్టించిన ఈ బ్రాండ్ ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది. సామాన్యులకు చేరువైన ఈ కంపెనీ ఇకపై కాస్త ప్రీమియం మోడళ్లపై దృష్టి సారించనుంది.

రూ.35 వేల జీతం ఉన్నవారు ఈ కార్లను ఈజీగా కొనచ్చు.. మైలేజ్‌లో రారాజులు

భారతీయ కుటుంబాల్లో కారుకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఒకప్పుడు బైక్ ఉంటేనే గొప్ప అనుకునే రోజులు. కానీ రాను రాను పరిస్థితి మారిపోయింది. ఇంట్లోని అందరు కలిసి బస్సులు, రైళ్లలో ప్రయాణించే బదులు కారులో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా వెళ్లవచ్చని ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు రావడంతో కొత్త కారును కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు తమకు అందుబాటులో ఉండే ధరలో లభించే కారును కొనాలని చూస్తుంటారు. ప్రధానంగా నెలకు జీతం రూ. 35,000 సంపాదించే వారు తక్కువ ధరలో మంచి పెర్ఫామెన్స్ అందించే కారును కావాలని అనుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ జీతం సంపాదించే వారికి కూడా అందుబాటులో ఉండే ధరలో చాలా కార్లు ఉన్నాయి. మరి ఆ కార్ల గురించి ఒకసారి కింది కథనంలో తెలుసుకుందాం.
Advertisement

షాకింగ్ న్యూస్! ఈ మహీంద్రా XUV700 ఇకపై లేదు!

మహీంద్రా థార్, స్కార్పియో తర్వాత భారతదేశంలో సంచలనం సృష్టించిన మహీంద్రా ఎస్‌యూవీలలో XUV700 (Mahindra XUV700) ఒకటి. నిజానికి, కంపెనీ నేటి ఇమేజ్‌కు ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారణమని చెప్పవచ్చు. XUV500ని హఠాత్తుగా నిలిపివేయడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే, దాని స్థానంలో వచ్చిన వాహనంతో చాలా మంది పాత చీతాను కూడా మరిచిపోయారు.

డిఫెండర్‌కు డిమాండ్ పెరుగుతోంది.. లిస్ట్‌లోకి చేరిన రాహుల్ దేవ్

సినిమా తారలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తల లగ్జరీ లైఫ్‌స్టైల్ వేరే విధంగా ఉంటుంది. వారు ఖరీదైన కార్లలో తిరగడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కోట్లు విలువ చేసే కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ కొత్తగా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ ఆటో ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఆయన కొనుగోలు చేసిన కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ కారు గురించిన వివరాలను ఈ కింది కథనంలో తెలుసుకుందాం.

మండే ఎండలో హోండా స్పెషల్ గిఫ్ట్.. సమ్మర్ స్పెషల్ కారు వచ్చేసింది

భారత ఆటోమొబైల్ రంగంలో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తన అమ్మకాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సిటీ, అమేజ్ సెడాన్లు, తాజా ఎలివేట్ SUVలను విక్రయిస్తున్న కంపెనీ గత కొంత కాలంగా ఇతర తయారీదారులకు బలమైన పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన కార్లను తీసుకొస్తుంది. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హోండా కొత్తగా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్, స్టాండర్డ్ వేరియంట్ కంటే మరింత స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన కలర్స్, సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఎలివేట్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించడమే కాక, SUV ప్రియులను ఆకట్టుకోవడంలో ఈ ఎడిషన్ కీలక పాత్ర పోషించనుంది. ఈ కొత్త మోడల్ విడుదల ద్వారా హోండా, భారత మార్కెట్లో తిరిగి తన స్థానం నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

33 కి.మీ మైలేజ్, 6 లక్షలకే 5 సీట్ల కారు.. రికార్డు స్థాయిలో మారుతి డిజైర్ అమ్మకాలు

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) ఇది ఒక పాపులర్ సెడాన్. ఇది దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. అట్రాక్టివ్ డిజైన్, ఎక్కువ ఫీచర్లు, అందుబాటు ధరలో లభించడం దీని ప్రత్యేకత. తాజాగా విడుదల అయిన ఏప్రిల్ 2025 అమ్మకాల నివేదిక ప్రకారం.. అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో హ్యుందాయ్ క్రెటా తర్వాత రెండో స్థానంలో మారుతి డిజైర్ నిలిచింది.

స్మార్ట్ మైలేజ్ కోసం మారుతీ కొత్త హైబ్రిడ్ కార్లు త్వరలో రాబోతున్నాయ్!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) ఆటోమొబైల్ మార్కెట్‌పై తన పట్టును సాధించడానికి కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. కంపెనీ 2025 నాటికి పలు కొత్త SUV మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని తన వ్యూహాన్ని ప్రకటించింది. దేశంలో SUV మద్దతు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, మారుతీ ఈ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలని చూస్తుంది. దీనిలో భాగంగా మొదటగా మార్కెట్లోకి రాబోతున్న మోడల్ Suzuki e-Vitara. ఇది మారుతీ సుజుకీ నుంచి రానున్న తొలి పూర్తి ఎలక్ట్రిక్ SUV కావడం విశేషం. ఈ మోడల్‌ను 2025 సెప్టెంబర్‌లో కంపెనీకి చెందిన Nexa ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఒక్క ఛార్జ్‌తో 460 కి.మీ రేంజ్! రేపు వస్తున్న MG ఎలక్ట్రిక్ SUV గురించి తెలుసా?

ఎంజీ మోటార్స్ విడుదల చేస్తున్న కార్లకు మార్కెట్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తూ మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది ఎంజీ మోటార్స్.. చాలా రోజుల నుంచి ఓ ప్రస్టేజియస్ మోడల్ తీసుకొస్తున్నామంటూ కంపెనీ ఊరిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం నేడు రానే వచ్చింది. ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారు విడుదలకు సమయం ఆసన్నమైంది.

కియా ఇండియా గట్టి దూకుడు.. త్వరలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు, ఈవీలు!

దక్షిణ కొరియా బ్రాండ్ కియా ఇండియా (Kia India) భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన ఉనికిని మరింత బలపరిచే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే దేశీయంగా పలు ఆకర్షణీయమైన మోడళ్లతో మార్కెట్లో స్థిరమైన గుర్తింపు పొందిన కియా, ఇప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేయడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలోకి అడుగుపెడుతూ తన వ్యాపారాన్ని మరింత పెంచుకుంటుంది. మార్కెట్లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలు చేసింది. 2025, 2026 మధ్య కాలంలో, భారతీయ వినియోగదారుల కోసం కియా నాలుగు ప్రధాన మోడళ్లను లాంచ్ చేయనుంది. ఈ మోడళ్లు కేవలం డిజైన్ పరంగా మాత్రమే కాకుండా, టెక్నాలజీ, పనితీరు, వినియోగదారుని అనుభవాన్ని మెరుగుపరిచే అంశాల పరంగానూ ప్రతిష్టాత్మకంగా ఉండే అవకాశముంది.

టాటా కర్వ్‌కు పోటీ ఇవే.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న SUVలు!

టాటా కర్వ్ (Tata Curvv) త్వరలో విడుదల కానున్న ఒక ముఖ్యమైన కూపే ఎస్యూవీ. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లీటరుకు 11 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది. ఇందులో 5 సీట్లు ఉంటాయి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
Advertisement

2025 టీవీఎస్ స్పోర్ట్ ES వేరియంట్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది

దేశీయ టూవీలర్ విభాగంలో ప్రముఖ కంపెనీ టీవీఎస్ (TVS) నుంచి విడుదలైన వాహనాలకు ఎప్పటికప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ ధర, మంచి మైలేజ్, నగర, గ్రామీణ ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం కారణంగా ఈ కంపెనీ బైకులు, స్కూటర్లకు దేశంలో ఆదరణ లభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, టీవీఎస్ మోటార్ కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి కొత్త కస్టమర్లను సంపాదించడానికి తాజాగా 2025 స్పోర్ట్ ES+ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త అప్‌డేట్‌లో ప్రధానంగా దీని ఇంజిన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. దీన్ని OBD-2B నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. దీంతో ఈ బైక్ నుంచి తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలు విడుదల అవుతాయి.

ఏప్రిల్‌లో టీవీఎస్ రికార్డ్ బ్రేకింగ్ అమ్మకాలు! ఎందుకంత డిమాండ్?

దేశీయంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అద్బుతమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. హోండా, హీరో, బజాజ్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ, టీవీఎస్ ఏకంగా 16 శాతం వృద్ధిని సాధించడం విశేషం.

ఇండియన్ మార్కెట్‌లో సెన్సేషన్.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO అమ్మకాల జోరు!

మహీంద్రా ఎక్స్‎యూవీ 3XO భారతీయ ఆటో మార్కెట్లో తన మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 29న విడుదలైన ఈ మోడల్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయింది. విడుదలైనప్పటి నుంచి ఇది అద్భుతమైన అమ్మకాల సంఖ్యలను నమోదు చేస్తోంది.

క్లాస్ మాస్ ఎవరికైనా నచ్చే స్కూటర్.. టీవీఎస్ నుంచి మరో అదిరిపోయే మోడల్ వచ్చేస్తోంది

టీవీఎస్ ఐక్యూబ్(TVS iQube) ఒక పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో పాటు, అందుబాటు ధరలో కూడా లభిస్తోంది. అందుకే ఇది మన దేశంలో ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతోంది. వినియోగదారులు కూడా దీన్ని ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ఐక్యూబ్ ఈ-స్కూటర్ 5 వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

బడ్జెట్ రెడీ చేసుకోండి.. అదిరిపోయే టాటా కొత్త కారు వచ్చేస్తుంది!

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొవడానికి కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారుల నుంచి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త కస్టమర్లకు మరింత చేరువ కావడానికి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ అయిన ఆల్ట్రోజ్‌ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు చేసింది. ఈ కొత్త కారు కంపెనీ అమ్మకాలను పెంచడానికి కీలకం కానుంది. దీనికి సంబంధించిన మొదటి టీజర్‌ను మే 22న విడుదల చేసింది. ఈ టీజర్‌తో పాటు, ధర ప్రకటనకు ముందు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై కొంత స్పష్టత వచ్చింది.

ఎప్పుడూ ఫేవరెట్… మళ్లీ దూసుకొచ్చింది.. అమ్మకాల్లో దుమ్ములేపిన స్విఫ్ట్

ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు మొదటి ఎంపికగా నిలిచిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ (maruti suzuki Swift) గత నెల అమ్మకాల్లో మంచి పెర్ఫామెన్స్‌ను చూపింది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2025లో ఈ కారు దాదాపు 14,592 మంది కస్టమర్లను ఆకర్షించి, అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో ఇది 7వ స్థానంలో నిలిచింది. ఆకట్టుకునే డిజైన్, నమ్మకమైన పనితీరు, మైలేజ్ కెపాసిటీ వంటి అంశాలతో స్విఫ్ట్ మరోసారి వినియోగదారులను ఆకట్టుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుుడు అప్‌డేట్ అవుతూ వస్తున్న ఈ కారు భారతీయ ప్రజలను ఆకర్షించడంలో బాగా విజయవంతం అయింది. ఇది కేవలం ఓ హ్యాచ్‌బ్యాక్ కారు కాదు, రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.

7 సీటర్ కారు కొనాలనుకుంటున్నారా? మారుతి ఎర్టిగా ధర పెరిగినా బెస్ట్ ఆప్షనేనా?

హ్యాచ్‌బ్యాక్ అయినా, ఎస్యూవీ అయినా, ఎంపీవీ అయినా.. భారతీయులు మొదట చూసేది ఆ బాడీ స్టైల్‌లో మారుతి కారు ఉందా లేదా అని.. ఒకప్పుడు మారుతికి అంత పట్టులేని ఎస్ యూవీ సెగ్మెంట్లో కూడా ఇప్పుడు గట్టిగా నిలదొక్కుకుంది. ఇక ఎంపీవీ సెగ్మెంట్‌లో మారుతికి ఒకటి కంటే ఎక్కువ మోడళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ఎర్టిగా అనే ఒక్క మోడల్ ఈ సెగ్మెంట్‌ను ఏలుతోంది.

ఫ్యామిలీ కార్‌కి కొత్త నిర్వచనం.. 15,780 మంది ఎంచుకున్న ఎర్టిగా!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌‌లో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో తాజాగా తన కార్ల అమ్మకాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో 7 సీటర్ కారు అయినటువంటి ఎర్టిగాకు సంబంధించిన అమ్మకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఏప్రిల్ 2025లో ఎర్టిగా(Ertiga) మరోసారి తన సత్తా చాటుతూ అత్యధిక డిమాండ్ ఉన్న 7-సీటర్ల వాహనంగా నిలిచింది. నెల మొత్తం అమ్మకాల పరంగా దేశవ్యాప్తంగా టాప్ 10 కార్ల జాబితాలో, ఈ కుటుంబ ప్రయాణ వాహనం నాలుగవ స్థానాన్ని అందుకుంది. ఈ అమ్మకాలను చూసినట్లయితే భారతీయ కుటుంబాల హృదయాలను ఆకర్షించిన మల్టీ పర్పస్ వాహనాల పట్ల ఉన్న డిమండ్‌కు నిదర్ననంంగా నిలుస్తోంది.
Advertisement

ఇక అంతా ఎలక్ట్రిక్ యుగమే.. MG కార్లకు పెరుగుతున్న ఆదరణ!!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తూ ఎంజీ మోటార్ దూసుకుపోతోంది. ZS EVతో మొదలైన ఈ ప్రయాణం ఆ తర్వాత కామెట్ (Comet), విండ్‌సర్ (Windsor) రాకతో ఊహించని మలుపు తిరిగింది. ఒకప్పుడు డీలా పడిన అమ్మకాలను ఈ రెండు మోడళ్లే చక్కదిద్దాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో సంచలనం.. ఎంజీ విండ్సర్ ప్రో వచ్చేస్తోంది

ఎలక్ట్రిక్ వాహనాలతో భారతదేశంలో సంచలనాలు సృష్టిస్తున్న ఎంజీ మోటార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనా మూలాలు ఉన్నప్పటికీ, బ్రిటిష్ వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ బ్రాండ్‌ను భారతీయులు సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ZS EV, కామెట్ EV, విండ్‌సర్ EV అనే మూడు ఎలక్ట్రిక్ కార్లు కంపెనీ శ్రేణిలో ఉన్నాయి.

తిరిగి సింహాసనంపై క్రెటా! హ్యుందాయ్‌ కారుకు ఏప్రిల్‌లో భారీ డిమాండ్

దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ ఇండియాలో కూడా చాలా కార్లను విక్రయిస్తూ టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులు బలమైన పోటీదారుగా నిలుస్తుంది. అమ్మకాల పరంగా ఈ కంపెనీ మెరుగైన గణంకాలను సాధిస్తూ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంది. తాజాగా ఏప్రిల్ 2025లో, హ్యుందాయ్‌కి చెందిన క్రెటా (Hyundai Creta) భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. వరుసగా రెండవ నెలలోనూ ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అమ్మకాల నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2025లో క్రెటా 17,016 యూనిట్లు అమ్ముడుపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 10.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది భారత వినియోగదారుల్లో క్రెటా కోసం ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.

SUVలకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏప్రిల్ 2025లో టాప్ 10 అమ్మకాల్లో SUVలే ఎక్కువ!

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వాహన మార్కెట్లలో ఒకటి. ఇక్కడ ప్రతి నెలా వేల సంఖ్యలో కార్లు అమ్ముడవుతుంటాయి. ఏప్రిల్ నెలలో భారీ సంఖ్యలో కార్లు అమ్ముడుపోయాయి. తాజాగా దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా విడుదలైంది. ఎప్పటిలాగే మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ హ్యుందాయ్ మోడల్ ఒకటి నంబర్ వన్‌గా నిలిచింది. అలాగే టాటా, మహీంద్రా కార్లు కూడా మంచి సంఖ్యలో అమ్ముడయ్యాయి.

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. MG విండ్‌సర్ EV vs టాటా నెక్సాన్ EV ఏది బెస్ట్ ?

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో విసిగిపోయిన ప్రజలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ దూసుకుపోతుంది. ప్రతి నెలా రికార్డు స్థాయిలో ఈవీలను టాటా డెలివరీ చేస్తోంది.