జైలులో ఉన్న సుకేశ్.. రోల్స్ రాయిస్ స్పెక్టర్ కొన్నాడట..!

దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల మోసాలతో సంచలనం సృష్టించిన వారిలో సుకేశ్ చంద్రశేఖర్ పేరు వినని వారుండరు. దాదాపు రూ.200 కోట్ల కోట్ల విలువైన దోపిడీ రాకెట్‌కు సంబంధించి అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా అతను చేసిన పని సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేస్తోంది. సాధారణంగా జైల్లో ఉన్న వ్యక్తి జీవితానికి సంబంధించిన వార్తలు మామూలుగా ఉంటాయి. కానీ సుకేశ్ మాత్రం మరో లెవెల్‌లోకి వెళ్లిపోయాడు. ఒక జైలులో ఉన్న వ్యక్తి అత్యంత ఖరీదైన విలాసవంతమైన కారు కొనుగోలు చేశాడు. జైల్లో ఉన్న ఒక వ్యక్తి కారును ఎలా కొనుగోలు చేశాడా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

బ్రేక్ లేకుండా మహీంద్రా అమ్మకాలు.. ఏప్రిల్‌లో 52,330 SUVలు!

భారతీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా తాజాగా ఏప్రిల్ 2025లో నమోదు చేసిన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, మహీంద్రా గత నెలలో 50,000కు పైగా SUVలను విక్రయించి మరోసారి తన దూకుడు కొనసాగించినట్లు తెలుస్తోంది. భారతదేశంలోని వినియోగదారులు హై-రైడింగ్, బలమైన రూపంలో ఉన్న SUVలపై చూపుతున్న ప్రేమ కారణంగా మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్‌లకు అమ్మకాలు మెరుగ్గా నమోదవుతున్నాయి. స్కార్పియో, బొలెరో, థార్, ఎక్స్‌యూవీ700, ఎక్స్‌యూవీ300 వంటి పాపులర్ మోడల్స్‌కు గల ఆదరణ, మార్కెట్లో మహీంద్రాకు ఉన్న స్థిరమైన డిమాండ్ కారణంగా దేశీయ ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ సాధించడానికి వీలైంది. ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వచ్చిన కొత్త SUV మోడళ్లకీ మంచి స్పందన లభిస్తోంది. దీంతో మహీంద్రా మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకుంటూ పోతుందని అంచనా వేయవచ్చు.

హీరో షాక్.. ఒక్క నెలలో సగానికి పడిపోయిన అమ్మకాలు.. అసలేం జరిగింది ?

మనదేశంలో నంబర్ వన్ టూ-వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ అన్ సంగతి మనందరికీ తెలిసిందే. స్కూటర్ల అమ్మకాలు పెద్దగా లేకపోయినా, హీరో మోటోకార్ప్ బైక్‌ల అమ్మకాల్లో మాత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

టయోటా హైక్రాస్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ వచ్చేసింది! ధర, ఫీచర్లు ఇవే

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టయోటా తన ప్రముఖ MPV మోడల్ అయిన ఇన్నోవా హైక్రాస్‌కు ఓ ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. "ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్" అనే పేరుతో ఈ వేరియంట్ మే 2025 నుంచి జూలై 2025 మధ్యకాలంలో మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉండనుంది. ప్రీమియం డిజైన్‌ను ప్రాతినిధ్యం వహించే ఈ మోడల్‌ ధర రూ. 32.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించబడింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఇన్నోవా హైక్రాస్‌ టాప్-ఎండ్ ZX (O) వేరియంట్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇది రెండు ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌ సూపర్ వైట్, పెర్ల్ వైట్‌లలో అందించబడుతోంది. ఇది బ్లాక్ కలర్‌తో స్టైలింగ్ హైలైట్స్, బాడీపై ప్రత్యేక డిజైన్‌తో సాధారణ మోడళ్లకంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
Advertisement

ఇండియాలో హాట్ ఫేవరెట్ SUV ధర పెంచిన స్కోడా!

భారతీయులను ఆకర్షించేందుకు తక్కువ ధరలో కొత్త కారు మోడల్‌ను స్కోడా కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దాని ధరను పెంచడం చాలా మందిని ఆశ్చర్యానికి, షాక్‎కు గురి చేస్తుంది.. స్కోడా కైలాక్ (Skoda Kylaq) అనే సబ్-కాంపాక్ట్ SUV మోడల్‌ను మొదట కేవలం రూ. 7 లక్షల 89 వేల బడ్జెట్ ధరకు ఇంట్రడ్యూస్ చేశారు.

దేశంలోనే కాదు, ప్రపంచం లోనూ వేగంగా దూసుకెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!

భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైకుకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో అందిరికి తెలిసిందే. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్రాండ్ చాలా కాలంగా ఇతర కంపెనీలకు బలంగా ఎదుర్కొని అమ్మకాల్లో దూసుకుపోతుంది. తాజాగా ఏప్రిల్ నెల ముగిసి మే నెల ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వాహన తయారీదారులు గత నెలలో సాధించిన సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. ఇప్పడు ఇదే క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన విక్రయాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఈ బ్రాండ్, 2025 ఏప్రిల్‌లో మంచి విజయాన్ని అందుకుంది. తాజా అమ్మకాల నివేదిక చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మళ్లీ తన పేరుకు తగ్గట్టే విజయాన్ని నమోదు చేసిందని స్పష్టంగా కనిపిస్తోంది.

బడ్జెట్ ధరలో అదిరిపోయే కార్లు.. అందుకే కియాకు ఇంత డిమాండా?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia).. హ్యుందాయ్ సక్సెస్ చూసి 2019లో భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అతి తక్కువ కాలంలోనే భారతదేశపు ప్రముఖ కార్ల తయారీదారుగా ఎదిగింది.

ఇదేనా కొత్త హ్యుందాయ్ వెన్యూ? టెస్టింగ్‌లో కనిపించిన నెక్ట్స్ జెన్ వెర్షన్!

భారత ఆటోమొబైల్ రంగం అభివృద్ది మరింత వేగవంతం అయింది. ప్రతి నెలా కొత్త కార్లు మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్న నేపధ్యంలో, వాహన తయారీ సంస్థలు కూడా అదే వేగంతో తమ వ్యూహాలను మార్చుకుని కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఉన్న పాపులర్ కార్లను మరింత ఆకర్షణీయంగా మార్చి తీసుకురావడంలో తయారీదారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి సమయంలో హ్యుందాయ్ నుండి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మరో కొత్త కారును భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతుంది. రాబోయే తదుపరి తరం హ్యుందాయ్ వెన్యూ 2026లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

టయోటా కార్ల జోరు.. ఏప్రిల్ అమ్మకాలు చూస్తే షాకవ్వాల్సిందే!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(Toyota Kirloskar Motor) భారతీయ మార్కెట్‌లో దుమ్ములేపుతోంది. ముఖ్యంగా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్, టైసర్, గ్లాన్జా, హిలక్స్, ఫార్చ్యూనర్, రూమియన్ వంటి మోడళ్లకు వినియోగదారుల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

గత నెలలో కార్ల అమ్మకాల్లో దుమ్ములేపిన మారుతీ.. ఎన్నో తెలుసా?

ఏప్రిల్ నెల ముగిసి మే నెలలోకి అడుగుపెట్టాం. ఈ క్రమంలో వాహన తయారీదారులు తమ అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki)తన అమ్మకాల నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం, ఏప్రిల్ 2025లో కంపెనీ మొత్తం 1,79,791 కార్లను విక్రయించింది. ఈ మొత్తంలో దేశీయంగా జరిగిన విక్రయాలతో పాటు ఇతర దేశాలకు చేసిన ఎగుమతులు కూడా ఉన్నాయి. సేల్స్ నివేదిక ప్రకారం, ఇండియా మార్కెట్లో విక్రయించిన కార్ల సంఖ్య 1,42,053గా నమోదైంది. ఇది లోకల్‌గా వినియోగదారులు మారుతీ సుజుకీ బ్రాండ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

వేసవిలో మీ కారు ఏసీ ఐస్ లా ఉండాలంటే... ఇవి తప్పకుండా తెలుసుకోండి!

ఎండలు మండిపోతున్నాయి కదా, మీ కారు ఏసీ చల్లగాలి ఇవ్వట్లేదా? అయితే ఇవే కారణాలు ఉండొచ్చు! ఇప్పుడే చూసుకోండి. ఈ ఎండాకాలంలో మీ కార్లో ఏసీ సరిగ్గా పనిచేసి లోపల చల్లగా ఉంచకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏసీ సిస్టమ్‌లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని చిన్న చిన్న రిపేర్లతో పోతాయి.

భారతదేశంలో తక్కువ ధరలో పేద-మిడిల్ క్లాస్ వారికి టాప్ బెస్ట్ కార్లు ఇవే!

ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండటంతో ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వినియోగదారులు కొత్త కారు కొనుగోలు చేసే ముందు మైలేజ్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే అధిక మైలేజ్ ఇచ్చేవి, నిర్వహణ ఖర్చులను కూడా తక్కువగా అవుతాయి. దీంతో చాలా వరకు డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే అత్యుత్తమ మైలేజ్ కార్ల జాబితాలో టాప్ కంపెనీలకు చెందిన పలు మోడళ్లు ఉన్నాయి. మైలేజ్ ఎక్కువ కావాలని కోరుకునే వారి కోసం ఈ కథనంలో భారత మార్కెట్లో మంచి మైలేజ్ అందించే 5 కార్ల గురించి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్లు ఎంటో ఒకసారి చూడండి.
Advertisement

కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ వంటి బడా బ్రాండ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్ ఖర్చు లేకుండా సిటీలో రోజూ తిరగడానికి వీలుగా ఉండటంతో స్టూడెంట్స్ ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారు.

దేశీయంగా తగ్గుదల, గ్లోబల్‌గా వృద్ధి.. హ్యుందాయ్ ఏప్రిల్ 2025 రిపోర్ట్

భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించిన హ్యుందాయ్ (Hyundai) చాలా కాలంగా వినియోగదారుల మనసు గెలుచుకుంటూ వస్తోంది. సాధారణంగా, ఈ దక్షిణ కొరియా కార్ల బ్రాండ్ భారత మార్కెట్లో నెలకు కనీసం 50,000 కార్లను విక్రయిస్తూ స్థిరమైన స్థానం ఏర్పరచుకుంది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి తయారీదారులకు బలమైన పోటీగా అధునాతన ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్‌తో కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తుంది. తాజాగా ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2025 నెలలో హ్యుందాయ్ అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడింది. ఏప్రిల్‌లో హ్యుందాయ్ భారతదేశంలో కేవలం 44,374 కార్లను మాత్రమే విక్రయించింది. ఇది సాధారణ అమ్మకాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ.

ఫోక్స్‌వ్యాగన్ షాకింగ్ నిర్ణయం.. టైగూన్, వెర్టిస్ కార్లు రీకాల్!

పోలో, వెంటో వంటి మోడల్స్ నిలిచిపోవడంతో భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ కథ ముగిసిందని చాలామంది అనుకున్నారు. అయితే స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కలిసి ప్రారంభించిన టైగూన్, వెర్టిస్ మోడళ్లు కంపెనీకి మళ్లీ మంచి ఊపునిచ్చాయి. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లు పోలో కంటే ఎక్కువ డిమాండ్‌తో దూసుకుపోతున్నాయి.

స్కోడా షాకింగ్ నిర్ణయం..వేలాది కార్లను రీకాల్ చేస్తున్న కంపెనీ!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తన వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో సక్సెస్ ఫుల్ గా అమ్ముడవుతున్న స్కోడా స్లావియా, కుషాక్, కైలాక్ మోడళ్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఏకంగా 25,000 యూనిట్లను వెనక్కి పిలుస్తున్నట్లు ప్రకటించింది. ఇంత పెద్ద సంఖ్యలో కార్లను రీకాల్ చేయడానికి గల కారణం ఏమిటంటే...

శక్తివంతమైన ఫీచర్లతో ఇసుజు తొలి ఎలక్ట్రిక్ పికప్ ట్రక్

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు కంపెనీ తన మొట్టమొదటి పూర్తిగా ఎలక్ట్రిక్ వన్-టన్ పికప్ ట్రక్ - D-Max EVని తీసుకొచ్చింది. ఇటీవల దీనిని యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన 2025 కమర్షియల్ వెహికల్ షోలో ఆవిష్కరించడం ద్వారా, ఎలక్ట్రిక్ వాహనాల దిశగా ఓ కీలకమైన ముందడుగు వేసింది. ఈ ఎలక్ట్రిక్ పికప్‌ను మొదట థాయిలాండ్‌లో తయారు చేస్తోంది. ఇటీవలి కాలంలో పికప్ ట్రక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ మార్కట్లో బాగా అమ్మకాలను సాధించే అవకాశం ఉంది. ఇసుజు తన తొలి ఎలక్ట్రిక్ వాహనం, D-Max EVను ప్రస్తుత డీజిల్-ఆధారిత డి-మాక్స్ డిజైన్‌కు అనుగుణంగా, కాని ఆధునిక ఎలక్ట్రిక్ టచ్‌తో రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ మొదటిగా డబుల్ క్యాబ్ వేరియంట్‌లో అందించబడుతోంది.

గంటకు 343 కి.మీ...ఈ సూపర్‌కార్ స్పీడ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

ప్రముఖ ఇటాలియన్ సూపర్‌కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని తమ సరికొత్త మోడల్ టెమెరారియోను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దాదాపు రూ. 6 కోట్ల ధరతో విడుదలైన ఈ మోడల్, గతంలో ఎంతో ప్రజాదరణ పొందిన హురాకాన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. గతేడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ఈ సూపర్‌కార్ కేవలం 8 నెలల్లోనే భారతీయ రోడ్లపైకి రావడం విశేషం.

భారత రైల్వే షాకింగ్ డెసిషన్: స్లీపర్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే జనరల్ కోచ్‌లోకి వెళ్లాల్సిందే!

మీరు తరచూ రైలు ప్రయాణం చేసేవారు అయితే, మే 1 నుండి అమలులోకి రానున్న భారత రైల్వే కొత్త నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు, వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులు కొన్నిసార్లు స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణించేవారు. టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా, స్థానికంగా టీటీ సహాయంతో లేదా ప్రయాణ సందర్భాన్ని బట్టి అనుమతితో ప్రయాణం సాగించగలిగేవారు. కానీ ఇకపై అటువంటి వెసులుబాటు ఉండదు. భారత రైల్వే తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, మే 1, 2025 నుండి వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులను ఏసీ లేదా స్లీపర్ కోచ్‌లలోకి అనుమతించరు. కన్ఫర్మ్ టికెట్ లేకపోతే, ఆ ప్రయాణికుడు కేవలం జనరల్ (అన్‌రిజర్వ్డ్) కోచ్‌లో మాత్రమే ప్రయాణించవచ్చు.

కొండలైనా.. గుట్టలైనా.. ఈజీ ఎక్కగల 5 డోర్ల SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకునే వారికి ఆఫ్-రోడ్ SUVలంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఇవి సాధారణ రోడ్లపై సులభంగా వెళ్లగలగడమే కాకుండా, గుంతలు, దిబ్బలు, కొండ ప్రాంతాల రోడ్లపై కూడా హాయిగా ప్రయాణించేలా రూపొందించబడి ఉంటాయి. ఇక్కడ అత్యంత శక్తివంతమైన, ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ SUVలైన మహీంద్రా థార్ రాక్స్, మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా మోడళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
Advertisement

డస్టర్ మళ్లీ వస్తోంది... ఈసారి బోరియల్ రూపంలో లాంచ్ కాబోతుంది!

భారతీయులకు రెనాల్ట్ (Renault) అంటే సాధారణంగా వెంటనే గుర్తొచ్చే పేరు డస్టర్ (Duster).ఒకప్పుడు భారతదేశపు SUV మార్కెట్‌ను ఊపేసిన ఈ మోడల్, నిజంగా రెనాల్ట్ బ్రాండ్‌కు ఊపునిచ్చింది. కియా, ఎంజిలాంటి బ్రాండ్‌లు ఇంకా మార్కెట్లోకి రాకముందే, రెనాల్ట్ భారతీయుల మనసుల్లో ఈ కారుకు బలమైన డిమాండ్ ఉండేది. డస్టర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్లపై ఇప్పటికీ కొన్నిసార్లు కనపడుతుంటే దాన్ని అలాగే చూస్తిండిపోతాం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్‌లు లేకపోవడం, పోటీ బ్రాండ్‌ల హావ పెరగడం వల్ల డస్టర్ మార్కెట్‌లో నుంచి మెల్లగా మాయమయ్యింది. ఈ మోడల్ తరువాత రెనాల్ట్‌కు ఉన్న పేరు కాస్త తగ్గిపోయింది. అమ్మకాల పరంగా కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా పెద్దగా మెరుగ్గా రాణించలేకపోయింది. అ

మారుతి ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇ-విటారా రాక ఆలస్యం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి నంబర్ వన్‎గా నిలుస్తుంది. ఆ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e-Vitara) ఒకటి.

టాటా పంచ్‌కు నిస్సాన్ మాగ్నైట్‌కు గట్టి పోటీ

నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్... ఈ రెండు కార్లు వాటి బ్రాండ్‌ల తరఫున మార్కెట్లో మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే కార్లు ఎప్పుడూ మార్కెట్‌కు శుభవార్లనే అందిస్తున్నాయి. కానీ, కొనేటప్పుడు ఏది బెస్టో తేల్చుకోవడం మాత్రం కాస్త కష్టమే. నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ రెండు కాంపాక్ట్ SUVలలో ఏది బెటరో చెప్పడానికి ఓ సారి రెండింటినీ పోల్చి చూద్దాం.

రూ.7.93 లక్షలతో కొత్త వెర్సిస్ 650 వచ్చేసింది.. BS6 ఫేజ్ 2 అప్‌డేట్

జపనీస్ కంపెనీ కవాసకి (Kawasaki) ఇండియాలో చాలా ఏళ్లుగా వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. అదిరిపోయే డిజైన్లతో యూత్‌ను ఆకట్టుకునే టూవీలర్స్‌ను విడుదల చేస్తుంది. కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూనే అదే సమయంలో తన పాత వాటిని ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త అప్‌డేట్‌లను జోడించి విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన ప్రీమియం అడ్వెంచర్ టూర్ బైక్ వెర్సిస్ 650 (versys 650)ను తాజా మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్‌తో విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, కొత్త దానిలో ఆకట్టుకునే అప్‌డేట్స్ బోలేడు ఉన్నాయి. ఈ కొత్త వెర్షన్, మోడల్ ఇయర్ 2025 (MY25), భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేస్తున్న తాజా BS6 ఫేజ్ 2 OBD2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.

ఇక 40 రోజుల వెయిటింగ్ అక్కర్లేదు.. ఈవీ సబ్సిడీ కేవలం 5 రోజుల్లో మీ సొంతం!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది.