టాటా కర్వ్ సీఎన్‌జీ వస్తోంది! రోడ్డుపై తొలిసారి కనిపించిన సరికొత్త SUV

ప్రయాణికుల సేఫ్టీ పరంగా భారతదేశపు నమ్మకమైన అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata motors) గత ఏడాది అనేక కార్లను ఆశించిన మేరకు విక్రయించింది. 2024 ఏడాదిలో కొత్త లాంచ్‌లతో మార్కెట్‌ను షేక్ చేసిన కంపెనీ ఈ ఏడాదిలో కూడా పలు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు ఇప్పుడు CNG వాహనాల వైపు కూడా టాటా గట్టి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్తగా కర్వ్ సీఎన్‌జీ (Curvv cng) పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారును తాజాగా రోడ్డుపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. మహారాష్ట్రలోని పుణే నగరంలో టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఈ కొత్త కారు కెమెరాలకు చిక్కింది. ఇది టాటా CNG లైనప్‌లో చేరనున్న కొత్త మోడల్ కావడం గమనార్హం.

హైక్రాస్‌కు ఇక కష్టకాలం! స్కోడా కొత్త 7-సీటర్‌తో వస్తోంది చూడు!

ఇండియన్ మార్కెట్‌లో 7-సీటర్ కార్లకు ఒకప్పుడు టయోటా ఇన్నోవానే కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. ఇప్పటికీ క్రిస్టా, హైక్రాస్ మోడళ్లతో ఆ బ్రాండ్ తన పట్టును నిలుపుకుంది. అయితే, హైక్రాస్ టాప్ వేరియంట్ల ధర 40 లక్షలు దాటడంతో, అంత డబ్బు పెట్టేవారికి మరో ఆప్షన్‌తో స్కోడా వస్తోంది. అదే కొత్త స్కోడా కొడియాక్! ఇది నిజానికి ఒక ఫుల్-సైజ్ ఎస్‌యూవీ.

రూ.2 లక్షల లోపు బెస్ట్ లుకింగ్, అదిరిపోయే ఫీచర్స్ కలిగిన టాప్ స్కూటర్ల లిస్ట్ ఇదే!

ప్రజల రోజువారీ ప్రయాణాల కోసం టూవీలర్ కచ్చింతగా ఉండాల్సిందే. ముఖ్యంగా బైక్‌ల కంటే స్కూటర్లు కంఫర్ట్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తాయి. ఇవి పురుషులు, స్త్రీలు ఇద్దరూ సులభంగా నడిపేందుకు అనువుగా ఉండటమే మాత్రమే కాకుండా లుక్స్ పరంగా ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా స్కూటర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో దేన్ని ఎంచుకోవాలో తెలియక చాలా మంది ఆలోచనలో పడుతారు. అందుకే రెండు లక్షల రూపాయల లోపు ధరలో మార్కెట్‌లో ఉన్న కొన్ని టాప్ స్కూటర్ల గురించి మీకు అందించబోతున్నాము. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా నడిచే బలమైన స్కూటర్లు, పట్టణ స్టైల్‌కు తగ్గ మోడర్న్ లుక్‌ని కూడా కలిగి ఉంటాయి. వాటిలో కొన్ని టాప్ మోడళ్లను ఓసారి కింది కథనంలో పరిశీలిద్దాం.

బాసూ! మార్చిలో ఏ ఎస్‌యూవీలు టాప్ లేపినాయో తెలుసా?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇప్పుడు ఎవరి హవా నడుస్తోంది? చిన్న కార్లా? సెడాన్లా? కానే కాదు! ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీలదే రాజ్యం. పెద్ద సైజు, పవర్ఫుల్ లుక్స్‌తో ఇవి యువతను, ఫ్యామిలీలను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. మార్చి 2025 అమ్మకాల గణాంకాలు చూస్తే మీకే అర్థమవుతుంది..ఏ కార్లు టాప్‌లో నిలిచాయో, ఏ కంపెనీ దుమ్మురేపిందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే!
Advertisement

వచ్చేసింది బాస్..! 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో మారుతీ కొత్త గ్రాండ్ విటారా.. లుక్ చూస్తే మైండ్ బ్లాక్

భారతీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ (maruti suzuki) దేశీయంగా మరింత పట్టు సాధించడానికి తన ప్రసిద్ధ మోడళ్లను ప్రస్తుత ఏడాదిలో వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా కంపెనీ తాజాగా 2025 వెర్షన్ గ్రాండ్ విటారాను(Grand Vitara) భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే SUV విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మోడల్, తాజా అప్‌డేట్‌‌లో భాగంగా పలు ముఖ్యమైన మార్పులతో వినియోగదారుల కోసం మరోసారి వచ్చింది. ఈసారి ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి టాప్-ఎండ్ వేరియంట్లకే పరిమితమైన 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఇప్పుడు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా (స్టాండర్డ్) అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా తీసుకొచ్చింది.

మైలేజ్ మామూలుగా లేదు.. భద్రతకు ఢోకా లేదు! అందుకే మారుతి ‘బుజ్జిగాడు’ అంటే అందరికీ ఇష్టం

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక సంచలనం! కేవలం రూ. 4.23 లక్షల ప్రారంభ ధరతో, అదిరిపోయే 33.85 కి.మీ మైలేజ్‌తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌ల సేఫ్టీని అందిస్తూ.. సామాన్యుడి సొంతింటి కారుగా దూసుకుపోతోంది. ఇంత తక్కువ ధరలో ఇంతటి కాంబినేషన్ అసాధారణం కదా? అదే మారుతి సుజుకి ఆల్టో K10. ఈ బడ్జెట్ బొనాంజా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

నిన్న తాతల స్కూటర్.. నేడు మనవళ్లకు ఫేవరెట్. .. అమ్మకాలలో సంచలనం

భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఎన్నో కొత్త బ్రాండ్లు వస్తున్నప్పటికీ, బజాజ్ తన ఐకానిక్ స్కూటర్ చేతక్‌తో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బజాజ్ చేతక్ ఏకంగా 29 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

స్టైల్‌కి కొత్త డెఫినిషన్ ఇచ్చిన యమహా FZ-S Fi 2025 వెర్షన్ వచ్చేసింది

భారతదేశంలో టూవీలర్ విభాగంలో బాగా ప్రసిద్ధి చెందిన యమహా(Yamaha) చాలా ఏళ్లుగా కస్టమర్ల ఆదరాభిమానాలను పొందుతుంది. శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఈ బ్రాండ్ అనేకమందిని త‌నవైపు ఆకర్షించుకుంది. ముఖ్యంగా యూత్‌లో యమహాకు ఒక ఫ్యాన్‌బేస్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో పలు మోడళ్లతో ఆకట్టుకుంటున్న కంపెనీ 150cc విభాగంలో యమహా మళ్ళీ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. మంచి పేరు సంపాదించుకున్న FZ-S FI మోడల్ ఇప్పుడు కొత్తగా మరిన్ని అప్‌డేట్‌లతో విడుదల అయింది. 2025 Yamaha FZ-S FI మోడల్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు, టెక్నాలజీ అప్‌డేట్‌లు ఉన్నాయి. మరింత స్టైలిష్‌గా మారిన ఈ బైక్, పాత మోడల్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా కనిపిస్తుంది.

మంచాన్ని కారుగా మార్చిన మాస్టర్ మైండ్.. బెంగాల్ నవాబ్ చూపించిన మ్యాజిక్

సోషల్ మీడియా వినియోగం ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడో ఓ మూల ఏ చిన్న ఘటన జరిగిన కూడా సెకన్లలో అంతటా తెలిసిపోతుంది. ముఖ్యంగా కోట్లాది జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి రోజూ ఏదో కొత్తగా, ఆశ్చర్యంగా జరగడం చూస్తూనే ఉంటాం. కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నుండి వెలువడుతున్న వినూత్న ఆలోచనలు ట్రెండింగ్‌లోకి రావడం వలన అందిరి లాగా కాకుండా ప్రత్యేకతను కలిగి ఉండాలనే వారు వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకతను చాటుకుంటూ ఒక వ్యక్తి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు.

మీ కారు బోర్ కొట్టిందా? అయితే ఫోక్స్‌వ్యాగన్ కొత్త బాస్ వచ్చేస్తున్నాడు!

సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది! ఫోక్స్‌వ్యాగన్ తన పవర్ ఫుల్ టిగువాన్ ఆర్-లైన్‌తో మీ డ్రైవింగ్ ఎక్స్‎పీరియన్స్ కంప్లీట్‎గా మార్చేయడానికి రెడీగా ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఊహించని ఫీచర్లు, చూపు తిప్పుకోలేని డిజైన్‌తో ఈ SUV రాబోయే తరం కార్లకు బెంచ్‌మార్క్‌గా నిలవనుంది. కేవలం ప్రయాణ సాధనంగానే కాదు, మీ స్టేటస్‌కు ప్రతీకగా నిలిచే ఈ టిగువాన్ ఆర్-లైన్ ఎలాంటి విప్లవాన్ని సృష్టించనుందో చూడాలి.

టాటా నెక్సాన్ ఫైర్.. ఒక్క నెలలో 16 వేల కార్లు.. ఏంటి ఈ రేంజ్?

ప్రయాణికుల సేఫ్టీ పరంగా దేశంలో అత్యంత నాణ్యతతో కూడిన కార్లను తయారు చేసే ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) తన కార్లను భారీ సంఖ్యలో విక్రయిస్తూ మారుతీ సుజుకీ కంపెనీకి బలమైన పోటీదారుగా నిలుస్తుంది. ice ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తూ భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ప్రసిద్ధ కార్ల తయారీదారుగా అవతరించింది. మార్చి నెల ముగిసిన నేపథ్యంలో టాటా తన సేల్స్ వివరాలు విడుదల చేసింది. ఇటీవల వచ్చిన డేటా ప్రకారం, టాటా మోటార్స్ ప్రసిద్ధ మోడల్ నెక్సాన్ (nexon) కారు దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ప్రధాన కార్ల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఇది నెక్సాన్ కారుకు భారతీయ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను తెలియజేస్తుంది.

ఎక్కువ మంది ఆ కారునే కొంటున్నారంటే కారణం ఉంది.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. బడ్జెట్‌కు బెస్ట్!

చిన్నదే కానీ దీని లుక్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంటాయి. ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకున్న మారుతి సుజుకి స్విఫ్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన స్టైలిష్ లుక్, అద్భుతమైన మైలేజ్, సరసమైన ధరతో ఎన్నో ఏళ్లుగా భారతీయ కార్ మార్కెట్‌ను ఏలుతున్న ఈ హ్యాచ్‌బ్యాక్.. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలతో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
Advertisement

ఇదేమి వేలం బాబోయ్.. చైనాలో 100 టన్నుల మొసళ్ల విక్రయం!

గ్వాంగ్డాంగ్ కోర్టు రూ. 4.7 కోట్లకు 100 టన్నుల సజీవ మొసళ్లను వేలం వేస్తోంది, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు వన్యప్రాణి వ్యాపార సంక్లిష్టతలను హైలైట్ చేస్తోంది.

ఎంజీ కార్లు కొనాలంటే ఇది సరైన టైమ్! ఏప్రిల్ నెలలో రూ. 3.92 లక్షల వరకు భారీ డిస్కౌంట్స్

భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒక శక్తివంతమైన కంపెనీగా టాటా మోటార్స్ నిలుస్తూ ఉండగా, ఇటీవల కాలంలో దానికి గట్టి పోటీ ఇచ్చేలా ఎంజీ మోటార్స్(mg motors) ఎదిగింది. ZS EV అనే మోడల్‌తో ev విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రాండ్, అప్పుడే మార్కెట్‌లో తనదైన ముద్ర వేయడంలో విజయం సాధించింది. కామెట్ EV రూపంలో వచ్చిన చిన్న కారుతో యువతను ఆకట్టుకోవడమే కాదు, నగర ప్రయాణాలకు సరిపోయే వినూత్నతను చూపించింది. ఇక విండ్సర్ EV అంటూ మరో అడుగు ముందుకు వేసి, సాధారణ వినియోగదారుడి దృష్టిని సంపాదించగలిగింది. ఈ రెండు మోడల్స్ ద్వారా ఎంజి మోటార్స్ ఈవీలో టాటా కంపెనీకి గట్టి సవాళ్లను విసురుతుంది. 'చైనీస్ బ్రాండ్' అయినప్పటికి JSW గ్రూప్ పెద్ద మొత్తంలో వాటా కొనుగోలు చేయడంతో, ఇప్పుడు దేశీయంగా కంపెనీగా నిలదొక్కుకుంది.

L2: Empuraan day 12 Collection : ఎంపురాన్ 12 రోజుల కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద మోతమోగిస్తున్న మోహన్ లాల్


సింగిల్ పంచ్ తో టాటాకు కౌంటర్ ఇచ్చిన ఎంజి!

కొన్ని నెలలుగా భారతదేశంలోని ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ మార్కెట్‌ను టాటా మోటార్స్ శాసిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మారుతి సుజుకి మాదిరిగానే టాటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే, ఇప్పుడు టాటా మోటార్స్‌కు ఆందోళన మొదలైంది. దీనికి కారణం జెఎస్‌డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా.

క్లాస్‌తో కలిసిన కంఫర్ట్.. టయోటా 2025 హైరైడర్ అదిరిపోతుంది.. మైలేజ్ 27 కి.మీలు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా (Toyota)కు చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్(urban cruiser hyryder) ఒక క్లాస్ అండ్ ప్రీమియం SUV‌గా అనిపిస్తుంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద వాహన తయారీ కంపెనీలైన జపనీస్ ఆటో మేకర్ మారుతీ సుజుకీ, టయోటా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మోడల్ ఆకట్టుకునే డిజైన్‌తో పాటు, మంచి మైలేజ్‌తో బలమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ కారణంగా భారతీయ ప్రజలకు ఇష్టమైన మెడల్‌గా అవతరించింది. ముఖ్యంగా ఈ కారును మధ్యతరగతి వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ టయోటా SUV ఇప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఇప్పుడీ మోడల్ మరింత పట్టు సాధించేందుకు, మరింత కొత్తగా అప్‌డేట్ అయి మార్కెట్లోకి విడుదల అయింది.

బాలీవుడ్‌లో కొత్త సెన్సేషన్..ఖుషీ కపూర్ ఎంట్రీ అదిరింది

బాలీవుడ్‌లో ఎదుగుతున్న తారలలో బోనీ కపూర్, శ్రీదేవి కుమార్తెలు ముందు వరుసలో ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె ఖుషీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే తన అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అక్క జాన్వీ కపూర్ కంటే ఖుషీ మరింత అందంగా ఉందని అభిమానులు భావిస్తున్నారు.

స్టైలిష్ గా ఉండాలి.. పవర్‌ఫుల్‌గా దూసుకుపోవాలి! కొత్త కరిజ్మా మీ కోసమే!

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో మోటోకార్ప్, తన పాపులర్ మోడల్ అయిన కరిజ్మా శ్రేణిని మరింత ఆధునీకరించి 2025 హీరో కరిజ్మా XMR 210ని విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కాంబాట్, టాప్, బేస్ అనే మూడు వేర్వేరు వేరియంట్‌లను హీరో ప్రవేశపెట్టింది.

హ్యుందాయ్ కొత్త CNG కారు.. ధర రూ. 7.50 లక్షలు... మైలేజ్ 27.1 కి.మీలు

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా (Hyundai India) మార్కెట్లో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త కార్లను విడుదల చేస్తుంది. ఎప్పుడూ తన వినియోగదారుల అవసరాలను ముందుగానే గుర్తించి వారికి ఉపయోగకరంగా ఉండే మోడళ్లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈఎక్స్ హై-సీఎన్జీ డ్యుయో (Exter Ex Hy-CNG Duo) కారును విడుదల చేసింది. CNG కార్లపై ఎక్కువ దృష్టి పెట్టిన కంపెనీ ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ సాధారణంగా మనం చూసే పెద్ద సింగిల్ సిలిండర్‌లను కాకుండా, రెండు చిన్న సైజ్ CNG సిలిండర్‌లతో రోడ్డుపైకి అడుగుపెడుతోంది. ఈ డబుల్ సిలిండర్ వ్యవస్థ వల్ల ప్రయాణికులు సులభంగా తమ సామాన్లను ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇది నగరాలలో రోజువారీ వాడకానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Advertisement

7 సీటర్ స్కోడా దూసుకొస్తోంది! ఈసారి స్టైల్‌తోపాటు అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇవ్వనుంది

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వాహన తయారీ దారులంతా కూడా తమ కార్లను ఇండియాలోకి విడుదల చేస్తూ మార్కెట్‌ను క్రమంగా పెంచుకుని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొన్ని తయారీదారులు దేశీయంగా ఇక్కడే ప్లాంట్‌లను ఏర్పాటు చేసి వాహనాలను తయారు చేసి ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు సైతం చేస్తున్నారు. మరికొన్ని కంపెనీలు విదేశాల నుంచి విడిభాగాలను తీసుకొచ్చి ఇండియాలోనే వాటిని అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చెక్ రిపబ్లిక్ బ్రాండ్ స్కోడా (skoda) కంపెనీ సైతం భారతీయ వినియోగదారుల కోసం కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

రూ.1500 ఫైన్ కట్టే ఓపిక లేదా? అయితే కేరళకు రండి.. పీయుసీ అడిగే నాథుడే లేడు!

వాహన యజమానులు తరచుగా విస్మరించే ముఖ్యమైన విషయాలలో ఒకటి తమ వాహనానికి పొగ పరీక్ష (పొల్యూషన్ అండర్ కంట్రోల్ - పీయుసీ) చేయించడం. ఏదైనా తనిఖీలో పట్టుబడినప్పుడే చాలామంది తాము పీయుసీ చేయించలేదని అప్పుడు గుర్తు చేసుకుంటారు. అయితే, కేరళ రాష్ట్రంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.

కార్లు, బైక్స్, బంగారం, వెండి.. ఉద్యోగులకు వర్షంలా బహుమతులిచ్చిన బాస్

ఎంతో కష్టపడి కంపెనీలు స్థాపించినప్పటికి అవి అభివృద్ధిలోకి రావాలంటే దానికి బలమైన బేస్ కావాలి. ఆ బేస్ ఎవరిదంటే.. ఉద్యోగులదే. వారు చేసిన కృషి, బాధ్యత, పనిలో నిబద్ధతే సంస్థను వృద్ధిలోకి తీసుకువస్తాయి. ఏడాది పొడవునా కంపెనీలో పనిచేసే వారికి జీతం తప్ప మరేమీ రాదు. ఎలాంటి ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా ఎంతోమంది సైలెంట్‌గా కష్టపడుతూ ఉంటారు. కొన్ని అరుదైన సందర్భాల్లో కొంతమంది యజమానులు తమ ఉద్యోగులు చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రత్యేక బహుమతులు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో పలువురు ఓనర్లు తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైక్స్ గిఫ్ట్‌లుగా ఇవ్వడం గురించి వార్తల్లో చదివాం. తాజాగా ఇటీవల గుజరాత్‌లో అలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.

స్టైలిష్ గా ఉండాలి.. దూసుకుపోవాలి.. యూత్ కోసం అదిరిపోయే బైక్.

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ తన సరికొత్త, అత్యంత శక్తివంతమైన నేకెడ్ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌ట్రీమ్ 250Rను ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ప్రత్యేకంగా యువతను ఆకట్టుకునేలా రూపొందించబడింది. దీని ముందు భాగంలోని ట్రయాంగిల్ ఆటోమాటిక్ హెడ్‌ల్యాంప్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా, దూకుడుగా కనిపిస్తుంది.

4 కోట్ల హృదయాలను గెలిచిన స్ప్లెండర్ ప్లస్ లేటెస్ట్ అవతారంలో వచ్చేస్తుంది

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హీరో(Hero) భారతీయ పేద, మధ్య తరగతి వినియోగదారుల కోసం అందుబాటు ధరలో, అధిక మైలేజ్ ఇచ్చే మోడళ్లను విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైక్స్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా స్ప్లెండర్ ప్లస్ (splendor plus) కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఒక నమ్మకమైన బైక్. ప్రపంచంలోనే నంబర్ 1 మోటార్ సైకిల్‌గా ఇది ఖ్యాతి గడించింది. సాధారణంగా మార్కెట్లో ఎన్నో మోడల్స్ వచ్చి పోతూ ఉంటాయి. కానీ స్ప్లెండర్ మాత్రం దశాబ్దాలుగా తన స్థానం నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా స్ప్లెండర్ ప్లస్ యూనిట్లు అమ్ముడవడం అంటేనే, ఈ బైక్‌పై ప్రజల ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.