అమ్మకాల్లో టాటా టియాగో హవా! మార్చిలోనే 7946 యూనిట్ల సేల్స్

భారతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఒక ముఖ్యమైన స్థానం ఉంటుంది. చూడటానికి చిన్నగా, చక్కగా ఉండే ఈ వాహనాలు రోజువారీ అవసరాలకు బాగా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వర్గానికి ఇది ప్రధాన మోడల్. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటనెన్స్‌తో నగర ట్రాఫిక్ రోడ్లపై కూడా సులభంగా రయ్ మంటూ దూసుకుపోతాయి. అందుకే హ్యాచ్‌బ్యాక్ కార్లు భారత మార్కెట్లో అత్యంత ప్రజాధారణ పొందిన వాహనాలుగా ఉన్నాయి. ఇలాంటి విభాగంలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మోడల్ టాటా టియాగో (tata tiago). దేశీయ అత్యంత సేఫ్టీ కార్లను తయారు చేసే టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ కారు తొలిసారిగా 2016 ఏప్రిల్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు, అంటే సరిగ్గా తొమ్మిదేళ్లు గడిచినా, టియాగో తన అమ్మకాలతో దూసుకుపోతుంది.

టాటాకు దిమ్మతిరిగే షాకిచ్చిన కియా.. తక్కువ ధరలో 5-స్టార్ సేఫ్టీ కారు

ప్రస్తుతం భారతదేశ కార్ మార్కెట్‌లో వినియోగాదారులు సేఫ్టీకి పెద్ద పీట వేస్తున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. కియా మోటార్స్ తన పాపులర్ SUV 'సైరస్' ఇప్పుడు సేఫ్టీ విషయంలో టాటాలకే సవాల్ విసురుతోంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సొంతం చేసుకుంది. అతితక్కువ ధరతో లభిస్తున్న ఈ సురక్షితమైన SUV గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఓలా బైక్ ఎలక్ట్రిక్ మార్కెట్‌లో కాలు పెట్టింది.. మొదటి రోల్ అవుట్!

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) స్కూటర్ల విభాగంలో ఇండియాలో అగ్రస్థానంలో ఉండగా, బైక్స్ సెగ్మెంట్‌లో కూడా తన సత్తాను చాటడానికి కొద్ది నెలల క్రితం మార్కెట్లోకి రోడ్‌స్టర్ (Roadster) బైక్ మోడల్‌ను విడుదల చేసింది. స్పోర్టీ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ మోడల్ మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో వచ్చింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ X,రోడ్‌స్టర్ ప్రో అనే ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి వచ్చింది. కస్టమర్ బడ్జెట్, అవసరాల ఆధారంగా నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. రోడ్‌స్టర్ X లైనప్, ఈ మూడు మోడళ్లలోనూ అత్యంత తక్కువకు లభిస్తుంది. ఇదిలా ఉండగా, ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఈ బైక్ ఉత్పత్తి కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించిందని తాజా సమాచారం.

బాబోయ్ డిఫెండర్.. చిన్నోడు కూడా వస్తున్నాడంట! పండగే పండగ!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ అంటే సాహసం, లగ్జరీ కలగలిసిన ఒక కల. దాని పవర్ ఫుల్ లుక్, తిరుగులేని కెపాసిటీ ఎవరినైనా ఆకర్షిస్తాయి. కానీ అధిక ధర కారణంగా చాలా మందికి ఆ కారు అందని ద్రాక్షలా ఉండేది. అయితే ఇప్పుడు మీ కల నిజం కాబోతోంది! 2027 నాటికి బేబీ డిఫెండర్‌ను విడుదల చేయనున్నట్లు ల్యాండ్ రోవర్ ప్రకటించింది.
Advertisement

భారత మార్కెట్లో బెంజ్ దుమ్మురేపింది.. ఒక్క ఏడాదిలో 18,928 కార్ల విక్రయాలు

భారతదేశం ఆర్థికంగా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో బడ్జెట్ ధరలో లభించే కార్లను ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఆదాయ స్థితిగతుల్లో మార్పులు రావటం కారణంగా చాలా మంది సమాజంలో హుందాగా కనిపించడానికి ఎక్కువగా ఖరీదైన లగ్జరీ కార్లను కొంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. దీనిని రుజువు చేస్తూ, లగ్జరీ కార్ల విభాగంలో ప్రముఖమైన బ్రాండ్ అయిన మెర్సిడెస్-బెంజ్ (mercedes benz) గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్రాండ్ సాధారణంగా ఖరీదైన, విలాసవంతమైన కార్లను మాత్రమే విక్రయిస్తుంది. అయినప్పటికీ, వీటి అమ్మకాలు ఆశ్చర్యకరమైన రీతిలో పెరగడం మన దేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతోందనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తుంది.

తక్కువ ధర.. ఎక్కువ భద్రత! కొత్త ఫీచర్లతో మారుతి చిన్న కారు దుమ్మురేపుతోంది!

"మారుతి కార్లలో సేఫ్టీ లేదు" అని ఇకపై ఎవరూ అనడానికి వీల్లేదు. మారుతి సుజుకి తన పాపులర్ కారు వాగన్‌ఆర్‌లో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. కేవలం రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో వస్తున్న ఈ కారును కొనడానికి ఇంతకంటే మంచి కారణం ఇంకేం కావాలి చెప్పండి? ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం.

మీ బడ్జెట్‌లో బంగారం లాంటి కార్లు! ఒక్కసారి డ్రైవ్ చేస్తే... ప్రేమలో పడిపోతారు!

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగింది. ముఖ్యంగా కార్ల వినియోగం ఇక్కడ వేగంగా పెరుగుతుంది. ప్రజలు ఒకప్పుడు బైక్ ఉంటే చాలు అనుకునేవారు. కానీ కాలం మారింది. ప్రజల ఇష్టాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆదాయ స్థితి గతుల్లో కొంత మెరుగుదల కనిపించడం కారణంగా తమ ఆదాయం మేరకు కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు జనాలు రూ.10 లక్షల లోపు మార్కెట్లో లభించే కార్లను కొనేవారు. ఆ ధరలో మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, అధునాతన ఫీచర్లు కలిగిన హ్యాచ్‌బ్యాక్‌ కార్లు, ఎంట్రీ లెవల్ సెడాన్‌లు ఎక్కువగా అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కస్టమర్ల అభిరుచులు, వారి లైఫ్‌స్టైల్‌లా మార్పులు వచ్చాయి.

స్మార్ట్ ఫోన్ డబ్బులతో బైక్ కొనుగోలు చేయొచ్చు.. ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.30,000తగ్గింపు

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఉందా? అయితే మీకో బంపర్ ఆఫర్. హీరో విడా అదిరిపోయే ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. ఏకంగా రూ.30,000 వరకు తగ్గింపు అందిస్తోంది. మీ జేబుకు చిల్లు పెట్టకుండా స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను స్మార్ట్ ఫోన్ ధరకే ఇంటికి తెచ్చుకునే అద్భుత అవకాశం అందిస్తుంది. ఈ సూపర్ ఆఫర్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫుల్ ట్యాంక్‌తో 686 కి.మీలు.. లెజెండరీ బైక్ కొత్తగా వచ్చేసింది..! ధర చూసి షాక్ అవుతారు!

ఇండియాలో పేద, మధ్య తరగతి, ధనవంతులకు అని ప్రతి ఒక్కరికి బాగా ఇష్టమైన బైక్ ఏదంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది హీరో స్ప్లెండర్‌ (hero splendor). ఎంతోకాలంగా భారత రోడ్లపై తన దూకుడు చూపించిన ఈ బైక్, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్‌గా నిలుస్తోంది. ఇది ఓ సాధారణ బైక్ కాదు, ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక భావోద్వేగం. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించడం దీని ప్రత్యేకత పైగా పనితీరును విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. నిత్య జీవితంలో ఆఫీసు వెళ్తున్నా, ఊర్లో తిరుగుతున్నా, లేదా దూర ప్రయాణాలకైనా ఇది కలిసొచ్చే మిత్రుడే. మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను సైతం సవాల్ చేసే స్థాయిలో ఉంది.

వేసవిలో మీ కారును కాపాడుకోండి..ఇంజిన్ వేడెక్కుతోందా? 

మీ ఫోర్ వీలర్ కేవలం ఓ ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. అది మీ కుటుంబంలో ఓ సభ్యుడి లాంటిది. దాని ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా భగభగ మండే వేసవిలో మీ కారు ఇంజిన్‌ను చల్లగా ఉంచుతుంది కూలెంట్. దీని స్థాయిని నిర్లక్ష్యం చేస్తే మీ కారుకు ఎలాంటి దుర్గతి పడుతుందో తెలిస్తే... షాక్ అవుతారు. కూలెంట్ తగ్గిపోతే మీ జేబు ఖాళీ కావాల్సిందే.

పక్కవాళ్లతో పోటీ పడాలంటే ఆ మాత్రం ఉండాలి బాస్.. అందుకే సిట్రోయెన్ మూడు కార్లను దించుతోంది!

సిట్రోయెన్ లవర్స్‌కు పండగే! ఒకేసారి మూడు కొత్త కార్లను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, ఈ కొత్త సిరీస్‌లో మొదటి కారును ఎవరో కాదు.. మనందరి అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని డెలివరీ తీసుకోవడం విశేషం. ఆ వివరాలేంటో చూద్దాం

సింపుల్ కార్ నుంచి సూపర్ సేఫ్ కార్‌గా మారిన మారుతి ఈకో 2025

భారతదేశంలో అదిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki) ప్రయాణికుల సేఫ్టీకి ఇటీవల కాలంలో మరింత ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. గతంలో గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో మారుతికి తక్కువ స్కోర్లు రావడం వల్ల విమర్శలు ఎదురవ్వగా, ఇప్పుడు అదే మారుతీ కొత్త తరం డిజైర్‌కు 5-స్టార్ రేటింగ్ సాధించి ఇతర వాహన తయారీదారులకు పోటీ పరంగా గట్టిగా తిరిగి సమాధానం ఇచ్చింది. తక్కువ ధరలలో లభించే మారుతి ఆల్టో K10, సెలెరియో వంటివాటి బేస్ వేరియంట్లలో కూడా ఇప్పుడు ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తుండటాన్ని చూస్తేనే సేఫ్టీకి మారుతీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందో తెలిసిపోతుంది.
Advertisement

లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు..! రూ.59 వేలకే సంచలన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (GEML) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆంపియర్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడంలో బాగా ప్రసిద్ది చెందింది. రోజువారి అవసరాల కోసం ఉపయోగపడే మోడళ్లను తీసుకొస్తుంది. అందరికీ ఎలక్ట్రిక్ వాహనాలను చేరువ చేయాలనే దృష్టితో మరో ముందడుగు వేసింది. తాజాగా, కంపెనీ "రియో 80 (reo 80)" అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌కి పరిచయం చేసింది. దీన్ని కంపెనీ ప్రత్యేకంగా ప్రజల రోజువారి అవసరాలను చేసుకోవడానికి రూపొందించబడింది. ఇది పేద, మధ్యతరగతి వారు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో లభిస్తుంది. పెట్రోల్ ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో ఇది అందరికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

బోర్ కొట్టే కార్లకు టాటా చెప్పేయండి..2025 కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే !

బోర్ కొట్టే సెడాన్లకు గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది ! 2025లో కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా నడవబోతోంది! అదిరిపోయే లుక్స్‌తో, లేటెస్ట్ టెక్నాలజీతో మీ డ్రీమ్ కారు రెడీ అవుతోంది. ఎలక్ట్రిక్ వైపు చూస్తున్నారా? హైబ్రిడ్ అంటే ఇష్టమా? లేక పాత ముంతే ముద్దు అంటారా? మీ టేస్ట్ ఏదైనా సరే.. 2025లో లాంచ్ అయ్యే ఈ టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు మాత్రం మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మళ్లీ వచ్చింది లెజెండరీ బైక్.. 2025 ప్యాషన్ ప్లస్ అదిరిపోయే లుక్‌తో

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ (Hero Motocorp) భారతదేశంలో ప్రజల రోజువారి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే బైక్‌లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది. మంచి మైలేజ్, ఆకట్టుకునే డిజైన్లతో ప్రతి ఏడాది సరికొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంది. తాజాగా కంపెనీ అప్‌డేట్ ఫీచర్స్‌తో కూడిన 2025 ప్యాషన్ ప్లస్‌ (passion plus) బైకును విడుదల చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ కొత్త OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని టూవీలర్ తయారీ కంపెనీలు లాంచ్ చేస్తున్న మోడళ్లను పర్యావరణ హితంగా తయారు చేయాలన్న భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. 2025లో లాంచ్ అయిన దాదాపు అన్ని కూడా ఈ విధంగానే విడుదల అవుతున్నాయి.

టెక్నాలజీతో సేఫ్ జర్నీ ఎలా చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీకోసమే!

ప్రస్తుత కాలంలో మహిళల భద్రత ఒక పెద్ద ప్రశ్నార్థకం. చట్టాలు ఎన్ని ఉన్నా, ఒంటరిగా తిరగడానికి భయపడే పరిస్థితి. క్యాబ్ ప్రయాణం సౌకర్యంగా అనిపించినా, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భయాన్ని కలిగిస్తున్నాయి. మరి క్యాబ్‌లో మహిళలు ఎలా సురక్షితంగా ఉండగలరు? మీకోసం కొన్ని ముఖ్యమైన భద్రతా చిట్కాలు! మీ స్నేహితులు, అక్కాచెల్లెళ్లకి తప్పకుండా షేర్ చేయండి!

బంగారం లాంటి కారును కొనడానికి వెనుకాడుతున్న కస్టమర్లు!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి సెడాన్ విభాగంలో కీలకం అయిన డిజైర్ (Dzire) మరోసారి అమ్మకాల గణంకాలతో వార్తల్లో నిలిచింది. ఆకట్టుకునే డిజైన్, ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైమన ప్రమాణాలు, మంచి మైలేజ్ కలిగిన ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలు వెల్లడయ్యాయి. ఇది దేశీయంగా అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ ఫ్లాగ్‌షిప్ సెడాన్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మార్చి 2025లో మారుతీ సుజుకీ డిజైర్ 15,460 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. త సంవత్సరం ఇదే నెలలో అంటే మార్చి 2024లో 15,894 యూనిట్లతో పోలిస్తే, ఈ సారి అమ్మకాలు 3 శాతం తగ్గాయి. ఏడాది ప్రాతిదికన చూస్తే ఇది స్వల్ప తగ్గుదల అని చెప్పవచ్చు.

మహీంద్రా దూకుడు: 3000 ఈవీలు క్షణాల్లో డెలివరీ!

మహీంద్రా తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. XEV 9e, BE 6 మోడళ్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ రావడంతో, కొనుగోలుదారులు ఏకంగా ఆరు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతటి ఆదరణకు కారణాలేంటి? ఎన్ని కార్లు అమ్ముడయ్యాయి? వెయిటింగ్ పిరియడ్ ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం.

ఒకే దెబ్బకు దేశంలోని అన్ని పెట్రోల్ పంపులకు గుణపాఠం నేర్పిన మహిళ

భారతదేశంలో పెట్రోల్ బంకులు కేవలం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు లభించే ప్రదేశాలు మాత్రమే కాకుండా అక్కడ కొన్ని ఉచిత సౌకర్యాలు కూడా పొందవచ్చు. దూర ప్రయాణాలు చేసే వారు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు రెస్ట్‌రూమ్ సదుపాయం లాంటి వాటిని వాడుకోవచ్చు. ప్రభుత్వం దేశంలోని పెట్రోల్ బంకుల్లో బాత్రూమ్ వాడకాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచాలని సూచనలు చేసింది. మీరు అక్కడ పెట్రోల్ నింపినా, నింపకపోయినా, టాయిలెట్‌ను ఉపయోగించేందుకు ఎలాంటి షరతలు ఉండకూడదు. అయితే, వాస్తవానికి కొన్ని పెట్రోల్ బంకులు ఈ నియమాన్ని పాటించకపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా, కొన్నిచోట్ల టాయిలెట్‌లను లాక్ చేసి ఉంచడం, తాళం వేసి ఉంచడం వంటి మనకు చాలా చోట్లనే కనిపిస్తుంది.

ఇన్నోవా కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి.. అది వచ్చే సరికి సగం జీవితం అయిపోద్ది

టయోటా ఇన్నోవా అంటే ఒకప్పుడు కేవలం ఫ్యామిలీ కార్ మాత్రమే కాదు, అది ఒక స్టేటస్ సింబల్. ఇప్పటికీ ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్తగా వస్తున్న మోడల్స్ క్రిస్టా, హైక్రాస్‌లకు అయితే విపరీతమైన డిమాండ్.. కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. మరి అంతలా ఎందుకు కొంటున్నారు? డెలివరీ కోసం ఏకంగా ఏడాది వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? తెలుసుకుందాం
Advertisement

లవ్ ఫెయిల్యూర్.. లగ్జరీ కార్ సక్సెస్! తమన్నా స్టైలే వేరు!

ప్రస్తుతం ఇండియాలో అందరికీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)పైనే మోజు. సెలబ్రిటీలైనా, మధ్యతరగతి వారైనా తమకు నచ్చిన ఎస్‌యూవీలను కొనుగోలు చేస్తున్నారు. ఇక సెలబ్రిటీల్లో అయితే ఆఫ్-రోడ్ సాహసాలకు అనువైన లగ్జరీ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. చాలామంది సినీ తారలు ఇటీవల ఇలాంటి ఎస్‌యూవీలను డెలివరీ తీసుకున్నారు.

కోమాకి రేంజర్ 2025 వచ్చేసింది.. ఒక్కసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ వాడకం గతంలో కంటే భారీగా పెరిగింది. తయారీదారులంతా కూడా డిమాండ్‌కు అనుగుణంగా ఈవీలను విడుదల చేస్తున్నారు. పెరుగుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీలు తమ మునుపటి మోడళ్లను 2025 ఇయర్ అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా మార్చి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కోమాకి ఎలక్ట్రిక్ (komaki electric) తన ప్రసిద్ధ ఈవీ బైక్‌ను మరింత కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌గా కంపెనీ పేర్కొన్న రేంజర్ ఎలక్ట్రిక్‌ (ranger electric)ను మారుతున్న కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా పలు కొత్త ఫీచర్స్‌ను జోడించి ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Karthika deepam 2 April 10th : జ్యోత్స్న వ్యూహానికి కాంచన బలి.. ఆ విషయంతో రగిలిపోతున్న వంటలక్క


ఏం జరుగుతోంది అసలు? కియా ప్లాంట్‌లో 5 ఏళ్లుగా ఇంజిన్ చోరీలు

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ (kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కార్ల తయారీదారులకు బలమైన పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. భారతదేశం అంతటా ఇప్పుడు కియా కార్లు కనిపిస్తున్నాయి. కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి దేశీయంగా విక్రయాలు జరుపుతూనే అంతర్జాతీయంగా మంచి మార్కెట్ కలిగిన దేశాలకు సైతం ఎగుమతులు చేస్తుంది. ఏపీ నుంచి రోడ్డు, వాయు, సముద్ర మార్గాల ద్వారా వాహనాలు రవాణా చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉండటం కారణంగా కియా ఇండియా ప్రతి ఏడాది కస్టమర్ల డిమాండ్ మేరకు అధునాతన ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ డిజైన్‌‌లతో కార్లను తయారు చేసి విక్రయిస్తుంది.

ఫైవ్ స్టార్ సేఫ్టీ.. తక్కువ ధర టెంప్టేషన్! ఇంకేం కావాలి బాసూ?

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ తక్కువగా ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్! తక్కువ ధరలోనే అత్యుత్తమ భద్రతా ఫీచర్లతో వస్తున్న టాప్-3 కార్ల గురించి తెలుసుకుందాం. ఇవి మీ ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తాయి. గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ కార్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.