రేసింగ్‌లో ఎలక్ట్రిక్ వర్సెస్ పెట్రోల్.. మహీంద్రా XUV 9e, BMW 3-సిరీస్ ఢీకొంటే?

మహీంద్రా సంస్థ ఇటీవల విడుదల చేసిన ఎలక్ట్రిక్ కారు XEV 9e. డిసెంబర్ 2024లో BE 6 ఎలక్ట్రిక్ కారుతో పాటు XEV 9e ఎలక్ట్రిక్ కారును విడుదల చేశారు. ఈ కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్‌లు ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత మార్చిలో డెలివరీలు ప్రారంభమయ్యాయి.

రూ.8.84 లక్షల 7-సీటర్ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టిన జనాలు

ఇండియాలో ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రయాణించడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. చిన్న కుటుంబం గల వారికి అయితే హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు అనుకూలంగా ఉంటాయి. అదే పెద్ద కుటుంబం ఉన్న వారికి ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన మోడళ్లు బాగా సెట్ అవుతాయి. దేశంలో ఏడుగురు సభ్యుల కుటుంబం కోసం సరైన కారును ఎంపిక చేయాలంటే, మొదట గుర్తొచ్చే పేరు మారుతీ సుజుకీ ఎర్టిగా (maruti suzuki ertiga). ఇది కేవలం ఒక కారే కాదు, రెండు కుటుంబాలు కలిసి ప్రయాణాలు చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందరూ కలిసి దైవదర్శనాలు, లేదా ఇతర టూరింగ్ స్థలాలకు వెళ్లాలనుకుంటే ఈ కారు బెస్ట్ ఆప్షన్. విశాలమైన ఇంటీరియర్ దీని సొంతం. పైగా అందరు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో లభిస్తూ, మంచి మైలేజ్ అందిస్తుంది.

మహీంద్రా మాయాజాలం.. 80 ఏళ్ల నిరీక్షణకు తిరుగులేని ఫలితం!

మనదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలలో ఒకటైన మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra) మొదట్లో వాణిజ్య వాహనాలు, వ్యవసాయ పరికరాల విక్రయాలలో నిమగ్నమై ఉండేది. ఆ తరువాత కార్లను ఉత్పత్తి చేసి విక్రయించడం ప్రారంభించింది. గత కొన్ని సంవత్సరాలుగా కార్ల విక్రయాలలో మహీంద్రా ఆధిపత్యం పెరగడం మొదలైంది.

ఆకాంక్ష పూరి లగ్జరీ డ్రీం కారు! ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ని సొంతం చేసుకున్న హాట్ బ్యూటీ!

బాలీవుడ్ నటి నటులకు ఎక్కువగా లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం, మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయిందంటే చాలు దాని గురించి వాకబు చేసి తమకు నచ్చే విధంగా ఉన్నట్లయితే వెంటనే కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ ఆకాంక్ష పూరి (akanksha puri) ఈ మధ్య కొత్తగా ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈమె కొన్నటువంటి కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్ (landrover defender). డీలర్ నిర్వహించిన వేడుకలో ఆకాంక్ష తన కొత్త SUVని డెలివరీ తీసుకుంటున్నట్లు ఒక వీడియోలో కనిపించింది. 'కార్ హోల్‌సేల్ బజార్' అనే షోరూమ్ నిర్వహణ ప్రమోషనల్ వీడియో కోసం ఈ డెలివరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది.
Advertisement

ఓలా-ఏథర్‌కి షాక్! కేవలం లక్షలోపు ధరలో అదిరిపోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి. ఇటీవలి కాలంలో మార్కెట్లోకి విడుదల అవుతున్న టూవీలర్స్‌లలో ఎక్కువ భాగం ఈవీలే ఉంటున్నాయి. పోటీ పెరిగిన నేపథ్యంలో తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ఇటలీకి చెందిన వెలోసిఫెరో సంస్థ, మన దేశానికి చెందిన VLF ఇండియా కలిసి, ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపిందించి తాజాగా ప్రారంభించాయి. ఈ కొత్త స్కూటర్ పేరు "VLF టెన్నిస్ మిలానో ఎడిషన్ (vlf tennis milano edition)". ఈ స్కూటర్ ప్రత్యేక ఎడిషన్ అయినప్పటికీ, దానిని అందరూ కొనగలిగే విధంగా అందుబాటు ధరలోనే అమ్మాలని VLF నిర్ణయించింది. స్టాండర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు భిన్నంగా, ఇది ప్రత్యేకమైన డిజైన్, స్టైల్, ఆకర్షణీయమైన లుక్స్‌తో రూపొందించబడింది

కొత్త కారు కొనే పేద, మధ్య తరగతికి చెందిన ముగ్గురిలో ఒకరు ఈ కారును కొనేస్తున్నారు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్, సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలో సీఎన్జీ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం 17 మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో డజనుకు పైగా కార్లు సీఎన్జీ ఎడిషన్లలో అందుబాటులో ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో మారుతి తన సీఎన్జీ కార్లను అధిక మైలేజీనిచ్చే విధంగా రూపొందించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో మారుతి దేశీయంగా 17,95,259 ప్యాసింజర్ వాహనాలను విక్రయించగా.. వాటిలో సుమారు 6,20,000 సీఎన్జీ మోడల్స్ ఉన్నాయి. అంటే, విక్రయించిన ప్రతి మూడు కార్లలో ఒకటి సీఎన్జీ కారే అని అర్థం చేసుకోవచ్చు.

కారు కొంటే బంగారం ఫ్రీ.. నిస్సాన్ మాగ్నైట్ సెన్సేషనల్ డీల్!

భారతీయ వాహన మార్కెట్లో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ (Nissan) తనదైన ముద్ర వేసుకుంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయరీదారుల నుంచి బలమైన పోటీ వస్తున్నప్పటికి వాటిని ఎదుర్కొని మరి మెరుగైన అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తుంది. తాజాగా కంపెనీ మాగ్నైట్ కారును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. SUV మాగ్నైట్ పై హ్యాట్రిక్ కార్నివాల్ పేరిట బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌ను నిస్సాన్ ప్రకటించింది. ఈ కారు ధర ప్రారంభ సమయంలో కేవలం రూ.4.99 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఇది భారతీయ వినియోగదారులకు SUV కలను నిజం చేసినట్లు నిలిచింది. కాలక్రమేణా, దీని విలువ పెరిగింది, ఆగష్టు 2024 నాటికి ప్రారంభ ధర రూ.6.14 లక్షల (ఎక్స్ షోరూమ్)కు చేరుకుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ పైగా! BYD e7 ప్రత్యేకతలు ఇవే!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న BYD, వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ తన శ్రేణిని విస్తరించుకుంటుంది. తాజాగా విడుదలైన e7 మిడ్-సైజ్ సెడాన్ తన స్పెషల్ ఫీచర్లతో వార్తల్లో నిలిచింది. BYD విడుదల చేసిన చిత్రాలు సీల్ సెడాన్‌ డిజైన్‌ మాదిరిగానే ఉన్నాయి. ఇది మనదేశ మార్కెట్లలో కూడా ఎట్రాక్టివ్ ఆఫ్షన్‎గా నిలుస్తుంది.

మారుతీ మళ్లీ నెంబర్ 1.. టాటా పంచ్ స్ట్రాంగ్ ఫైట్! బెస్ట్ సెల్లింగ్ కార్స్ లిస్ట్ ఇదే

గత ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో వాహన తయారీ కంపెనీలు వరుసగా తమమ సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రస్తుతం పోటీ విపరీతంగా పెరిగిపోయింది. తయారీదారులంతా కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఇటీవల విడుదల అయిన డేటా ప్రకారం, ప్యాసింజర్ వాహనాల అమ్మకాల పరంగా దేశీయ అతిపెద్ద కార్ల తయీరీ కంపెనీ అయినటువంటి మారుతీ సుజుకీ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ రంగంలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో, భారతదేశవ్యాప్తంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు దాదాపు 43 లక్షలకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 42 లక్షలుగా ఉండగా, 2025లో అమ్మకాల్లో మరింత వృద్ధి నమోదైంది.

రికార్డుల మోత..రాయల్ ఎన్‌ఫీల్డ్ ఖాతాలో మరో విజయం!

Royal Enfield : 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో వివిధ వాహన తయారీ సంస్థలు తమ విక్రయాల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విక్రయాల నివేదికను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10,09,900 బైక్‌లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఇందులో ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పవచ్చు.

6.75 లక్షల కార్లు ఎగుమతి.. అంతర్జాతీయంగా భారత కార్ల హవా!

భారతదేశం ప్రస్తుతం కార్ల తయారీకి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కార్ల కర్మాగారాలు నిరంతరం ఉత్పత్తి చేస్తూ, దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు కూడా పెద్ద సంఖ్యలో కార్లను ఎగుమతి చేస్తున్నాయి. స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Skoda Auto Volkswagen India) ఈ విషయంలో ముందుంది.

ఈ బైక్ పట్టుకుంటే వదిలేయలేరు! హోండా నుంచి సరికొత్త ఈవీ బైక్ వచ్చేస్తుంది

భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీదారుగా మారడానికి వేగంగా అడుగులు వేస్తుంది. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ కంపెనీలన్ని కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అలాగే, ఇక్కడ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కీలకంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ టూవీలర్ తయారీదారులు ఇతర విదేశీ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ టూవీలర్ కంపెనీ హోండా (Honda) ఈ ఏడాది జనవరిలో QC1, Activa e ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందరు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో విడుదల చేసి, EV రంగంలో తన పట్టును బలోపేతం చేసుకుంది.
Advertisement

ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ టీవీఎస్ సత్తా! 77% వృద్ధి.. భవిష్యత్తుపై గట్టి నమ్మకం!

తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన అమ్మకాలతో అదరగొట్టేస్తోంది. టీవీఎస్ గ్రూప్ 1911లో టీ.వీ. సుందరం అయ్యంగార్ ద్వారా ఒక రవాణా సంస్థగా ప్రారంభమైంది. 1978లో టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ ఒక ప్రత్యేక సంస్థగా ఏర్పడింది. ప్రారంభంలో సుజుకి మోటార్ కార్పొరేషన్‌తో కలిసి 'ఇండో సుజుకి' పేరుతో మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? Vida V2 పై రూ.40,000 వరకు ప్రయోజనాలు

ఇండియాలో టూవీలర్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp) సంప్రదాయ ఇంధన మోడళ్లతో పాటు, ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా విడుదల చేస్తుంది. విడా బ్రాండ్ క్రింద V2 అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తుంది. శక్తివంతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, స్మార్ట్ ఫీచర్లతో కూడిన ఈ మోడల్ గత డిసెంబర్‌లో విడుదల అయింది. ఇప్పటికే రైడర్ల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ఇప్పుడు, ఈ స్కూటర్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు మరో సూపర్ అప్‌డేట్ అందింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్‌‌పై దాదాపు రూ.40,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ కంపెనీ వాహనాలకు భారీ స్థాయిలో డిమాండ్.. 5.53 లక్షల మంది ఫేవరెట్ బ్రాండ్!

భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) సేల్స్ పరంగా దూసుకుపోతోంది. మార్చి నెల ముగిసిన నేపథ్యంలో వివిధ తయారీదారులు తమ సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. అలాగే పాత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కూడా తన అమ్మకాల డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, మార్చి 2025లో మహీంద్రాను అధిగమించి, అమ్మకాల పరంగా మళ్లీ తన బలాన్ని నిరూపించుకుంది. దేశీయ మార్కెట్లో టాటా కార్లకు వస్తున్న ఆదరణను నిరూపిస్తూ, మార్చి 2025లో 51,616 కార్లు అమ్ముడుపోయాయి. ఇది గత నెల అంటే ఫిబ్రవరిలో జరిగిన 46,437 కార్ల అమ్మకాలతో పోలిస్తే, బాగానే వృద్ధి చెందింది.

క్రెటా పవర్‌తో హ్యుందాయ్ జోరు! టాటా, మహీంద్రా వెనుకబాటు!

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన సత్తాను చాటుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేయగా, హ్యుందాయ్ అనూహ్యంగా దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించింది.

MG మోటార్ EV సునామీ.. విండ్సర్ మోడల్‌ను ఎవరూ ఆపలేకపోతున్నారు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ (Mg Motor) అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం లగ్జరీ ఫీచర్స్‌తో కూడిన కార్లను అందించడంలో ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మార్కెట్‌లో తనదైన ముద్ర వేయడానికి హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ వంటి ICE ఇంజిన్ వాహనాలను తీసుకొచ్చిన కంపెనీ కొంతవరకు విజయాన్ని సాధించినా, పూర్తి స్థాయిలో ఊహించిన స్థాయికి చేరుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఇతర తయారీదారుల నుంచి భారత్‌లో విపరీతమైన పోటీ ఉండటం. తర్వాత MG మోటార్ తన దృష్టిని ఎలక్ట్రిక్ వాహనాలపై మళ్లించింది. ఈవీల దిశగా అడుగులు వేసినప్పటి నుంచి కంపెనీ సేల్స్‌లో దూసుకుపోతుంది.

మార్కెట్లో మారుతి హవా.. దీనిని మించినోడే లేడు మామ.. ఏడాదిలో 22 లక్షల కార్ల అమ్మకాలు!

భారత వాహన పరిశ్రమలో అత్యధిక వాహనాలను విక్రయించే సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్. ఈ సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 22,34,266 కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది అమ్ముడైన 21,35,323 కార్ల కంటే 4.63 శాతం ఎక్కువ. అయితే, దేశీయంగా విక్రయాలు మాత్రం స్వల్పంగా 0.05 శాతం పెరిగి 17,60,767 కార్లు అమ్ముడయ్యాయి. సంస్థ ఈ ఏడాది పనితీరును వివరంగా పరిశీలిద్దాం.

సరికొత్త చరిత్రను లిఖించిన బజాజ్ పల్సర్.. ఏకంగా 2 కోట్లు దాటిన సేల్స్

భారతదేశంలో బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్(Pulsar) అంటే తెలియని వారు ఉండరు. 2001లో యువతకు స్పోర్టీ మోటార్‌సైక్ల అభిరుచిని పరిచయం చేసిన ఈ మోడల్ ఇప్పుడు మరో చరిత్ర సృష్టించింది. ఆల్-టైమ్ హిట్ మోడళ్లలో ఒకటైన పల్సర్, 20 మిలియన్ల (2 కోట్ల) యూనిట్ల విక్రయాలను దాటి, ఇది అత్యంత విజయవంతమైన మోటార్‌సైకిల్ బ్రాండ్‌గా నిలిచింది. సాధారణ కమ్యూటర్ బైక్‌ల ఆధిపత్యం ఉన్న సమయంలో, పల్సర్ తన మస్కులర్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్, టాప్-క్లాస్ పనితీరుతో మార్కెట్‌ను శాశ్వతంగా మార్చేసింది. అద్భుతమైన వేగం, పెద్ద ఇంజిన్ సామర్థ్యం, మెరుగైన మైలేజ్‌ ఈ మూడింటిని ఒకే బైక్‌లో అందించిన మొదటి భారతీయ మోటార్‌సైకిల్ పల్సర్‌ మాత్రమే.

టయోటా చరిత్రలో మైలురాయి.. తొలిసారిగా 3 లక్షల యూనిట్ల అమ్మకాలు

భారతీయులకు టయోటా అంటే ప్రత్యేకమైన అభిమానం. మారుతి సుజుకితో స్నేహం కుదిరిన తర్వాత టయోటాకు అన్నీ మంచి శుభవార్తలే వస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం ముగియడంతో టయోటా అమ్మకాల గణాంకాలు విడుదల అయ్యాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జపనీస్ వాహన తయారీదారు భారతదేశంలో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Advertisement

ఇకపై 100 దేశాల చూపు భారత్‌పైనే.. మారుతి ఇ విటారా గొప్ప విజయం!

కొన్ని సార్లు రావడం కాస్త లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్న పవన్ డైలాగ్ ప్రస్తుతం మారుతికి సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న దిగ్గజ కంపెనీ మారుతి. కంపెనీ ఎప్పుడు ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తుందా అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించేలా తొలి సారిగా ఎలక్ట్రిక్ కారును త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతుంది.

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న కియా.. మార్చిలో 25,525 యూనిట్ల సేల్స్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రసిద్ధ కంపెనీగా అవతరించింది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కార్ల తయారీదారులకు బలమైన పోటీగా ఎదిగి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు తన కార్లను పరిచయం చేస్తుంది. సెల్టోస్, సోనెట్ లాంటి SUV లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కియా, దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన మోడళ్లను లాంచ్ చేస్తుంది. భారత మార్కెట్లో ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ బ్రాండ్‌లు తమదైన ముద్ర వేయడానికి పోటీ పడుతున్నప్పటికీ, కియా మాత్రం ఒక ప్రత్యేకమైన ప్లేస్‌ను దక్కించుకుంది.

ఇకపై స్కూటర్‌కు ఇద్దరు హెల్మెట్లు తప్పనిసరి! భద్రతకు పెద్దపీట!

వాహనదారుల భద్రత పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతేడాది జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వందల మంది మరణిస్తుండడంతో ప్రభుత్వం వాటి నివారణకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక మీదట కొత్తగా స్కూటర్, బైక్ కొనుగోలు చేస్తే దానితో పాటు కొనుగోలుదారుడికి డీలర్ నుంచి రెండు హెల్మెట్లు ఇవ్వాలని రూల్ పెట్టింది.

భారతదేశంలోని నెంబర్ 1 ప్యాసింజర్ వెహికల్‌గా అవతరించిన వ్యాగన్ఆర్

భారతదేశంలో బడ్జెట్ ధరలో లభించే కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా అందుబాటు ధరలో, మంచి పెర్ఫామెన్స్ అందించే కార్లను కొనుగోలు చేస్తుంటారు. తాజాగా గత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో వాహన తయారీదారులు తమ సేల్స్ వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన విక్రయాల డేటాను వెల్లడించింది. కంపెనీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బెస్ట్ సెల్లింగ్ కార్ టైటిల్‌ను మారుతీ మరోసారి తన సొంతం చేసుకుంది.