మహీంద్రా చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు! థార్, స్కార్పియో, XUV700 హవా!
ఆటోమొబైల్స్
- 1 year, 6 month, 7 days ago
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఈ కాలంలో మొత్తం 5,51,487 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (FY24)లో నమోదైన 4,59,877 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 20 శాతం వృద్ధిని సూచిస్తుంది.