ఎన్ని ఫీచర్స్ ఇచ్చిన కొనే దిక్కేలేని ఎంజీ కంపెనీ మోడల్

ఇండియాలోని కార్ల తయారీదారుల్లో ఎంజీ మోటార్స్ ఓ పాపులర్ కంపెనీ. ఎట్రాక్టివ్ లుక్స్ తో కార్లను తయారు చేయడం దీని ప్రత్యేకత. లోకల్‌గా టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో వీటికి పోటీగా ఎంజీ కంపెనీ కూడా ఈ సెగ్మెంట్లో భారీగా పెట్టుబడులు

టాటా టాప్ మోడల్ నెక్సాన్ ధరకే సిట్రోయెన్ కంపెనీకి చెందిన ఆల్ట్రా స్టైలిష్ మోడల్

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్(citroen) భారత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కంపెనీ విడుదల చేసిన మోడళ్లలో ఏవీ పెద్దగా ఇక్కడి కస్టమర్ల దృష్టిని ఆకర్షించకపోయినా కంపెనీ మాత్రం అవిశ్రాంతంగా పోరాడుతోంది. టాటా కర్వ్‌కి పోటీగా ఇటీవల విడుదల చేసిన బసాల్ట్ కూపే SUV పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అది కూడా ఆదరణ పొందలేదనే చెప్పాలి.

టీవీఎస్ జూపిటర్ CNG, సుజుకి E యాక్సెస్ ఎప్పుడొస్తాయో తెలుసా?

ఇండియాలో టూవీలర్ తయారీదారుల్లో టీవీఎస్(TVS), సుజుకీ మోటార్‌ సైకిల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశీయ ప్రజల రోజువారి అవసరాల కోసం బడ్జెట్ ధరలో టూవీలర్స్‌ను విక్రయిస్తూ తమదైన ముద్ర వేసుకున్నాయి. హీరో, హోండా, బజాజ్ వంటి కంపెనీలకు బలమైన పోటీగా ఉంటూ ప్రతి ఏడాది సేల్స్‌ను పెంచుకుంటున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు బైకులు, స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ టూ వీలర్ మార్కెట్లో వేగంగా వృద్ధిని సాధిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇతర తయారీదారుల నుంచి పోటీ ఎక్కువగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త మోడళ్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి సారించాయి. ఎప్పటిలాగే పేద, మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసి జూపిటర్ CNG, సుజుకీ ఇ యాక్సెస్ స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నాయి.

కొత్త టయోటా కారు గురించి ఎవరూ చెప్పని ముఖ్య విషయాలు ఇవే

టయోటా కిర్లోస్కర్ ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయ ఆటోమొబైల్ తయారీదారు. జనవరిలో అట్టహాసంగా ముగిసినటు వంటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ హిలక్స్ పికప్ ట్రక్ బ్లాక్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే పికప్ ట్రక్ ను ఘనంగా విడుదల చేశారు. దీని డిజైన్ చాలా ఎట్రాక్టివ్ గా ఉండడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Advertisement

బైక్‌కి పోటీ ఇచ్చే బడ్జెట్ కార్.. అమ్మకాల్లో జోరు చూపిస్తుంది

ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది మారుతీ సుజుకీ మాత్రమే. దశాబ్దాల కాలంగా పేద, మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తూ పేదవారి కంపెనీగా బాగా ప్రసిద్ధి చెందింది. దేశంలో అమ్ముడుపోతున్న టాప్ 10 కార్లలో దాదాపు సగానికి పైగా మారుతీ కార్లనే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీని బట్టి ఈ కంపెనీ మోడళ్ల పట్ల భారతీయ ప్రజలు ఏ మేరకు ఆదరణ ఉందో తెలుస్తుంది. అమ్మకాల పరంగా గత నెలలో మారుతీ టాప్‌లో నిలిచింది. ఇప్పటికే పలు మోడళ్ల వారీగా సేల్స్ వివరాలు వెల్లడిస్తున్న కంపెనీ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన సెలెరియో (celerio) సేల్స్ డేటాను విడుదల చేసింది.

రూ.1.75 లక్షల తగ్గింపు.. ఇప్పుడు కాక మరెప్పుడూ? ఇది బెస్ట్ డీల్!

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ (citroen) భారతదేశంలో మంచి మార్కెట్ కలిగి ఉంది. సేల్స్ పరంగా గత కొన్నేళ్లుగా మెరుగైన గణంకాలను నమోదు చేస్తుంది. 2024లో విజయవంతంగా తన కార్లను విక్రయించిన కంపెనీ 2025లో అంతకంటే ఎక్కువ మంది కస్టమర్లకు చేరువకావడానికి పండుగల సమయంలో తీసుకొచ్చినట్లు తన కార్లపై మార్చి 2025లో భారీ తగ్గింపులు అందిస్తుంది. సాధారణంగా వాహన తయారీ కంపెనీలు నెలా నెలా ప్రత్యేక తగ్గింపులు ఇస్తుంటాయి. ఇప్పటికే ఇతర సంస్థలు తమ మోడళ్లపై మార్చి ఆఫర్స్ ప్రకటించగా, ఇదే బాటలో సిట్రోయెన్ సైతం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రసిద్ధ మోడళ్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. HT ఆటోలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఎంపిక చేసిన మోడళ్లపై ఈ నెలలో భారీ తగ్గింపు ఇస్తుంది.

రోడ్లు మీద మైలురాళ్లను చూశారా.. వాటి రంగులకు అర్థం ఏంటో తెలుసా ?

మీరు సాధారణంగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కిలో మీటర్ల దూరాన్ని తెలిపేందుకు వేసిన మైలు రాళ్లను చూసే ఉంటారు. దాని మీద ఊరి పేరు, వచ్చే గ్రామం ఇంకా ఎన్ని కిలో మీటర్ల దూరం ఉంటుందో దాని మీద పెయింట్ చేసి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మైలు రాళ్లు వివిధ రకాల రంగుల్లో ఏర్పాటు చేసి ఉంటాయి. మరి ఇలా మైలురాళ్లకు వివిధ రంగులు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా..

మధ్యతరగతి ప్రజల కోసం తెచ్చిన కారు.. షోరూమ్‌లలో సందడి కనిపించడంలేదు

MG మోటార్ భారతదేశంలో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీగా ఉంది. దేశీయంగా ఉన్నటువంటి మహీంద్రా, టాటా మోటార్స్ కార్లకు పోటీగా ప్రీమియం లుక్, సరికొత్త ఫీచర్స్‌తో పలు మోడళ్లను విక్రయిస్తుంది. ఇటీవల ఫిబ్రవరి నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ ఆస్టర్ (astor) కారుకు సంబంధించిన సేల్స్ వివరాలు వెల్లడించింది. ఎంజీ మోటార్ అమ్మకాలలో ఆస్టర్‌ ఫెయిల్ మోడల్‌గా నిలుస్తుంది. ఎందుకంటే గత కొంత కాలంగా కస్టమర్ల నుంచి దీనికి ఆదరణ తగ్గుతూ వస్తుంది. కంపెనీ నుంచి విడుదలైన నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2025లో ఎంజీ ఆస్టర్ కేవలం 264 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. అదే గత ఏడాది అనగా 2024 ఇదే ఫిబ్రవరి నెలలో ఇది 1,036 ఆస్టర్ కార్ల విక్రయాలను సాధించింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 772 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి.

రూ.10లక్షల లోపు మంచి మైలేజీ ఇచ్చే 12 మోడల్స్ ఇవే

ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. దేశంలో కార్ల పరిశ్రమ రోజు రోజుకు పెరుగుతుంది. మన దేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువగా నివసిస్తున్నారు. దీంతో వాళ్లను టార్గెట్ చేసి ఆటోమొబైల్ కంపెనీలు కార్లు తయారు చేస్తున్నాయి. సొంత కారు కొనుగోలు చేయాలని చాలామంది కలలు కంటారు. మధ్య తరగతి ప్రజలు వారి బడ్జెట్ కు తగ్గట్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న వాటిని సెలక్ట్ చేసుకుంటారు.

కొత్త కారు లాంచ్ చేసేందుకు రోమ్ వెళ్లిన బెంజ్

ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ తన కొత్త కార్ మోడల్‎ను విడుదల చేసేందుకు రోమ్‎కు వెళ్లింది. మరదేదో కంపెనీ కాదు మెర్సిడెస్ బెంజ్. ఇది సీఎల్ఏ అనే లగ్జరీ కారు మోడల్ ను విడుదల చేసింది. అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన కారు మోడల్‌గా కంపెనీ దీనిని రూపొందించింది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ కారులో లేని ఫీచర్లను ఈ మోడల్ లో అందించింది. బెంజ్ ఈ కారులో AI టెక్నాలజీని అందించింది.

బొలెరో కారును ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుగా మార్చిన కస్టమర్

మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మహీంద్రా బొలెరో ఒకటి. నిజానికి కొన్ని సంవత్సరాల వరకు బొలెరో ప్రతినెల మహీంద్రా నంబర్ వన్ బెస్ట్ సెల్లింగ్ కారు. ఇప్పుడు మరికొన్ని లేటెస్ట్ మహీంద్రా కార్లు ఆ నంబర్ వన్ స్థానాన్నిదక్కించుకున్నాయి. అయితే, మహీంద్రా బొలెరో కార్ల అమ్మకాలు తగ్గాయని అనుకోలేము.. ఎప్పటిలాగే, నిర్దిష్ట సంఖ్యలో కస్టమర్లు ఈ బొలెరోను కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

ఫిబ్రవరి 2025లో ఎక్కువగా అమ్ముడైన టాప్ కార్లు ఇవే!

ప్రపంచంలోనే భారతదేశం వాహన పరిశ్రమ అభివృద్దిలో వేగంగా దూసుకుపోతుంది. అందుకే అంతర్జాతీయ తయారీదారులు కూడా ఇక్కడి వచ్చి ప్లాంట్‌లను ఏర్పాటు చేసి తమ వాహనాలను లోకల్‌గా విక్రయిస్తునే ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. దేశంలో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మొదలుకుని SUVలు, సెడాన్‌లు ఇతర మోడళ్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. ప్రతి ఏడాది కూడా ఇండియాలో కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వాహన తయారీదారులు కూడా వారిని ఆకట్టుకునే డిజైన్లతో కార్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి నెల ముగియగానే కంపెనీలు తమ మోడళ్ల వారిగా సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. అయితే ఈ నెలలో దేశంలో అత్యధికంగా విక్రయాలను సాధించిన టాప్ 5 కార్లు ఏవో కింది కథనంలో తెలుసుకోండి.
Advertisement

ఓలా, హీరోలకు సవాల్ విసిరిన బజాజ్! టెస్టింగ్‌లో కనిపించిన కొత్త ఇ-స్కూటర్

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుంది. గతంలో పెట్రోల్ మోడళ్లను ఎక్కువగా కొన్న జనాలు ఇప్పుడు తమ ధోరణిని క్రమంగా మార్చుకుని ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ బజాజ్ (Bajaj) కూడా ఈ సెగ్మెంట్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. అందుకే గతంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి తయారీదారులకు పోటీ నిస్తూ ఇది దేశంలో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. అయితే కంపెనీ ఈ విజయపరంపరను కొనసాగించడానికి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవల ఈ మెడల్‌ను రోడ్డుపై పరీక్షిస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.

ఫిబ్రవరిలో అమ్మకాల్లో దుమ్ములేపిన టయోటా 8సీటర్ కార్

జపాన్‎కు చెందిన ప్రసిద్ధ ఆటో మొబైల్ కంపెనీ టయోటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది. ఇండియాలో మారుతి సుజుకీతో పార్టనర్ షిప్ కారణంగా టయోటా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రతి నెల కొత్త మోడల్స్ రాకతో ఈ గణాంకాలు మారుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో అమ్ముడైన టయోటా కార్లకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

తల్లిదండ్రులూ జాగ్రత్త! 10 ఏళ్లలోపు పిల్లలను ముందు సీట్లో కూర్చోబెడుతున్నారా?

ప్రస్తుతం కుటుంబ ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. కారుతో భార్య, పిల్లలతో కలిసి సరదాగా బయటకు వెళ్లి తిరిగి రావడం లాంటి వాటిని చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలా వెళ్తున్న పిల్లలను కొంతమంది ముందు సీట్లో కూర్చోబెడుతుంటారు. అలాగే వారిని పాఠశాలలకు తీసుకెళ్లేటప్పుడు కూడా తమ పక్కనే ముందు సీట్లో కూర్చోబెడతారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరం అని చాలా మందికి తెలియదు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టవద్దని ఇటీవల శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చంటి బిడ్డలతో కలిసి ప్రయాణించే వారు వెనుక సీట్లోనే కూర్చోవడం ఉత్తమం. వీటికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. తాజాగా UAE ప్రభుత్వం 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను తమ ఒడిలో పెట్టుకుని ప్రయాణించే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

మార్కెట్లో మారుతి బెస్ట్ హైబ్రిడ్ కార్ ఇదే

ఇండియాలో మారుతి కార్లకు ఉన్న డిమాండ్ మరే కంపెనీ కార్లకు ఉండదు. ప్రతి నెల వేల సంఖ్యలో కార్లు అమ్ముడవుతుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈవీ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కమ్రంలోనే మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUV ఇ విటారాను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇ విటారా బుకింగ్ ప్రారంభమైంది. రూ.25వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి ఇ విటారా కారును బుక్ చేసుకోవచ్చు.

కొత్త టాటా కారు రోడ్ల మీద టెస్ట్ డ్రైవ్ లో కెమెరాకు చిక్కిందోచ్

టాటా మోటార్స్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కొన్ని దశాబ్ధాలుగా నాణ్యమైన వాహనాలను ఉత్పిత్తి చేస్తూ విశ్వసనీయతకు పెట్టింది పేరుగా నిలిచింది. ఈ కంపెనీ కారు కొనుగోలు చేస్తే సేఫ్టీ గ్యారంటీ అన్న పేరు ముద్ర పడిపోయింది. అందుకే కస్టమర్లు కారు కొనుగోలు చేయాలనుకుంటే వారి బెస్ట్ ఛాయిస్ ఈ కంపెనీదే అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు నయా కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది టాటా కంపెనీ.

175 కి.మీ రేంజ్ ఉన్న బైక్ ధర ఈ స్థాయిలో పెరగాలా? EV బైక్ లవర్స్ షాక్!

దేశంలో అన్ని రాష్టాల్లో కూడా పెట్రోలో ధరలు దాదాపు రూ.100కు పైనే ఉంది. పెద, మధ్య తరగతి ప్రజలకు టూవీలర్ లేనిదే రోజు గడవని పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలకు, వ్యాపారాలకు, కాలేజ్‌లకు, ఇంటి అవసరాల కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బదులుగా చాలా మంది టూవీలర్ ఉపయోగిస్తున్నారు. అయితే భారీగా ఉన్న పెట్రోల్ ధరలతో సామాన్యుడు భయపడిపోతున్నాడు. చాలి చాలని జీతంతో ఇంటిని గట్టేక్కిస్తున్న పరిస్థితుల్లో సంపాదనలో టూవీలర్ మెయింటనెన్స్‌కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఇటీవల కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. రోజూ పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హాయిగా బ్యాటరీ ఛార్జ్ చేసుకుని రోజంతా తిరిగే ఈవీ బైకులను ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. అందుకే వాహన తయారీదారులు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు.

28.06 కి.మీ మైలేజ్.. ఫుల్ సేఫ్టీ.. బడ్జెట్ ఫ్రెండ్లీ టాటా టియాగో NRG!

ఇండియాలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేసే కంపెనీ అంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చే టాటా మోటార్స్(tata motors) మాత్రమే. రతన్ టాటా ఆశయాలకు అనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తుంది. గత ఏడాదిలో అధునాతన ఫీచర్స్‌ కలిగిన కార్లను లాంచ్ చేయగా, 2025లో తన సేల్స్ పెంచుకోవాలని చూస్తుంది. దీనిలో భాగంగా తన ప్రసిద్ధ మోడల్ టియాగో ( Tiago) అప్‌డేట్ వెర్షన్ NRGను ఇటీవల విడుదల చేసింది. Tata Tiago NRGలో సాధారణ టియాగో కారుతో పోలిస్తే కొత్త ఫీచర్స్ చాలా ఉన్నాయి.

మార్కెట్లో మరో హై పర్ఫామెన్స్ బెక్ రిలీజ్ చేసిన కీవే ఇండియా

ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ ప్రపంచ వ్యాప్తంగా వాహనాలను విడుదల చేస్తుంది. దాని యాజమాన్యంలో ఉన్న హంగేరియన్ టూవీలర్ బ్రాండ్ కీవే ఇండియన్ మార్కెట్లోకి తన ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. దేశీయ మార్కెట్లోకి ఇప్పటికే కీవే వియస్టా 300 , కీవే సిక్స్టీస్ 300ఐతో పాటుగా కీవే కె-లైట్ అనే క్రూయిజర్ బైక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Advertisement

చిన్న ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోన్న ఎంజీ.. కేవలం ఈ నెలలోనే!

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (Mg motor India) ఇటీవల తన దూకుడును మరింత ఎక్కువగా ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేస్తూ టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి వాహన తయారీదారులకు గట్టి సవాల్ విసురుతుంది. ముఖ్యంగా సాంప్రదాయ ఇంధన కార్లను విడుదల చేస్తూనే అదే సమయంలో బాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌పై కూడా కీలకంగా దృష్టి సారించింది. SUV మోడల్ హెక్టర్ లాంచ్‌తో ఎంజీ మోటార్ దేశంలో బలమైన వృద్దిని సాధిస్తుంది. కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీలను కూడా తీసుకొచ్చి ఇప్పటి వరకు ఈవీ కార్ల పరంగా టాప్ ప్లేస్‌లో ఉన్నటువంటి టాటా మోటార్స్ గట్టి షాక్ ఇచ్చి సేల్స్ విషయంలో మెరుగైన గణాంకాలను నమోదు చేసింది.

కేటీఎం బైక్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ - త్వరపడండి

ప్రస్తుతం దేశంలో ద్విచక్రవాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఇవి కనీసం అవసరంగా మారిపోయాయి. గతంలో కుటుంబానికి ఒక్క బైక్ ఉంటే సరిపోయేది. కానీ ప్రస్తుం పరిస్థితి మారిపోయింది. మహిళలు కూడా ఉద్యోగాల చేస్తుండడంతో వారికీ బైక్, కార్లు అవసరం అయిపోయాయి. అంతే కాకుండా కాలేజీ వెళ్లే పిల్లలకు కూడా బైక్ తప్పనిసరి అయింది. దీంతో అనేక కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి దించుతున్నాయి కంపెనీలు.

రోల్స్ రాయిస్ కారును కొన్న ఊర్వశి రౌతేలా.. దీని ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్‌తో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న నటి ఊర్వశి రౌతేలా (urvashi rautela). ఇటీవల కాలంలో తెలుగులో అగ్రహీరోల పక్కన స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇక్కడ కూడా బాగా పాపులరాటి సంపాదించింది. గత ఏడాది సంక్రాంతి సమయంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సాంగ్స్‌కు స్టెప్పులు వేసింది. ఇటీవల సంక్రాతి కానుకుగా వచ్చిన డాకు మహారాజ్‌ సినిమాలో కూడా బాలయ్యాతో కూడా చిందులు వేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బాగా బిజీగా ఉన్న ఊర్వశి రౌతేలా చేతినిండా బాగా సంపాదిస్తునే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ, ఇంకోవైపు వివిధ కంపెనీలకు యాడ్స్ చేస్తూ బాగానే కూడబెడుతుంది.

సామాన్యుల నుంచి స్టార్స్ వరకూ అందరి ఫేవరెట్ కారు.. గతనెల ఎంతమంది కొన్నారంటే?

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (maruti suzuki) అమ్మకాల పరంగా దేశంలో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి నెలా ముగియగానే తన కార్ల సేల్స్ వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా ప్రసిద్ధ SUV గ్రాండ్ విటారా (grand vitara)కు సంబంధించిన అమ్మకాల డేటాను విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో అత్యధికంగా సేల్స్ సాధించిన SUVల లిస్ట్‌లో ఏడవ స్థానంలో నిలిచింది. అధునాతన డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో దేశంలోని సామాన్యుడి నుంచి మొదలుకుని సినిమా తారల వరకు అందరూ ఈ ఎస్‌యూవీని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. చూడగానే లగ్జరీ లుక్‌తో కట్టిపడేసే గ్రాండ్ విటారా ఫిబ్రవరి 2025లో దాదాపు 10,669 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

లేటెస్ట్ సఫారీ స్టీల్త్ ఎడిషన్ ఫస్ట్ డెలివరీ ఇచ్చిన టాటా

టాటా మోటార్స్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆటోమోబైల్ మార్కెట్లో దీనికి ఉన్న విశ్వసనీయత మరో కంపెనీకి లేదంటే అతిశయోక్తి కాదు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కంపెనీ పాపులర్ SUVలు హారియర్, సఫారీల 'స్టీల్త్ ఎడిషన్' ఆవిష్కరించింది.