స్లావియా ధరను భారీగా తగ్గించిన స్కోడా కంపెనీ

కొన్నేళ్ల కిందటి వరకు ఎక్కువగా జనాలు సెడాన్ కార్లను ఉపయోగించే వారు. కానీ కాలం మారిన కొద్దీ ఇప్పుడు జనాలంతా ఎస్‎యూవీల వెంటపడుతున్నారు. అయితే ఇప్పటికీ కొందరు మాత్రం పాత మోడల్స్‎ను ఇష్టపడుతుంటారు. కాబట్టి సెడాన్ మోడల్స్ కు గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. ఒకప్పుడు ఉన్నంత ప్రజాదరణ లేకపోయినా త్రి బాక్స్ టైప్ వెహికల్స్ నేటికీ బాగానే అమ్ముడవుతున్నాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు(ఎస్‎యూవీ) లకు ఉన్న రైడింగ్ కంఫర్ట్. చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ స్కోడా అనేది దాని సెడాన్లతో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఫిబ్రవరిలో భారీగా పడిపోయిన టాటా పంచ్ అమ్మకాలు

టాటా మోటార్స్ కార్లకు దేశీయంగా మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ సాయంతో కార్లను మార్కెట్లోకి వదులుతుంది. దేశంలో సబ్ ఫోర్ మీటర్ లేదా కాంపాక్ట్ ఎస్ యూవీలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని విభాగాలను వది ఈ సెగ్మెంట్లో తమ లేటెస్ట్ కార్లను భారత మార్కెట్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కస్టమర్లు కూడా అలాంటి కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. టాటా కూడా తన మైక్రో ఎస్ యూవీ పంచ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

లగ్జరీలో విమానాన్ని మించిపోయే SUV.. కానీ వెంటనే దొరకదండోయ్!

భారతదేశంలో కార్ల తయారీ దారుల్లో ఎంజీ మోటార్స్ (Mg Motors) ఒక ప్రసిద్ధ కంపెనీ. ఆకట్టుకునే డిజైన్‌తో కార్లను విడుదల చేయడం దీని ప్రత్యేకత. లోకల్‌గా టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో వీటికి పోటీగా ఎంజీ సైతం ఈ సెగ్మెంట్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు భారతీయ ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోడల్ MG విండ్సర్ కారుకు దేశంలో డిమాండ్ బాగా ఉంది. ఇది ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV. దీని ఆకర్షణీయమైన డిజైన్, సరికొత్త ఫీచర్స్‌తో చాలా మంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది భారీ సంఖ్యలో అమ్ముడుపోతుంది. దీని లాంచ్ తర్వాత డెలివరీలు మొదలైనప్పటి నుంచి ప్రతి నెలా సగటున 3,000 కార్ల సేల్స్ జరుగుతూనే ఉన్నాయి.

ఇన్నోవా హైక్రాస్ మోడల్ కు అదిరిపోయే సేఫ్టీ ఫీచర్ యాడ్ చేసిన టయోటా

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా మోటార్స్ విడుదల చేసే కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో కూడా ఈ కార్లు రోడ్ల మీద ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో ఇన్నోవా కారు అంటే తెలియని వారుండదు. అప్పట్లో అంబాసిడర్ ఏ విధంగా వాడే వారో ప్రస్తుత ఇన్నోవాను కూడా స్టేటస్ సింబల్ గా వాడుతున్నారు. దీని మంచి లుక్, పికప్, ఎక్కువ మంది ప్రయాణించే వీలు ఉండడంతో దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్నోవా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Advertisement

టాటా సియెర్రా 2025 డిజైన్ లీక్

దిగ్గజ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత మార్కెట్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. బాడీ బిల్డ్ క్వాలిటీ ఇవ్వడంలో టాటాకు మించింది లేదు. అందుకే వినియోగదారులు చాలా మంది టాటా కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి టాటా మోటార్స్ ఈ ఏడాది భారత మార్కట్లోకి అనేక కొత్త కార్లు, ఎస్ యూవీలను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది.

అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ VS ఓలా, ఏథర్, హీరో! ఎవరు గెలుస్తారు?

గత కొంత కాలంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈవీ తయారీదారులు పోటా పోటాగా కొత్త టూవీలర్స్‌ను విడుదల చేస్తూ, దేశాన్ని ఈవీలకు ప్రధాన గమ్యస్థానంగా మారుస్తున్నారు. పెద్ద కంపెనీల నుంచి మొదలుకుని ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ అల్ట్రావయోలెట్(Ultraviolette) గత వారం భారతదేశంలో రెండు కొత్త ఈవీలను విడుదల చేసింది. ఇప్పటి వరకు లక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌లను మాత్రమే విడుదల చేసిన ఈ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కూడా పట్టు సాధించడానికి టెస్రాక్ట్ (Tesseract)ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ మోడల్ మార్కెట్లో పెద్ద సంచలనం అయింది. దీని ఆకట్టుకునే రూపంతో భారీ ఆదరణ సంపాదిస్తుంది.

రెండు దశాబ్దాల నుంచి భారత రోడ్లను ఏలుతున్న స్టైల్ ఐకాన్

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ(Maruti suzuki) అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తుంది. ధర చాలా వరకు అందుబాటులో ఉంచడం దీని ప్రత్యేకత. అందుకే గత దశాబ్దాల కాలంగా కూడా మారుతీ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. కారు కొనాలని కోరిక ఉండి కొనలేక భాదపడుతున్న వారికి మారుతీ తక్కువ ధరలోనే తన ప్రసిద్ధ మోడళ్లను అందిస్తూ సొంత కారు కలిగి ఉండాలనే కోరికను నెరవేర్చుతుంది. సేల్స్‌లో ప్రతి ఏడాది కూడా మొదటి స్థానంలో నిలవడం మారుతీకే చెందుతుంది. మార్కెట్లో చాలా కార్ల తయారీ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మారుతీ సుజుకీ కార్లంటే దేశంలో చాలా మందికి ఇష్టం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెల ముగియగానే ఆటోమొబైల్ కంపెనీలన్ని కూడా తమ అమ్మకాల వివరాలు విడుదల చేస్తున్నాయి.

సేల్స్‌లో రెచ్చిపోతున్న ఆనంద్ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు

దేశీయ దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా (mahindra and mahindra) పెట్రోల్, డీజిల్ ఇంధనాల కార్లతో పాటు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా తన సత్తాను చాటడానికి కీలకంగా కృషి చేస్తుంది. ఈవీ మార్కె్ట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీ ఇటీవల కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. ఇతర దేశాల తయారీదారుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోడానికి కొత్త XEV 9e, BE 6 ఎలక్ట్రిక్ SUV లను తీసుకొచ్చింది. కస్టమర్ల నుంచి వీటికి మంచి ఆదరణ వస్తుందని తాజాగా విడుదల అయిన సేల్స్ డేటాను చూస్తే తెలిసిపోతుంది. మహీంద్రా వెల్లడించినదాని ప్రకారం, ఫిబ్రవరి 2025 నెలలో ఈ ఈవీ కార్లు భారీ సంఖ్యలో అమ్మకాలను నమోదు చేశాయి. మొత్తం 3,196 యూనిట్ల సేల్స్‌తో ఇవి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో డిమండ్ ఉన్న మోడళ్లుగా అవతరించాయి.

భారీ అమ్మకాలతో దూసుకుపోతున్న స్కోడా కైలాక్

భారత ఆటోమొబైల్ రంగం ఇటీవల కాలంలో బాగా వృద్ధి చెందింది. ఇక్కడ మిడ్ రేంజ్ కార్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు రూ.10లక్షల లోపు కార్లను మార్కెట్లో తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే కోవలో స్కోడా ఆటో ఇండియా కూడా గతేడాది ఇండియాలో తన మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‎యూవీ అయిన స్కోడా కైలాక్‎ను లాంచ్ చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి బడ్జెట్ ధరలోనే ఈ కారును తీసుకొచ్చింది.

ఫిబ్రవరిలో భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు

భారత్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అంతే కాకుండా ఇవి పర్యవరణ హితం కావడంతో వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం రాయితీలను కూడా అందజేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలను పెట్టేవాళ్లకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. అందుకే భారత్‎లో ఇటీవల ఎలక్ట్రిక్ కార్లుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీలు నిరంతం పోటీ పడుతున్నాయి.

2 లక్షల ఇళ్లకు ఆనందాన్ని ఇచ్చిన 7 సీటర్ మోడల్ కియా కారెన్స్

భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే దిగ్గజ వాహన తయారీదారుగా ఎదిగిన దక్షిణ కొరియా బ్రాండ్ కియో మోటార్స్ (Kia Motors) ఇక్కడి దేశీయ కంపెనీలకు బలమైన పోటీగా నిలుస్తూ, సేల్స్‌లో దూసుకుపోతుంది. ఒకవైపు సాంప్రదాయ ఇంధన కార్లను విడుదల చేస్తూనే మరోవైపు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా మంచి అమ్మకాలను సాధిస్తుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మంది కలిసి ప్రయాణించే పెద్ద ఎంపీవీ కార్లను తీసుకొస్తూ కియో చాలా కాలంగా తన విజయపరంపరను కొనసాగిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టీగా (Ertiga) వంటి కాంపాక్ట్ ఎంపీవీలకు పోటీగా కియా గతంలో విడుదల చేసిన ప్రసిద్ధ మోడల్ కారెన్స్ (carens) ఎంపీవీ భారతీయ కస్టమర్లకు బాగా నచ్చిన కారుగా అవతరించింది. కియా మోటార్స్ వెల్లడించిన దాని ప్రకారం, కారెన్స్ మోడల్ ఇప్పటి వరకు 2 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది.

ఛాంపియన్ ట్రోఫీ తెచ్చిన టీం ఇండియా క్రికెటర్ల దగ్గర ఎంత ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా ?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీం ఇండియా అవతరించింది. ఆదివారం దుబాయ్ లో జ‌రిగిన ఫైన‌ల్లో న్యూజిలాండ్‎ను 4వికెట్ల తేడాతో ఓడించి కప్పును కైవసం చేసుకుంది. దాదాపు 12ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. 12సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని భారత క్రికెటర్లు మన దేశానికి తీసుకొచ్చారు. ఈ విజయంతో 25ఏళ్ల కిందట న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన 140కోట్ల మంది భారతీయులను తలెత్తుకునే విధంగా చేసింది.
Advertisement

హోలీ రోజు కార్లు బైక్స్ ఉన్న వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి

భారతీయ ప్రజలు పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంస్కృతి, సంప్రదాయాలకు విలువ నివ్వడంలో దేశ ప్రజల తర్వాతే ఎవరైనా. దేశంలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగలలో హోలీ కూడా ఒకటి. చిన్నాపెద్దా, ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 14న శుక్రవారం నాడు హోలీ వచ్చింది. ఇప్పటికే హోలీ పండుగ సంబరాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సమయంలో వాహనాలపై రంగులు పడుతాయి. కార్స్, బైక్స్‌లపై రంగుల పొడి పడటం వల్ల అవి చెడిపోయే అవకాశం ఉంది. వాహనాదారులకు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. అందుకే కార్స్, బైక్స్‌ను కలిగి ఉన్న ప్రతిఒక్కరూ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన తమ వాహనాలను రంగుల నుంచి కాపాడుకోవచ్చు. మరి అవెంటో ఒకసారి కింది కథనంలో తెలుసుకోండి.

త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ.. ధర, ఫీచర్స్ ఇవే ?

టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్(TVS) కంపెనీ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. కంపెనీ భారత మార్కెట్లో పెద్ద ఎత్తున వివిధ మోటార్ సైకిళ్లు, స్కూటర్లను విక్రయిస్తుంది. కస్టమర్లను ఆకర్షించే డిజైన్లు, ఫీచర్లతో వస్తున్నాయి. కాలానికి అనుగుణంగా, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు బైకులు, స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది టీవీఎస్ కంపెనీ. అందుకే టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్ వేగంగా పురోగతి సాధిస్తోంది. ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో విక్రయించే స్కూటర్లలో జూపిటర్ మోస్ట్ పాపులర్ అన్న సంగతి తెలిసిందే.

మరోసారి మాగ్నైట్ కారు ధరను పెంచిన నిస్సాన్

మన దేశంలో బడ్జెట్ కార్ల మార్కెట్ రోజురోజుకు బాగా వృద్ధి చెందుతుంది. బడ్జెట్ కార్ల మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కార్ల కొనుగోలు విషయంలో మిడిల్ క్లాస్ ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. దీంతో అన్ని కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నాయి. సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమైబైల్ కంపెనీ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇండియా ఫ్యామిలీ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. పెట్రోల్ బైక్స్, స్కూటర్లతో పాటు ఈవీ మోడళ్లకు కూడా ఆదరణ పెరగడంతో తయారీదారులు పోటా పోటీగా వరుస లాంచ్‌ల్ చేస్తున్నారు. మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ కంపెనీలు ప్రస్తుతం తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే పెద్ద బ్రాండ్‌లకు పోటీగా చిన్న సంస్థలు కూడా ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను విడుదల చేస్తున్నాయి. వాటిలో ప్రముఖ కంపెనీ గోదావరి(godawari) ఎలక్ట్రిక్ మోటార్స్ చాలా కాలంగా పెద్ద కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా నిలవడానికి దేశీయ వినియోగదారుల కోసం తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసే అమ్మకానికి తీసుకొస్తుంది. ఈ కంపెనీ దేశంలో ఇబ్లు ఫియో ఎక్స్ మోడల్ ద్వారా బాగా పేరు సంపాదించింది. ఆగస్టు 2024లో ఈ ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఇది మెరుగైన సేల్స్‌ను నమోదు చేస్తూనే ఉంది.

డాక్టర్లు, ఇంజనీర్లకు ఇష్టమైన కారు.. 34 కి.మీ మైలేజ్, రూ.5 లక్షల ధర

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) ఆకర్షణీయమైన కార్లను విడుదల చేయడంలో బాగా ప్రసిద్ధి చెందింది. భారతీయ వినియోగదారుల కోసం తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ అందించే మోడళ్లను తీసుకొస్తుంది. మార్కెట్లో దీని ఫార్ములా మిగతా కంపెనీలకు భిన్నంగా ఉంటుంది. అందుకే చాలా ఏళ్లుగా ప్రతి ఏడాది కూడా సేల్స్ విషయంలో అందరి కంటే ముందు స్థానంలో నిలుస్తుంది. గత ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచిన మారుతీ తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ (wagon R) అమ్మకాల వివరాలను మారుతీ సుజుకీ విడుదల చేసింది.

ఎట్టకేలకు ఖరీదైన కారు కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్

చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీలీల. బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసి టాలీవుడ్ సెన్సేషన్ అయిపోయింది. రెండేళ్ల క్రితం వరుసగా డజను పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‎కు ఎదిగింది. ఈ అమ్మడు ఏ ముహూర్తాన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో ఏమో కానీ.. కెరీర్ స్టార్టింగులోనే సీనియర్ స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. ఏకంగా నట సింహం బాలయ్య, మాస్ మహారాజ రవితేజ వంటి వారితో నటించే అవకాశం దక్కించుకుంది.

మూడు బ్లాక్‌బస్టర్ల నేషనల్ క్రష్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ అదిరిపోతుంది

ప్రస్తుతం 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న (rashmika-mandanna) వరుస సినిమా హిట్లతో దూసుకుపోతుంది. మొదట కన్నడలో నటించి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో మంచి హిట్ సాధించి స్టార్ హిరోల ప్రక్కన నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా హిట్ సినిమాలు చేసి దేశవ్యాప్తంగా అందరి ఫేవరెట్ హీరోయిన్‌గా ఉంది. తన అభిమానులు ఆమెను ముద్దుగా 'నేషనల్ క్రష్' అని పిలుస్తారు. తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్ తరువాత ఇప్పుడు రష్మిక మందన్న ట్రెండింగ్‌లో ఉంది. పుష్ప సినిమాతో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత యానిమల్ సినిమా కూడా ఆమెకు బంపర్ హిట్ ఇచ్చింది.

ఓలా బైక్ బుక్ చేసుకున్న వాళ్లు ఇంకా కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఓలా కంపెనీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ఇప్పటికే అనేక రకాల మోడల్స్‎ను మార్కెట్లోకి విడుదల చేసి కస్టమర్లకు బాగా దగ్గరైంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో, ఆకట్టుకునే లుక్‎తో పాటు కస్టమర్లకు అందుబాటు ధరలో వాహనాలను అందించడం ఆ కంపెనీ ప్రత్యేకత. సాధారణంగా ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలోనే అత్యధికంగా స్కూటర్లు విడుదల అవుతున్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో బైక్స్ కావాలనుకునే వారికి తీవ్ర నిరాశే ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓలా కంపెనీ రోడ్ స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది.
Advertisement

ఉమెన్స్ డే కానుకగా మీకు ఇష్టమైన వారికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ స్కూటర్లు బెస్ట్

ప్రతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Womens Day) మార్చి 8న జరుపుకుంటారు. వివిధ రంగాల్లో మహిళా సాధికారతను పెంపొందించడం, ఆయా రంగాల్లో వారి కృషిని అభినందించడంతో పాటు, లింగ సమానత్వం పై ప్రజల్లో అవగాహన తీసుకురావడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. ఈ ప్రత్యేకమైన రోజు వారికి గుర్తుండి పోయే విధంగా చేసేందుకు అమ్మ, చెల్లి, భార్య ఇలా ఇష్టమైన వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న వారు ఎలక్ట్రిక్ స్కూటర్ కొని ఇస్తే వారి ఆనందానికి హద్దులుండవు.

Gold Loan ATM : బ్యాంకులకు గుడ్ బై.. ఏటీఎం ద్వారా క్షణాల్లో గోల్డ్ లోన్!


ఫిబ్రవరి నెలలో దారుణంగా పడిపోయిన మారుతి ఎర్టిగా సేల్స్

ఫ్యామిలీతో కలిసి లాంగ్ టూర్ వెళ్లాలని అనుకుంటున్నారా.. అందుకోసం తక్కువ ధరలో మల్టిపర్పస్ సెవెన్ సీటర్ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే అలాంటి వాళ్లకు మారుతి సుజుకీ తయారు చేసిన ఎర్టిగా కారు(Maruti Suzuki Ertiga) బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ కారులో సౌకర్యవంతంగా ఏడుగురు కలిసి ప్రయాణించవచ్చు. అంతే కాదు దూర ప్రయాణాలకు ఈ కారు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మధ్య తరగతి వాళ్ల కారు కలను నెరవేర్చే మోడల్స్ లో మారుతి ఎర్టిగా ఒకటి. ఈ కారు బేసిక్ మోడల్ 12 లక్షలకే వస్తున్నందున ఇది వారికో మంచి ఆఫ్షన్ అని చెప్పవచ్చు.

ఓ మహిళా.. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త !

స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదన్న మాట వాస్తవం. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆమెను గౌరవించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందన్న మాట వినే ఉంటాం. తన వెనుక ఒక తల్లి, భార్య, చెల్లి, అక్క, కూతురు ఇలా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తి మరింత చేసే విధంగా ప్రతి ఒక్కరూ వాళ్లకు సహకరించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మీ జీవితంలో మీకు అండగా నిలిచిన మహిళలకు శుభాకాంక్షలు తెలపడం మన కర్తవ్యం.

హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు.. ఇలాంటి ఛాన్స్ మిస్ కాకండి!

ఆటోమొబైల్ పరిశ్రమలో వాహన తయారీదారుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. కొత్త కస్టమర్లను సాధించడమే లక్ష్యంగా పోటా పోటీగా లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కంపెనీలు తమ సేల్స్‌ను పెంచుకుని వ్యాపారాన్ని విస్తరించడం కోసం అప్పడప్పుడు ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ను కూడా అందిస్తుంటాయి. తాజాగా ఇప్పుడు దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors) ఇండియాలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి 'సూపర్ డిలైట్ మార్చ్(Super Delight Mmarch)' పేరిట ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త కస్టమర్లు భారీగా పెరుగుతారని కంపెనీ భావిస్తోంది. దీనిలో భాగంగా భారీ ఎత్తున తగ్గింపులు, ప్రత్యేక బహుమతులు పొందుతారు. హ్యుందాయ్ అందిస్తున్న ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలు ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి.