అదిరిపోయే హిలక్స్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..

ఆటోమొబైల్ పరిశ్రమలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్(Toyota Kirloskar Motor) ఇండియాలో కొత్తగా పికప్ ట్రక్ హిలక్స్ బ్లాక్ ఎడిషన్‌ (Hilux Black Edition)ను విడుదల చేసింది. దీన్ని ఇటీవల జనవరి ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో అట్టహసంగా నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ఆవిష్కరించగా, ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ వెల్లడించిన దాని ప్రకారం, దీని ప్రారంభ ధర రూ.37.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రీమియం కార్ల నుండి బడ్జెట్ ధరలో హ్యాచ్‌బ్యాక్‌ల వరకు పలు మోడళ్ల విడుదల చేస్తున్న టయోటా ఇప్పుడు ఈ కొత్త లాంచ్‌తో దాని మార్కెట్‌ను మరింత విస్తరించుకుంటుంది. ఇది శక్తివంతమైన పెర్ఫామెన్స్‌ను అందిస్తుందని తయారీదారు ప్రత్యేకంగా పేర్కొంది.

మారుతీ సుజుకీ మాస్టర్ స్ట్రోక్! సేల్స్‌లో మరోసారి అగ్రస్థానం

భారత ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (FADA) ప్రతి నెలా దేశవ్యాప్తంగా అమ్ముడుపోయిన వాహనాల డేటాను వెల్లడిస్తుంది. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న RTOలలో నమోదైన వాహనాలను నమోదు చేసుకుని ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంది. తాజాగా ఫాడా ఫిబ్రవరి 2025కు సంబంధించి కార్ల కంపెనీల ద్వారా RTO వద్ద నమోదైన డేటాను సేకరించి వాటి అమ్మకాల వివరాలు తాజాగా విడుదల చేసింది. గత నెలలో దిగ్గజ కార్ల తయారీ దారులు మెరుగైన సంఖ్యలో విక్రయాలను నమోదు చేశారు.

భర్తతో కలిసి సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టిన సోనమ్ కపూర్

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందంతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు సోనమ్. తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి నాలుగు ఫిలింఫేర్ అవార్డులకు నామినేట్ కూడా అయింది. సోనమ్ కపూర్ మరెవరో కాదు బాలీవుడ్ యాక్టర్ అనిల్ కుమార్ కుమార్తె. సోనమ్ కపూర్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్ ఆర్ట్స్ చదువుకుంది. 2005లో బ్లాక్ సినిమాకు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి డైరెక్షన్లో మెలకువలను నేర్చుకున్నారు.

ఛార్జింగ్ స్టేషన్ లేకపోవడంతో కర్ణాటక నుంచి గోవాకు స్కూటర్ తోసుకెళ్లిన యువకుడు

కొన్నేళ్ల కిందట మన దేశంలో పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ఉన్నన్ని లేవు. దీంతో పెట్రోల్ అయిపోతే బైకులు, స్కూటర్లను తోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లే వాళ్లను చిన్నప్పుడు చాలా మందినే చూసే ఉన్నాం. అప్పట్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంతలా డెవలప్ కాలేదు. ఇన్ని వాహనాలు అప్పట్లో లేవు. దీంతో కొన్నాళ్ల కిందట దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే పెట్రోల్ బంకులు ఉండేవి. గ్రామాల్లో ఉండేవారు పట్టణానికి వెళ్లినప్పుడు కావాల్సిన పెట్రోల్ అదనంగా తెచ్చుకునే వారు.
Advertisement

స్కూటర్ లాగా ఈజీగా మహిళలు డ్రైవింగ్ చేయగలిగే బెస్ట్ కార్స్

గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో కూడా పురోగతి సాధిస్తున్నారు. ఒకప్పుడు విద్య నేర్చుకోవడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు, పెద్ద సంస్థలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. సొంతంగా వ్యాపారాలను మొదలుపెట్టి సక్సెస్ అవుతున్నారు. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా విజయవంతంగా దూసుకుపోతున్నప్పటికి డ్రైవింగ్ వంటి రంగంలో మాత్రం కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడు వారిలో కూడా కొంత మార్పులు వచ్చాయి. మహిళలు కూడా డ్రైవింగ్‌లో రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. పురుషాధిక్య డ్రైవింగ్‌లో క్రమంగా వారు కూడా అడుగులు పెడుతున్నారు. చాలా ప్రాంతాల్లో మహిళ డ్రైవర్లు కనిపిస్తున్నారు.

అర్బన్ క్రూయిజర్ టైజర్ ధరలను భారీగా పెంచిన టయోటా

జపాన్ కు చెందిన ప్రసిద్ద ఆటో మొబైల్(Auto Mobile) కంపెనీ టయోటా(toyota). ఈ కంపెనీ తయారు చేసిన కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. టయోటా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి వదులుతుంది. ఈ కంపెనీ కొత్త టెక్నాలజీ సాయంతో కార్లను డిజైన్ చేసి తన ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను విసురుతూనే ఉంటుంది. అలాంటి కంపెనీ భారత్ లో పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీతో పొత్తు పెట్టుకుంది. అప్పటి నుంచి కంపెనీ వృద్ధి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో భారీ సంఖ్యంలో కార్లను అమ్ముతోంది. కస్టమర్లు కూడా ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో టయోటా కంపెనీ అమ్ముతున్న కార్లతో సంగం రీబ్యాడ్జ్ కార్లే.

టాటా బంపరాఫర్.. ఎలక్ట్రిక్ కార్లపై లక్ష రూపాయల వరకు తగ్గింపు

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ మాములుగా లేదు. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కార్ల తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ విభాగంలో భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పటికే పలు ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న కంపెనీ త్వరలో మరిన్ని మోడళ్లను విడుదల చేయడానికి ప్రయాత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే, మార్కెట్లో ఈవీ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని నిలుపుకోవడానికి మార్చి, 2025లో ప్రత్యేకంగా కొన్ని ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపులు టాటా మోటార్స్ అందిస్తుంది. తన ప్రసిద్ధ టియాగో(Tiago) EV హ్యాచ్‌బ్యాక్‌‌పై దాదాపు లక్ష రూపాయాల వరకు తగ్గింపు ప్రయోజనాలు ఇస్తుంది. 2024, 2025 మోడళ్లపై వేర్వేరు తగ్గింపులు ఉన్నాయి. తక్కువ ధరలో కొత్త ఈవీ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఉమెన్స్ డే స్పెషల్ ట్రీట్.. గిఫ్ట్‌గా బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇచ్చేసి సర్‌ప్రైజ్ చేయండి

ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day)న ఎంతో ఘనంగా జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను కాపాడేందుకు, లింగ అసమానతను తొలగించడానికి, వారిని ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఎదగడానికి 'ఉమెన్స్‌ డే'ను అన్ని దేశాల్లో ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక రోజును వారికి గుర్తిండి పోయేలా చేయడానికి అమ్మ, చెల్లి, భార్య మొదలగు వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న వారు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా ఇచ్చినట్లయితే వారి ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం స్కూటర్లు వినియోగించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. ఉద్యోగాలకు, కాలేజ్‌లు, ఇతర ఇంటి అవసరాలకు వారికి స్కూటర్లు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. మహిళల కోసం చాలా ఎలక్ట్రిక్ మోడళ్లు ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఇంధ్రభవనం లాంటి కోట్ల విలువైన లగ్జరీ కారును కొన్న కమల్ హాసన్‌

భారతీయ సినిమా పరిశ్రమలో అగ్ర నటుడు కమల్ హాసన్‌(kamal haasan) ఒకవైపు సినిమాలు చేస్తూనే అటూ రాజకీయాల్లో కూడా తిరుగుతున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళంతో పాటు ఇతర భాషల్లో నటించి దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించారు. సినిమాలు, రాజకీయాల గురించి ప్రక్కన పెడితే కమల్ హాసన్‌‌కు ప్రత్యేకంగా లగ్జరీ కార్లంటే అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే చాలా కార్లు ఉన్నాయి. తాజాగా ఈ అగ్ర నటుడు మరో అధునాతన విలాసవంతమైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.

5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన మొదటి మారుతీ సెడాన్‌కు యాక్సిడెంట్

భారతదేశంలో తక్కువ ధరలో మధ్యతరగతి వినియోగదారులు కొనగలిగే కార్లను విడుదల చేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India)కు చెందిన దిగ్గజ మోడల్ డిజైర్ (Dzire) ఇటీవల యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కొంత దెబ్బతింది. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, కారులో ఎంత మంది ఉన్నారనే విషయం గురించి ఎలాంటి వివరాలు తెలియనప్పటికీ లోపల కూర్చున్న ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కథనంలో మారుతీ డిజైర్ యాక్సిడెంట్ గురించి ప్రముఖంగా చర్చించడానికి ప్రధాన కారణం, గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన మారుతీ తొలి కారుగా గుర్తింపు పొందిన డిజైర్ ప్రమాదంలో దాని ముందు కుడి భాగం బాగా దెబ్బతింది. దీంతో ఇప్పుడు దీని నాణ్యత గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది.

దేశంలో డిమాండ్ ఉన్న బైక్స్.. రూ.60 వేల ధరలో 65+ కి.మీల మైలేజ్

ఇండియాలో రోజువారీ ప్రయాణాల కోసం టూవీలర్ తప్పనిసరి. ప్రతిరోజు ఇబ్బంది పడుకుంటూ ఉద్యోగాలకు, కాలేజ్‌లు, ఇతర చిన్న అవసరాల కోసం బస్సులు, ఆటోలు వంటి వాటిల్లో ప్రయాణించడం కంటే ఒక టూవీలర్ కొంటే అన్ని పనులు చేసుకోవచ్చని చాలా మంది బైక్ లేదా స్కూటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 80 శాతానికి పైగా ఇళ్లల్లో కనీసం ఒక్క టూవీలర్ అయిన తప్పనిసరిగా ఉంటుంది. ప్రధానంగా దేశంలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. తక్కువ ధరలో రోజవారి ప్రయాణాలకు ఎక్కువ మైలేజ్ అందించే బైక్స్‌లను కొనుగోలు చేయడానికి వారు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే తయారీదారులు కూడా అందుబాటు ధరల్లోనే పలు మోడళ్లు విడుదల చేస్తున్నారు.
Advertisement

ధోనీ కొత్త రేంజ్ రోవర్ కారు..! దీని ధర తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే

మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)కి క్రికెట్‌తో పాటు కార్స్, బైకులన్నా కూడా చాలా ఇష్టమని అందిరికీ తెలిసిందే. ఆయన గ్యారేజీలో వందల వాహనాలు ఉన్నాయి. వాటిలో పాత అరుదైన బైక్స్, కార్స్‌తో పాటు లేటెస్ట్‌గా మార్కెట్లోకి విడుదలైన పలు మోడళ్ల వరకు ఉంటాయి. కార్ల విషయానికి వస్తే, ఖరీదైన లగ్జరీ కార్లు ఆయన వద్ద ఉన్నాయి. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయితే దాని గురించి పూర్తిగా వాకబు చేసుకుని తనకు నచ్చినట్టు ఉంటే వెంటనే కొనుగోలు చేసి గ్యారేజీలో పెట్టుకుంటారు. కోట్లు విలువ చేసే కార్లను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా తమ ఇంటికి కొత్త బంధువును తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ బంధువు ఎవరో కాదు కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (range rover autobiography). ఇటీవల ఈ Suv కారును ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

అడవులు, కొండలతో పాటు రోడ్లపై కూడా రఫ్ఫాడించే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్

ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ అల్ట్రావయోలెట్ (ultraviolette) ఇండియాలో కొత్తగా అధునాతన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ బైకును విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు 'షాక్ వేవ్ (shockwave)'. ఇది రెండు విధాలుగా ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. అడవులు, బండరాళ్లు, గుంతలు కలిగిన ఆఫ్‌రోడ్‌తో పాటు సాధారణ రోడ్లపై కూడా ఈజీగా దూసుకుపోతుంది. భారత్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవీ మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అల్ట్రావయోలెట్ కొత్త డ్యూయల్-పర్పస్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. మరో విషయం ఏమిటంటే దీంతో పాటే తన మొట్టమొదటి 'టెస్రాక్ట్ (Tesseract)' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. స్కూటర్ విభాగంలో టెస్రాక్ట్. బైక్స్ విభాగంలో షాక్ వేవ్ కంపెనీని గొప్ప స్థాయికి తీసుకెళ్తాయని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది.

మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కిలోమీటర్లు

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ అల్ట్రావయోలెట్ (ultraviolette) దేశీయ మార్కెట్లో ఈవీ విభాగంలో చాలా కాలంగా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ మిగతా తయారీదారుల కంటే మరింత దూకుడు ప్రదర్శిస్తూ, కొత్త టూవీలర్స్‌ను తీసుకురావడంలో వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో అల్ట్రావయోలెట్ భారతీయ మార్కెట్లోకి తాజాగా తన మొట్టమొదటి 'టెస్రాక్ట్ (Tesseract)' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో, అదిరిపోయే పెర్ఫామెన్స్‌తో వచ్చింది. అన్ని వర్గాల వారు కొనగలిగే విధంగా బడ్జెట్ ధరలోనే దీన్ని లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్‌లో అల్ట్రావయోలెట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి ఇతర ఈవీ తయారీదారులకు గట్టి పోటీ ఇచ్చినట్లయింది. చూడగానే నచ్చే విధంగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కొత్త రూపం, అదిరిపోయే ఫీచర్స్‌తో అంబాసిడర్‌ కార్లు మళ్ళీ వస్తున్నాయ్!

భారతీయ మార్కెట్లో 90వ దశకంలో అంబాసిడర్ కార్ల హవా ఓ రేంజ్‌లో ఉండేది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, సినిమా స్టార్స్, ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఈ కార్లనే ఎక్కువగా వాడేవారు. ఈ కారుతో రోడ్లపై వెళ్తుంటే ఆ దర్జా వేరే లెవల్‌లో ఉండేది. ఒక ఇంట్లో అంబాసిడర్ (ambassador) ఉందంటే వారిని ధనవంతులు అనుకునేవారు. పాత కాలం సినిమాల్లో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. అంబాసిడర్‌ను చాలా మంది తమ సోషల్ స్టేటస్‌ కోసం వాడుతుండేవారు. ఇది భారతీయ మార్కెట్లో ఒక ఐకానిక్ మోడల్. ఒకప్పుడు రోడ్లను ఏలిన కారు ఇప్పుడు చాలా వరకు కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చాలా అరుదుగా మోడిఫై చేయించుకుని వాడుతుంటారు. అప్పటి కాలం వారు కొంతమంది తమకు ఇష్టమైన కారును వదిలి పెట్టలేక తమ గ్యారేజీలో భద్రంగా ఉంచుకుని వీలున్నప్పుడు రోడ్లపై అలా షికారుకు వెళ్తుంటారు

సేఫ్టీ, లగ్జరీ ఫీచర్స్, హై పెర్ఫార్మెన్స్‌తో వోల్వో XC90 కొత్త వెర్షన్ రోడ్డెక్కింది

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న కార్ల తయారీదారులకు అత్యంత కీలకం. దీనికి ప్రధాన కారణం చాలా దేశాలు ఆర్థికంగా బలంగా లేకపోవడం, వృద్ధి సన్నగిల్లడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే భారత్‌‌లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. పైగా ఇక్కడ వాహన పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్ల వాడకం కూడా ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో తయారీదారులు మన దేశానికి క్యూ కట్టి వరుసగా కొత్త కార్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో ఇప్పటికే మెరుగైన మార్కెట్ కలిగిన వోల్వో కార్ ఇండియా (Volvo Car India) కొత్త మోడళ్లను లాంచ్ చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా తాజాగా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ XC90 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

డిగ్రీ పాసయ్యారా అయితే టాటా సంస్థలో పలు ఉద్యోగాలు మీకోసం..!

టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 జూలై 2020.


సంస్థ పేరు: టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్‌తో పాటు ఇతర పోస్టులు

డిగ్రీ ఉంటే చాలు..ఎస్‌బీఐలో మంచి జీతంతో ఆఫీసర్ పోస్టులు

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 3850 సర్కిల్ బేస్డ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 ఆగష్టు 2020


సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 3850
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 ఆగష్టు 2020

దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న కారు.. షోరూమ్‌లకు క్యూ కట్టిన కస్టమర్లు

భారతీయ కార్ల తయారీలో మారుతీ సుజుకీ (Maruti Suzuki) చాలా కాలంగా నెం.1 స్థానంలో ఉంటుంది. దశబ్దాల నుంచి దేశంలో బడ్జెట్ ధరలో హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మొదలుకుని SUV ఇతర సెగ్మెంట‌ల కార్లను విక్రయిస్తుంది. కంపెనీ ప్రతిఏడాది కూడా అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో పోటీ ఎక్కువ అవుతున్న కొద్ది మారుతీ సైతం తన దూకుడును ప్రదర్శిస్తూ, మరింత మంది వినియోగాదారులకు చేరువ అవుతుంది. ప్రతినెల ముగిసిన తరువాత కార్ల తయారీదారులు తమ సేల్స్ వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి ముగిసిన నేపథ్యంలో వరుసగా కంపెనీలు ఈ నెలలో నమోదు చేసిన అమ్మకాలను విడుదల చేస్తున్నారు. డేటా ప్రకారం గత నెలలో మారుతీ సుజుకీ ఇతర కంపెనీల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించి ఫిబ్రవరిలో అగ్రస్థానం పొందింది.
Advertisement

భర్తతో కలిసి బెంజ్ కారులో తిరుగుతున్న గేమ్ ఛేంజర్ హీరోయిన్

సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. క్రికెటర్లు, ధనవంతులు, సినిమా తారలు వంటి వారు మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే వెంటనే దాన్ని కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. ముఖ్యంగా సినిపరిశ్రమకు చెందిన వారు ఇటీవల కాలంలో పలు ఈవెంట్‌లకు వెళ్లినప్పుడు లేదా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కోట్లు విలువ చేసే టాప్ బ్రాండ్‌లకు చెందిన లగ్జరీ కార్లతో ఎక్కువగా కనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా బాలీవుడ్‌లో అత్యంత ప్రియమైన జంటలలో ఒకరైన నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) ఆయన భార్య నటి కియారా అద్వానీ (Kiara Advani) ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుతో కనిపించారు. ఈ సెలబ్రిటీ జంట ఒక బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరు కలిసి బయట కెమెరాల కంట పడ్డారు.

ఏకంగా టాటా మోటార్స్‌కే ఊహించని షాక్ ఇచ్చిన కస్టమర్లు

ఇండియాలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన కార్లను విడుదల చేయడంలో ఎంతో నమ్మకం కలిగిన దేశీయ ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) ఎప్పటికప్పుడు తన అమ్మకాల వివరాలు విడుదల చేస్తుంది. నెల ముగియగానే సేల్స్ డేటాను వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిబ్రవరి ముగిసిన తరుణంలో ఈ నెలలో కంపెనీ విక్రయించిన మొత్తం డేటాను ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం, టాటా మోటార్స్ 2025 ఫిబ్రవరి నెలలో మొత్తం 79,344 యూనిట్లను విక్రయించింది. వీటిలో దేశీయంగా విక్రయించినవే కాకుండా ఇతర దేశాలకు చేసిన ఎగుమతులు సైతం కలిపి ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి తక్కువగా నమోదయ్యాయి. 2024 ఫిబ్రవరిలో టాటా మోటార్స్ 86,406 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈసారి 8 శాతం తగ్గింది. భారతీయ ఆటో మార్కెట్లో టాటా కంపెనీకి బలమైన మార్కెట్ ఉంది.

రోజువారీ వాడకానికి దేశంలో లభిస్తున్న టాప్ బెస్ట్ స్కూటర్లు

ఇండియాలో పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకుని గ్రామీణ ఏరియాల్లో ఉన్న ప్రజల వరకు బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. రోజువారీ పనులు చేసుకోవడానికి టూవీలర్స్ ఇప్పుడు తప్పనిసరి. స్కూటర్ అయితే ఇలాంటి వాటికి చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. గేర్స్ లేకుండా మహిళలు, పురుషులు సులభంగా రైడ్ చేయడానికి ఇవి ఉత్తమమైన ఆప్షన్. ప్రస్తుతం మార్కెట్లో చాలా మోడళ్లు కొనుగోలుకు లభిస్తున్నాయి. కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారు వేటిని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. తక్కువ ధరలో లభించడంతో పాటు, మంచి మైలేజ్ అందించే, మెరుగైన ఫెర్ఫామెన్స్‌ను ఇచ్చే స్కూటర్స్‌‌లో హోండా యాక్టివా,సుజుకి యాక్సెస్, హీరో డెస్టినీ, యమహా ఫాసినో వంటి మొదలగు టాప్ మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కొత్త స్కూటర్ కొనాలని అనుకుంటున్న వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతాయి. వీటి గురించి కింది కథనంలో తెలసుకుందాం.

తక్కువ ధరకే మరిన్ని ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చిన క్రెటా కొత్త వేరియంట్స్

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) ఇండియాలో చాలా కాలంగా కార్లను విక్రయిస్తుంది. ప్రతి ఏడాది అదిరిపోయే డిజైన్‌తో అత్యాధునిక ఫీచర్స్‌తో కస్టమర్లకు అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ ధరలో కార్లను విడుదల చేస్తుంది. దేశంలో హ్యుందాయ్ కార్లు చాలా ప్రసిద్ధి చెందాయి. వాటిలో క్రెటా (Creta) మోడల్‌కు మంచి ఆదరణ ఉంది. మిడ్‌సైజ్ SUV విభాగంలో క్రెటా దేశంలో విజయవంతమైన మోడల్. దాదాపు 1.2 మిలియన్లకు పైగా కస్టమర్లు దీనిని వాడుతున్నారు. దీని ఆకట్టుకునే ప్రీమియం లుక్స్, ఫీచర్స్ కారణంగా భారతీయ కస్టమర్లలో ప్రజాదరణ పొందిన కారుగా నిలుస్తుంది. ఇంత డిమాండ్ ఉన్న మోడల్‌ను హ్యుందాయ్ కొత్తగా మరింత ఆకట్టుకునే ఫీచర్స్‌తో విడుదల చేసింది. 2025 క్రెటా కొత్త వేరియంట్‌లతో కూడా వచ్చింది. అప్‌డేట్‌లలో భాగంగా రెండు వేరియంట్‌లు SX ప్రీమియం, EX (O) ను తీసుకొచ్చింది.

రూ.53 వేలకే కోమాకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 75-100 కి.మీ.ల రేంజ్

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ఈవీ తయారీదారులు వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ తమ వ్యాపారాన్ని క్రమంగా పెంచుకుంటున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ కోమాకి (Komaki) కూడా దేశీయ వినియోగదారుల కోసం కొత్త స్కూటర్లను విడుదల చేస్తూ తన మార్కెట్ వాటాను విస్తరిస్తుంది. కంపెనీ తాజాగా X3 సిరీస్‌ను విడుదల చేసింది. అయితే వీటిని పట్టణ ప్రాంతాల్లోని మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించింది. వీటిని నడపడం చాలా ఈజీ. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ టూవీలర్స్‌‌లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించడానికి చాలా కాలంగా అధునాతన మోడళ్లను తీసుకొస్తున్న కోమాకి ఇప్పుడు ఎక్స్‌3 సిరీస్‌ను కూడా లేటెస్ట్ ఫీచర్స్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చింది.