మంచి మైలేజ్ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్‌.. లేటెస్ట్ ఇంజిన్‌‌తో లాంచ్

దేశంలో టూవీలర్ విభాగంలో బైక్స్‌తో పాటు స్కూటర్స్ కూడా భారీగానే అమ్మకాలు సాధిస్తున్నాయి. మహిళలు, పురుషులు నడపడానికి అనుకూలంగా ఉండే స్కూటర్స్ అంటే చాలా మందికి ఇష్టం. నగరాలు, పట్టణాల్లో రోజు ఆఫీసులు, కాలేజ్‌లకు వెళ్లడానికి గ్రామాల్లో వివిధ అవసరాల కోసం ఇవి చాలా అనువుగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో హోండా యాక్టివా అంటే అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. దీనిని స్కూటర్లలో రారాజుగా పిలుస్తారు. దీని తర్వాత ఇదే విభాగంలో డిమాండ్ ఉన్న మోడల్ అంటే TVS జూపిటర్ మాత్రమే. దీన్ని స్కూటర్లలో రాణిగా అనుకుంటారు. దీని ఆకట్టుకునే డిజైన్, మైలేజ్ ఇంజిన్ పనితీరు వంటి అంశాల ప్రాతిపదికన TVS jupiter‌ను కొనుగోలు చేసే వారి లక్షల్లో ఉంటారు. అసలైన ఫ్యామిలీ స్కూటర్‌గా ఇది భారతీయ రోడ్లపై పరుగులు పెడుతుంది. ప్రతి నెలా లక్షలాది మంది దీని కొంటుంటారు.

కొత్త స్కూటర్ కొనాలా? అందరి ఫేవరెట్ యాక్టివా ఎలక్ట్రిక్ షోరూమ్‌‌లకు వచ్చేసింది

ఇండియాలో టూవీలర్ తయారీదారుల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీ హోండా (Honda) అమ్మకాలతో దూసుకుపోతుంది. దేశంలో పేద, మధ్య తరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో, ఎక్కువ రేంజ్ అందించే బైక్స్, స్కూటర్స్‌ను విక్రయించడంలో హోండాకు ఎదురేలేదు. ముఖ్యంగా స్కూటర్ అంటే దేశంలో అందరికి గుర్తుకు వచ్చే ఒకే ఒక మోడల్ అదే యాక్టివా (Activa). భారతదేశంలో దీనికి మామూలు డిమాండ్ ఉండదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఇది కనిపిస్తుంది. ఏళ్ల క్రితం విడుదలైన యాక్టివా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తగా అప్‌డేట్ అవుతూ మార్కెట్లోకి కొత్త ఫీచర్స్‌తో వస్తూనే ఉంది. అయితే ఇంతకాలం Ice ఇంజిన్‌లో లభించిన ఈ స్కూటర్ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హోండా ఇటీవల కొత్తగా యాక్టివా-ఇ (Activa e) ఈవీను తీసుకొచ్చింది.

మంచి మైలేజ్‌తో నిస్సాన్ కొత్త బేబీ SUV వచ్చేస్తుంది.. మెయింటనెన్స్ చాలా తక్కువ

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియా (Nissan India) దేశీయ వినియోగదారులకు తక్కువ ధరలో కార్లను విక్రయిస్తూ, మారుతీ సుజుకీ (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors) వంటి కంపెనీలకు పోటీగా నిలుస్తుంది. తన ప్రసిద్ధ మోడల్ మాగ్నైట్ (magnite) దేశంలో బాగా ప్రజాధారణ పొందిన suvలలో ఒకటిగా ఉంది. ఇది ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్న మంచి డిమాండ్ ఉన్న కారు. దీని ఆకట్టుకునే రూపం, ఇంజిన్ పనితీరుతో అమ్మకాలను ఆశించినంతంగా సాధిస్తూ, నిస్సాన్ పేరును దేశం మొత్తం విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాగ్నైట్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో ఉంది. అయితే కంపెనీ ఈ ప్రసిద్ధ కారును Cng ఆప్షన్‌లో తీసురావాలని చూస్తుంది.

ఇండియాలో టెస్లా మొట్టమొదటి షోరూమ్ ఎక్కడో తెలుసా..?

ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీలో దిగ్గజ కంపెనీ ఎలాన్ మస్క్‌(Elon Musk)కు చెందిన టెస్లా (Tesla) ఇండియాలో తన కార్యకలాపాలను ప్రారంభించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్లాంట్‌లో ఏర్పాటు చేయడానికి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని అనువైన ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో ఇప్పటికే ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన తన వాహనాలను విక్రయించడానికి మొదటి షోరూమ్‌ను ఏర్పాటు చేయడానికి గత కొంత కాలంగా కీలక నగరాల్లో అనువుగా ప్రాంతాలను పరిశీలిస్తుండగా, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, టెస్లా తన మొదటి షోరూమ్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఒక వాణిజ్య టవర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కంపెనీ తన షోరూమ్ అవసరాల మేరకు దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలానికి లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ చదరపు అడుగుకు రూ.900 అద్దె చెల్లించనుంది.
Advertisement

దేశ రాజధానిలో 15 ఏళ్ల కంటే పాత వాహనాలకు ఇకపై పెట్రోల్, డీజిల్ నిషేధం!

దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం అక్కడ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. వాహనాల నుంచి అధికంగా విడుదల అవుతున్న ఉద్గారాలను, కాలుష్యాన్ని తగ్గించడం కోసం 15 ఏళ్లు దాటిన పాత వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయవద్దని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్‌ సింగ్‌ సిర్సా అధికారులతో సమావేశమైన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదేశాలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో గాలి నాణ్యత గత కొన్నేళ్లుగా చాలా వరకు తగ్గుతుంది. ప్రధానంగా వాహనాల సంఖ్య రాజధానిలో భారీగా పెరిగింది. దీంతో వాటి నుంచి తీవ్రస్థాయిలో కాలుష్య ఉద్గారాలు విడుదల అవుతున్నాయి.

రూ.4.23 లక్షలకే 6 ఎయిర్‌బ్యాగులు.. మారుతీ ఆల్టో K10 కొత్త అప్‌డేట్‌

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారతీయ వినియోగాదారులకు తక్కువ ధరలో కార్లను అందించడంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. దేశంలో చాలా ప్రసిద్ధ మోడళ్లను విక్రయిస్తూ, అమ్మకాల పరంగా మొదటి స్థానంలో ఉన్న మారుతీ తన కార్లలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన ప్రమాణాలను అందిస్తుంది. తాజాగా కంపెనీ ఇండియాలో ఫేమస్ మోడల్ అయినటువంటి ఎంట్రీ లెవల్ ఆల్టో K10 (Alto K10) కారును కొత్తగా అప్‌డేట్ చేసి తిరిగి మార్కెట్లోకి అమ్మకానికి తీసుకొచ్చింది. సాధారణంగా దేశంలో పేద-మధ్య తరగతి వారు తక్కువ ధరలో కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారికి మారుతీ ఆల్టో K10 సరైన ఆప్షన్. ఇప్పుడు మరింత కొత్తగా అప్‌డేటేడ్ ఫీచర్స్‌తో వచ్చిన ఎంట్రీ వేరియంట్‌ను జనాలు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గతంలో కంటే చాలా వరకు తగ్గిన ఓలా స్కూటర్ అమ్మకాలు

బెంగళూరు‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇండియాలో ఇ-స్కూటర్ల సెగ్మెంట్‌లో అమ్మకాలతో దూసుకుపోతుంది. కంపెనీ మోడళ్లపై దేశంలో పలు ఆరోపణలు వచ్చిన్నప్పటికి వాటన్నింటిని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ, ఇంకా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, ఈవీ టవీలర్ వాటాను క్రమంగా పెంచుకోవడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇ స్కూటర్‌లో తన సత్తాను చాటుతున్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇటీవల 'రోడ్‌స్టర్' అనే ఈవీ బైక్‌ను కూడా విడుదల చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు బైక్స్ విభాగంలో ప్రత్యర్థులకు బలమైన పోటీగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓలా ఫిబ్రవరి నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. డేటా ప్రకారం, గత నెలలో ఓలా ఎలక్ట్రిక్ 25,000 కంటే ఎక్కువ స్కూటర్లను విక్రయించింది.

ఈ కారుతో దారిలో ఎక్కడా ఆగనవసరం లేదు.. ఏకంగా 630 కి.మీలు డ్రైవ్ చేయచ్చు!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తన వాహనాలను విక్రయిస్తుంది. ఇండియాలో ఇప్పుడు కియా అంటే చాలా ఫేమస్. ఇక్కడ అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కార్ల తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కంపెనీ సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తూ ఈవీ సెగ్మెంట్‌లో కూడా తన సత్తాను చాటుతుంది. ఇప్పటికే పలు ఈవీ మోడళ్లను లాంచ్ చేసిన కియా తాజాగా కొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్‌ను ఆవిష్కరించింది. దీని పేరు 'ఈవీ4 (Ev4)'. ప్రస్తుతం ఇది అందుబాటులో లేనప్పటికి త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోతుంది. ప్రపంచం మొత్తం కూడా ఈవీల వైపు చూస్తున్న నేపథ్యంలో కియా మోటార్స్ ఈ కొత్త కారుతో మార్కెట్ వాటాను పెంచుకోనుంది.

మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో ముగిసిన ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం

ఏసర్ ఫాస్టర్ అవార్డుల (acer faster awards) నాలుగో ఎడిషన్ కోసం దేశంలో వాహన ప్రేమికులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా దీనికి సంబంధించిన జ్యూరీ సమావేశం ఫిబ్రవరి 26,27 తేదీలలో చెన్నైలోని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌ (MMRT)లో విజయవంతంగా ముగిసింది. గతంలో ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకను ఈసారి కూడా అదే విధంగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తాజాగా ముగిసిన జ్యూరీ సమావేశంలో న్యాయనిర్ణేతలు గత ఏడాదిలో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ కార్స్, బైక్స్‌లను ఎంపిక చేశారు. తుది నామినేషన్‌లో భాగంగా టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్, సేఫ్టీతో పాటు ఇతర కీలక అంశాలకు సంబంధించి కఠిన పరీక్షలు నిర్వహించిన తర్వాత వాటిలో నుంచి అత్యుత్తమమైనవాటిని చివరి రౌండ్‌కు నామినేట్ చేశారు. విజేతలను కూడా ప్రకటించనున్నారు.

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో చైనీస్ బ్రాండ్లు

ప్రపంచ వాహన పరిశ్రమలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేసేవారు, Cngలు కూడా అనుకున్నంత స్థాయిలోనే సేల్స్‌ను నమోదు చేసేవి. అయితే ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల(ev) వైపు అడుగులు వేస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి విడుదల అవుతున్న వాటిలో ఎక్కువగా ఈవీలే ఉంటున్నాయి. ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఈవీ తయారీ సంస్ధలు ఉన్నాయి. వీటిలో దిగ్గజ కంపెనీల నుంచి మొదలుకుని పలు మధ్యస్థ స్థాయి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చాలా సంస్థలు ఉండగా, వాటన్నింటిలో చైనా దేశాలకు చెందిన కంపెనీలు ముందంజలో ఉన్నాయి.

యమహా హైబ్రిడ్ బైక్.. పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్.. కాన్సెప్ట్‌ మోడల్‌గా ప్రదర్శన

ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇవి మంచి మైలేజ్ ఇవ్వడంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. అందుకే కొత్తగా వాహనాలను ఇంటికి తెచ్చుకోవాలని అనుకునేవారు హైబ్రిడ్ మోడళ్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తయారీదారులు కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హైబ్రిడ్ కార్లను విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే ఫీచర్‌తో టూవీలర్స్‌ను సైతం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా (yamaha) కొత్తగా xmax సిరీస్‌లో SHEV అనే హైబ్రిడ్ బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ప్రపంచమార్కెట్లో కాన్సెప్ట్ మోడల్‌గా ఆవిష్కరించింది. కార్లలో విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీ ఇప్పుడు టూవీలర్ సెగ్మెంట్‌లోకి మారింది.

రూ.6.21 లక్షలకే రూ.27 కి.మీల మైలేజ్ ఇచ్చే కారు సేల్స్‌లో దూసుకుపోతుంది

దక్షిణకొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ఇండియాలో కూడా మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. తక్కువ ధరతో పాటు, మెరుగైన మైలేజ్ ఇచ్చే కార్లను విడుదల చేయడంలో దేశంలో గుర్తింపు పొందింది. కంపెనీ ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హ్యుందాయ్‌కు గొప్ప పేరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ మోడల్ ఎక్స్‌టర్ (Exter) Suvకి సంబంధించిన సేల్స్ వివరాలు వెల్లడించింది. భారతదేశంలో ప్రజాధారణ పొంందిన కార్లతో ఈ ఎస్‌యూవీ కూడా ఒకటి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభించడంతో పాటు మైలేజ్ కూడా అద్భుతంగా వస్తుంది. ఈ ఎక్స్‌టర్ కారు జనవరి 2025 నెలలో 6,068 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీనికి ముందు డిసెంబర్ నెల 2024లో కేవలం 5,270 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
Advertisement

మార్కెట్లోకి సరికొత్త ఆటోరిక్షాలు.. ఒక కి.మీకు కేవలం రూ.1 ఖర్చు!

దేశీయ ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ (Bajaj) ఇండియాలో టూవీలర్ వాహనాలతో పాటు, త్రీవీలర్స్‌ను కూడా విడుదల చేస్తుంది. ఈ కంపెనీకి చెందిన పలు వాహనాలకు దేశంలో మంచి ఆదరణ ఉంది. తాజాగా బజాజ్ మార్కెట్లోకి సరికొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు లాంచ్ చేసింది. వీటికి కంపెనీ గోగో(gogo) అని పేరు పెట్టింది. గోగో బ్రాండ్ కింద విడుదలైన వీటి పేర్లు, P5009, P5012, P7012. బజాజ్ సాధారణంగా ఇండియాలో త్రీ వీలర్ విభాగంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పుడు కొత్త మోడళ్ల ద్వారా కంపెనీ స్థాయి మరో ఎత్తుకు వెళ్తుంది. బజాజ్ గోగో బ్రాండ్ కింద ప్రస్తుతం ఈ మూడింటిని విడుదల చేసినప్పటికీ త్వరలో మరిన్నింటిని విడుదల చేయాలని చూస్తుంది. ఈ కొత్త ఆటోరిక్షాలోని మొదటి 'P' అక్షరం ప్యాసింజర్‌ని సూచిస్తుంది, 50, 70 నెంబర్లు వాటి కొలతలను పేర్కొంటుంది.

బీఎండబ్ల్యూ లగ్జరీ కారుతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్

ఇండియాలో లగ్జరీ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ధనవంతులు, సినీ తారలు, క్రికెటర్లు వంటి సెలబ్రిటీలు మార్కెట్లోకి ఏదైన కొత్త మోడల్ లగ్జరీ కారు విడుదల అయిందంటే వెంటనే దాని గురించి వాకబు చేసుకుని తమ గ్యారేజీలో చేర్చుకుంటారు. ఇటీవల కాలంలో చాలా మంది సినీ తారల కోట్లు విలువ చేసే టాప్ బ్రాండ్‌లకు చెందిన కార్లతో కెమెరాల కంట పడుతూ, సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. తాజాగా తెలుగు, కన్నడ,హిందీ, పంజాబీ, తమిళ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి యామీ గౌత‌మ్ (Yami Gautam) దిగ్గజ లగ్జరీ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ (BMW)కు చెందిన X7 (ఎక్స్‌7) అనే కారుతో కనిపించింది. ఖరీదైన కారు నుంచి ఆమె బయటకు దిగుతున్న వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె అభిమానులు షేర్ చేస్తున్నారు.

సేల్స్‌లో దూసుకుపోతున్న టీవీఎస్ జూపిటర్ స్కూటర్.. ఒకే నెలలో లక్షకుపైనే

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ (Tvs Motor) దేశంలో తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే మోడళ్లను విక్రయిస్తూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా కస్టమర్లను కలిగి ఉంది. హోండా, హీరో వంటి కంపెలకు ధీటుగా బలమైన టూవీలర్స్‌ను దింపడంలో టీవీఎస్ కంపెనీ పెట్టింది పేరు. ప్రతి ఏడాది కూడా అమ్మకాలతో దూసుకుపోతున్న టీవీఎస్ తాజాగా జనవరి 2025కు సంబంధించిన సేల్స్ డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, కంపెనీ ఈ నెలలో మొత్తం 2,93,802 టూవీలర్స్‌ను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే సేల్స్ పెరిగాయి. 2024 జనవరి నెలలో టీవీఎస్ మొత్తం 2,68,233 టూవీలర్స్‌ను సేల్ చేసింది. దేశంలో చాలా మంది ఈ కంపెనీ మోడళ్లను ఆదరించినట్లు ఈ డేటాను చూస్తేనే తెలిసిపోతుంది.

చేతివృత్తులకు వారికి గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 3 లక్షల వరకు రుణం.. అర్హతలు ఇవే!

భారతీయ కళాకారులను బంధక రహిత రుణాలతో ఎలా మద్దతు ఇస్తుందో, చిన్న పరిశ్రమలు మరియు ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

30 కి.మీల మైలేజ్ ఇచ్చే కారు ధరను పెంచిన టయోటా

ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు మారుతీ (Maruti), టయోటా (Toyota) సంయుక్తంగా కలిపి రూపొందించిన టయోటా గ్లాంజా మోడల్ ఇండియాలో బాగా ఆదరణ పొందింది. ఇది 2019లో మార్కెట్లోకి ప్రవేశించింది. చాలా మంది ఈ కారును కొనుగోలు చేశారు. సేల్స్ పరంగా టాటా ఆల్ట్రేస్‌‌ను సైతం అధిగమించింది. గత నెలలో గ్లాంజా సేల్స్ దాదాపు 2 లక్షల యూనిట్లను దాటడం గమనార్హం. దేశంలో లాంచ్ అయిన 5 ఏళ్ల తరువాత ఇప్పటి వరకు ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇన్ని లక్షల అమ్మకాలను దాటి కొత్త ఘనతను సాధించింది. ఇదిలా ఉంటే టయోటా కిర్లోస్కర్ మోటార్ (toyota kirloskar motor) ఇటీవల షాకింగ్ న్యూస్ చెప్పింది. అమ్మకాలతో దూసుకుపోతున్న గ్లాంజా కారు ధరను పెంచింది. దీంతో దీన్ని కొనుగోలు చేయాలని అనుకున్న వారికి ఇది విచారం కలిగించే వార్త అని చెప్పవచ్చు.

500 కి.మీల రేంజ్‌తో పాటు ప్రయాణికుల సేఫ్టీ విషయంలో రారాజు!

మారుతీ సుజుకీ(Maruti Suzuki) దేశంలో పేద-మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో కార్లను విడుదల చేస్తూ, ప్రసిద్ధ తయారీదారుగా ఉంది. పెట్రోల్, డీజిల్, CNG వాహనాల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు దూసుకుపోతున్నప్పటి మారుతీ మాత్రం అందరి కంటే వెనుక స్థానంలో ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈవీ విభాగంపై కూడా ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇ-విటారా(-e-vitara) అనే ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. దీన్ని ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVతో మారుతీ ఈవీ సెగ్మెంట్‌లో సైతం తన సత్తాను చాటడానికి సిద్ధమైంది. ఈ కారు కోసం మారుతీ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇ-విటారాను మార్చిలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ లగ్జరీ కారును కూడా తమన్నా స్టైల్‌లో మెరిసిపోయేలా చేసింది!

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోల పక్కన నటించి దేశవ్యాప్తంగా భారీ లెవల్లో ఫ్యాన్స్‌ను కలిగిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah bhatia) సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్, పలు ప్రకటనల ద్వారా భారీగా సంపాదిస్తుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 కి పైగా సినిమాల్లో నటించిన తమన్నాకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇటీవల కాలంలో పలు ఈవెంట్స్‌కు, పార్టీలకు హాజరైనప్పుడు అధునాతన కార్లతో కనిపించిన ఆమె తాజాగా ఖరీదైన లగ్జరీ ఆడి A4 సెడాన్‌తో కెమెరాల కంట పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ టీషర్ట్‌తో మెరిసిపోతున్న తమన్నాఒక జిమ్ నుంచి బయటకు వచ్చి ఆడి A4 కారులో వెళ్లిపోయారు. ఈ క్రమంలో కెమెరాలకు ఫోజులిచ్చారు. అయితే ఇప్పుడు ఈ కారు గురించి ప్రత్యేకంగా ఆటో ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు.

ఈ కారును జనాలు ఎగబడి మరి కొన్నారు.. ఏకంగా లక్ష అమ్మకాలు

ఇండియాలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా (Honda)కు మంచి మార్కెట్ ఉంది. టాటా మోటార్స్, మారుతీ వంటి దేశీయ తయారీదారులకు పోటీగా అధునాతన మోడళ్లను విడుదల చేస్తూనే ఉంది. గత కొన్నేళ్లుగా దేశంలో కార్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో హోండా మార్కెట్లో మెజార్టీ వాటాను పొందడానికి ప్రతి ఏడాది అదిరిపోయే మోడళ్లను భారతీయ వినియోగదారులు కొనగలిగే విధంగా బడ్జెట్ ధరలో విడుదల చేస్తూ అమ్మకాలను క్రమంగా పెంచుకుంటుంది. ఇండియాలో పలు మోడళ్లను విక్రయిస్తున్న హోండా తాజాగా తన ప్రసిద్ధ SUV ఎలివేట్‌‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. ఈ కారు సేల్స్ పరంగా సరికొత్త రికార్డును సాధించింది. హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ (Honda Elevate SUV) మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి దాదాపు ఒక లక్ష అమ్మకాలను నమోదు చేసింది. జనాలు ఈ కారును ఆదరించడంపై కంపెనీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement

తక్కువ ధర, అదిరిపోయే ఫీచర్స్ ఉన్న కారును 60 మంది మాత్రమే కొన్నారు

ఫ్రెంచ్‌‌కు చెందిన ప్రముఖ ఆటోమోబైల్ తయారీ కంపెనీ సిట్రోయెన్ (Citroen) ఇండియాలో కూడా తన కార్లను విక్రయిస్తుంది. దేశీయ వాహన తయారీదారులకు పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను లాంచ్ చేస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఈవీలను కూడా అమ్మకానికి తీసుకొస్తుంది. కంపెనీ దేశంలో eC3 EV అనే ఈవీ కారును విక్రయిస్తుంది. తాజాగా సిట్రోయెన్ ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. డేటా ప్రకారం, ఈ కారును జనాలు ఎక్కువగా ఆదరించడం లేదని తెలుస్తుంది. జనవరి 2025లో, eC3 EVని కేవలం 60 మంది మాత్రమే కొనుగోలు చేశారు. అధునాతన ఫీచర్స్, అదిరిపోయే డిజైన్‌ను కలిగిన ఈ కారు ఇంత తక్కువగా సేల్స్ నమోదు చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 67.39 శాతం తగ్గడం గమనార్హం.

ఈ పొట్టి కారుతో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు మీ మీదే

JSW MG మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూసుకుపోతుంది. టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి కంపెనీలకు పోటీగా బడ్జెట్ ధరలో ఈవీలను విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో ఈవీల హవా ఎక్కువగా ఉంది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లకు కూడా మంచి ఆదరణ ఉంది. ఇదే అదునుగా తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఈవీ తయారీదారులు పోటా పోటీగా కార్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఎంజీ మోటార్ సైతం ఎలక్ట్రిక్ కార్లపై మెయిన్ ఫోకస్ చేసింది. ఇప్పటికే దేశీయంగా ZS EV, విండ్సర్ EV, కామెట్ EV విక్రయిస్తుండగా, తాజాగా MG కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ (Blackstorm) అనే ప్రత్యేక ఎడిషన్ కారును విడుదల చేసింది. ఇది చూడటానికి నల్లగా కనిపిస్తుంది. దీని అల్లాయ్ వీల్స్ మరింత ఆకట్టుకునే విధంగా ఎరుపు కలర్‌తో వచ్చాయి.

గుడ్‌న్యూస్.. పెద్ద కుటుంబానికి సరిపోయే ఈ కారుపై రూ.2.4 లక్షల డిస్కౌంట్

భారత కార్ల మార్కెట్‌లో JSW MG మోటార్ ఇండియా ప్రముఖ కంపెనీగా ఉంది. అధునాతన ఫీచర్స్‌తో ప్రీమియం లుకింగ్‌ను కలిగిన మోడళ్లను లాంచ్ చేస్తుంది. కంపెనీ తన సేల్స్‌ను పెంచుకోడానికి అప్పుడప్పుడు ప్రత్యేకంగా తగ్గింపులు అందిస్తుంటుంది. ఈ క్రమంలో మరోసారి తన ప్రసిద్ధ మోడల్ హెక్టర్ (Hector) కారుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. తక్కువ ధరలో కస్టమర్లు దీన్ని సొంతం చేసుకోవడానికి ఈ SUV పై రూ. 2.40 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నటు కంపెనీ ప్రకటించింది. కొత్తగా డిస్కౌంట్ ధరలో కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఇదే మంచి అవకాశం. ముఖ్య విషయం ఏమిటంటే ఈ తగ్గింపు ప్రయోజనాలు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మార్కెట్లోకి అదిరిపోయే అడ్వెంచర్ టూరింగ్ బైక్‌ను లాంచ్ చేసిన డుకాటీ

లగ్జరీ టూవీలర్ తయారీ కంపెనీ డుకాటీ (Ducati) ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన బైక్స్‌ను విడుదల చేయడంలో ప్రసిద్థి చెందిన సంస్థ. ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్‌ వంటి కఠిన రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోయే మోడళ్లను లాంచ్ చేయడంలో డుకాటీకి మంచి పేరుంది. భారతీయ మార్కెట్లో ఈ కంపెనీ నుంచి టూవీలర్స్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. టూరింగ్, లాంగ్ రైడ్ వంటి వాటి కోసం ఇప్పటికే అధునాతన మోడళ్లను తీసుకొచ్చిన డుకాటీ తాజాగా దేశీయ మార్కెట్లో అదిరిపోయే బైక్‌ను దింపింది. ఈ కొత్త మోడల్ పేరు 'డిజర్ట్‌ ఎక్స్‌ డిస్కవరీ (Desert S Discovery)'. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. ఎక్కువ దూరం రైడింగ్ చేసే వారికి ఇది అత్యంత అనువైన మోడల్ అని కంపెనీ పేర్కొంటుంది. లాంగ్ రైడింగ్ సమయంలో ఉపయోగకరంగా ఉండేలా అధునాతన ఫీచర్స్‌ను దీనిలొ అందించారు.

2025 ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్: 26 నుంచి జ్యూరీ సమావేశం.. సభ్యుల్లో డ్రైవ్‌స్పార్క్ ప్రతినిధి

భారతీయ వాహన ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏసర్ ఫాస్టర్ అవార్డుల (acer faster awards) నాల్గవ ఎడిషన్ కోసం జ్యూరీ రౌండ్ 26 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఏడాది (2024)లో ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ ఈ సారి మరింత ఘనంగా జరగడానికి సిద్దమవుతుంది. 2025 ఎడిషన్ కోసం చెన్నైలోని ప్రసిద్ధ మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో జ్యూరీ రౌండ్‌ను ఫిబ్రవరి 26,27 తేదీలలో నిర్వహించనున్నారు. గత ఏడాది మార్కెట్లోకి విడుదలైన కార్లు, బైక్స్‌లలో ఉత్తమమైన వాటిని గుర్తించి బహుమతులతో సత్కరిస్తారు. నాల్గవ ఎడిషన్ కోసం అవార్డులకు వాహనాలను ఎంపిక చేయడానికి 26 నుంచి రెండు రోజుల పాటు జ్యూరీ సమావేశం జరుగుతుంది. ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ జ్యూరీలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. 2024లో విడుదలైన కార్స్, బైక్స్‌ ఈ జ్యూరీలో ఎంట్రీకి అర్హత కలిగి ఉంటాయి.