ఈ స్టైలిష్ మారుతీ కారు ఇకపై కనిపించదు! ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసా?
ఆటోమొబైల్స్
- 1 year, 7 month, 13 days ago
ఇండియాలో పేద, మధ్య తరగతి వినియోగదారులకు తక్కువ ధరలో కార్లను విడుదల చేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) దేశంలో విక్రయిస్తున్న ఏకైక సెడాన్ మోడల్ సియాజ్ కారు అమ్మకాలను నిలిపివేయాలని ఆలోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాల నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది సెడాన్ కార్ల లవర్స్‌కు బాధ కలిగించే న్యూస్ అని చెప్పవచ్చు. మారుతీ సుజుకీ సియాజ్ (ciaz) అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి నిలిపివేయబడతాయని తెలుస్తుంది. అయితే కంపెనీ నుంచి ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ నివేదికలు మాత్రం ఈ కారు ఉత్పత్తిని మార్చి చివరి నాటికి ఆగిపోతుందని, ఏప్రిల్ నాటికి సేల్స్ క్లోజ్ అవుతాయని అంటున్నారు. భారతీయ మార్కెట్లో సెడాన్ మోడల్ సియాజ్ కారుకు మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికి అమ్మకాలు ఆగిపోనున్నాయి.