2 లక్షలు దాటిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన కంపెనీ!

భారత ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది. తమ ఎలక్ట్రిక్ కార్ మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ సంస్థ ఈవీల అమ్మకాల్లో మరో రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఈ సంస్థ 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా.. వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది.‌ వినియోగదారులకు కృతజ్ఞతలు చెప్పేందుకుగాను రానున్న 45 రోజులపాటు తమ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఆఫర్లను ఈ సంస్థ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

473 కి.మీల రేంజ్ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు డెలివరీలు స్టార్ట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లు ఏవిధంగా కొనుగోలు చేస్తున్నారో అందిరికి తెలిసిందే. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, CNG కార్లకు పోటీగా ఈవీల సేల్స్‌లో క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశీయ వాహన తయారీ దారులు టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో మార్కెట్లో అమ్మకాల పరంగా మంచి స్థానంలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈవీల విభాగంలో వెనుకబడి ఉన్న మారుతీ సుజుకీ సైతం ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. వీటన్నింటికి పోటీగా హ్యుందాయ్ కూడా వరుసగా ఈవీ కార్లను విడుదల చేస్తుంది. దక్షిణ కొరియా కంపెనీ అయిన హ్యుందాయ్ దేశంలో ఇంత కాలం ICE ఇంజిన్ వాహనాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుండగా, ఇప్పుడు తన ధోరణిని మార్చుకుని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది. తాజాగా కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ క్రెటా ఈవీని తీసుకువచ్చింది.

మరోసారి కారు ధర పెంచి ఝలక్ ఇచ్చిన హ్యుందాయ్… ప్రస్తుతం ఈ సెడాన్ రేటు ఎంత అంటే?

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యుందాయ్ మోటార్ పేరు సుపరిచితమే! అనేక సంవత్సరాలుగా ఈ బ్రాండ్ నుంచి వస్తున్న కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. దేశీయ కారు అమ్మకాల్లో హ్యుందాయ్ సంస్థ రెండో స్థానంలో కొనసాగుతోంది. అట్రాక్టివ్ డిజైన్స్, ఫీచర్ల కలబోతతో ఈ సంస్థ నుంచి వస్తున్న కార్లు భారత కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ సంస్థ తమ క్రెటా, అల్కాజర్ టుక్సాన్ ఆరా మోడళ్ల ధరలను పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో పాపులర్ సెడాన్ కారు మోడల్ 'వెర్నా' ధరను కూడా పెంచి మరోసారి ఝలక్ ఇచ్చింది.

ఈ కారులో 7 మంది కలిసి ప్రయాణించవచ్చు.. పెట్రోల్ కంటే ఎక్కువగా అమ్ముడుపోతుంది

భారతీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీదారు అయిన మహీంద్రా (Mahindra) కార్లకు దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ వాహనాల్లో ఇంజిన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్లతో కార్లను విడుదల చేయడంలో మహీంద్రాకు మంచి పేరుంది. దేశీయంగా ఉన్న టాటా మోటార్స్, మారుతీ సుజుకీ కంపెనీలకు బలమైన పోటీదారుగా మహీంద్రా కీలక పాత్ర పోషిస్తుంది. 2024లో కంపెనీ అమ్మకాల పరంగా మెరుగైన సంఖ్యలను నమోదు చేసింది. మహీంద్రా పెట్రోల్‌తో డీజిల్ కార్లను కూడా విక్రయిస్తుంది. సాధారణంగా డీజిల్ కార్లను విడుదల చేయడం చాలా వరకు తగ్గిపోయింది. అన్ని కంపెనీలు కూడా పెట్రోల్ మోడళ్లను మాత్రమే విక్రయిస్తుండగా, మహీంద్రా మాత్రం పెట్రోల్‌తో పాటు డీజిల్ వేరియంట్‌ను విక్రయిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో కంపెనీ మంచి మార్కెట్‌ను కలిగి ఉంది.
Advertisement

మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్‌తో లాంచ్ అయిన సూపర్ స్టైలిష్ బైక్

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్స్ (honda motorcycles) ఇటీవల కాలంలో తన దూకుడును పెంచింది. 2025లో తన అమ్మకాలను పెంచుకోడానికి భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా పలు బైక్‌లను తీసుకురావడానికి ప్లాన్ చేసింది. ఈ క్రమంలో హోండా తాజాగా 2025 హోండా హార్నెట్ 2.0 (2025 honda hornet 2.0) ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. అధునాతన డిజైన్‌తో, లేటెస్ట్ టెక్నాలజీని కలిగిన బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ కొత్త మోడల్‌ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. హోండా ఈ బైక్‌ను రెడ్ వింగ్, బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. హార్నెట్ 2.0 ప్రారంభ ధర రూ. 1,56,953. ఇది ఎక్స్‌ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో హోండా కంపెనీకి మంచి మార్కెట్ ఉంది.

విండ్సర్ ఈవీ జయహో.. ఉత్పత్తిలో కనీవినీ ఎరుగని రికార్డ్.. ఎంజీ సంస్థకు లాభాల పంట!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. ఆనేక వాహన తయారీ సంస్థలు ఈవీలతో మార్కెట్లో పోటీ పడుతున్నాయి. స్టార్టప్ సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే.. ఈ కంపెనీల్లో ఎంజీ సంస్థ 'తగ్గేదేలే' అంటోంది. ఈ బ్రాండ్ నుంచి ఎంజీ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో దూసుకుపోతోంది. వరుసగా నాలుగు నెలలుగా ఈ కారు.. బెస్ట్-సెల్లింగ్ కారుగా కొనసాగుతోంది. అంతకుముందు ఈ స్థానం టాటా నెక్సాన్ ఈవీ పేరిట ఉంది. తాజాగా ఈ ఎంజీ విండ్సర్ ఈవీ కారు ఉత్పత్తి పరంగా ఓ కీలక రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో పూర్తిగా చూసేద్దాం.

ఇండియాలో అత్యంత సురక్షితమైన కారు.. నమ్మకంగా తిరగండి

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో కారును కొనుగోలు చేసే వారు ప్రమాద సమయంలో రక్షణ అందించే వాటిని ఎంచుకుంటున్నారు. షోరూమ్‌కు వెళ్లినప్పుడు ముందుగా కారు లోపల ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుని తమకు నచ్చిన మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా కార్లు ఉన్నాయి. వీటిలో సేఫ్టీ ప్రమాణాలు ఉన్నప్పటికి అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుంటున్నారు. కారును కొనడానికి వెళ్ళినప్పుడు సేఫ్టీ రేటింగ్ అనేది అతి ముఖ్యమైన అంశం. అలాగే, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఇతర ఫీచర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో కార్ల నాణ్యతను టెస్ట్ చేయడానికి భారత ప్రభుత్వం BNCAPని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా క్రాష్ టెస్టింగ్ ఉండగా, దానికి ఏమాత్రం తీసిపోకుండా భారత క్రాష్ టెస్ట్‌లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం తయారీదారులు తమ కార్లను BNCAP కింద టెస్టింగ్ చేస్తున్నారు. వీటిలో వచ్చిన మంచి రేటింగ్‌ను తమ ప్రమోషన్ కోసం వాడుతున్నారు.

సౌత్ ఇండియాలో జనాలు ఎగబడి మరి ఈ కంపెనీ టూవీలర్స్ కొంటున్నారు

దేశంలో హోండా (Honda) కంపెనీకి చెందిన బైక్ లేదా స్కూటర్లను వాడని వారు ఉండటం చాలా తక్కువ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా హోండా టూవీలర్స్ కనిపిస్తాయి. ప్రజల రోజువారీ అవసరాలకు ఉపయోగకరంగా ఉండే వాహనాలను విడుదల చేయడంలో ఇది దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుంది. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లేదా స్కూటర్లను ప్రజల కోసం లాంచ్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా టూవీలర్ తయారీదారులు ఉన్నప్పటికీ కూడా హోండా నుంచి వచ్చే వాటికి చాలా నమ్మకమైన మోడళ్లుగా మంచి పేరుంది. సేల్స్ పరంగా హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీల కంటే కూడా ముందు వరుసలో ఉంది. తాజాగా కంపెనీ అమ్మకాల పరంగా కీలక మైలురాయికి చేరుకుంది. దక్షిణ భారతదేశంలో ప్రజలు హోండా టూవీలర్స్‌ను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ బైక్ లేదా స్కూటర్లు సౌత్‌లోని పలు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

మార్కెట్‌లో జనాలు ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే!

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు.. ఈవీలతో సందడి చేస్తున్నాయి. కొత్త కొత్త మోడళ్లతో మార్కెట్లో పోటీని పెంచుతున్నాయి. ఇప్పటికీ‌ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాప్‌లో కొనసాగుతుండగా.. విదేశీ కంపెనీలు సైతం గట్టి పోటీనిస్తున్నాయి. మొత్తంగా ఈ 2025 జనవరి నెల ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా.. మంచి ఫలితాలే అందించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దూసుకుపోతోంది. గత ఐదు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ సంస్థ తమ మోడళ్లతో వినియోగదారులకు బాగా చేరువైంది.

అదిరిపోతున్న టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు.. డిజైన్‌కు ఫిదా కావాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీలో ఎంతో ప్రసిద్ధి చెందిన టయోటా మోటార్(Toyota Motor) వరుసగా కార్లను విడుదల చేస్తూ, అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో కూడా తన కార్లను విక్రయిస్తూ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇంత కాలం పెట్రోల్, డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీ తాజాగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే మిగతా కార్ల తయారీదారులు ఈవీ విభాగంలో కార్లను విడుదల చేస్తూ దూసుకుపోతుండగా, టయోటా మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. ఇలాంటి తరుణంలో కంపెనీ రానున్న కాలంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టయోటా ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన IIMS 2025 (ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో)లో టయోటా తన ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. దీనిని కాన్సెప్ట్ వెర్షన్‌ను ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం చేశారు.

టీవీఎస్ నుంచి లాంచ్ అయిన సరికొత్త 2025 రోనిన్

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ (Tvs) ఇండియాలో బైక్స్, స్కూటర్స్‌ను విడుదల చేస్తూ, హీరో, హోండా కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ వినియోగదారుల్లో చాలా మంది ఈ కంపెనీకి చెందిన మోడళ్లను వాడుతున్నారు. టీవీఎస్ 100cc నుంచి మొదలుకుని 310cc వరకు పలు బైక్స్‌లను విక్రయిస్తుంది. గత ఏడాదిలో పలు మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా తన ప్రసిద్ధ మోడల్ రోనిన్‌ (Ronin)ను కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఈ సరికొత్త 2025 టీవీఎస్ రోనిన్ పాత దానికంటే అధునాతనంగా ఉంటుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పేరున్న టూవీలర్ తయారీదారులు భారతీయ వినియోగాదారులను ఆకట్టుకోడానికి పోటా పోటీగా కోత్త బైక్స్‌ను లాంచ్ చేస్తున్న తరుణంలో టీవీఎస్ తన 2025 రోనిన్ మోడల్‌తో సేల్స్ పెంచుకోనుంది.
Advertisement

ట్రయంఫ్ సంస్థ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ప్రీమియం బైక్‌పై భారీ ధర తగ్గింపు.. ప్రస్తుతం ఎంతంటే?

ట్రయంఫ్.. ప్రపంచ దిగ్గజ ప్రీమియం బైక్ తయారీ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ నుంచి వివిధ రకాల టూ-వీలర్స్ మోడళ్లు భారత మార్కెట్లో సేల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి Speed T4. ఈ బైకును వినియోగదారులకు మరింత చేరువగా చేసేందుకు ట్రయంఫ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ధరను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు రూపాయలు 2.17 లక్షలుగా ఉన్న ఈ బైక్ ధరను 1.99 లక్షలకు తగ్గించింది. మార్కెట్‌లో ఈ బైక్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. అందవల్ల వీటికి సైతం భారీ స్థాయిలో మార్కెటింగ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ బైక్ కి సంబంధించిన విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? ఈ కొత్త మోడల్‌పై లుక్కేయండి.. దీంట్లో ఫీచర్లన్నీ కిర్రాకే!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఖర్చులు కలిసి వస్తాయని చాలా మంది ఈవీలవైపు మొగ్గు చూపుతున్నారు. టూ-వీలర్ సెగ్మెంట్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల భారత రోడ్లపై జోరుగా పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అనేక వాహన తయారీ సంస్థలు కొత్త మోడళ్లతో సందడి చేస్తున్నాయి. తాజాగా BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ.. LOEV+ పేరుతో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. పట్టణ వినియోగదారులకు అనువుగా ఉండేందుకు దీన్ని రూపొందించింది. BattRE సంస్థ నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్- షోరూమ్ ధర రూ.69,999గా ఉంది.

అందరూ చూస్తుండగానే మారుతీ కారును ఈడ్చుకెళ్ళిన లారీ

భారతదేశంలో ప్రతి నిమిషం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. యాక్సిడెంట్ల కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. కొంతమంది అయితే శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడమే. ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ కూడా కొంత మంది అవేమీ పట్టించుకోకుండా రోడ్లపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తున్నారు. భారీగా ఫైన్‌లను విధిస్తున్నప్పటికి కూడా ట్రాఫిక్ నియమాలను పాటించని వారు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. తొందరగా గమ్యానికి చేరాలనే భావనతో రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారు ఇటీవల రోడ్లపై ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇలా వెళ్తున్నప్పుడు డ్రైవర్లకు మధ్య తగాదాలు కూడా జరుగుతుంటాయి.

టెస్లాలో భారీ జాబ్ ఆఫర్స్.. త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్న ఎలక్ట్రిక్ వాహనాలు.. ఇక పోటీ మరింత హాట్!

ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా.. భారత మార్కెట్లో తమ వాహనాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య అనేక విషయాలపై చర్చలు జరిగాయి. ఇప్పుడు టెస్లా సంస్థ.. భారత్‌లో తమ కంపెనీ కోసం వివిధ ఉద్యోగాల ఆఫర్లను ప్రకటించింది. ఇది భారత్‌లో తమ ప్రస్థానాన్ని ప్రారంభించే ప్రక్రియలో ముందడుగుగా చెప్పవచ్చు. సోమవారం టెస్లా లింక్డ్‌ఇన్ పేజీలో ఈ మేరకు జాబ్ అడ్వటైజ్మెంట్స్ పోస్ట్ చేశారు. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

వంటింట్లో తిష్ట వేసిన డేంజర్ పదార్థం.. ఏటా 19 లక్షమంది మృతి!

అతిగా ఉప్పు తీసుకోవడం ప్రతి సంవత్సరం 1.9 మిలియన్ మరణాలకు దారితీస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వినియోగాన్ని తగ్గించే ప్రమాదాలు మరియు వ్యూహాలను కనుగొనండి.

రూ.6.1 లక్షలకే ఫ్యామిలీ కారు.. కొత్తగా అప్‌గ్రేడ్ ఫీచర్స్‌తో వచ్చింది

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్(Renault) భారతీయ మార్కెట్లో ప్రసిద్ధ కార్లను చాలా కాలంగా విక్రయిస్తుంది. కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో కార్లను విడుదల చేస్తూ, మెరుగైన మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ తాజాగా 2025 ట్రైబర్ (Triber), కిగర్ (Kiger) మోడళ్లను విడుదల చేసింది. పాత మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉండగా, వాటిని కంపెనీ అప్‌డేట్ చేసి తీసుకొచ్చింది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమర్లు పూర్తి సంతృప్తి పొందేలా వారికి ఇష్టమైన చాలా కొత్త ఫీచర్స్‌ ఈ కొత్త అప్‌డెటెడ్ కార్లలో అందించారు. రెండు ఇంజిన్లలో కూడా స్వల్పంగా మార్పులు చేశారు. E-20 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్లలో మార్పులు ఉన్నాయి. మిగతా ఫీచర్స్‌లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్ల చాలా కార్లను కొత్తగా మార్చి అదిరిపోయే ఫీచర్స్‌తో అప్‌డేట్ చేసి తిరిగి తీసుకొచ్చారు.

హైబ్రిడ్ వాహనాల వినియోగంలో గందరగోళమా..? గ్యాసోలిన్ లేకుండా వీటిని నడపలేమా? మీ సందేహాలకు సమాధానం ఇదిగో!

ఈ రోజుల్లో హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరుగతోంది. ఇది ఎలక్ట్రిక్ కార్లను మించి వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. మంచి మైలేజీ అందించడమే కాకుండా.. పర్యావరణానికి అనుకూలంగా ఉండడం.. ఈ హైబ్రిడ్ వాహనాల వినియోగానికి కారణాలుగా చప్పవచ్చు. అయితే.. చాలా మందికి ఈ హైబ్రిడ్ వాహనాల వినియోగం గురించి అవగాహన ఉండదు. అవి ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు.

KTM-యమహా కంపెనీలకు గట్టి షాక్.. సరికొత్త బైక్‌ను దింపిన అప్రిలియా

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ అప్రిలియా (Aprilia) భారత్‌లో కూడా తన వాహనాలను విక్రయిస్తుంది. ఇక్కడి లోకల్ కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తూ, అధునాతన మోడళ్లను భారతీయ వినియోగదారుల కోసం తీసుకొస్తుంది. తాజాగా కంపెనీ అదిరిపోయే డిజైన్‌తో సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు 'అప్రిలియా టువోనో 457 (aprilia tuono 457)'. ఈ బైకును అప్రిలియా బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రముఖ భారతీయ నటుడు జాన్ అబ్రహం ప్రారంభించారు. దీని ధర రూ.3.95 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
Advertisement

మార్కెట్లోకి ఆడి కొత్త కారు.. ఇది మీ వద్దకు రావాలంటే 6 నెలలు ఆగాల్సిందే

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి (Audi) ఇండియా మార్కెట్లో మంచి ఆదరణ కలిగిన సంస్థ. చాలా కాలంగా అధునాతన ఫీచర్స్‌ను కలిగిన మోడళ్లను విడుదల చేస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమర్లను ఆకట్టుకునే కార్లను లాంచ్ చేయడంలో ఆడి ఇండియా బాగా ప్రసిద్ధి చెందిన సంస్థ. కంపెనీ తాజాగా ఇప్పుడు సరికొత్త లగ్జరీ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ పేరు 'ఆడి ఆర్‌ఎస్ క్యూ8 పెర్ఫార్మెన్స్(audi rs q8 performance)'. ఈ కారుకు భారతీయ మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది. దీన్ని ఇప్పటికే చాలా మంది బుకింగ్ చేసుకున్నారు. కస్టమర్లు ఈ ఆడి కారును తమ చేతుల్లోకి తీసుకోవాలంటే దాదాపు 6 నెలల సమయం వరకు వేచి ఉండాల్సి ఉంది. దీనికి కారణం రాబోయే 6 నెలల కాలానికి సంబంధించిన బుకింగ్స్ అన్ని పూర్తయ్యాయి.

తక్కువ ధరలో కొత్త కారు కొనే టైం వచ్చేసింది.. టాటా కారుపై రూ.50 వేల వరకు తగ్గింపు

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన కార్లను తయారు చేయడంలో ప్రసిద్ది చెందిన దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన ప్రసిద్ధ మోడల్ టాటా కర్వ్‌ (Tata Curvv) పై భారీ ఎత్తున తగ్గింపులు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది ఒక SUV కూపే. ఇటీవల కాలంలో మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కారు అమ్మకాలు పెంచుకోవడానికి కస్టమర్లను ఆకర్షించడానికి కర్వ్‌ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్తగా 2025 ఏడాదిలో కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారు, టాటా మోటార్స్ అందిస్తున్న తగ్గింపు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలోనే అదిరిపోయే కారును కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. 2025 జనవరి నెలలో ఈ కారు మెరుగైన సేల్స్‌ను నమోదు చేసింది.

ఈ ఎలక్ట్రిక్ కార్లతో మారుతి సుజుకి మార్కెట్లో రచ్చ రచ్చే..! తక్కువ ధరలో, ఫ్యామిలీల కోసం ప్లాన్స్!

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. దీంతో స్టార్టప్‌ల నుంచి మొదలుకొని అనేక వాహన తయారీ సంస్థలు తమ ఈవీలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే.. దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి చాలా లేట్‌గా అడుగు పెట్టింది. ఇటీవల‌ జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో తమ బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు మోడల్ ఇ-విటారాను ఈ సంస్థ ఆవిష్కరించింది. దీంతో మార్కెట్‌లో ఈవీ రంగంలోకి సైతం ప్రవేశించింది.

మరోసారి కారు ధర పెంచి ఝలక్ ఇచ్చిన మారుతి సంస్థ.. ఈసారి ధర పెంపు ఎలా ఉందంటే..?

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మారుతి సుజుకి సంస్థ పేరు అందరికీ సుపరిచితమే. తరతరాలుగా ఈ కంపెనీ వాహనాలు వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గతేడాది ఈ సంస్థ నుంచి భారత మార్కెట్లో డిజైర్ పేరుతో చిన్న సెడాన్ కారు లాంచ్ అయింది. ఎక్సలెంట్ స్టీల్ స్ట్రెంత్తో వచ్చిన ఈ కారు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ కారు క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ కూడా సాధించి ఔరా అనిపించింది. అంతేకాకుండా మంచి మైలేజీ అందించడం కూడా ఈ కారు మరో ప్రత్యేకత. కానీ ఇప్పుడు మారుతి సంస్థ ఈ డిజైర్ మోడల్‌కు సంబంధించి‌ వినియోగదారులకు ఒక షాక్ ఇచ్చింది. దీని ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు.. చైనా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో భారత్ పేరు మారుమోగుతుంది. ఇతర దేశాలు చాలా వరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని యుద్ధ భయాలతో అల్లాడిపోతున్నాయి. అయితే భారత్‌లో మాత్రం అంతా సైలెంట్‌గా ఉంది. అంతర్జాతీయంగా ఉన్న కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని వేగంగా అభివృద్ధి చెందుతుంది. భారతీయ కార్ల మార్కెట్ ప్రస్తుతం అత్యంత సానుకూలంగా ఉంది. దీంతో వాహన తయారీదారులు ఇక్కడి మార్కెట్‌పై ఎక్కువగా ఫోకస్ చేశారు. అందుకే వరుసగా కార్లను విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా ఉంది. కొత్తగా లాంచ్ అవుతున్న వాటిలో అత్యధిక భాగం ఈవీలే ఉంటున్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన దిగ్గజ కంపెనీ Byd (బీవైడీ) ఇండియాలో కొత్తగా సీలియన్ 7 (Sealion 7) అనే అదిరిపోయే కారును విడుదల చేసింది.